Monday 17 October 2016

మలబద్దకం మిమ్మల్ని బాధిస్తుందా??ఉపసమనానికి పద్దతులు, ఆహార అలవాట్లు చూసేద్దాం


మీ కడుపులో సరిగా లేకపోతే ఆరోజంతా నరకంగా అనిపిస్తుంది.ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు కాని, ఈ మలబద్దకం వల్ల నలుగురిలో ఉన్నప్పుడు, మీకే కాకుండా అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది.అయితే కంగారుపడి,భయపడవలసిన అవసరం లేదు, మీరు తీసుకునే ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

పీచు పదార్దములు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి,దీని వల్ల ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది. సామన్యముగా మనం పౌశ్టికమైన ఆహారం తీసుకోవడం కన్నా “జంక్ ఫుడ్”నే ఎక్కువగా ఇష్టపడతాము, కానీ ప్రతీ రోజూ మనం తీసుకునే ఆహారంలో 26 గ్రాముల పీచు పదార్దంతో కూడిన ఆహరం ఉండాలి.

సామన్యంగా ఈ మలబద్దకము, సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల, మన తీసుకునే ఆహారంలో పీచు పదార్దం లేకపోవడం వల్ల,ఇంకా చాల కారణముల చేత వస్తుంది.దానికోసం మందులు వాడి మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం సరికాదు, పీచు పదార్దం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది.



పండ్లు , కూరగాయలు , బీన్స్ మరియు ధాన్యాలు:ఇవి అన్నీ అధిక శాతంలో పీచు పదార్దం కలిగి ఉన్నవే, అయితే సరియైన పౌశ్టికమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది.ఆకులు, పండ్లు, పండ్ల యొక్క పై తొక్క భాగములో ఎక్కువగా మీకు పీచు పదార్దం లభిస్తుంది.ఆపిల్ పండులోని తొక్కను తీయకుండా తీసుకుంటేనే మంచిది,పచ్చి కూరగాయలు, ఆకుకూరలలో పీచు పదార్దమే కాదు శరీరానికి కావలసిన మెగ్నీషియం కూడా లభిస్తుంది.

ఎండు ద్రాక్ష: ఈ మల బద్దక సమస్యకు ఎండు ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న లక్షణాలు మన కండరాలను ఉత్తేజపరచి, పెద్ద ప్రేగు ద్వారా వ్యర్ద పదార్దాలని పంపించేస్తుంది.5 ఎండు ద్రాక్షలో 3 గ్రా.ము పీచు పదార్దం ఉంటుంది.

కాఫీ మరియు ఇతర వేడి ద్రవాలు: కాఫీ మన ఆరోగ్యానికి ఏ రకంగాను సహయపడక పొయిన మనలోని ఒత్తిడిని తగ్గించి, మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.అయితే ఈ మలబద్దక సమస్య నిర్మూలనలోను కాఫీ ఎంతగానో సహాయపడుతుంది, అంతే కాకుండా ఇతరత్రా వేడి పదార్దాలు తీసుకోవడంలోను ఈ సమస్య నుంచి మంచి ఫలితం లభిస్తుంది.

నీరు: మనం పీచు పదార్దం ఎంత తీసుకున్నప్పటికీ, దానికి తోడు నీరు కూడా తీసుకోవాలి,లేదంటే కడుపులో ఉన్న వ్యర్ద పదార్దాలు శుబ్ర పడకుండా అధిక నొప్పితో మలబద్దకముకు దారి తీస్తుంది.పండ్ల ముక్కల్ని నీటితో కలిపి తీసుకుంటే మంచి ప్రభావం చుపిస్తాయి.

రాత్రి పూట పడుకునే ముందు 1 గ్లాసు వేడి పాలు తాగి పడుకుంటే మీ జీర్ణాశయం శుబ్రపడి, మంచి ప్రబావం చుపిస్తుంది.

మీరు భోజనం చేసిన తరువాత దానిలో భాగంగనే పీచు పదార్దం తీసుకున్నట్లు అయితే అహారం త్వరగా జీర్ణం అయ్యి ఈ మలబద్దక సమస్యనుండి విముక్తి లభిస్తుంది.

0 comments:

Post a Comment