Saturday 12 November 2016

మన ఇంట్లొని వాటితోనే మెరిసే చర్మాన్ని కాపాడుకోవచ్చు!

చర్మం మృదువుగా ఉండాలని టీవీలలో కనిపించే అడ్వెర్టైస్మెంట్లు చూసి ఇష్టమొచ్చిన క్రీములను కొని రాత్రుళ్ళు రాస్తుంటారు. తీర అవి మన చర్మానికి పడక వికటిస్తే అప్పుడు చర్మ వ్యాధుల డాక్టర్ వద్దకు పరిగెడతారు. ఎందుకు? ఇవ్వనీ అవసరం లేకుండా మన ఇంట్లొని వాటితోనే మెరిసే చర్మాన్ని కాపాడుకోవచ్చు. అవెంటో చూద్దమా..!

1.ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పాల మీగడను ముఖానికి రాసుకుని తెల్లవారుజామున చల్లని నీటితో కడిగిస్తే మీ చర్మం మిలమిల మెరిసిస్తుంది.

2. అలాగే స్నానానికి ముందు నిమ్మరసంలో కాసింత పసుపును కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, నల్లటి మచ్చలకు చెక్‌ పెట్టవచ్చు.


3. అలాగే రోజా పువ్వులు చందనాన్ని పేస్ట్‌ చేసి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే కొన్ని వారాల్లో ముఖంలో నల్లని మచ్చలు, కంటి కిందటి వలయాలు కనుమరుగమైపోతాయి.

4. అలాగే కేశ సంరక్షణకు సెంబరుత్తి పువ్వు రసం, నువ్వుల నూనెను సమపాళ్లలో వేడిచేసి ఆ నూనెను రాసుకోవాలి. ఇంకా టెంకాయ నూనెలో వేప పువ్వు వేసి వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే చుండ్రుకు చెక్‌ పెట్టవచ్చు. జుట్టు ఇంకా దట్టంగా పెరుగుతాయి


శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీలోషన్‌ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.దానిని ఇలా తయారు చేసుకోవచ్చు.

1.మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌కి, ఒక స్పూన్‌ గ్లిజరిన్‌, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.

2. కప్పు రోజ్‌వాటర్‌లో టీస్పూన్‌ బొరాక్స్‌ పొడిని, రెండు టీస్పూన్ల వేడిచేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు.

3. సబ్బుని చిన్నచిన్న ముక్కల్లా చెక్కుకుని మూడు టీస్పూన్ల నిండా దానిని తీసుకోవాలి. దానిని పావుకప్పు నీళ్లలో కలిపి వేడిచేసి, నాలుగు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ని, టీస్పూన్‌ గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి.

ఇక మీ బాడీ లోషన్ తయారు. ఇక ప్రతి రోజు వాడి మెరిసే చర్మాన్ని పొందండి.

ఆరి పాపాత్ముడా... మనసాక్షి లేదు నీకు! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

ఆరి పాపాత్ముడా... మనసాక్షి లేదు నీకు! 

జంబులింగం బీచ్ లో కూర్చుని ఉంటాడు.. అటుగా వెళ్తున్న ఇంగ్లీష్ వాళ్ళు జంబులింగాన్ని అడుగుతారు
ఇంగ్లీష్- are you relaxing?
జంబులింగం -లేదు నేను జంబులింగంని
మరో ఇంగ్లీష్ వా-are you relaxing?
జంబులింగం - అరె! నేను జంబులింగం ని.
(జంబులింగం లేచి నడుస్తుంటాడు. అతనికి మరో వ్యక్తి కనపడతాడు)
జంబులింగం - Are you relaxing.
2వ్యక్తి- yes, I am relaxing.
జంబులింగం - ఆరి పాపాత్ముడు...  మీ వాళ్ళు అక్కడ చెట్టుని, పుట్టని, కనిపించిన నరమానవుడిని నీ గురించి అడుగుతుంటే నువ్విక్కడ కాళ్లారా జాపి ఊపుకుంటూ...కాళ్ళు, తీరిగ్గా కూర్చున్నావా! ఏవండోయ్! మీవాడు ఇక్కడ ఉన్నాడు.


