Saturday, 12 November 2016

మన ఇంట్లొని వాటితోనే మెరిసే చర్మాన్ని కాపాడుకోవచ్చు!

చర్మం మృదువుగా ఉండాలని టీవీలలో కనిపించే అడ్వెర్టైస్మెంట్లు చూసి ఇష్టమొచ్చిన క్రీములను కొని రాత్రుళ్ళు రాస్తుంటారు. తీర అవి మన చర్మానికి పడక వికటిస్తే అప్పుడు చర్మ వ్యాధుల డాక్టర్ వద్దకు పరిగెడతారు. ఎందుకు? ఇవ్వనీ అవసరం లేకుండా మన ఇంట్లొని వాటితోనే మెరిసే చర్మాన్ని కాపాడుకోవచ్చు. అవెంటో చూద్దమా..!

1.ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పాల మీగడను ముఖానికి రాసుకుని తెల్లవారుజామున చల్లని నీటితో కడిగిస్తే మీ చర్మం మిలమిల మెరిసిస్తుంది.

2. అలాగే స్నానానికి ముందు నిమ్మరసంలో కాసింత పసుపును కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, నల్లటి మచ్చలకు చెక్‌ పెట్టవచ్చు.


3. అలాగే రోజా పువ్వులు చందనాన్ని పేస్ట్‌ చేసి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే కొన్ని వారాల్లో ముఖంలో నల్లని మచ్చలు, కంటి కిందటి వలయాలు కనుమరుగమైపోతాయి.

4. అలాగే కేశ సంరక్షణకు సెంబరుత్తి పువ్వు రసం, నువ్వుల నూనెను సమపాళ్లలో వేడిచేసి ఆ నూనెను రాసుకోవాలి. ఇంకా టెంకాయ నూనెలో వేప పువ్వు వేసి వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే చుండ్రుకు చెక్‌ పెట్టవచ్చు. జుట్టు ఇంకా దట్టంగా పెరుగుతాయి


శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీలోషన్‌ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.దానిని ఇలా తయారు చేసుకోవచ్చు.

1.మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌కి, ఒక స్పూన్‌ గ్లిజరిన్‌, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.

2. కప్పు రోజ్‌వాటర్‌లో టీస్పూన్‌ బొరాక్స్‌ పొడిని, రెండు టీస్పూన్ల వేడిచేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు.

3. సబ్బుని చిన్నచిన్న ముక్కల్లా చెక్కుకుని మూడు టీస్పూన్ల నిండా దానిని తీసుకోవాలి. దానిని పావుకప్పు నీళ్లలో కలిపి వేడిచేసి, నాలుగు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ని, టీస్పూన్‌ గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి.

ఇక మీ బాడీ లోషన్ తయారు. ఇక ప్రతి రోజు వాడి మెరిసే చర్మాన్ని పొందండి.

ఆరి పాపాత్ముడా... మనసాక్షి లేదు నీకు! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

ఆరి పాపాత్ముడా... మనసాక్షి లేదు నీకు! 

జంబులింగం బీచ్ లో కూర్చుని ఉంటాడు.. అటుగా వెళ్తున్న ఇంగ్లీష్ వాళ్ళు జంబులింగాన్ని అడుగుతారు
ఇంగ్లీష్- are you relaxing?
జంబులింగం -లేదు నేను జంబులింగంని
మరో ఇంగ్లీష్ వా-are you relaxing?
జంబులింగం - అరె! నేను జంబులింగం ని.
(జంబులింగం లేచి నడుస్తుంటాడు. అతనికి మరో వ్యక్తి కనపడతాడు)
జంబులింగం - Are you relaxing.
2వ్యక్తి- yes, I am relaxing.
జంబులింగం - ఆరి పాపాత్ముడు...  మీ వాళ్ళు అక్కడ చెట్టుని, పుట్టని, కనిపించిన నరమానవుడిని నీ గురించి అడుగుతుంటే నువ్విక్కడ కాళ్లారా జాపి ఊపుకుంటూ...కాళ్ళు, తీరిగ్గా కూర్చున్నావా! ఏవండోయ్! మీవాడు ఇక్కడ ఉన్నాడు.


నేను చచ్చిపోతా... భార్యతో భర్త! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

డైరీ మిల్క్ తీసుకో... భార్యతో భర్త! 

భార్య : నేను చచ్చిపోతా....
భర్త : ఇదిగో Cad-bury Dairy Milk తీసుకో....
భార్య : ఇప్పుడు ఇది ఎందుకు...?
భర్త : ఏదైనా మంచిపని చేసేముందు నోరు తీపి చేసుకోమని అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు కదా!
కడుపుకు తినపోయినా కనీసం మంచినీళ్ళు ఉంటే బ్రతుకు బండి ఈడ్చేయవచ్చు.

