Tuesday 27 September 2016

జీరో వలన మన శరీరం జీరో..!



కోరికలుండని మనిషుండరు. ఇక సౌందర్యోపాసన కోసం మాత్రం ఎంతకైనా మనిషి తెగిస్తాడనేది వాస్తవం. అయితే జీవితం లో ఫాషన్స్ సైక్లిక్ విధానంలో తిరుగాడుతుంటాయ్. ఆ విధానంలోనే ఒల్డ్ ఫాషన్స్ మాళ్ళీ మనకు తారసపడుతుంటాయ్. ఆ కోవాలోనికి ఈ రోజు సన్నగా నాజూకుగా ఉండే శరీరాకృతి కూడా వచ్చేసింది. అదేదో కాదు జీరో సైజ్ నడుము. ఈ నడుము గురించి ప్రస్తుతం అతివలంతా పడరాని పాట్లు పడుతున్నారు. జీరో సైజ్ విసేషాలేంటో తెలుసుకుందామా!

సైజ్ జీరో:

అమ్మాయిలు అతి సన్నటి నడుముకోసం మక్కువ పెంచుకుని కృంగి కృశించిపోవడాన్నే సైజ్ జీరో అంటున్నారు. అతిగా డైటింగ్ చేయడం, అతిగా వ్యాయామం చేయడం ద్వారా తమ శరీరాకృతిని అసాధారణ స్థితిలో కుదింపజేసుకుని స్లిమ్‌గా, నాజూకుగా, అందంగా కనిపించాలని మహిళలు పడుతున్న సరికొత్త పాటునే సైజ్ జీరో అంటున్నారు.

సైజ్ జీరో కోసం:

సైజ్‌ జీరో.. అందమైన శరీరాకృతి.. డైటింగ్ చేయాల్సిందే.. సన్నగా ఉండవలసిందే. ఊబకాయం మన సమీపానికి రాకుండా జాగ్రత్త పడాల్సిందే. అయితే నాజూకు పేరుతో మాతృత్వానికి సైతం దూరమయ్యే స్థితిని మహిళలు కొని తెచ్చుకుంటే ఎదురయ్యే పరిస్టిథులు…

తమ శరీరం తమకే బరువుగా తయారయ్యే విపత్కర స్థితిని ఎవరూ కోరుకోరు. ప్రస్తుత కాలంలో స్త్రీపురుషులు ఇరువురూ కూడా సన్నబడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ నాజూకుతనం కోసం ఆ ఆశ శృతి మించితే అందం కోసం పందెంలో శరీరం మోతాదుకు మించి చిక్కిపోతే సకల రోగాలకు శరీరం నిలయంగా మారుతోంది.

చివరకు మాతృత్వం కూడా స్త్రీకి దూరమయేలా సైజ్ జీరో ప్రభావం చూపుతోంది. ఇలా ఫిగర్ బాగుండాలని తపనతో అతి సన్నటి నడుమును కొని తెచ్చుకున్న యువతులకు బహిష్ఠు సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అంతకు మించి చిన్నవయసులోనే నెలవారీ బహిష్ఠులు ఆగిపోవడం లేదా క్రమం తప్పడం జరుగుతోందట.

ఇక ఇలాంటి వారికి పెళ్లంటూ జరిగితే గర్భం దాల్చడం కూడా కష్టమయిపోతోందని వైద్యుల ఉవాచ. నాజూకు శరీరం కష్టపడి సాధించుకున్న వారికి పుట్టే పిల్లలు సైతం పోషకాహారం లోపించి బరువు తక్కువతనంతో పుడుతున్నారట.

సన్నబడిపోవాలనే కోరిక మదిలో రగులుతుండగా అతిగా డైటింగ్ మరియు వ్యాయామం చేసే అమ్మాయిలకు అసాధారణ బహిష్టుల సమస్య వస్తోందని వైద్యులంటున్నారు. ఇంకా ప్రమాదం ఏమిటంటే ఇలాంటి నాజూకు భామల ఎముకలు ముదివయస్సులో ఉన్న వారి ఎముకల లాగా బలహీనంగా తయారవుతున్నాయి.

అందమైన శరీరాకృతి ఉండవలసిందే. ఊబకాయం మన సమీపానికి రాకుండా జాగ్రత్త పడాల్సిందే. అయితే నాజూకు పేరుతో మాతృత్వానికి సైతం దూరమయ్యే స్థితిని మహిళలు కొని తెచ్చుకోవటం మాత్రం ఇబ్బందికర విషయమే.

0 comments:

Post a Comment