నేను చచ్చిపోతా... భార్యతో భర్త! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

డైరీ మిల్క్ తీసుకో... భార్యతో భర్త! 

భార్య : నేను చచ్చిపోతా....
భర్త : ఇదిగో Cad-bury Dairy Milk తీసుకో....
భార్య : ఇప్పుడు ఇది ఎందుకు...?
భర్త : ఏదైనా మంచిపని చేసేముందు నోరు తీపి చేసుకోమని అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు కదా!




కడుపుకు తినపోయినా కనీసం మంచినీళ్ళు ఉంటే బ్రతుకు బండి ఈడ్చేయవచ్చు.

కడుపుకు తినపోయినా కనీసం మంచినీళ్ళు ఉంటే బ్రతుకు బండి ఈడ్చేయవచ్చు. కానీ నీటి విలువ మన శరీరానికి అంతకంటే ఎక్కువ ఉంది. నీటితో అనేక రుగ్మతలు, వ్యాధులు మతుమాయమవుతాయంటే నమ్మశ్యఖ్యంగా లేదు కదూ..! నీరు మన శరీరానికి ఎంత అవసరమో అంత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండి. అవేంటో తెలుసుకుందామా…

1. శరీరంలో నీటి శాతం సక్రమంగా ఉండాలి. ఇది ఏమాత్రం తక్కువున్నా చర్మం ముడతలు పడడం, పొడిబారిపోవడం, చర్మ సమస్యలు మొదలవుతాయి. శరీరంలో నీటి శాతం 75 నుంచి 80 వరకు ఉండాలి.

2. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు దూరమవుతాయి. చర్మం మంచి నిగారింపును పొందుతుంది.


3. శరీరంలోని నీరు చెమట, మూత్రం రూపాల్లో బయటికి పోతుంది. దీంతో శరీరం నీటి శాతాన్ని కోల్పోతుంది. కనుక ఆ నష్టాన్ని పూడ్చడానికి ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని తాగుతూ ఉండాలి. ఎక్కువ నీటిని తీసుకోవడంతో అధిక బరువు ఉన్నవారు కూడా తగ్గుతారు.

4. పెదాల పగుళ్లను నివారించి సున్నితంగా, అందంగా చేస్తుంది. చర్మం తేమగా ఉండాలంటే సరిపోను నీరు తప్పనిసరి.

5. ముఖం మీద ఏర్పడ్డ ముడతలను మట్టుమాయం చేయడంలో నీరు చేసే పనితీరే వేరు. మూత్రపిండాల్లో రాళ్లు, ఇతర సమస్యలు వచ్చే అవకాశముండదు.

6. చెమట ద్వారా శరీరంలోని మలినాలను బయటికి పంపడంతో దుర్వాసనకు దూరంగా ఉండొచ్చు.

7. అందం విషయంలో కళ్లు కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి. నీళ్లు తాగడంతో పాటు రోజులో అప్పుడప్పుడు కళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల కళ్లు తాజాగా, ఆకర్షణీయంగా కనబడుతాయి.
ఎక్కువ తీసుకుంటే కలిగే నష్టాలు:

నీరు త్రగితే మంచిది కదా అని పరిమితికి మించి త్రాగితే మూత్రపిండాలపై ఎక్కువ భారం పడుతుంది. కిడ్ని ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దాంతో ఆనారోగ్య బారిన పడాల్సిన ప్రమాదముంది. ఎక్కువ దాహం వేసినప్పుడైనా, మళ్లీ మళ్లీ తాగాల్సి వస్తుందని ఒకేసారి గ్లాసులకొద్దీ నీరు తగడం సరైన పద్ధతి కాదు. దాంతో మేలుకన్నా కీడే ఎక్కువగా ఉంటుందనేది తెలుసుకోవాలి.