కడుపుకు తినపోయినా కనీసం మంచినీళ్ళు ఉంటే బ్రతుకు బండి ఈడ్చేయవచ్చు. కానీ నీటి విలువ మన శరీరానికి అంతకంటే ఎక్కువ ఉంది. నీటితో అనేక రుగ్మతలు, వ్యాధులు మతుమాయమవుతాయంటే నమ్మశ్యఖ్యంగా లేదు కదూ..! నీరు మన శరీరానికి ఎంత అవసరమో అంత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండి. అవేంటో తెలుసుకుందామా…

1. శరీరంలో నీటి శాతం సక్రమంగా ఉండాలి. ఇది ఏమాత్రం తక్కువున్నా చర్మం ముడతలు పడడం, పొడిబారిపోవడం, చర్మ సమస్యలు మొదలవుతాయి. శరీరంలో నీటి శాతం 75 నుంచి 80 వరకు ఉండాలి.

2. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు దూరమవుతాయి. చర్మం మంచి నిగారింపును పొందుతుంది.


3. శరీరంలోని నీరు చెమట, మూత్రం రూపాల్లో బయటికి పోతుంది. దీంతో శరీరం నీటి శాతాన్ని కోల్పోతుంది. కనుక ఆ నష్టాన్ని పూడ్చడానికి ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని తాగుతూ ఉండాలి. ఎక్కువ నీటిని తీసుకోవడంతో అధిక బరువు ఉన్నవారు కూడా తగ్గుతారు.

4. పెదాల పగుళ్లను నివారించి సున్నితంగా, అందంగా చేస్తుంది. చర్మం తేమగా ఉండాలంటే సరిపోను నీరు తప్పనిసరి.

5. ముఖం మీద ఏర్పడ్డ ముడతలను మట్టుమాయం చేయడంలో నీరు చేసే పనితీరే వేరు. మూత్రపిండాల్లో రాళ్లు, ఇతర సమస్యలు వచ్చే అవకాశముండదు.

6. చెమట ద్వారా శరీరంలోని మలినాలను బయటికి పంపడంతో దుర్వాసనకు దూరంగా ఉండొచ్చు.

7. అందం విషయంలో కళ్లు కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి. నీళ్లు తాగడంతో పాటు రోజులో అప్పుడప్పుడు కళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల కళ్లు తాజాగా, ఆకర్షణీయంగా కనబడుతాయి.
ఎక్కువ తీసుకుంటే కలిగే నష్టాలు:

నీరు త్రగితే మంచిది కదా అని పరిమితికి మించి త్రాగితే మూత్రపిండాలపై ఎక్కువ భారం పడుతుంది. కిడ్ని ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దాంతో ఆనారోగ్య బారిన పడాల్సిన ప్రమాదముంది. ఎక్కువ దాహం వేసినప్పుడైనా, మళ్లీ మళ్లీ తాగాల్సి వస్తుందని ఒకేసారి గ్లాసులకొద్దీ నీరు తగడం సరైన పద్ధతి కాదు. దాంతో మేలుకన్నా కీడే ఎక్కువగా ఉంటుందనేది తెలుసుకోవాలి.

Friday, 11 November 2016

కేశసౌందర్యానికి ఉల్లి - ‘ఉల్లి ‘చేసినంత మేలు ‘తల్లి ‘కూడా చేయదు!

‘ఉల్లి ‘చేసినంత మేలు ‘తల్లి ‘కూడా చేయదంటారు. నిజమే ఈ సామెత నూటికి నూరుపాళ్ళు నిజం. ఉల్లి లేని వంట లేదంటే ఆశ్చర్యమేమీ లేదు. ఉల్లి అరోగ్యానికే అనుకుంటున్నారా? సౌందర్యోపాసనకు కూడా ఉపయోగ పడుతుంది. మనకు కేశ సంరక్షణ అంతే చాలా ఆశక్తి ఉన్నా, దానిని సరిగ్గా పర్యవేక్షించుకోపోవటంతో కేశాలు ఊడిపోవటం, రాలటం జరుగుతుంటుంది. కేశ సంరక్షణ జాగ్రత్తలు తీసుకొన్న తర్వాత కూడా అదే విధంగా ఉంటే దానికి కారణం అనారోగ్యకరమైన జీవన శైలి, ఆహారంలో అసమతుల్యత వల్ల చర్మ మరియు జుట్టు మీద చెడు ప్రభావాన్ని చూపుతుంది.మన వంటగదిలోని చాలా రకాలు వంటకు ఉపయోగించే వస్తువులను హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు తేనె, గుడ్డు, పెరుగు, బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం, మరియు ఉల్లిపాయ వంటివి హోమ్ రెమెడీ హెయిర్ ట్రీట్మెంట్ కు ఉపయోగిస్తుంటారు. ఉల్లిపాయ మన కళ్ళలో నీళ్ళు కారేవింధంగా చేస్తుంది. అలాగే కురుల సమస్యలను కూడా నివారిస్తుంది.

