చర్మం మృదువుగా ఉండాలని టీవీలలో కనిపించే అడ్వెర్టైస్మెంట్లు చూసి ఇష్టమొచ్చిన క్రీములను కొని రాత్రుళ్ళు రాస్తుంటారు. తీర అవి మన చర్మానికి పడక వికటిస్తే అప్పుడు చర్మ వ్యాధుల డాక్టర్ వద్దకు పరిగెడతారు. ఎందుకు? ఇవ్వనీ అవసరం లేకుండా మన ఇంట్లొని వాటితోనే మెరిసే చర్మాన్ని కాపాడుకోవచ్చు. అవెంటో చూద్దమా..!
1.ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పాల మీగడను ముఖానికి రాసుకుని తెల్లవారుజామున చల్లని నీటితో కడిగిస్తే మీ చర్మం మిలమిల మెరిసిస్తుంది.
2. అలాగే స్నానానికి ముందు నిమ్మరసంలో కాసింత పసుపును కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, నల్లటి మచ్చలకు చెక్ పెట్టవచ్చు.
3. అలాగే రోజా పువ్వులు చందనాన్ని పేస్ట్ చేసి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే కొన్ని వారాల్లో ముఖంలో నల్లని మచ్చలు, కంటి కిందటి వలయాలు కనుమరుగమైపోతాయి.
4. అలాగే కేశ సంరక్షణకు సెంబరుత్తి పువ్వు రసం, నువ్వుల నూనెను సమపాళ్లలో వేడిచేసి ఆ నూనెను రాసుకోవాలి. ఇంకా టెంకాయ నూనెలో వేప పువ్వు వేసి వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే చుండ్రుకు చెక్ పెట్టవచ్చు. జుట్టు ఇంకా దట్టంగా పెరుగుతాయి
శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీలోషన్ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.దానిని ఇలా తయారు చేసుకోవచ్చు.
1.మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌కి, ఒక స్పూన్ గ్లిజరిన్, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.
2. కప్పు రోజ్‌వాటర్‌లో టీస్పూన్ బొరాక్స్ పొడిని, రెండు టీస్పూన్ల వేడిచేసిన ఆలివ్ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్ వాటర్ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు.
3. సబ్బుని చిన్నచిన్న ముక్కల్లా చెక్కుకుని మూడు టీస్పూన్ల నిండా దానిని తీసుకోవాలి. దానిని పావుకప్పు నీళ్లలో కలిపి వేడిచేసి, నాలుగు స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ని, టీస్పూన్ గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి.
ఇక మీ బాడీ లోషన్ తయారు. ఇక ప్రతి రోజు వాడి మెరిసే చర్మాన్ని పొందండి.

0 comments so far,add yours