Friday 11 November 2016

కేశసౌందర్యానికి ఉల్లి - ‘ఉల్లి ‘చేసినంత మేలు ‘తల్లి ‘కూడా చేయదు!

‘ఉల్లి ‘చేసినంత మేలు ‘తల్లి ‘కూడా చేయదంటారు. నిజమే ఈ సామెత నూటికి నూరుపాళ్ళు నిజం. ఉల్లి లేని వంట లేదంటే ఆశ్చర్యమేమీ లేదు. ఉల్లి అరోగ్యానికే అనుకుంటున్నారా? సౌందర్యోపాసనకు కూడా ఉపయోగ పడుతుంది. మనకు కేశ సంరక్షణ అంతే చాలా ఆశక్తి ఉన్నా, దానిని సరిగ్గా పర్యవేక్షించుకోపోవటంతో కేశాలు ఊడిపోవటం, రాలటం జరుగుతుంటుంది. కేశ సంరక్షణ జాగ్రత్తలు తీసుకొన్న తర్వాత కూడా అదే విధంగా ఉంటే దానికి కారణం అనారోగ్యకరమైన జీవన శైలి, ఆహారంలో అసమతుల్యత వల్ల చర్మ మరియు జుట్టు మీద చెడు ప్రభావాన్ని చూపుతుంది.మన వంటగదిలోని చాలా రకాలు వంటకు ఉపయోగించే వస్తువులను హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు తేనె, గుడ్డు, పెరుగు, బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం, మరియు ఉల్లిపాయ వంటివి హోమ్ రెమెడీ హెయిర్ ట్రీట్మెంట్ కు ఉపయోగిస్తుంటారు. ఉల్లిపాయ మన కళ్ళలో నీళ్ళు కారేవింధంగా చేస్తుంది. అలాగే కురుల సమస్యలను కూడా నివారిస్తుంది.

ఈ సమస్యకు ఫుల్ స్టాప్ చెప్పాలంటే ఉల్లి చలవ చాలు. మరి ఉల్లి చేసే మేళ్ళేంటో చూద్దామా! ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా !

1. ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ రక్త ప్రసరణను పెంచి, కురులకు శక్తిని ఇస్తుంది. ఉల్లిపాయను మెత్తగా చేసి తలకు రాయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. దీన్ని అలాగే ఉల్లిపాయ పేస్ట్ తలకు పట్టించడం లేదా ఏదైనా ఇతర హెయిర్ ప్యాక్ లతో ఈ పేస్ట్ ను కూడా కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయడానికి అరగంట ముందు తలకు హాట్ ఆయిల్ మసాజ్ చేయాలి.

2. ఉల్లిపాయ రసం తలలో ఇతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ మీ కేశాలను డ్యామేజ్ చేయవచ్చు. అంతే కాదు అది జుట్టు రాలడానికి ముఖ్య కారణం కావచ్చు. కాబట్టి స్లాప్ ఇన్ఫెక్షన్ అరికట్టడానికి ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించండి. ఇంకా హెయిర్ ఫాలీసెల్స్ లో మూసుకు పోయిన రంద్రాలను తెరచుకొనేలా చేస్తుంది.


3. ఉల్లిపాయ రసంను తలకు పట్టించడం వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరిగి కొత్తగా వెంట్రుకలు మొలవడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ హెయిర్ ఫాల్ ను అరికట్టడమే కాదు, హెయిర్ గ్రోత్ కు కూడా సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనెలో కలుపుకొని బాగా మిక్స్ చేసి తల మాడుకు మసాజ్ చేయాలి. చేసిన అరగంట తర్వాత రెగ్యులర్ గా ఉపయోగించే మంచి షాంపుతో, చల్లనీటి తలస్నానం చేసుకోవాలి.