ఈ సమస్యకు ఫుల్ స్టాప్ చెప్పాలంటే ఉల్లి చలవ చాలు. మరి ఉల్లి చేసే మేళ్ళేంటో చూద్దామా! ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా !

1. ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ రక్త ప్రసరణను పెంచి, కురులకు శక్తిని ఇస్తుంది. ఉల్లిపాయను మెత్తగా చేసి తలకు రాయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. దీన్ని అలాగే ఉల్లిపాయ పేస్ట్ తలకు పట్టించడం లేదా ఏదైనా ఇతర హెయిర్ ప్యాక్ లతో ఈ పేస్ట్ ను కూడా కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయడానికి అరగంట ముందు తలకు హాట్ ఆయిల్ మసాజ్ చేయాలి.

2. ఉల్లిపాయ రసం తలలో ఇతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ మీ కేశాలను డ్యామేజ్ చేయవచ్చు. అంతే కాదు అది జుట్టు రాలడానికి ముఖ్య కారణం కావచ్చు. కాబట్టి స్లాప్ ఇన్ఫెక్షన్ అరికట్టడానికి ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించండి. ఇంకా హెయిర్ ఫాలీసెల్స్ లో మూసుకు పోయిన రంద్రాలను తెరచుకొనేలా చేస్తుంది.


3. ఉల్లిపాయ రసంను తలకు పట్టించడం వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరిగి కొత్తగా వెంట్రుకలు మొలవడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ హెయిర్ ఫాల్ ను అరికట్టడమే కాదు, హెయిర్ గ్రోత్ కు కూడా సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనెలో కలుపుకొని బాగా మిక్స్ చేసి తల మాడుకు మసాజ్ చేయాలి. చేసిన అరగంట తర్వాత రెగ్యులర్ గా ఉపయోగించే మంచి షాంపుతో, చల్లనీటి తలస్నానం చేసుకోవాలి.

4. హోం రెమడీస్ లలో చుండ్రును వదలగొట్టడానికి ఇదొ అద్బుతమైన చిట్కా. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం వల్ల హెయిర్ లాస్ అరికడుతుంది. అలాగే చుండ్రును నివారిస్తుంది. మీరు రెగ్యులర్ గా తలకు వాడే హెయిర్ ప్యాక్ కి కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని కూడా చేర్చడం వల్ల చుండ్రును నివారించగలుగుతుంది. నిమ్మరసం, పెరుగు, మరియు కొద్దిగా తేనె మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల కూడా చుండ్రును నివారంచవచ్చు.

మరీ ఇంత మేతకైతే ఎలా అండి ? నవ్వేద్దాం గురు పోయేదేముంది!

మరీ ఇంత మేతకైతే ఎలా అండి ?

లేడీస్ సీట్లో కూర్చొన్న రాము, రాధ రాగానే లేచి సీటు ఇవ్వబోయాడు,
"ఫర్వాలేదు కూర్చొండి. నేను నిలబడతాను" చెప్పింది రాధ.
మళ్ళీ ఇంకో స్టాప్ రాగానే రాము లేవబోగా..."వద్దొద్దు కూర్చోండి" మళ్ళీ అంది రాధ.
ఇంకో స్టేజి రాగానే... రాధతో...
"మేడమ్... దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఇప్పటికే నేను దిగాల్సిన స్టేజికంటే చాలా దూరం వచ్చేశాను" బాధగా చెప్పాడు రాము.


ఆడవాళ్లు మీకు జోహార్లు! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

ఆడవాళ్లు మీకు జోహార్లు!

హైదరాబాదులొ ఈ మధ్య ఒక కొత్త mall తెరిచారు. ఇచ్చట పెళ్ళి కొడుకులు కూడా అమ్మబడును అని ప్రకటనలు ఇచ్చారు (అవును సరిగ్గా పెళ్ళైన కొత్తలో సినిమాలో లాగానే). కాకపోతే కొన్ని షరతులు పెట్టారు,

అవి ఏమిటంటే:
  1. అమ్మాయిలు మా mallకి ఒక్కసారి మాత్రమే అనుమతింప బడుతారు
  2. పెళ్ళి కొడుకులని వారి వారి హోదా, రుచులు, అభిరుచులకు తగ్గట్లు వివిధ అంతస్థులలో వర్గీకరించబడ్డారు. ఏ అంతస్థులో పెళ్ళి కొడుకునైనా మీరు ఎన్నుకోవచ్చును. ఆ అంతస్థులో నచ్చకపోతే మీరు మరో అంతస్థుకి వెళ్ళవచ్చు. కాకపోతే మీరు వెనక్కి తిరిగి రావటానికి అస్కారము లేదు, చివరి అంతస్థు నుంచి బయటకు పోవడం తప్ప.
ఇదేదో బావుందే చూద్దామని ఒక అమ్మాయి mallకి వస్తుంది. అంతస్థులవారీగా ఈ విధంగా సూచనలు ఉన్నాయి.
మెదటి అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు.
రెండవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు.
మూడవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు.

