Tuesday 18 October 2016

చక్కటి ఆరోగ్యానికి పాటించవలసిన పధ్ధతులు


మీకు మీ ఆరోగ్యం అంటే శ్రధ్ధ వుందా? మీ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యమని ఏనాడైన ఆలోచించారా?అవును మన ఆరోగ్యం బాగుంటేనే కొంతకాలం జీవిత లక్ష్యాలు సాధించవచ్చు.అంతే కాక మన ఆరోగ్యాన్ని చూసి మరికొందరు మారే అవకాశముంది.మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని అదీ మన అలవాట్లలోనె ఉందని ఇప్పుడు తెలుసుకుందాం: 


 
ఆహారంలో ఎక్కువగా పళ్లు, కూరగాయలు ఉంటే అది ఆరోగ్యకరమైన ఆహారం అన్నమాట.అధిక బరువు తగ్గితే, దాంతో పాటు ఉప్పు వాడకం తగ్గిస్తే రక్తపోటు తగ్గుతుంది. పక్షవాతం రావడానికి ముఖ్య కారణం అధిక రక్తపోటే. సగం గుండెపోటు, పక్షవాతాలకు కారణం అధిక రక్తపోటు.రక్తపోటు,కొలెస్ట్రాల్,షుగర్ ఏ స్థ్తాయిలో ఉన్నయో,ఏ స్థ్థాయిలో ఉండాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.అదేవిధంగా గుండె బాగా పని చేసేందుకు ఓ కార్యచరణను రూపొందించుకోవలి.ఎక్కువగా మధ్యపానం చేసే వారిలో గుండె జబ్బులు,లివర్ పాడవటం,రక్ట పోటు పెరిగి పోవటం లాంటివి వస్తాయి.అంతేకాక మధ్యపానం చేసే వారిలో రక్తపోటు కూడా పెరుగుతుంది. సరైన ఆరోగ్యం కొరకు మధ్యపానం ఆపేయాలి.ఇక ధూమ పానం విషయానికొస్తే రోజూ తక్కువ తక్కువగ మనేయ్యాలి.అంతేకాక ధూమపానం మానటానికి ఎన్నో మందులు ఈ రోజు వచ్చాయి. అంతే కాక ధూమ పానం చేయలి అనుకున్నప్పుడు పనిమీదే శ్రధ్ధ పెడితే దానిపై ధ్యాస పోతుంది..రోజూ అరగంట పాటు నడక, లేదా ఏ ఇతర్ సులభమైనటువంటి వ్యాయామం చేస్తే గుండెపోటు, పక్షవాతం రాకుండా నిరోధించవచ్చు.ఒక సంవత్సరం పాటు పొగతాడం మానేస్తే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సగం తగ్గుతుంది. కొన్నేళ్ళు పొగతాగకుండా ఉంటే ఆ రిస్క్ పూర్తిగా పోతుంది.మీరు తాగకపోయినా పక్కవారు తాగి పీల్చే పొగ వల్ల వారికంటే ముందు మీరు జబ్బుపడతారు. అంటే మీరు ప్రతి రోజూ చేసే పనిలో శారీరక శ్రమనుఉందేలా చూసుకోవాలి.వీలైనప్పుడంతా నడవడం చేయాలి. శుభ్రమైన గాలి పీల్చడానికి కాసేపు నడవాల్సి వస్తే నడవండి. రోజుకు రెండు సార్లు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు ఐదు నిమిషాలపాటు చేయొచ్చు.బయట తినేటప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. క్యాంటీన్ లో, హోటళ్లలో ఏది పడితే అది తినటం మంచిది కాదు.మానసిక ఒత్తిళ్ళ వల్లే కాక పొగతాగడం, ఆల్కహాలు తీసుకోవడం, ఏ ఆహారం పడితే ఆ ఆహారం తినడం వల్ల జరుగుతుంది.కొవ్వు తక్కువగా వుండే పద్దార్థాలు తినటం ఎంతో మంచిది.పండ్లు, తాజా కూరగాయలు తినటం శరీరానికి ఎంతో మంచిది.

0 comments:

Post a Comment