4. హోం రెమడీస్ లలో చుండ్రును వదలగొట్టడానికి ఇదొ అద్బుతమైన చిట్కా. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం వల్ల హెయిర్ లాస్ అరికడుతుంది. అలాగే చుండ్రును నివారిస్తుంది. మీరు రెగ్యులర్ గా తలకు వాడే హెయిర్ ప్యాక్ కి కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని కూడా చేర్చడం వల్ల చుండ్రును నివారించగలుగుతుంది. నిమ్మరసం, పెరుగు, మరియు కొద్దిగా తేనె మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల కూడా చుండ్రును నివారంచవచ్చు.

మరీ ఇంత మేతకైతే ఎలా అండి ? నవ్వేద్దాం గురు పోయేదేముంది!

మరీ ఇంత మేతకైతే ఎలా అండి ?

లేడీస్ సీట్లో కూర్చొన్న రాము, రాధ రాగానే లేచి సీటు ఇవ్వబోయాడు,
"ఫర్వాలేదు కూర్చొండి. నేను నిలబడతాను" చెప్పింది రాధ.
మళ్ళీ ఇంకో స్టాప్ రాగానే రాము లేవబోగా..."వద్దొద్దు కూర్చోండి" మళ్ళీ అంది రాధ.
ఇంకో స్టేజి రాగానే... రాధతో...
"మేడమ్... దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఇప్పటికే నేను దిగాల్సిన స్టేజికంటే చాలా దూరం వచ్చేశాను" బాధగా చెప్పాడు రాము.


ఆడవాళ్లు మీకు జోహార్లు! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

ఆడవాళ్లు మీకు జోహార్లు!

హైదరాబాదులొ ఈ మధ్య ఒక కొత్త mall తెరిచారు. ఇచ్చట పెళ్ళి కొడుకులు కూడా అమ్మబడును అని ప్రకటనలు ఇచ్చారు (అవును సరిగ్గా పెళ్ళైన కొత్తలో సినిమాలో లాగానే). కాకపోతే కొన్ని షరతులు పెట్టారు,

అవి ఏమిటంటే:
  1. అమ్మాయిలు మా mallకి ఒక్కసారి మాత్రమే అనుమతింప బడుతారు
  2. పెళ్ళి కొడుకులని వారి వారి హోదా, రుచులు, అభిరుచులకు తగ్గట్లు వివిధ అంతస్థులలో వర్గీకరించబడ్డారు. ఏ అంతస్థులో పెళ్ళి కొడుకునైనా మీరు ఎన్నుకోవచ్చును. ఆ అంతస్థులో నచ్చకపోతే మీరు మరో అంతస్థుకి వెళ్ళవచ్చు. కాకపోతే మీరు వెనక్కి తిరిగి రావటానికి అస్కారము లేదు, చివరి అంతస్థు నుంచి బయటకు పోవడం తప్ప.
ఇదేదో బావుందే చూద్దామని ఒక అమ్మాయి mallకి వస్తుంది. అంతస్థులవారీగా ఈ విధంగా సూచనలు ఉన్నాయి.
మెదటి అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు.
రెండవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు.
మూడవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు.

అద్భుతం!! అని అనుకుంటూ ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళింది ఆ అమ్మాయి.

నాలుగవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు. ఇంటి పని, వంట పనిలో కూడా సహాయ పడతారు.
"ఆహా !! ఈ mall చాలా బావుందే. ఈ అంతస్థులో నాకు కావలసిన వరుడు దొరుకుతాడు అని అనుకున్నది. అలా అనుకున్న మరు క్షణమే ఇంకా పైకి వెళ్తే ఎలాంటి వాళ్ళు ఉంటారబ్బా!! అని అనుకొని తరువాతి అంతస్థుకి వెళ్తుంది".
అక్కడి సూచన ఇది:
"మీతో కలిపి ఈ అంతస్థుకి చేరుకున్నవారి సంఖ్య : 61,397. ఈ అంతస్థులో పెళ్ళికొడుకులు లేరు. ఆడవాళ్ళని మెప్పించడం అసాధ్యం."