అద్భుతం!! అని అనుకుంటూ ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళింది ఆ అమ్మాయి.

నాలుగవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు. ఇంటి పని, వంట పనిలో కూడా సహాయ పడతారు.
"ఆహా !! ఈ mall చాలా బావుందే. ఈ అంతస్థులో నాకు కావలసిన వరుడు దొరుకుతాడు అని అనుకున్నది. అలా అనుకున్న మరు క్షణమే ఇంకా పైకి వెళ్తే ఎలాంటి వాళ్ళు ఉంటారబ్బా!! అని అనుకొని తరువాతి అంతస్థుకి వెళ్తుంది".
అక్కడి సూచన ఇది:
"మీతో కలిపి ఈ అంతస్థుకి చేరుకున్నవారి సంఖ్య : 61,397. ఈ అంతస్థులో పెళ్ళికొడుకులు లేరు. ఆడవాళ్ళని మెప్పించడం అసాధ్యం."


సంపూర్ణ ఆరోగ్యానికి బైపాస్ రూట్.. 'బీట్'రూట్.

చక్కటి గులాబీ రంగులో నవనవలాడుతూ నన్ను తినండి మీ శరీరంలో రక్తమై ప్రవహిస్తా అంటూ సందేశం ఇచ్చే ఓ వక్తలా కనపడుతుంది బీట్రూట్. క్యారెట్, బీట్రూట్ రెండూ రక్త శాతాన్ని పెంచుతాయని వైద్యుల నుంచీ డాక్టర్ల వరకూ అంటూ ఉండటం మనకు తెలిసిందే. కాని కొందరు ఈ బీట్రూట్ ను వెలివేస్తున్నారనీ చెప్పవచ్చు. అయితే బీట్రూట్ ను తినవచ్చు, జ్యూస్ గ వాడుకోవచ్చు, కూరగా వండుకోవచ్చు. కొందరి ఇళ్ళల్లో వండటం ఇప్పటికే జరుగుతుంది. జబ్బులోస్తే పెట్టే వంటకంగా, జ్యూస్ గా దీనిని వాడుతున్నారేగాని మరొకటి కాదు. దీని ఉపయోగాలు తెలియకపోవటమే ఇందుకు కారణం. చర్మా సౌందర్యానికి కూడా ఇది పని చేస్తుంది. అందుకే మా పాఠకులకు బీట్రూట్ చేసే మేళ్ళేంటో తెలియ చేసేందుకు ఈ శీర్షికలో ఇస్తున్నాం. బీట్రూట్ చేసే మేళ్ళేంటో తెలుసుకుందామా..!

1. గుప్పెడు ఓట్స్‌నీ, బీట్‌రూట్‌ ముక్కల్నీ తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకుని మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. తరవాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. రెండు నిమిషాలాగి నీళ్లను మరిగించి, ముఖానికి ఆవిరిపడితే సరి… చర్మం కాంతులీనుతుంది.

2. బీట్‌రూట్‌ ముక్కని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ, చేతులకూ రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది.

3. బీట్‌రూట్‌ రసానికి కొంచెం తేనె కలిపి, పెదాలకు రాసుకుని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు రాస్తే పెదాలు మృదువుగా మారతాయి.

4. బీట్‌ రూట్‌ రసంలో కొంచెం పెరుగూ, బాదం నూనె, చెంచా ఉసిరిక పొడి కలిపి పేస్ట్‌లా చేసుకుని, దాన్ని తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఎదుగుదుతుంది. అది కండిషనర్‌గానూ ఉపయోగపడుతుంది.

5. జుట్టు తెల్లబడిందనో, చక్కని రంగులో కనిపించాలనో భావించే వారు రసాయనాలు కలిపిన రంగుల్ని వాడే బదులు బీట్‌రూట్‌ రసాన్ని వారానికోసారి తలకు పట్టించి, అరగంట ఆగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు చక్కని రంగులో కనబడుతుంది.

Thursday, 10 November 2016

‘క్యా’రెట్ ప్యాక్... కాళ్లకు కళ తెప్పించండి.

