పన్నీరుకి మన అందానికి ఎంతో మంచి సంబందం కలదు,సమాన్యంగా మన భారత దేశంలో, ప్రతీ ఇల్లు పన్నీరు కలిగి ఉంటుంది అనడంలో సందేహమే లేదు.


మీ కంటి సం రక్షణకు చిట్కాలు:
మీ కళ్ళు చల్లగా, మరియు, ప్రశాంతంగా ఉండడానికి కొంచెం “దూదె”(కాటన్ బాల్)తీసుకుని,పన్నీరులో ముంచి మీ కళ్ళ పై పెట్టుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.
ఈ పన్నీరుని “ఐ డ్రాప్స్”గా కూడా ఉపయోగించుకోవచ్చు, ఎలా అంటే, మీ కళ్ళు మంటలు పుడుతున్నా, ఎర్రగా ఉన్నా, 2-3 చుక్కలు మీ కంటిలో వేసుకుని 10-15 నిమిషాలు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంటే చల్లగా,ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
మీరు కళ్ళ కింద నల్లని మచ్చలతో బాధపడుతున్నారా, ఐతే కొంచెం పన్నీరు తీసుకుని, “దూదె” (కాటన్ బాల్) తో మచ్చలపై పన్నీటిని రాయండి,చనిపొయిన మీ చర్మ కణాలని తొలగించి,మలినాలతో మూసుకుపొయిన మీ చర్మంలోని రంద్రాలని శుబ్రం చేసి, మచ్చలని తొలగిస్తుంది.
పన్నీటితో ప్రయత్నించి విసిగిపొయి ఉన్నారా, ఐతే కొంచెం గంధం పొడిని పన్నీటిలో కలిపి ఆ మిశ్రమాన్న్ని మీ కంటి రెప్పలపై పట్టించుకుని 10-15 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.



మీ చర్మ సం రక్షణకు చిట్కాలు:
కొంచెం పన్నీరు తీసుకుని, కొంచెం “దూదె”తో (కాటన్ బాల్) తీసుకుని, మీ ముఖాన్ని పన్నీటితో శుబ్రం చేసుకోవాలి, అలా చేస్తే మీ ముఖంలోని దుమ్ము, ధూళి అంతా పోయి,చాలా తాజాగా అనిపిస్తుంది, ఇలా ఉదయాన్నే, మరియు రాత్రి పడుకునే ముందు చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది.
అంతే కాకుండా ఈ పన్నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకుంటే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.పన్నీటి సుగంధ పరిమళం(వాసన)మీ చర్మంలోని ఒత్తిడిని తగ్గించి ఎంతో తాజాగా మరియు ప్రశాతంగా ఉంచుతుంది.

మీరు మొటిమలు, నల్ల మచ్చలతో బాధపడుతూ ఉంటే, కొంచెం పన్నీరు తీసుకుని, ఆ మచ్చలపై రాస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది.


జుట్టు సం రక్షణలో పన్నీరు ఎలా ఉపయోగపడుతుంది:
అందమైన మీ జుట్టు కోసం కొంచెం పన్నీరుని, మీ షాంపూతో కలిపి జుట్టుకి పట్టించండీ,పన్నీటి సుగంధ పరిమళం(వాసన)మీ యొక్క జుట్టుకి పట్టి, మీ జుట్టుకి మంచి సువాసన లబిస్తుంది.
అంతేకాకుండా ఈ పన్నీరు మీ జుట్టు రక్షణకై “హెయిర్ కండీషనర్”గా కూడా ఉపయోగపడుతుంది.
ఒక వేళ మీ జుట్టూ రాలిపొతుంది(ఊడిపోతుంది) అని చింతిస్తున్నారా, ఐతె కొంచెం పన్నీరుని మీ అరచేతిలోకి తీసుకుని మీ వేళ్ళతో మీ జుట్టు యొక్క మొదళ్ళకు పట్టిస్తే, మంచి ఫలితాలు పొందవచ్చు.

మీరు చుండ్రుతో బాదపడుతున్నరా, ఐతే కొంచెం మెంతుపొడి, పన్నీరు కలిపి, మీ జుట్టుకు పట్టించి, 10-15 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మీ చుండ్రు మాయామౌతుంది.

మీ జుట్టుకి నూనె బదులు ఈ పన్నీరు రాసుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది.
Share To:

0 comments so far,add yours