సంపూర్ణ ఆరోగ్యానికి బైపాస్ రూట్.. 'బీట్'రూట్.

చక్కటి గులాబీ రంగులో నవనవలాడుతూ నన్ను తినండి మీ శరీరంలో రక్తమై ప్రవహిస్తా అంటూ సందేశం ఇచ్చే ఓ వక్తలా కనపడుతుంది బీట్రూట్. క్యారెట్, బీట్రూట్ రెండూ రక్త శాతాన్ని పెంచుతాయని వైద్యుల నుంచీ డాక్టర్ల వరకూ అంటూ ఉండటం మనకు తెలిసిందే. కాని కొందరు ఈ బీట్రూట్ ను వెలివేస్తున్నారనీ చెప్పవచ్చు. అయితే బీట్రూట్ ను తినవచ్చు, జ్యూస్ గ వాడుకోవచ్చు, కూరగా వండుకోవచ్చు. కొందరి ఇళ్ళల్లో వండటం ఇప్పటికే జరుగుతుంది. జబ్బులోస్తే పెట్టే వంటకంగా, జ్యూస్ గా దీనిని వాడుతున్నారేగాని మరొకటి కాదు. దీని ఉపయోగాలు తెలియకపోవటమే ఇందుకు కారణం. చర్మా సౌందర్యానికి కూడా ఇది పని చేస్తుంది. అందుకే మా పాఠకులకు బీట్రూట్ చేసే మేళ్ళేంటో తెలియ చేసేందుకు ఈ శీర్షికలో ఇస్తున్నాం. బీట్రూట్ చేసే మేళ్ళేంటో తెలుసుకుందామా..!

1. గుప్పెడు ఓట్స్‌నీ, బీట్‌రూట్‌ ముక్కల్నీ తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకుని మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. తరవాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. రెండు నిమిషాలాగి నీళ్లను మరిగించి, ముఖానికి ఆవిరిపడితే సరి… చర్మం కాంతులీనుతుంది.

2. బీట్‌రూట్‌ ముక్కని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ, చేతులకూ రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది.

3. బీట్‌రూట్‌ రసానికి కొంచెం తేనె కలిపి, పెదాలకు రాసుకుని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు రాస్తే పెదాలు మృదువుగా మారతాయి.

4. బీట్‌ రూట్‌ రసంలో కొంచెం పెరుగూ, బాదం నూనె, చెంచా ఉసిరిక పొడి కలిపి పేస్ట్‌లా చేసుకుని, దాన్ని తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఎదుగుదుతుంది. అది కండిషనర్‌గానూ ఉపయోగపడుతుంది.

5. జుట్టు తెల్లబడిందనో, చక్కని రంగులో కనిపించాలనో భావించే వారు రసాయనాలు కలిపిన రంగుల్ని వాడే బదులు బీట్‌రూట్‌ రసాన్ని వారానికోసారి తలకు పట్టించి, అరగంట ఆగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు చక్కని రంగులో కనబడుతుంది.

Thursday 10 November 2016

‘క్యా’రెట్ ప్యాక్... కాళ్లకు కళ తెప్పించండి.