మనం తరచూ ఏదో ఓ ప్యాక్ వేసుకుని ఫ్రెష్ అవుతుంటాం. పార్లర్ కు వెళ్ళినా ఫ్రూట్ ప్యాక్ను వేయటానికే బ్యుటీషియన్ వాళ్ళు ముందుకొస్తారు. అందుకు కారణం ఫ్రూట్ ప్యాక్ ఎన్నో రకాలుగా పని చేస్తుంది. శరీర తత్వాన్ని మారుస్తుంది, రంగును ఇనుమడింప చేతుంది. అందుకే ఈ ప్యాక్ కు అంత ప్రాధాన్యం ఇస్తారు. అయితే పాదాలకు ఏ ప్యాక్ వేస్తే బాగుంటుందో తెలియక, ఎవైనా వేసుకున్నా సంతృప్తి కలుగక మనం బాధపడుతుంతాం. అటువంటి సమస్యకు సొల్యూషన్ క్యారెట్ పాదాలకు ప్యాక్ గా వేస్తే ఎన్నో సహజ సిధ్ధ గుణాలతో మన పాదాలకు మంచి చేస్తోందట. అంతేకాక పాదాల రంగునూ ఇనుమడింప చేస్తుందట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

1 . క్యారెట్‌ తురుమునకు రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్‌ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

2 . అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.
3 . మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్‌ లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి.

4 . కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్‌గా వేసుకుంటే కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి.

5 . కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.

6 . టేబుల్‌స్పూన్‌ శనగపిండి పుల్లపెరుగు తీసుకుని కలిపి మిశ్రమంలా చేసి దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త ఆరిన తర్వాత గట్టిగా రుద్ది కడిగేస్తే మృతకణాలు తొలగిపోతాయి.

అప్పారావుతో అంత వీజీ కాదండోయ్! నవ్వేద్దాం గురు పోయేదేముంది!


అప్పారావుతో అంత వీజీ కాదండోయ్!

సార్.... ఈ షర్టు గుడ్డ తీసుకోడి. అస్సలు చినగదు" తాను చూపుతూ అన్నాడు Salesman.
"గుడ్డ చాలా బాగుంది. కానీ వద్దులే" అన్నాడు అప్పారావు.
"అదేం సార్.. పెద్ద ఖరీదేం కాదు"
"ఖరీదు సంగతి కాదు. నాకు రెండు మీటర్లు చాలు. కానీ చినగదంటున్నావు కదా! ఎలా చించిస్తావు?" అడిగాడు అప్పారావు.


కొత్త కోడలి వంట తంటాలు! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

కొత్త కోడలు మొదటి సారి వంట చేయాలనుకుంది....

వంటల పుస్తకము చదువుతూ వంట మొదలు పెట్టె......

గుడి నుండి అత్త తిరిగి వచ్చే...
ఫ్రిజ్జు తెరచి చూచే...
అచ్చెరువందే....

కోడలింజూచి అడిగె.....

"పూజ గది నుండి ఈ గంట ఫ్రిజ్జ్ లో కెట్ల వచ్చే.?..."

కోడలు : "అత్తమ్మా.... పుస్తకము లో వ్రాసి ఉండె..... మిశ్రమంను బాగుగా కలిపి తర్వాత ఒక 'గంట' ఫ్రిజ్జ్ లో పెట్టవలెనని......".

అత్త: ఓసినీ తెలివి తాకట్టుపెట్ట!


కరివేపాకని అలా తీసి పారెయ్యకండి సుమీ - ఎన్నో ఔషధ గుణాలు!

చారులో కరివేపాకులా తీసేశారు అన్న సామెత వినే ఉంటారు. ఈ సామెతకు ఓ అర్ధం ఉంది. ఎవరైనా మన పట్ల నిర్లక్షంగా ప్రవర్తిస్తే వెంటనే చారులో కరివేపాకులా తీసేస్తున్నారని బాధపడతాం. ఈ పోలిక కు కారణం కరివేపాకును ఎంత శ్రధ్ధగా కూరల్లో, చారుల్లో వేస్తామో అంతే నిర్లక్షంగా తినేటప్పుడు దాన్ని తీసి పక్కనపెడతాం. కానీ కరివేపాకు చేసే మేళ్ళు ఏమిటో చాలా మందికి తెలియవు. అందానికి ఆరోగ్యానికీ కరివేపాకు మేలంటే అతిశయోక్తి కాదేమో. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కరివేపాకు ప్రధానంగా కళ్ళకు మంచిది. తరచూ కరివేపాకు తింటే కళ్ళ ఆరోగ్యం ఇనుమడిస్తోంది.

1.ఆహారం ద్వారా కరివేపాకును తీసుకోవడం ద్వారా మీ కురులు తెల్లబడవు.

2.అతిపిన్న వయసులోనే మీ జుట్టు నెరసిపోవడం వంటి సమస్యలకు కరివేపాకుతో చెక్‌ పెట్టవచ్చును.

3.అరకేజీ నువ్వుల నూనెను కాసి, అందులో 50 గ్రాముల పచ్చి కరివేపాకును వేసి మూతపెట్టాలి. మరుసటి రోజు ఆ నూనెను గోరువెచ్చగా వేడి చేసి, తలకు పట్టించి, కుంకుడు కాయతో తలస్నానం చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే తెలుపు జుట్టు నలుపు జుట్టుగా మారిపోతుంది.


