ఈ రోజుల్లో జీవితం ఎంతో గజిబిజిగా, హడావిడిగా, ఉరుకులు, పరుగులు పెడుతూ, అందాన్ని కాపాడుకోవడానికి ఏ రకమైన వస్తువులు వాడాలో కూడా అలొచించుకునేంత సమయం ఉండడంలేదు అందుకే, “మీ అందమే మా ఆనందం” అని భావిస్తూ మీ కోసం, మీ అందమైన చర్మం కోసం సరికొత్త చిట్కాలు తెచ్చేశాం, ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి.
ముందుగా మీ చర్మంలో ముడతలు అనేక కారణముల వల్ల వ్యాపించవచ్చు,సూర్యిని కాంతి వల్ల, ధూమపానం వల్ల,ఈ ఇబ్బందులు కలగవచ్చు.అయితే మీ కంటి కింద, ముక్కు, నోరు ఇలా ముఖంలో అనేక భాగములలో ముడతలు వచ్చి మిమ్మల్ని అందమైన వయస్సులోనుంచి అమ్ముమ్మ, తాతాయ్యల వయస్సులోకి మార్చేస్తాయి, అంటే చిన్న వారు అయినను ఎక్కువ వయస్సు ఉన్నవారిలా కనపడతారు.

ధూమపానం వల్ల మీ చర్మం ముడతలు పడిపోతుంది, ఇందులో ఉన్న నికోటిన్ పదార్దము మీ రక్త ప్రవాహాన్ని సరిగా అవ్వకుండా ఆపేస్తుంది, అంతే కాకుండా మీ రక్త కణాల ఉత్పత్తిని కూడా ఆపేస్తుంది. దీని వల్ల మీ చర్మం ముడతలు పడిపోతుంది.

మంచి పౌశ్టికమైన ఆహారం విటమిన్ “E”తో తీసుకోవడం వల్ల మీ చర్మంలోని ముడతలు తగ్గి,ప్రారంభ దశలో ఉన్న ముడతలను ఆపుతుంది.


బయటకు వెళ్ళెటప్పుడు చర్మానికి సన్ స్క్రీన్ ను రాయడం మంచిది.ఇది మిమ్మల్ని ముడతల బారి నుంచి కాపాడుతుంది.

మీ ఆహార పద్దతులలో సరియైన సమ్యమనం పాటించండి, శరీర బరువు శాతం తగ్గినా చర్మం పై ముడతలు పడే ప్రమాదం ఉంది.

చర్మం ఎప్పుడూ పొడిగా మారకుండా తేమగా ఉంచడానికి ” మాయిశ్చరైజర్” ను ఉపయోగించండి.

తగిన పోషకపదార్దాలు లభించాలంటే మీ భోజనంలో పండ్లు, కూరగాయలు, గింజలు,తీసుకుంటే మంచిది, వీటిలో ఉన్న పొషకపదార్దాలు మీ చర్మాన్ని ముడతల బారి నుండి రక్షిస్తాయి.

అత్యంత సులభమైన చిట్కా ఏమిటంటే, సరియైన సమయం అంటే కనీసం 6 గంటలు నిదుర పోతే, మీ చర్మం ముడతలు పడకుండ కాపాడుకోవచ్చు.

మీ ఆహారంలో “విటమిన్ A,C,E,K”కలిగి ఉన్నవి తీసుకుంటే, మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు .

ఒక నమ్మలేని నిజం ఏమిటంటే, ఒత్తిడి వల్ల కూడ మన చర్మం ముడతలు పడడానికి దారి తీస్తుంది.

సాద్యమైనంత వరకూ ప్రశాంతమైన మనస్సు, ఆలోచనలతో ఉంటే మంచిది.
చర్మవ్యాధి నిపుణులు సలహా ప్రకారం మీ ముఖాన్ని ఎక్కువగా శుబ్రం చేయరాదు, అలా చేస్తే మీ చర్మంలోని సహజమైన కణాలు పోయి, ముడతలకు దారి తీసే ప్రమాదం ఉంది.
మీరు సూర్యునికాంతి ప్రభావం నుండి బయటపడాలంటే “విటమిన్ C” ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.
Share To:

0 comments so far,add yours