మనం తరచూ ఏదో ఓ ప్యాక్ వేసుకుని ఫ్రెష్ అవుతుంటాం. పార్లర్ కు వెళ్ళినా ఫ్రూట్ ప్యాక్ను వేయటానికే బ్యుటీషియన్ వాళ్ళు ముందుకొస్తారు. అందుకు కారణం ఫ్రూట్ ప్యాక్ ఎన్నో రకాలుగా పని చేస్తుంది. శరీర తత్వాన్ని మారుస్తుంది, రంగును ఇనుమడింప చేతుంది. అందుకే ఈ ప్యాక్ కు అంత ప్రాధాన్యం ఇస్తారు. అయితే పాదాలకు ఏ ప్యాక్ వేస్తే బాగుంటుందో తెలియక, ఎవైనా వేసుకున్నా సంతృప్తి కలుగక మనం బాధపడుతుంతాం. అటువంటి సమస్యకు సొల్యూషన్ క్యారెట్ పాదాలకు ప్యాక్ గా వేస్తే ఎన్నో సహజ సిధ్ధ గుణాలతో మన పాదాలకు మంచి చేస్తోందట. అంతేకాక పాదాల రంగునూ ఇనుమడింప చేస్తుందట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

1 . క్యారెట్‌ తురుమునకు రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్‌ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

2 . అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.




3 . మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్‌ లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి.

4 . కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్‌గా వేసుకుంటే కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి.

5 . కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.

6 . టేబుల్‌స్పూన్‌ శనగపిండి పుల్లపెరుగు తీసుకుని కలిపి మిశ్రమంలా చేసి దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త ఆరిన తర్వాత గట్టిగా రుద్ది కడిగేస్తే మృతకణాలు తొలగిపోతాయి.

అప్పారావుతో అంత వీజీ కాదండోయ్! నవ్వేద్దాం గురు పోయేదేముంది!


అప్పారావుతో అంత వీజీ కాదండోయ్!

సార్.... ఈ షర్టు గుడ్డ తీసుకోడి. అస్సలు చినగదు" తాను చూపుతూ అన్నాడు Salesman.
"గుడ్డ చాలా బాగుంది. కానీ వద్దులే" అన్నాడు అప్పారావు.
"అదేం సార్.. పెద్ద ఖరీదేం కాదు"
"ఖరీదు సంగతి కాదు. నాకు రెండు మీటర్లు చాలు. కానీ చినగదంటున్నావు కదా! ఎలా చించిస్తావు?" అడిగాడు అప్పారావు.


కొత్త కోడలి వంట తంటాలు! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

కొత్త కోడలు మొదటి సారి వంట చేయాలనుకుంది....

వంటల పుస్తకము చదువుతూ వంట మొదలు పెట్టె......

గుడి నుండి అత్త తిరిగి వచ్చే...
ఫ్రిజ్జు తెరచి చూచే...
అచ్చెరువందే....

కోడలింజూచి అడిగె.....

"పూజ గది నుండి ఈ గంట ఫ్రిజ్జ్ లో కెట్ల వచ్చే.?..."

కోడలు : "అత్తమ్మా.... పుస్తకము లో వ్రాసి ఉండె..... మిశ్రమంను బాగుగా కలిపి తర్వాత ఒక 'గంట' ఫ్రిజ్జ్ లో పెట్టవలెనని......".

అత్త: ఓసినీ తెలివి తాకట్టుపెట్ట!


కరివేపాకని అలా తీసి పారెయ్యకండి సుమీ - ఎన్నో ఔషధ గుణాలు!

చారులో కరివేపాకులా తీసేశారు అన్న సామెత వినే ఉంటారు. ఈ సామెతకు ఓ అర్ధం ఉంది. ఎవరైనా మన పట్ల నిర్లక్షంగా ప్రవర్తిస్తే వెంటనే చారులో కరివేపాకులా తీసేస్తున్నారని బాధపడతాం. ఈ పోలిక కు కారణం కరివేపాకును ఎంత శ్రధ్ధగా కూరల్లో, చారుల్లో వేస్తామో అంతే నిర్లక్షంగా తినేటప్పుడు దాన్ని తీసి పక్కనపెడతాం. కానీ కరివేపాకు చేసే మేళ్ళు ఏమిటో చాలా మందికి తెలియవు. అందానికి ఆరోగ్యానికీ కరివేపాకు మేలంటే అతిశయోక్తి కాదేమో. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కరివేపాకు ప్రధానంగా కళ్ళకు మంచిది. తరచూ కరివేపాకు తింటే కళ్ళ ఆరోగ్యం ఇనుమడిస్తోంది.

