అందమైన స్త్రీలలో, మరింత అందమైనవి వారి పెదవులు,రకరకాల కారణముల వల్ల స్త్రీలు వారి పెదవుల విషయంలో ఎంతో ఇబ్బందికి గురి అవుతున్నారు.అయితే కారణం ఏదైననూ వారి అందమైన పెదవులు రంగు మారి నల్లగా అవ్వడం,వారికి ఇబ్బందిని కలిగిస్తుంది.ఈ ఇబ్బందిని తొలగించి, వారి పెదవుల సం రక్షణకై కొన్ని చిట్కాలు చుసేద్దామా:

బాదం ఆయిల్:

మీరు మర్కెట్లోకి వెళ్ళితే మీ పెదవుల్న్ని కాపాడుకోవడానికి ఎన్నో రకముల “లిప్ కేర్”, “లిప్ బాం”లు దొరుకుతాయి, అయితే పూర్తిగా వాటి మీద ఆదారపడితే ప్రయోజనం ఉండకపోగా, కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువ, అందుకే మీ ఇంట్లోనే ఎంతో సహజమైన,సులభంగా తయారుచేసుకునే చిట్కా ఇదిగో.బాదం ఆయిల్ని మీ పెదాలకు పట్టించాలి, ఇలా రోజు చేస్తూ ఉంటే, మీ పెదాలు నల్ల రంగుని వదిలేసి అందంగా మారతాయి.

కీరా దోసకాయ:

మీ చర్మ సౌందర్యాన్ని, పెదవుల అందాన్ని, కాపాడడంలో “కీరా దోసకాయ” ఎంతో ప్రత్యేకం, ఐతే దీని వల్ల మీ పెదవులే కాకుండా మీ శరీరంలోని పాదాలు, చేతుల కింద నల్లని మచ్చలు,ఇలా నల్లబడిన ప్రదేశాలన్నీ బాగు చేసుకోవచ్చు.మీ పెదవుల సం రక్షణకై దీని రసాన్ని తీసి రాయండి,ఇలా రోజూ చేస్తే ఇది మీ పెదవుల పై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.




పచ్చి పాలు:

మీ పెదవుల్న్ని కాపాడుకోవడానికి చర్మాన్ని అందంగా ఉంచ్చుకోవడానికి, ఈ పద్దతి బాగా ఉపయోగపడుతుంది, మీరు చేయవలసిందల్లా కొంచెం పచ్చి పాలు తీసుకుని “Cotton” తో కాని, లేదా ఎదైన పొడి గుడ్డతో కాని మీ పెదవుల్ని తుడవండి.పచ్చి పాల ప్రభావంతో మీ పెదవుల చర్మంలోని చనిపోయిన కణాలు తొలగి పోయి, అందమైన కాంతివంతమైన పెదాలు మీకు లబిస్తాయి.

ఫ్రూట్ జ్యూస్:

ఫ్రూట్ జ్యూస్ లు ఎక్కువగా తీసుకోవడం వల్ల,అందులో కెమికల్ “P” వల్ల మీ చర్మంలోని కణాలు శుబ్రపడతాయి, అంతే కాకుండా మీ వ్రుదా చర్మ కణాలని తొలగిస్తాయి.

తేనె,పెరుగు, నిమ్మరసం, ఈ 3 మిశ్రమాలని కలిపి మీ పెదవలకు పట్టించి, ఒక గంట తరువాత మెల్లగా కడగండి, ఇలా చేస్తూ ఉంటే మీ ఎదవులు అందంగా మారతాయి.

వెన్న:

మీ పెదవుల అందం కోసం ఎంతో డబ్బులు ఖర్చు చేసి, తిరిగి ఇబ్బందులు పడే కన్న మీ ఇంట్లొనే మీ ఫ్రిజ్ లో ఉన్న వెన్నను కొంచెం తీసి రోజూ మీ పెదాలకు పట్టించి, ఎలా 2-3 వారాలు చేస్తే అందమైన పెదవులు మీ సొంతం అవుతాయి.
Share To:

0 comments so far,add yours