వర్షాకాలం అంటే ఎంతోమందికి ఇస్టం అయినది, సరదాగా తడచి హాట్, హాట్ కాఫీ తాగితే ఆ మజాయే వేరు, కాకపోతే ఎంత సరదానో అంతే ఇబ్బందులు కూడా ఉంటాయి, అవి ఏమిటంటారా, రండి చూసేద్దాం.
వర్షాకాలం అనేది అన్ని ఋతువులలో కల్లా ఎంతో ప్రత్యేకమైనది, అంతే కాకుండా ఎన్నో ప్రత్యేకతలతో కూడినది, ఈ కాలంలో తడితనం అంటే తేమ ఎక్కువగా ఉంటుంది.దీని వల్ల మీ జుట్టుకి చుండ్రు పట్టే అవకాశాలు ఎక్కువ.ఈ చుండ్రు వల్ల మన జుట్టే కాదు మంచి అందం కుడా పాడైపోతుంది.
వర్షాకాలంలో వర్ష శాతం ఎక్కువగా ఉండడం వల్ల మీ జుట్టుని తడవనివ్వకండి,ఎక్కువగా తడిస్తే మీ జుట్టూ పాడైపోయే ప్రమాదం ఉంటుంది.మీ జుట్టుని కాపాడుకోవడానికి “గొడుగులు”,”Caps” ఉపయోగించండి.
ఒకవేళ అనుకోని పరిస్తితుల్లో మీ జుట్టూ తడిచిపొయినట్లయితే వీలైనంత త్వరగా తుడుచుకుని ఆరబెట్టుకోండి.
వారంలో 2-3 సార్లు తలస్నానం చేయండి, అలా చేయడం వల్ల మీ జుట్టు మొదళ్ళు శుబ్రముగా వుండి, ఏరకమైన జుట్టుకి సంబందించిన వ్యాదులు(చుండ్రు,ఫంగస్”) సోకవు.
మీ జుట్టుని సాద్యమైనంతవరకు తడిగా ఉండనివ్వరాదు,అలా ఉన్నప్పుడు గట్టిగా కట్టకూడదు.

అందమైన, మెరిసే జుట్టు కోసం “హెయిర్ కండిషనర్లు” ఉపయోగించండి.

ఎక్కువ శాతం నీరు,పళ్ళ రసములు తాగడం మంచిది.


ఈ కాలంలో కొద్ది కొద్దిగా జుట్టు వూడిపోవడం సహజం, కంగారుపడనవసరం లేదు, “హెయిర్ కర్లింగ్”,మొదలగు విధానాలు మానుకోవడం మంచిది, వీటి వల్ల జుట్టు పాడైపొయే అవకాశం ఎక్కువ.

ఒకవేళ మీకు తీవ్రమైన సమస్యలు తలెత్తితే, చర్మానికి లేదా జుట్టుకి సంబందించిన వైద్యుల్న్ని (dermatologist or trichologist)సంప్రదించడం ఎంతో మంచిది.


చేయవల్సినవి:
వారానికి 2-3 సార్లు తలస్నానం చేయండి.
తలస్నానం చేసే ముందు జుట్టుకి నూనె పెట్టుకుని తరువాత చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
విటమిన్ “E” కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకొండి.


చేయకుడనివి:
మీ జుట్టుని తడిగా ఉంచరాదు.
తడిగా ఉన్నప్పుడు దువ్వరాదు.
వర్షాకాలంలో “Dryers” ఉపయోగించకపోవడం మంచిది.



పైన సూచించినవన్నీ మీ అందమైన, మరియు ఆరోగ్యవంతమైన జుట్టుకోసమే, పాటించండి
Share To:

0 comments so far,add yours