1.ఆహారం ద్వారా కరివేపాకును తీసుకోవడం ద్వారా మీ కురులు తెల్లబడవు.

2.అతిపిన్న వయసులోనే మీ జుట్టు నెరసిపోవడం వంటి సమస్యలకు కరివేపాకుతో చెక్‌ పెట్టవచ్చును.

3.అరకేజీ నువ్వుల నూనెను కాసి, అందులో 50 గ్రాముల పచ్చి కరివేపాకును వేసి మూతపెట్టాలి. మరుసటి రోజు ఆ నూనెను గోరువెచ్చగా వేడి చేసి, తలకు పట్టించి, కుంకుడు కాయతో తలస్నానం చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే తెలుపు జుట్టు నలుపు జుట్టుగా మారిపోతుంది.


4.చిన్న వయస్సులో జుట్టు నెరసి పోకుండా ఉండాలంటే.. ఒక కప్పు కరివేపాకును రుబ్బుకుని ఆ రసంలో మూడు స్పూన్ల మెంతి పొడిని కలిపి జుట్టుకు ప్యాక్‌లా వేసుకుని, ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే తెల్లజుట్టు నలుపుగా మారిపోతుంది.

5.ఇంకా కరివేపాకు, గింజలు లేని ఉసిరికాయ, మందారం పువ్వుల్ని సమపాళ్లు తీసుకుని కాసింత నీరు చేర్చి రుబ్బుకోవాలి. తర్వాత ఆ రసాన్ని తలకు బాగా పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే.. మీ జుట్టు మృదువుగా తయారవుతుంది.
6.కరివేపాకుతో పేస్టు,మెహందీ – అర కప్పు , కరివేపాకు – అరకప్పు, మందారం ఆకులు – అర కప్పు, కుంకుడు కాయలు – అర కప్పు

పైన చెప్పిన వస్తువుల్ని ముందు రోజు నానబెట్టుకోవాలి. మరుసటి రోజు తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు మిల మిల మెరిస్తుంది.

Wednesday 9 November 2016

పాదాలు పగిలి ఇబ్బంది పడుతున్నారా? తెలుగు టిప్స్!

పాదాలు పగిలి ఇబ్బంది పడుతున్నారా? డిటర్జెంట్లు పాదాలపై దాడి చేస్తున్నాయా? శరీరంలో విపరీతమైన వేడి వల్ల పాదాల పగుళ్ళు వచ్చి సతమతమవుతున్నారా? అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చికిత్స కు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఈ సమస్యకు చికిత్సలున్నాయి. ఆట్టే ఆశ్చయపోకండి. పాదాల పగుళ్ళతో బాధపడే వారికి మా ఈ తెలుగు టిప్స్ ద్వారా గృహ చికిత్సా విధానాలను ఈ శీర్షికలో ఇస్తున్నాం. మరి అవేంటో చూద్దామా..!


1. పాదాలు తట్టుకునేంత వేడినీటిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం చేర్చి పాదాలను ఆ నీటిలో ఉంచి, బ్రష్‌తో పాదాలను రుద్దినట్లైతే బ్యాడ్‌ సెల్స్‌కు చెక్‌ పెట్టవచ్చు.

2. గోరింటాకును బాగా రుబ్బుకుని పగుళ్లు ఉన్న చోట రాసుకుని ఎండిన తర్వాత కడిగితే పగుళ్లకు చెక్‌ పెట్టవచ్చు.

3.బొప్పాయి గుజ్జును పగుళ్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

Image result for foot scrub

4. వేపాకు, పసుపులో కాసింత సున్నం కలిపి పేస్‌‌టలా రుబ్బుకుని, ఆముదంలో చేర్చి పగుళ్లకు రాసినట్లైతే ఉపశమనం లభిస్తుంది.