4.చిన్న వయస్సులో జుట్టు నెరసి పోకుండా ఉండాలంటే.. ఒక కప్పు కరివేపాకును రుబ్బుకుని ఆ రసంలో మూడు స్పూన్ల మెంతి పొడిని కలిపి జుట్టుకు ప్యాక్‌లా వేసుకుని, ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే తెల్లజుట్టు నలుపుగా మారిపోతుంది.

5.ఇంకా కరివేపాకు, గింజలు లేని ఉసిరికాయ, మందారం పువ్వుల్ని సమపాళ్లు తీసుకుని కాసింత నీరు చేర్చి రుబ్బుకోవాలి. తర్వాత ఆ రసాన్ని తలకు బాగా పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే.. మీ జుట్టు మృదువుగా తయారవుతుంది.
6.కరివేపాకుతో పేస్టు,మెహందీ – అర కప్పు , కరివేపాకు – అరకప్పు, మందారం ఆకులు – అర కప్పు, కుంకుడు కాయలు – అర కప్పు

పైన చెప్పిన వస్తువుల్ని ముందు రోజు నానబెట్టుకోవాలి. మరుసటి రోజు తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు మిల మిల మెరిస్తుంది.

Wednesday, 9 November 2016

పాదాలు పగిలి ఇబ్బంది పడుతున్నారా? తెలుగు టిప్స్!

పాదాలు పగిలి ఇబ్బంది పడుతున్నారా? డిటర్జెంట్లు పాదాలపై దాడి చేస్తున్నాయా? శరీరంలో విపరీతమైన వేడి వల్ల పాదాల పగుళ్ళు వచ్చి సతమతమవుతున్నారా? అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చికిత్స కు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఈ సమస్యకు చికిత్సలున్నాయి. ఆట్టే ఆశ్చయపోకండి. పాదాల పగుళ్ళతో బాధపడే వారికి మా ఈ తెలుగు టిప్స్ ద్వారా గృహ చికిత్సా విధానాలను ఈ శీర్షికలో ఇస్తున్నాం. మరి అవేంటో చూద్దామా..!


1. పాదాలు తట్టుకునేంత వేడినీటిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం చేర్చి పాదాలను ఆ నీటిలో ఉంచి, బ్రష్‌తో పాదాలను రుద్దినట్లైతే బ్యాడ్‌ సెల్స్‌కు చెక్‌ పెట్టవచ్చు.

2. గోరింటాకును బాగా రుబ్బుకుని పగుళ్లు ఉన్న చోట రాసుకుని ఎండిన తర్వాత కడిగితే పగుళ్లకు చెక్‌ పెట్టవచ్చు.

3.బొప్పాయి గుజ్జును పగుళ్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

Image result for foot scrub

4. వేపాకు, పసుపులో కాసింత సున్నం కలిపి పేస్‌‌టలా రుబ్బుకుని, ఆముదంలో చేర్చి పగుళ్లకు రాసినట్లైతే ఉపశమనం లభిస్తుంది.

5. అలాగే ఆముదం, కొబ్బరి నూనె సమపాళ్ళలో తీసుకుని అందులో పసుపు పొడి చేర్చి రోజూ పాదాలకు రాస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు.

6. రాత్ర నిద్రకు ఉపక్రమించే సమయంలో పాదాలను శుభ్రం చేసుకుని కొబ్బరి నూనె రాస్తే పగుళ్లు ఏర్పడవు.

7. ఇంకా నాణ్యత గల స్లిపర్స్‌, షూస్‌ వాడటం ద్వారా పగుళ్లు దరిచేరవు. ఇలాంటి గృహ చిట్కాలను పాటిస్తే మీ పాదాలకు చీకూ చింతా అవసరం ఉండదు.

వాడ్ని పర్ఫెక్ట్ అనరు... పసోడంటారు ! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

వాడ్ని పర్ఫెక్ట్ అనరు... పసోడంటారు ! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

A: మా అబ్బాయి పర్‌ఫెక్ట్. తెలుసా?
B: మీ వాడు smoke చేస్తాడా?
A: లేదు
B: మరి మందు తాగుతాడా?
A: లేదు
B: పోనీ ఇంటికి లేట్ గావస్తాడా?
A: అబ్బే ఆ సమస్యే లేదు.
B: నాకు తెలిసి నిజంగానే మి అబ్బాయి పెర్‌ఫెక్టే. మీవాడి వయసెంత?
A: వచ్చే బుధవారానికి ఐదు నిండి ఆరు నెలలొస్తాయి...
B: ఆ(  వాడ్ని పర్ఫెక్ట్ అనరు... పసోడంటారు !

పెళ్ళాం పేరు మర్చిపోతే ...? నవ్వేద్దాం గురు పోయేదేముంది!

