పాదాలు పగిలి ఇబ్బంది పడుతున్నారా? డిటర్జెంట్లు పాదాలపై దాడి చేస్తున్నాయా? శరీరంలో విపరీతమైన వేడి వల్ల పాదాల పగుళ్ళు వచ్చి సతమతమవుతున్నారా? అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చికిత్స కు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఈ సమస్యకు చికిత్సలున్నాయి. ఆట్టే ఆశ్చయపోకండి. పాదాల పగుళ్ళతో బాధపడే వారికి మా ఈ తెలుగు టిప్స్ ద్వారా గృహ చికిత్సా విధానాలను ఈ శీర్షికలో ఇస్తున్నాం. మరి అవేంటో చూద్దామా..!


1. పాదాలు తట్టుకునేంత వేడినీటిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం చేర్చి పాదాలను ఆ నీటిలో ఉంచి, బ్రష్‌తో పాదాలను రుద్దినట్లైతే బ్యాడ్‌ సెల్స్‌కు చెక్‌ పెట్టవచ్చు.

2. గోరింటాకును బాగా రుబ్బుకుని పగుళ్లు ఉన్న చోట రాసుకుని ఎండిన తర్వాత కడిగితే పగుళ్లకు చెక్‌ పెట్టవచ్చు.

3.బొప్పాయి గుజ్జును పగుళ్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

Image result for foot scrub

4. వేపాకు, పసుపులో కాసింత సున్నం కలిపి పేస్‌‌టలా రుబ్బుకుని, ఆముదంలో చేర్చి పగుళ్లకు రాసినట్లైతే ఉపశమనం లభిస్తుంది.

5. అలాగే ఆముదం, కొబ్బరి నూనె సమపాళ్ళలో తీసుకుని అందులో పసుపు పొడి చేర్చి రోజూ పాదాలకు రాస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు.

6. రాత్ర నిద్రకు ఉపక్రమించే సమయంలో పాదాలను శుభ్రం చేసుకుని కొబ్బరి నూనె రాస్తే పగుళ్లు ఏర్పడవు.

7. ఇంకా నాణ్యత గల స్లిపర్స్‌, షూస్‌ వాడటం ద్వారా పగుళ్లు దరిచేరవు. ఇలాంటి గృహ చిట్కాలను పాటిస్తే మీ పాదాలకు చీకూ చింతా అవసరం ఉండదు.
Share To:

1 comments so far,Add yours