నోటినీ,పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవటం వల్ల వయస్సు మీద పడేటప్పుడు వచ్చే సమస్యలకు దూరంగా ఉండవచ్చు.నోటినీ శుభ్రంగా ఉంచుకోవటం అంటే రోజూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవటం,వాటిని ఎప్పుడూ కడుక్కోవటం.నోటిని శుబ్రంగా ఉంచుకోవటం ఎలా అనేది ఏ వయస్సు వారు ఎలా జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నపిల్లలు:
పుట్టుకతోనే పిల్లల్లో పళ్ళు నిర్మాణం జరిగిపోతుంది కాని అవి చిగుళ్ళ క్రింద ఉండిపోతాయి.ఒకసారి పళ్ళు వచ్చాక ఆ నిర్మాణం జీవితాంతం ఉండిపోతుంది.కాబట్టి ఒకసారి పళ్ళు వచ్చాక వాటిని ఎలా ఉంచుకోవాలో తల్లిదండ్రులు తెలియజేయాలి.పుట్టుకతో వచ్చిన పళ్ళను సమ్రక్షించుకుంటే అవి వాళ్ళు పెద్ద అయ్యేవరకూ ఆ స్థానాలను పదిలంగా ఉంచుకుంటాయి.కాబట్టి మీ పిల్లలు చక్కగా ఆహారం నమలాలంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవటం ఒక్కటే మార్గం.
పిళ్ళల పళ్ళ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:
1.అప్పుడే పళ్ళు వస్తున్న పిల్లలకు రోజూ పళ్ళను శుభ్రంగ తోమాలి.అంతేకాక అప్పుడే వచ్చే పళ్ళను ఒక గుడ్డ సాయంతో సున్నితంగ పళ్ళను తోమాలి.2 సంవత్సరలు లోపు పిల్లలకు బ్రష్ వాడకూడదు.కేవలం తడిగుడ్డతో మాత్రమే తోమాలి.
2.పిల్లల్ని నోటిలో సీసా పెట్టుకుని పడుకోనివ్వరాదు.ఎందుకంతే ఆ సీసాలో ఉన్న పాలు లేదా మరేదైన తాగేవస్తువు పళ్ళలో చేరి పళ్ళను పాడు చేస్తాయి.
3.కొంచెం వయసు కలిగిన పిల్లలకు తక్కువా చక్కెర శాతం ఉన్న పదార్థాలైన పళ్ళు,కూరగాయలూ తినేలా అలవాటు చెయ్యాలి.అంతే కానీ చూయింగ్ గంలు,కాండీలు తిననివ్వకండి.
4.పిల్లలకు నోటి పరిశుభ్రత,పళ్ళ విషయం లో తీసుకొవలసిన జాగ్రత్తలునీర్పాలి.పళ్ళు శుభ్రపరచుకునే విధానాని వారికి తెలపాలి.
5.అలాగే పిల్లల్ని డెంటిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళలి.అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ఏడాది నిండిన పిల్లలకు చెక్ అప్ అవసరమని సూచిస్తోంది.
టీన్స్:
పళ్ళను శుబ్రంగా ఉంచుకోవటం వల్ల మీ చిరునవ్వు ఫ్రెష్గాను స్వాస మంచి ఫ్రెష్ గా ఉంటుంది.
1.మీ పళ్ళను రోజూ రెండు సార్లు ఫ్లూరైడె బ్రుష్ తో కడుకుంతే మంచిది.
2.రోజుకొకసారి పళ్ళను పుక్కిలించటం ఎంతో మంచిది.
3.చూయింగ్ గం తినకూడదు,పొగ త్రాగరాదు.ఎందుకంటే పొగ త్రాగటం వల్ల మీ పళ్ళు గారలు పడతాయి.ఫలితంగా నోరు దుర్వాసన వస్తుంది,అంతేకాక కాన్సర్ వస్తుంది.
4క్రికెట్ మొదలైన క్రీదల్లో తలకు ధరించె హెల్మెత్ను వాడలి.
5.ప్రతీ ఆరు నెలలకొకసారి మీ డెంటిస్ట్ ను కలవండి.చెక్ అప్ చేయించుకోండి.
పెద్దలు:
పళ్ళ సమ్రక్షణ చక్కగా చేసుకోవటం వల్ల చిగుల్ల సమస్యలకు, పళ్ళు ఊడిపోవటం సమస్యలు తలత్తకుండా ఉంటాయి.
1.రోజూ 2 సార్లు బ్రష్ చెసుకోవాలి.ఫ్లూరైడ్ బ్రష్ తో తోముకోవాలి.రోజుకొకసారి పళ్ళను పుక్కిలించుకోవాలి.
2.చూయింగ్ గం వాడవద్దు,పొగ త్రాగవద్దు.
కొన్ని మందులు వాడినప్పుదు పళ్ళపై వాటి ప్రభావం ఉంటుంది.కాబట్టి మీ డెంటిస్ట్ ను సంప్రదించాకే వాటిని వాడండి.
3.మీ నోతిని, పళ్ళను నిత్యం పరీక్షించి చూసుకోండి.ఎందుకంతే బలహీనపడిన పళ్ళు,చిగుళ్ళ సమస్యా తెలిసేందుకు అవకాశముంది.
4.ప్రతి ఆరు నెలలకొకసారీ మీ దంత వైదుని వద్దకు వెళ్ళండి.
0 comments so far,add yours