అన్యోన్య దంపతులు!
ఒక old man ని ఒక విలేఖరి ఇలా అడుగుతాడు. 
విలేఖరి : మీకు 70 సంవత్సరాలు, ఇంకా మీరు మీ భార్యని Darling, Honey, అని పిలుస్తున్నారంటే చాలా great. మీ Secret చెప్తారా? 
Old Man : నేను దాని పేరు మర్చిపోయా, అడగాలంటే భయమేసి అలా పిలుస్తాను. జుట్టు రాలకుండా ఉండేందుకు గౄహ చిట్కాలు


ప్రస్తుతం మారుతున్న స్థితిగతులూ, కార్పొరేట్ ఉద్యోగాలు, వ్యాపారంలో టెన్షన్లూ ఇవేకాక మానసిక ఒత్తిడులు అన్నీ కూడా మన జుట్టు ఊడిపోయేలా చేస్తాయి. ఎంత కష్టపడినా మన ఆరోగ్యం అందం దెబ్బతింటుంటే ఎవరికైనా బాధేమరి! ఇందుకోసం రకరకాల షాంపూలను, తెరపీలను వాడుతుంటాం. అవి సరిచేయకపోగా జుట్టు మరింత ఊడేలా చేస్తాయి. ఈ సమస్యను దాదాపు నూటికి 80 శాతం మంది ఎదుర్కొంటున్నారు. అయినా సరైన పరిష్కారాన్ని అన్వేషించలేకపోతున్నారు. ఏ తెరపీ వాడినా అది సైడ్ ఎఫ్ఫెక్ట్ లేనిదై ఉండాలి. అటువంటి నేచురల్ థెరపీలు మన ఇంట్లోనే ఉన్నాయి అన్నది సత్యం. వాటిని తెరపీలుగా వాడుకుంటే మనకు సమస్యలు తీరిపోగా మనశ్శాంతి లబిస్తుంది. ఆ గృహ చిట్కాలను మీకందిస్తున్నాం. అవేంటో చూద్దమా..!

1.కొబ్బరి నూనె: గోరువెచ్చగా చేసి తలకు రాసి మర్దన చేయడం వల్లా ఫలితం ఉంటుంది. తలలో రక్త ప్రసరణ సాఫీగా జరిగి, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగని రోజూ నూనె రాసుకోవాలని లేదు. తలస్నానానికి గంటా, రెండు గంటల ముందు నూనె రాసుకుంటే సరిపోతుంది.

2.ఉసిరి : జుట్టు రాలే సమస్యనే కాదు, చుండ్రుని కూడా నివారిస్తుంది. తలలో ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తగ్గేలా చూస్తుంది. అలాంటి సమస్యలున్నప్పుడు పెరుగులో ఉసిరి పొడిని కలిపి తలకు పూతలా వేసుకొని కాసేపయ్యాక కడిగేసుకుంటే సరిపోతుంది.


3.పెరుగు :జుట్టుని మెరిపించడంతో పాటూ ఒత్తుగా పెరిగేలా చేస్తుంది పెరుగు. దీన్ని నేరుగా తలకు రాసుకోవచ్చు. లేదంటే తేనె, నిమ్మరసం లాంటి ఇతర పదార్థాలతో కలిపీ తలకు పట్టించుకోవచ్చు. పెరుగును తలకు రాసుకుని అరగంట తరవాత తలస్నానం చేయాలి.

4.గోరింటాకు : జుట్టు సంరక్షణకు సంబంధించి గోరింటాకు పొడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారం, పదిహేను రోజులకోసారి గోరింటాకు పొడిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగూ కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక తలస్నానం చేయాలి.

5.మందారం : జుట్టు విపరీతంగా రాలుతుంటే ఉడికించిన మందాల పువ్వుల్ని వాడితే ఎంతో మార్పు ఉంటుంది. అయితే ఆ పూతను నేరుగా కాకుండా పెరుగు లేదా గుడ్డులో కలిపి రాసుకోవాలి.

6.కొబ్బరిపాలు:కొన్నిసార్లు జుట్టు చిట్లిపోతుంది. పొడి బారడం, తలంతా దురదపెట్టడం వంటి సమస్యలూ తలెత్తుతాయి. వాటిని నివారించాలంటే తలకు కొబ్బరి పాలు రాసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి.

