అందం అనగానే గుర్తొచ్చేది ఆడవాళ్ళు, అలా అని వదిలేస్తే మగవాళ్ళు ఏమైపోతారు.వాళ్ళు కూడా అందంలోను, దాని సం రక్షణలోను ఆడవారితో పోటీ పడుతున్నారు.ఆడవారికి ఉన్నట్లుగా మగవారికి అన్ని రకముల “కాస్మటిక్స్” లేకపొయినప్పటికి, ఎన్నో సహజమైన పద్దతుల ద్వారా వారి అందాన్ని కాపాడుకుంటూ, అందంలో వారుకూడ ఆడవారికి తక్కువ కాదు అని చెప్పడానికి ఈ పద్దతులు, రండి చూసేద్దాం:
సాధారణంగా మగవారి కన్నా ఆడవారికే చర్మం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి,అయితే కొన్ని అధ్యాయనాల ప్రకారం మగవారి చర్మం ఆడవారి చర్మం కన్నా ఆలస్యంగా ముడతలు పడుతుందంట కాని, మగవారి జీవనశైలి, వారి అలవాట్లు, వారిని చర్మ సమస్యలలో ముందుకు తీసుకు వచ్చి,ఆడవారితో సమానం చేసేశాయి.
సరే అయ్యిందేదో ఔతుందిలే కాని, మగ వారి చర్మ రక్షణకు చిట్కాలు చూసేద్దామా,
ధూమపానం: ధూమపానం అనేది మగవారి యొక్క “Manliness”కి చిహ్నము లాంటిది.కాని దీని వల్లనే మగవారి వయస్సు వారి అసలు వయస్సుకన్నా ఎక్కువగా అనిపిస్తుంది,ధూమపానము మగవారి అసలు వయస్సుకి మరికొంత వయస్సు కలిపి, చర్మం ముడతలకు, పొడిబారిపోవడానికి కారణం అవుతుంది.
షేవింగ్ : సాధరణంగా మగవారు షేవింగ్ ఎక్కువగా చేసుకోవడం వల్ల చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి,షేవింగ్ వల్ల చర్మం కఠినంగా అయిపొయి, చర్మంలోని తేమను తీసివేస్తుంది, అందువల్ల చర్మం పొడిగా మారి ముడతలకు దారి తీస్తుంది. మీరు షేవింగ్ ను చల్లని నీటితో చేసుకుని,తరువాత “మాయిశ్చరైజర్” ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ద్రాక్ష రసం: మగ వారి చర్మ సౌందర్యానికి ద్రాక్ష రసం ఎంతో మంచిది, ప్రతీ రోజూ ఆహారంతో పాటు ద్రక్ష రసాన్ని కలిపి తీసుకుంటే, అది మీ చర్మంలోని “Elasticity” స్థితిస్థాపకతను పెంచి, మీ చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచుతుంది.
మద్యం: మగవారికి ముఖ్యమైన, ఎంతో ఉపయోగకరమైన చిట్కా ఏమిటంటే మద్యాన్నికి దురంగా ఉండటం, ఎందుకంటే మద్యం వల్ల రక్త నాళాలు అవసరమైన దానికంటే ఎక్కువగా సాగి ఇబ్బందులు కలిగిస్తాయి.
వ్యాయామం: వృద్దాప్యంగా కనిపించడం అనేది మన చర్మం వల్లే కాదు మన కుంగిపోయిన కండరాలు కూడా దీనికి కారణం అవుతాయి,అందుకే ప్రతీ రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయడం వల్ల కండరాలు బలపడి చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
మసాజ్: రోజూ మీ ముఖం పై మెల్లగా మసాజ్ చేయడంవల్ల రక్త ప్రసరణ సజావుగా సాగి చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది.
రోజూ పాలతో మీ ముఖాన్ని శుబ్రం చేసుకుంటే చర్మంలోని మలినాలు అన్నీ పోయి మంచి ఫలితం కనిపిస్తుంది.
ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు.
ముఖ్యంగా బచ్చలికూర లేదా చిక్కుళ్ళు వంటి కూరగాయలలో చర్మం ముడతలు పడకుండా చూసుకోవచ్చు .
సూర్యుని కాంతి: మీ చర్మాన్ని అధికంగా సుర్యుని కాంతిలో ఉంచకండి, దాని వల్ల మీ చర్మం ముడతలు పడటానికి ఎక్కువ అవకాశం ఉంది.
మంచి నీరు అధికంగా తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని ముడతల బారి నుంచి కాపాడుకోవచ్చు
రోజుకి కనీసం 8 గ్లాసులు, లేదా 2 లీటర్ల నీరు తీసుకుంటే చర్మ రక్షణలో ఎంతో ఉపయోగపడుతుంది.
0 comments so far,add yours