Friday 4 November 2016

మీ ఆయుష్షును తెలుసుకోవచ్చు... ఇలా!

మనిషి జీవితం క్షణ భంగురమని అందరికీ తెలుసి కూడా కానీ ఈ కాస్త సమయంలోనే ఎన్నో ఆశలు కోరికలు ఇంకా ఎన్నో అయితే అసలు మనిషిలో ప్రాణం ఎంత కాలం ఉంటుందన్న దానికి సమాధానం లేదు. ఇప్పుడు ఒక సింపుల్ టెస్ట్ మన మరణ రహస్యం గుట్టు విప్పబోతోంది. మన రక్తం లోనే మన ఆయుష్ రేఖలు ఉన్నయన్న విషయం నిజమని తేలింది. అందుకే ఓ రక్త పరీక్ష మీ జీవిత కాలాన్ని లెక్క కడతానంటోంది. ఆ పరీక్ష మీ జీవన చక్రం ఎప్పుడు ఆగిపోతుందో వివరిస్తుంది.

మనిషి ఆయుష్షు ను నిర్థారించే టెలోమెరీ టెస్ట్ ఇది. మనిషి వయస్సు పెరగడానికి కారణం ఏంటి?

మనిషి దేహం ఎన్నో కణాల నిర్మాణం. మన వయసు పెరిగిందంటే మనలోని కణాల వయస్సు పెరిగినట్లే. వయసు పెరిగిందంటే టెలోమేర్స్ తగ్గిపోతున్నట్లు లెక్క. మన జీవితకాలాన్ని శాసించేవి ఈ టెలోమేర్లే. మనం ఎన్నేళ్లు బతుకుతామో వీటిని బట్టే తెలుసుకోవచ్చు. సాధారణంగా మనం ఎంతకాలం బతుకుతామో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి మనిషికీ ఉంటుంది. ఆ ఆసక్తి నుంచి పుట్టుకొచ్చిందే టెలోమేర్. అదే జరిగితే మన జీవితంలో ఇదో ముఖ్య భాగమైపోతుంది. కానీ.. సమాజానికిదో పెను ప్రమాదమని హెచ్చరించేవారూ ఉన్నారు..

టెలోమేర్ పై పరిశోధనలు

2009 నోబెల్ ఫ్రైజ్ విన్నర్ విలియం హెచ్ యాండ్రూస్ టెలోమేర్స్ మనిషి వయస్సుని ఎలా ప్రభావితం చెస్తాయో ప్రపంచానికి తెలియజెప్పారు. 20 ఏళ్లుగా మనిషి ఆయుష్షు పై ఈయన అంతులేని పరిశోధనలు చేస్తున్నారు. బోస్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కేంద్రంగా ఎన్నో వినూత్న ఆవిష్కరణలు జరిగాయి. రక్తం చూసి మనిషి ఎంత కాలం బతుకుతాడో చెప్పే పరీక్షను కనుక్కొంటున్నది ఇక్కడే. ఇందుకోసం 800 మంది సీనియర్ సిటిజన్లపై ఇక్కడ పరిశోధనలు చేశారు. 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం బతికిన వారందరినీ ఓ గ్రూప్ గా తీసుకున్నారు. వాళ్ల జన్యు పటాలను పరిశీలించారు. వాళ్ల ఆయుష్షు కు సంబంధించిన ఆనవాళ్లు రక్తంలో ఏమైనా దొరుకుతాయో వెతికారు. వాళ్ల ప్రయత్నాలు ఫలించాయి. వాటి ఫలితమే ఈ పరీక్ష.


టెలోమేర్ల క్షీణత లక్షణాలు

మనిషి శరీరంలో అంతర్భాగంలోకి వెళ్తే అంతా కణాల మయమే. అందులోని ప్రతి కణంలోనూ జీన్స్, క్రోమోజోములు ఉంటాయి. ఈ క్రోమోజోములు డీఎన్ఏలతో నిండి ఉంటాయి. క్రోమోజోములోని చివరి భాగాన్నే టెలోమేర్ అంటారు. టెలోమెర్ లు తగ్గిపోతున్న కొద్దీ, మనిషి మరణానికి దగ్గరగా వెళ్తున్నాడన్నమాట. ఈ టెలోమేర్లు కుంచించుకుపోతున్నకొద్దీ కండరాల హీనత, జ్ఞాపకశక్తి కోల్పోవడం, దృష్టి లోపం వంటి సమస్యలు మనిషి ఎదురవుతుంటాయి. టెలోమేర్లు తగ్గితే వయసు పెరిగిపోతూ ఉంటుంది.

