Saturday 1 October 2016

సోరియాసిస్ కు దూరంగా ఉండాలంటే !?

కొందరికి చర్మ వ్యాధులు మానసిక బాధకు గురిచేస్తాయి. ఈ వ్యాధులు హాని చేయకపోయినా న్యూనతా భావాన్ని కలిగించి అవి ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూపులు చూసేలా చేస్తాయి. అయితే ఇవి మెల్లగా శరీరలోనికి ప్రవేశించి మెల్ల మెల్లగా వాటి ప్రభావం పెంచుకుంటూ తమ ఉనికిని పెంచుకుంటాయి. మనలో ఉన్న అశ్రధ్ధ వల్ల వాటి స్వైర విహరం పెరుగుతుంది. అందులో ఒకటి సొరియాసిస్. ఇది ఎందుకు వస్తుందో చెప్పటం కష్టం. కానీ సోరియాసిస్ రావటానికి గల కారణాలు చికిత్సా మార్గాలను మీకోసం ఇస్తున్నాం.

సోరియాసిస్ ఎలా వస్తుందంటే:

మానసిక ఉద్విగ్నత (స్ట్రెస్) అందులో ఒక ముఖ్య కారణం. అది కాక, వాతావరణం, అందులోని హెచ్చు తగ్గులు , కాలుష్యం మరొక కారణం. చర్మంలో తగినంత తేమ లేకపోవడం వొక ముఖ్య కారణం.అంటే డ్రై స్కిన్ కలిగి వుంటే ఈ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం వుంటుంది. అంటే చలి కాలం, ఏ.సీ లో ఎక్కువ గడపడం యివి కూడా ముఖ్య కారణాలే.


సోరియాసిస్ కు దూరంగా ఉండాలంటే:

1. తెల్లవారి 5 గంటల సమయంలో సూర్యుడి కిరణాల్లో విటమిన్-ది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ కిరణాలు తగిలినప్పుడు చర్మానికి అనేక రకాలుగా మంచిది. చర్మ వ్యాధులు వచే అవకాశం ఉండదు.

2. అలాగే చర్మం పొడి కాకుండా చూసుకోవడం ముఖ్యం. అంటే అలోవేరా, ఈవియాన్ లాంటి ఆయింట్మెంట్లు ఎక్కువ గా వాడడం వల్ల చాలా ప్రయోజనం కనిపిస్తుంది . వీటిలో విటమిన్.డీ. కూడా వుండే ఆయింట్మెంట్లు యిప్పుడు ఎన్నో మార్కెట్లో వున్నాయి. వాటిని వాడటం మంచిది.

3. మరో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే పసుపు కలసిన మంచి ఆయింట్మెంట్లు ఎన్నో మార్కెట్ లో లభిస్తున్నాయి. వీకో టర్మేరిక్ క్రీము ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ, చర్మ రోగాలకు, ముఖ్యంగా, సోరియాసిస్ కు బాగా పని చేయడం జరుగుతోంది. సోరియాసిస్ వున్న వారు ఈ క్రీములు వాడటం మంచిది.

4. సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు అతి ముఖ్య వైద్యము, వాటిని గురించి వర్రీ కాక పోవడమే. ముఖ్యంగా అది చర్మపు పైపొరకు మాత్రం వచ్చే వ్యాధి కనుక చర్మం లోని రెండో పొరని కూడా అది బాధించదు అనేది గుర్థుంచుకోవాల్సిన విషయం. లోపలి అన్ని అంగాలు బాగా పని చేస్తున్నాయి అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి.

5. మనలో వుండే భయము, సిగ్గు మాత్రమే ముఖ్య రోగం కాని అవి రెండూ వదిలేస్తే నిజమైన రోగం ఏమీ బాధించదు మనం గుర్తుంచుకోవాలి.

6. పక్కవారు ఏమనుకుంటారో అన్న భావన, ఎవరో ఏదో ఒక మాట అంటే దానిని తలుచుకునే బాధ పడటం తప్ప , నిజమైన బాధ ఏమీ వుండదనే చెప్పవచ్చు. ఈ మనో వ్యధల / బాధల వల్లనే మోకాళ్ళ నొప్పులు , మరో నొప్పులు, మరో వ్యాధులు వస్తూ వుంటాయి.

7. ప్రాణాయామాలు, ధ్యానము నేర్చుకొని ప్రతి రోజూ ఎంత సేపు వీలైతే అంత సేపు చెయ్యటం శరీరానికే కాక మనసుకూ ఎంతో మంచిది. తగ్గుతుందన్న నమ్మకంతో చెయ్యండి. తగ్గాలనే కౄత నిశ్చయంతో చెయ్యండి. నిరాశకు అసలు చోటు ఇవ్వకండి.

8. మనకు వచ్చే రోగాలన్నీ పోగలిగేవే. ప్రతి రోగానికీ మందు వుంది. సగం మందు మనలోనే వుంది. మనో బలం పూర్తిగా పోవచ్చు కూడా. సగం మందు బయట వుంది.కాబట్టి చర్మ వ్యాధుల గురిచి దిగులు చెందకండి.

0 comments:

Post a Comment