ప్రస్తుతం మారుతున్న స్థితిగతులూ, కార్పొరేట్ ఉద్యోగాలు, వ్యాపారంలో టెన్షన్లూ ఇవేకాక మానసిక ఒత్తిడులు అన్నీ కూడా మన జుట్టు ఊడిపోయేలా చేస్తాయి. ఎంత కష్టపడినా మన ఆరోగ్యం అందం దెబ్బతింటుంటే ఎవరికైనా బాధేమరి! ఇందుకోసం రకరకాల షాంపూలను, తెరపీలను వాడుతుంటాం. అవి సరిచేయకపోగా జుట్టు మరింత ఊడేలా చేస్తాయి. ఈ సమస్యను దాదాపు నూటికి 80 శాతం మంది ఎదుర్కొంటున్నారు. అయినా సరైన పరిష్కారాన్ని అన్వేషించలేకపోతున్నారు. ఏ తెరపీ వాడినా అది సైడ్ ఎఫ్ఫెక్ట్ లేనిదై ఉండాలి. అటువంటి నేచురల్ థెరపీలు మన ఇంట్లోనే ఉన్నాయి అన్నది సత్యం. వాటిని తెరపీలుగా వాడుకుంటే మనకు సమస్యలు తీరిపోగా మనశ్శాంతి లబిస్తుంది. ఆ గృహ చిట్కాలను మీకందిస్తున్నాం. అవేంటో చూద్దమా..!
1.కొబ్బరి నూనె: గోరువెచ్చగా చేసి తలకు రాసి మర్దన చేయడం వల్లా ఫలితం ఉంటుంది. తలలో రక్త ప్రసరణ సాఫీగా జరిగి, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగని రోజూ నూనె రాసుకోవాలని లేదు. తలస్నానానికి గంటా, రెండు గంటల ముందు నూనె రాసుకుంటే సరిపోతుంది.
2.ఉసిరి : జుట్టు రాలే సమస్యనే కాదు, చుండ్రుని కూడా నివారిస్తుంది. తలలో ఇన్‌ఫెక్షన్ ఉంటే తగ్గేలా చూస్తుంది. అలాంటి సమస్యలున్నప్పుడు పెరుగులో ఉసిరి పొడిని కలిపి తలకు పూతలా వేసుకొని కాసేపయ్యాక కడిగేసుకుంటే సరిపోతుంది.
4.గోరింటాకు : జుట్టు సంరక్షణకు సంబంధించి గోరింటాకు పొడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారం, పదిహేను రోజులకోసారి గోరింటాకు పొడిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగూ కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక తలస్నానం చేయాలి.
5.మందారం : జుట్టు విపరీతంగా రాలుతుంటే ఉడికించిన మందాల పువ్వుల్ని వాడితే ఎంతో మార్పు ఉంటుంది. అయితే ఆ పూతను నేరుగా కాకుండా పెరుగు లేదా గుడ్డులో కలిపి రాసుకోవాలి.
6.కొబ్బరిపాలు:కొన్నిసార్లు జుట్టు చిట్లిపోతుంది. పొడి బారడం, తలంతా దురదపెట్టడం వంటి సమస్యలూ తలెత్తుతాయి. వాటిని నివారించాలంటే తలకు కొబ్బరి పాలు రాసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి.
0 comments so far,add yours