మానవుని ఆరోగ్యం కోసం,అందం కోసం, చర్మ సౌందర్యం కోసం ఎన్నో సహజ పద్దతులు ఉన్నాయి, అందులో తులసి ఎంతో ప్రముఖమైనది, గత 5000 సంవత్సరాలుగా సహజ పద్దతులలో మీ ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో తులసి ఎంతో ఉపయోగపడింది.ఎన్నో అద్భుతాలకు కారణం అయినది, అందుకే “తులసి”ని అందరూ “మూలికల రాణీ” అని వర్ణిస్తారు.దీనిని మందుల తయారిలో, ఎన్నో చికిత్సలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.ఇది మన యొక్క మానసిక స్తితి పై మంచి ప్రభావాన్ని చూపించి, మంచి ఫలితాలను ఇస్తుంది.
ఎందరో ఈ తులసిని ఆయుర్వేదంలో “దోష నివారిణీగా” గుర్తించ్చారు,అంతే కాకుండా మంచి ఆరోగ్యం కోసం ఎంతో మంది దీని పచ్చి ఆకుల్ని నములుతారు.
తులసి వల్ల మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందామ :
1.దగ్గు మరియు శ్వాసకోశ సమస్యలు:
మీరు జలుబు,దగ్గు,శ్వాసకి సంబందించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే తులసితో మంచి ఫలితాలు పొందవచ్చు.తులసి లోని ఔషధ లక్షణాల మిమ్మల్ని ఈ సమస్యల నుండి విముక్తుల్ని చేస్తుంది.అంతే కాకుండా ఇది ఉపయోగించడం వల్ల జ్వరము,తుమ్ములు, మరియు వైరల్ నుండి మంచి విముక్తు లబిస్తుంది.


ఒక వేళ మీకు జలుబు చేస్తే కొంచెం తులసి ఆకులు, లవంగాలు, కొంచెం ఉప్పు కలిపి తీసుకుంటే, అన్నిటి నుండి మంచి ఉపసమనం కలుగుతుంది. ఆస్త్మా మరియు జలుబు నివారణకు మంచి ఔషదం.
2. కిడ్నీలో రాళ్ళ సమస్య :
మీ కిడ్నీలో రాళ్ళు ఉంటే కొంచెం తులసి రసంలో, తేనె కలిపి తీసుకోండి, మీ కిడ్నీలో రాళ్ళ కరిగిపోయి మంచి ఫలితాలు లబిస్తాయి.
3. గుండె జబ్బులు:
మీ గుండె సమస్యల్లో, మరియు, స్ట్రోక్ రాకుండా కాపాడడంలో తులసి ఎంతగానో ఉపయోగ పడుతుంది.
దీనిలో ఉన్న”విటమిన్ C” మీ గుండె జబ్బులని నయం చేసి, ఏ విదమైన ఇబ్బందులు కలగకుండా కాపాడుతుంది.
4.మీ గొంతు కోసం:
మీ గొంతు సమస్యలకు కూడ ఎంతో ఉపయోగపడుతుంది, జలుబు చేసి మీ గొంతు మూగబోయిన,ఎంతో ఇబ్బందిగా అనిపిస్తున్నా కొంచెం నీరు తీసుకుని అందులో తులసి ఆకులు వేసి మరిగించి ఆ నీటిని తాగితే మీ గొంతు ఏ సమస్యలు లేకుండా మంచిగా మారుతుంది.
5.పళ్ళ సమస్యలు :
ఇది మీ పళ్ళ సమస్యల్లో ఎంతగానో ఉపయోగ పడుతుంది, దీనిని మీ పళ్ళు శుబ్రపరుచుకోవడానికి ఉపయోగిస్తారు.
6. పిల్లల సమస్యలు:
తులసి చిన్న పిల్లలు యొక్క ఆరోగ్య సమస్యలలో ఎంతగానో ఉపయోగపడుతుంది, దగ్గు, జలుబు, విరేచనాలు, మరియు వాంతులు వంటి సాధారణ సమస్యల నుంచి విముక్తినిస్తుంది.ఆటలమ్మ, కడుపులో పురుగులు ఉన్నపుడు, గొంతు సరిగా లేనప్పుడు, ఇలా ప్రతీ సమస్యలో తులసి ఎంతో ఉపయోగపడుతుంది.
వీటితో పాటు, తులసితో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. చర్మం,జుట్టు, మదుమేహం, క్యాన్సర్ నుండి కాపాడటంలో కూడ ఎంతో ఉపయోగపడుతుంది.
Share To:

0 comments so far,add yours