Friday 7 October 2016

ఔషధగుణాల అల్లం ... రోగాలకు వెయ్యండి కళ్లెం.

ఘాటుగా ఉండి వెజ్ నాన్వెజ్ తేడా లేకుండా అన్ని కూరలలో వాడేది అల్లం. అల్లం పచ్చడి గురించి చెప్పనవసరం లేదు.ఇద్లీలో, దోశలో నంచుకు తింటే అహా..!చెప్పనవసరంలేదుగా..!అల్లంలో మనకు తెలియని ఔషధీయ గుణాలు ఎన్నో పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు చక్కటి మందులా పనిచేస్తుంది. కొందరు అల్లాన్ని అన్నింటిలో వాడితే మరి కొంత మంది మాత్రం అల్లాన్ని చూస్తే ఆమడ దూరంలో ఉంటారు. అల్లాన్ని దూరం చేసుకుంటే మన ఆరోగ్యాన్ని దూరం చేసుకున్నట్టే.



ఇక మరి అల్లం ఔషధీయ సంగతులు తెలుసుకుందామా..!
  1. గర్భిణీ స్ర్తీలలో రెండవ నెల ఆరంభంతోనే వాంతులు అవడం, తలతిరుగుడు, నడుం బాధలు లాంటివి వస్తుంటాయి.
  2. మోషన్‌ సిక్‌నెస్‌, సీసిక్‌నెస్‌లను తగ్గిస్తుంది. కడుపులో వాయువును అల్లం హరించి వేస్తుంది.
  3. జింజెర్ గాస్ట్రో ఇంటెస్టినల్‌ డిస్ట్రెస్‌ అంటే జీర్ణ సంబంధమైన ఇబ్బందులన్నిటికీ అల్లం రామ బాణంలా పనిచేస్తుంది
  4. అరుగుదల లేకపోవడం వంటి వాటిని మార్నింగ్‌ సిక్‌నెస్‌ అంటారు. దీనిని అల్లం బాగా తగ్గిస్తుంది.
  5. జలుబు, ఫ్లూను నివారించేందుకు చికిత్స చేయటానికి కూడా అనాదిగా వైద్యులు, ఆయుర్వేద శాస్తక్రారులు అల్లాన్ని ఉపయోగించారు.
  6. అల్లం పెయిన్‌ కిల్లర్‌. అలానే మంట ఎక్కడ ఉన్నా తగ్గిస్తుంది.
  7. కఫం, దగ్గుకు అల్లం తేనె కలిపి ఇచ్చిన వెంటనే ఉపశమనం కలుగుతుంది.
  8. నీరసంగా ఉన్నప్పుడు అల్లం టీ త్రాగాలి. నూతనోత్సహం వస్తుంది.
  9. కాల్చిన అల్లాన్ని శొంఠి అంటారు. శొంఠిని పొడిగా చేసి అర స్పూన్‌ పొడి, ఆర స్పూన్‌ పంచదార కలుపుకొని పరకడుపున తీసుకోవాలి. లేదా మొదటి ముద్దలో 10.
  10. శొంటిపొడిని తీసుకుంటే తిన్నది జీర్ణం బాగా అవుతుంది.
  11. రక్త క్యాన్సర్‌ను నిరోధించ డంలో బాగా పని చేస్తుంది. కనుక అల్లాన్ని ఆహారంలో వాడడం ఎంతో మంచిది. అల్లం టీ త్రాగడం, రోజు ఉదయం ఓ చిన్న అల్లం
  12. ముక్క నమిలి తినడం ద్వారా అజీర్తి, గ్యాస్ట్రిక్‌ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
  13. అల్లాన్ని నిమ్మరసంలో ఊరబెట్టి అజీర్ణం అనిపించినప్పుడు తింటుంటే ఆ మందం తగ్గుతుంది. అల్లం సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.
  14. గుండెలో మంట వచ్చినప్పుడు అల్లం తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
  15. కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. కేన్సర్‌ ట్యూమర్స్‌ పెరగనీయదు.
  16. మైగ్రేన్‌ తలనొప్పిని వెంటనే తగ్గిస్తుంది.

0 comments:

Post a Comment