అందమైన జుట్టుకోసం అంతులేని మార్గాలు ఉన్న ఈ కాలంలో వారానికి 3-4 సార్లు తలస్నానం చేసినా ఎప్పుడైన మీ జుట్టు జిడ్డుగా మారిపోవడం గమనించారా, పోనీ అలా ఎందుకు అయిపొతుందో తెలుసుకున్నారా, ముఖ్యంగా, మీరు ప్రొద్దున్న చేసిన తలస్నానం మిమ్మల్ని ఎంతో ఫ్రెష్ గా ఉంచుతుంది, కాని సాయంత్రానికి అది మీ జుట్టిని వదిలేస్తుంది, దీనికి కారణం “శబం(Sebum)”అనే కొవ్వుతో కూడిన పదార్దం సరియైన రీతిలో ఉత్పత్తికాకపోవడమే.ఈ “శబం (Sebum)” వల్ల మన జుట్టు ఎంతో కోమలంగా, మరియు పొడిబారకుండా ఉంటుంది.
ఈ జిడ్డు గల జుట్టు వల్ల, మీ జుట్టుకే కాకుండా మీ చర్మానికి కూడా హాని కలిగే ప్రమాదం ఉంది.ఈ జుడ్డుగల జుట్టు 2 రకాలు, మొదటిది మీ జుట్టు యొక్క మొదలు భాగం నుంచి చివరి భాగం వరకు జిడ్డుగా ఉండడం, రెండొవది మీ జుట్టు మొదలు భాగం జిడ్డుగా ఉండి, చివరి భాగం పొడిబారిపోవడం. అయితే చింతించవలసిన అవసరం లేదు.

జిడ్డుగల జుట్టుని నిర్మూలించి, జుట్టుని రక్షించే మార్గాలు


1.రోజూ తలస్నానం చేసే అప్పుడు మీ షాంపూతో మీ జుట్టుని శుబ్రముగా రుద్దండి, దానివల్ల మీ జుట్టుకి పట్టిన దుమ్ము, ధూళి వదిలి మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.
2.మంచి “కండీషనర్” తయారు చేసుకోండి, కొంచెం కలబంద రసం, ఒక స్పూన్ ఆపిల్ కలిపిన వెనిగర్, నిమ్మరసం తీసుకుని మీ జుట్టు కి పట్టించి శుబ్రం చేసుకుంటే ఎంతో మంచిది
3. ప్రత్యేకంగా జిడ్డుగల జుట్టుతో పోరాడే షాంపూని వాడతం ఏంతో మంచిది,సాదారణంగా షాంపూలోని “PH” శాతం 4-7 వరకు ఉండగా, జిడ్డుగల జుట్టుకి, మరింత ఎక్కువ శాతం ఉండేది అవసరం.

4. మా షాంపూని మీరే తయారుచేసుకోండి, అందులో కొంచెం కలబంద రసం, 2 టేబుల్ స్పూన్లు నిమ్మ రసం కలిపి ఫ్రిజ్లో పెట్టి కావాల్సినపుడు ఉపయోగించుకోవచ్చు.
5. మీది జిడ్డుగల జుట్టు అయితే సాద్యమైనంత వరకు “కండీషనర్”లు వాడకపోవడం మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే మీ జుట్టు చివరి భాగాలకు పట్టించి శుబ్రం చేసుకోవడం మంచిది.
6. మీరు ఎక్కువగా జుట్టు దువ్వుకునేవారైతే, మీకు జుట్టూ ఊడిపొయే ప్రమాదం ఎక్కువ, అందుకే తగ్గించి దువ్వుకోవడం మంచిది.
7. మీ జిడ్డుగల చర్మంతో పోరాడడానికి నిమ్మ సారం, టీ,పళ్లరసం,వినెగార్ ఎంతో ఉపయోగపడతాయి, కాని ఇవి వాడిన తరువాత మీ జుట్టుని చల్లని నీటితో శుబ్రం చేసుకోండి, లేదంటే వాటిలోని రసాయన తత్వం మీ జుట్టుకి హాని కలిగించే ప్రమాదం ఉంది.
8. కోడి గుడ్డు సొన తీసుకుని కొంచెం సున్నం కలిపి మీ జుట్టుకి పట్టించి శుబ్రం చేసుకుంటే, మంచి ప్రభావం చూపిస్తుంది.

ఇంకెందుకు ఆలోచన, పైన సూచించిన వాటిలో అన్నీ మన ఇంట్లో ఉండేవే, జుట్టు పై బెంగ పోవాలంటే ఒక్కసారి ట్రై చేసేయండి.
Share To:

0 comments so far,add yours