Tuesday, 8 November 2016

అతివలు మెచ్చేవి అతివలకు నచ్చేవి హైహీల్స్...హై ‘హీల్స్ తెచ్చిపెట్టే సమస్యలు

అతివలు నడుస్తుంటే వారి అందం మరింతాగా ఆకర్షింప చేస్తుంది. అతివలు నడకే వారికి ఎంతో వన్నె తెచ్చిపెడుతుంది కూడా! అంతేకాక అతివలు తమ నడక ఎంతో బాగుండాలని శతవిధాలా ఆలోచించి రకరకాల చెప్పులను కూడా వాడుతుంటారు. వాటిలో అతివలు మెచ్చేవి అతివలకు నచ్చేవి హైహీల్స్. ఎత్తుగా ఉన్న వారి నుండీ పొట్టిగా ఉన్నవారి వరకూ అందరూ వాటినే వాడటానికి ఇస్టపడతారు. పొట్టిగా ఉన్నవాళ్ళు వాడితే కొంచేం ఫర్వాలేదు కానీ మధ్యస్థంగా ఉన్నవారూ, ఎత్తుగా ఉన్నవారూ వీటినే ఎంచుకుంటారు. కానీ ఆనతికాలంలోనే సమస్యల వలయంలో చిక్కుకుని సతమతమై ఫ్లాట్ మోడల్స్ ను వాడటం మొదలుపెడతారు. హైహీల్స్ వెనుక వున్న సమస్యలను ఈ శీర్షికలో మహిలా పాఠకు ప్రత్యేకంగా తెలుగు టిప్స్ అందిస్తోంది. అవేంటో తెలుసుకుందామా!


హైహీల్స్ వలన నడకలో హొయలు వచ్చి.. నడక అందాన్ని దిద్దుకుంటుంది. కాస్తంత ఎత్తు తక్కువగా ఉన్న వారు కూడా ఎత్తుగా వున్నవారిలా కన్పించే అవకాశం వీటిలో వుంది. అయితే హైహీల్స్‌ను ఏదో ఒక సందర్భంలో వుపయోగించడం వలన అంతగా ప్రమాదమేమీ ఉండదు. కానీ రెగ్యులర్‌గా ఉపయోగించారంటే మాత్రం వాటి కారణంగా చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. హైహీల్స్‌ షేప్‌ కారణంగా పాదాల మీద అధిక భా రం పడుతుం ది. వెన్నెము క, మెడ వీటి పైన కూడా, అధిక భారం పడి.. అవి నొప్పి పెట్టే అవకాశం ఉంది. ఎక్కువ కాలం హైహీల్స్‌ వాడటం వలన పాదం చీల మండలం దగ్గర వుండే ఎచిలిస్‌ టెండాన్‌ పొట్టిగా తయా రయ్యే అవకాశం ఉంది. దీంతో టెండాన్‌ ఇబ్బందిని కలిగిస్తుం ది. పాదాలపై ఆనెలు, బ్లిస్టర్స్‌ వంటివి రావటానికి, హైహీల్స్‌ కారణం అవుతాయి. ఆనెలు, వత్తిడితో కలిగే బ్లిస్టర్స్‌ నొప్పితో నడవ నీయని పరిస్థితి తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.

హైహీల్షూ దీర్ఘకాలం హైహీల్స్‌ వాడేవారిని న్యూరోమా అన్న సమస్య వేధిస్తుంది. తీవ్రమైన నొప్పి కాకుండా… దీర్ఘకాలంగా పెయిన్‌ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే సర్జరీ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. దీర్ఘకాలం హైహీల్స్‌ వాడడం వలన పాదం వెనుక భాగంలో లోపం ఏర్పడుతుంది. ఇది కూడా వేధిస్తుంది.బొటన వ్రేళ్లలో కూడా లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. హైహీల్స్‌ ధరించినప్పుడు మెదడుకు వెళ్లే నరాలు వత్తిడికి గురై.. మెదడు కార్యకలాపాలు సక్రమంగా జరగవు. పూర్తిగా హైహీల్స్‌కు దూరంగా వుండటం కుదరని పక్షంలో వీలయినంత వరకు వీటి వాడ కాన్ని తగ్గించేందుకు చేసేందుకు ప్రయ త్నించాలి. హీల్స్‌ గనుక వేసుకోవాల్సి వస్తే వాటిని వేసు కున్నా సరే కూర్చున్నప్పుడు చెప్పులను విడిచి పాదాలను నేలపై పెట్టుకోవాలి. నడిచేటప్పుడు వేసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

పెళ్ళాం కావాలి అని ప్రకటనిస్తే ...? నవ్వేద్దాం గురు పోయేదేముంది!

అన్నీ కొత్తగా అంటే ఇలానే ఉంటుంది మరి! 

ఓ అతి తెలివి గడుగ్గాయి పెళ్ళీ చేసుకుందామని పేపర్లో ప్రకటన ఇవ్వాలనుకున్నాడు. అందరూ వధువు కావాలని ప్రకటన ఇవ్వడం చూసి విసికి కాస్త వెరైటీగా ఉంటుందని "పెళ్ళాం కావాలి" అని ప్రకటన ఇచ్చాడు. 
అంతే మర్నాడు వేలకొద్దీ ఫోన్ కాల్స్, మెయిల్స్, మెసేజ్-లు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అన్నిటి సారాంశం ఒక్కటే....
 "ఆలశ్యం  చేయకుండా వచ్చి మా ఆవిడని తీసుకువెళ్ళండి. మీకు కుదరకపోతే అడ్రస్ ఇవ్వండి వచ్చి దింపివెళ్తాము."