ఆయుఃప్రమాణాన్ని నిర్ధారించే టెలోమేరీలు

అసలు ఈ టెలోమెరీలు ఎందుకు తగ్గిపోతాయి? ఇవి తగ్గిపోకుండా మనిషి తనను తాను కాపాడుకోలేడా? దీన్ని కనుగొనేందుకే యాండ్రూస్ తన బృందంతో కలిసి పరిశోధనలు చేశారు. టెలోమేర్లు ఎందుకు తగ్గిపోతాయో తెలుసుకోగలిగారు. వాటి తరుగుదలను నివారించే ప్రక్రియను కూడా కనుగొన్నారు. మనం వయస్సు పెరుగుదలను నివారించాలంటే టెలోమేర్లను కాపాడుకోవాలి. అప్పుడే మనం ఎక్కువ కాలం జీవించవచ్చు. అలాగని ఎక్కువ టెలోమేర్లు ఉన్నంత మాత్రన ఎక్కువ కాలం జీవిస్తామన్న గ్యారెంటీ కూడా లేదంటున్నారు శాస్త్రవేత్తలు.
మరణ నిర్ధారణ పరీక్ష

రోగ నిర్ధారణ కోసం ఎలా బ్లడ్ శాంపిల్స్ ఇస్తామో, మరణ నిర్థారణ పరీక్ష కూడా అలాగే చేయించుకోవచ్చు. ఈ టెస్ట్ ఖరీదు 435 పాండ్లు ఉంటుందంటున్నారు సైంటిస్టులు. సో 30 వేల రూపాయలు ఖర్చు పెడితే చాలు మన నుదుటి రాతను తెలుసుకోవచ్చన్నమాట.

డెత్ క్యాలిక్యులేటర్ మనిషికి వరమా? శాపమా?

డెత్ క్యాలిక్యులేటర్ అద్భుతం అంటున్నారు కొందరు. కాదు అనర్థం అంటున్నారు ఇంకొందరు. ఇంతకీ ఇది వరమా? శాపమా? ఇక పరీక్ష ఫలితాలు రాకముందే నిజా నిజాల పరీక్షకు నిలబడాల్సి వచ్చింది డెత్ క్యాలిక్యులేటర్. ఎందుకంటే? ఇక మనిషి పెళ్లి చేసుకోవాలంటే ఈ పరీక్ష చేయించుకోవాల్సిందేనా? ఇన్స్యూ రెన్స్ కోసం డెత్ క్యాలిక్యులేటర్ డాక్యుమెంట్ కూడా పెట్టాల్సిందే? ఓన్ అయినా, లోన్ అయినా, ఉద్యోగానికైనా ఈ పరీక్ష అవసరమా? సగటు మనిషికో కన్ ఫ్యూజన్? సామన్యునికో సవాల్? డెత్ క్యాలిక్యులేటర్ అంటే మనిషి పేరు కింద క్వాలిఫికేషన్ తో పాటు ఎక్స్ పైరీ డేట్ కూడా రాయడమే ఈ పరీక్ష అని కొందరు వాదిస్తున్నారు. పుట్టిన రోజు జరుపుకుంటున్న మనిషి, మరి ఈ డెత్ డేని ఎలా జరుపుకోవాలి? పెళ్లిళ్లు జరగాలంటే ఈ టెలోమెరీ మూలమై పోతుంది. పరీక్షలో తక్కువ ఆయుష్షు ఉందని తెలిస్తే ఏ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకుంటుంది చెప్పండి. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ సంగతీ అంతే. తక్కువ కాలం బతుకుతారని తెలిస్తే వారికి పాలసీలు ఇచ్చేందుకు ఏ కంపెనీలూ ముందుకు రావు. ఉద్యోగాలకు కూడా ఈ టెస్ట్ అవసరం అంటాయి. కార్పొరేట్ కంపెనీల్లో అల్పాయుష్షు ఉన్న వారికి ఉద్యోగం దొరకడం కూడా కష్టమై పోతుంది. అప్పుడు సమాజంలో రెండు కొత్త వర్గాలు పుట్టుకొస్తాయి. అవి దీర్ఘాయుష్సు ఉన్నవారు, అల్పాయుష్షు ఉన్నవారు. దీంతో సరికొత్త సమస్యలు ఎదురవుతాయి.

సైన్స్ సాధిస్తున్న అద్భుత విజయంగా కొంతమంది దీన్ని వర్ణిస్తున్నారు. ఎందుకంటే? భవిష్యత్తులో రాబోయే వ్యాధులేంటో ముందే తెలిస్తే, వాటికి చికిత్స ముందే తీసుకోవచ్చని కొందరు చెబుతున్నారు. జన్యు పరమైన మార్పులను జెనెటిక్ మాడిఫికేషన్ తో ఆ వ్యాధులను తప్పించుకోవచ్చని ఇంకొందరు ఆశ పడుతున్నారు. దీంతో మనిషి ఆయు ప్రమాణం మరింత పెరుగుతుందంటున్నారు. ఇదంతా మనిషి మంచి కోసమే అన్నది వీరి వాదన.

మనిషి ఆశావాదాన్ని చంపేస్తున్న నిర్ధారణ పరీక్షలు సైన్స్ కందనిదంటూ ఏదీ లేదు కానీ ఇంత జెనెరేషన్లో మార్పులోచ్చినా ఇంకా ఎన్నో కనుగొనటానికి మానవుడు ఎన్నో కష్టాలు పడుతున్నాడు. చివరికి విజయం సాధిస్తున్నాడు. అయితే తన ఆయుష్షును సైతం తెలుసుకుంటే ఇంకేం చేస్తాదో చూడాలి.

0 comments:

Post a Comment