మన శరీరంలో ఏ అంగనికైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ వద్దకు పరిగెడతాం. అయితే చర్మానికి సమస్య వస్తే కాసింత ఆలస్యంగా వెళతాం. ఆ సమయానికి సమస్య కాస్తా ఎక్కువైపోతుంది.ఫలితంగా ఎన్నో డబ్బులు ధారపోస్తాం. కానీ మార్పు రావటం మాట అలా ఉంచినా ఫలితం మాత్రం సూన్యం. ఎందుకంటే చర్మ సమస్య మొదలైతే అది తొందరగా తీరదు. ఈ మాట నూటికి నూరుపాళ్ళు నిజం. పుట్టడం తోనే చక్కని చర్మంపొందడం కుదరని విష యం. జన్యు పరమైన మార్పుల కారణంగా చర్మం అనేక మార్పులు చెంది మనకు చుట్టుకుని ఉంటుంది. చర్మం యొక్క రంగు వారసత్వంపై కూడా ఆధారపడవచ్చు.

ఎవరికైనా కూడా పూర్తి ఆరోగ్యవంతమైన చర్మం ఉందని చెప్పటం కష్టం. ప్రస్తుతం చాలా మంది శుభ్రతను పాటిస్తూనే మరింత ఆకర్షణీయంగా ఉండడం కోసం అనేక రకాల క్రీములను వాడుతూ ఉంటారు. చర్మంలో కూడా కొన్ని రకాలు ఉం టాయి. వాటికి తగిన మందులను ఎంచు కోవడంలోనే చాలా మంది విఫలమవుతున్నారు. క్రీముల ద్వారా కొందరు లాభపడుతుంటే మరికొందరు అదే క్రీముల వలన నష్టపోతున్నారు. ఏ చర్మానికి ఏ క్రీములు వాడాలో తెలియక ఏదో ఒక క్రీము తీసుకుని వాడటం వల్ల పూర్తిగా నష్టపోతున్నారు. చివరికి కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంలా తయారవుతుంది వారి పరిస్థితి. అసలు చర్మం గురించీ అది ఎందుకు ఇబ్బందికి గురి అవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.



కొన్ని సార్లు జన్యుపరమైన విషయాలను కూడా మన అలవాట్లు మార్చుతాయి. ముఖ్యంగా ఎండలో తిరిగే సమయం, ఎండ తీవ్రత, సిగరెట్‌, ఒత్తిడి, నిద్ర వంటి విషయాలే ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటి వల్లనే మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడుతాయి.

సూర్యుని నుండి వచ్చే ప్రమాదకర కిరణాలను అతినీలలోహిత (ultra violet) కిరణాలు అంటారు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఖహూ కిరణాలు (UVA) చర్మం వదులుగా అయ్యేలా చేస్తాయి. ఖవ్దీ కిరణాలు చర్మంలో ఉండే కణాలను కాల్చివేస్తాయి. సాధారణంగా అన్ని సన్‌లోషన్లూ ఖవ్దీ కిరణాలను మాత్రమే అడ్డుకుంటాయి. అలాగే సన్ స్క్రీన్ లోషన్ స్థాయి ఖవ్దీ కిరణాలను(UVB) ఆపగల గరిష్టస్థాయిని మాత్రమే వివరిస్తుంది. అందువల్లనే ఎంతో మంది ఖరీదైన సన్‌లోషన్‌ వాడుతున్నప్పటికీ చర్మం వదులుగా అవుతుంది. సన్‌లోషన్‌ను వాడదలిచిన వారు ఖవ్దీ కిరణాలను మాత్రమేగాక ఖహూ కిరణాలను అడ్డుకొనగల క్రీములను ఎంచుకోవాలి. జింక్‌, అవెబెన్‌ జోన్‌ వంటి పదార్థాలు ఖహూ కిరణాలను అడ్డుకొనగలుగుతాయి. అందువలన సన్‌లోషన్లలో జింక్‌ మరియు అవెబెన్‌జోన్‌ (avobenzone) కూడా ఉండే క్రీములను ఎంచుకోవాలి.

ప్రస్తుతకాలంలో ఏ సన్‌స్క్రీన్‌ లోషన్‌ అయినా చర్మానికి తేమ అందించే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. కనుక జిడ్డుగా ఉండే చర్మం కలవారు మళ్లీ మాయిశ్చరైజర్‌ వాడడం వల్ల నిగారింపును కొల్పోతారు. అందువలన అందరికీ మాయిశ్చరైజర్‌ అవసరం ఉండదు. ఒక వేళ రెండూ వాడాలని అనుకుంటే ముందుగా మాయిశ్చరైజర్‌ను వాడి నీటితో శుభ్రపరిచి, ఆరిన తరువాత మాత్రమే సన్‌స్క్రీన్‌ లోషన్‌ను వాడాలి.

ఇప్పటి వరకూ జరిపిన సర్వేల ప్రకారం 18ఏళ్ల వయస్సు వరకూ కేవలం 18 నుండీ 23 శాతం వరకూ మాత్రమే చర్మంలో సౌరశక్తి వల్ల సమస్యలు ఉత్పన్న మవుతాయి. కనుక ఒక వేళ ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోనంత మాత్రాన జీవితాంతం బాధపడాలి అన్న మాట అవాస్తవం.
Share To:

0 comments so far,add yours