Friday 7 October 2016

చర్మాన్ని మిల మిలా మెరిపించే ఫలాలు.

ఆహా.. ఏం తేజస్సు, ఏం రంగు అని మనం కొందర్ని చూసి ఆశ్చర్యపోతుంటాం. మరి కొందరిని చూస్తే ఇందుకు భిన్నం గా ఉంటుంది. ఆలా ఉండేందుకు మనమూ ప్రయత్నిస్థాం. దాని కోసం ఏవేవో శరీరానికి రాస్తూ ఉంటాం. కారణం ఏదో తెలియక ఫేస్ ప్యాకులు ,మానిక్యూర్లు చేయించుకుంటాం కాని సమస్య మనకు తెలియదు.ఫలితం మాత్రం శూన్యమే. ఎన్ని చిట్కాలు పాటించినా కూడా ఫలితం రాకపోగా మరిన్ని సమస్యలు కొనితెచ్చుకోవడం ఖాయం. దీనికి కారణం బయటి సమస్య మాత్రమే కాదు.. శరీరంలోనిది కూడా..! కాబట్టి పైపై రంగులు, మేకప్‌ మాత్రమే కాకుండా అంతర్గతంగా కూడా కాస్త జాగ్రత్త వహించాలి. మన చర్మం మెరిసేందుకు కొన్ని జ్యూసులను సేవించాలి. మనకు అందుబాటులో ఉండే పండ్లతో మన ఆరోగ్యం, అందం రెండూ ఇనుమడిస్తాయి. అవేంటో చూసేద్దామా ఒకసారి..!

జామకాయ

పండ్లలో అతి చవకగా అందరి ఇంట్లో కనపడుతూ నేను మీ ఇంట్లో ఉన్నానంటూ కనిపించేది జామకాయ. జామకాయలో వుండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తా యి. ఆరోగ్య సంబంధిత వ్యాధులు నయమవుతాయి. క్రమంగా చర్మం నిగారింపు సం తరించుకుంటుంది.

ఆపిల్‌

కోసే కత్తికి కూడా శ్రమపడకుండా అతి సుతిమెత్తగా ఉండే పండు ఆపిల్. యాపిల్‌లోని గుణాలు చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చి మెరిసేలా చేస్తాయి. రోజూ ఒక ఆపిల్‌ తీసుకోవడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే వాటిని చాలా వరకు దూరం చేసుకోవచ్చు.

Image result for fruits beauty tips

టమాటా

ఇది రక్తా న్ని శుద్ధి చేస్తుంది. విటమిన్స్‌ కూడా లభి స్తాయి. టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

క్యారెట్‌

క్యారెట్ను చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. తినడానికి ఎంతో రుచిగా వుండే క్యారెట్‌లో పోషకాలు కూడా ఎక్కువే.ఇందులో వుండే విటమిన్‌ ఏ, సిలు చ ర్మానికి తేజస్సును ఇస్తాయి. కళ్లకు కూడా ఎంతో మంచిది. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

బీట్‌రూట్‌

బీట్రూట్ రసం ఎంతో మంచి విలువల్ని కలిగి ఉంటుండి. రక్తంలోని మలి నాలను తొలగిస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యని పెంచుతుంది. లివర్‌కు మంచిది. కిడ్నీ లను శుద్ధి చేస్తుంది. చర్మాన్ని మెరి సేలా చేస్తుంది.

పుచ్చకాయ

దాహార్తిని తీర్చడం తోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. శరీరానికి చలువను ఇస్తుంది. అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది.

0 comments:

Post a Comment