5. అలాగే ఆముదం, కొబ్బరి నూనె సమపాళ్ళలో తీసుకుని అందులో పసుపు పొడి చేర్చి రోజూ పాదాలకు రాస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు.

6. రాత్ర నిద్రకు ఉపక్రమించే సమయంలో పాదాలను శుభ్రం చేసుకుని కొబ్బరి నూనె రాస్తే పగుళ్లు ఏర్పడవు.

7. ఇంకా నాణ్యత గల స్లిపర్స్‌, షూస్‌ వాడటం ద్వారా పగుళ్లు దరిచేరవు. ఇలాంటి గృహ చిట్కాలను పాటిస్తే మీ పాదాలకు చీకూ చింతా అవసరం ఉండదు.

వాడ్ని పర్ఫెక్ట్ అనరు... పసోడంటారు ! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

వాడ్ని పర్ఫెక్ట్ అనరు... పసోడంటారు ! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

A: మా అబ్బాయి పర్‌ఫెక్ట్. తెలుసా?
B: మీ వాడు smoke చేస్తాడా?
A: లేదు
B: మరి మందు తాగుతాడా?
A: లేదు
B: పోనీ ఇంటికి లేట్ గావస్తాడా?
A: అబ్బే ఆ సమస్యే లేదు.
B: నాకు తెలిసి నిజంగానే మి అబ్బాయి పెర్‌ఫెక్టే. మీవాడి వయసెంత?
A: వచ్చే బుధవారానికి ఐదు నిండి ఆరు నెలలొస్తాయి...
B: ఆ(  వాడ్ని పర్ఫెక్ట్ అనరు... పసోడంటారు !

పెళ్ళాం పేరు మర్చిపోతే ...? నవ్వేద్దాం గురు పోయేదేముంది!

అన్యోన్య దంపతులు!
ఒక old man ని ఒక విలేఖరి ఇలా అడుగుతాడు. 
విలేఖరి : మీకు 70 సంవత్సరాలు, ఇంకా మీరు మీ భార్యని Darling, Honey, అని పిలుస్తున్నారంటే చాలా great. మీ Secret చెప్తారా? 
Old Man : నేను దాని పేరు మర్చిపోయా, అడగాలంటే భయమేసి అలా పిలుస్తాను. 



జుట్టు రాలకుండా ఉండేందుకు గౄహ చిట్కాలు


ప్రస్తుతం మారుతున్న స్థితిగతులూ, కార్పొరేట్ ఉద్యోగాలు, వ్యాపారంలో టెన్షన్లూ ఇవేకాక మానసిక ఒత్తిడులు అన్నీ కూడా మన జుట్టు ఊడిపోయేలా చేస్తాయి. ఎంత కష్టపడినా మన ఆరోగ్యం అందం దెబ్బతింటుంటే ఎవరికైనా బాధేమరి! ఇందుకోసం రకరకాల షాంపూలను, తెరపీలను వాడుతుంటాం. అవి సరిచేయకపోగా జుట్టు మరింత ఊడేలా చేస్తాయి. ఈ సమస్యను దాదాపు నూటికి 80 శాతం మంది ఎదుర్కొంటున్నారు. అయినా సరైన పరిష్కారాన్ని అన్వేషించలేకపోతున్నారు. ఏ తెరపీ వాడినా అది సైడ్ ఎఫ్ఫెక్ట్ లేనిదై ఉండాలి. అటువంటి నేచురల్ థెరపీలు మన ఇంట్లోనే ఉన్నాయి అన్నది సత్యం. వాటిని తెరపీలుగా వాడుకుంటే మనకు సమస్యలు తీరిపోగా మనశ్శాంతి లబిస్తుంది. ఆ గృహ చిట్కాలను మీకందిస్తున్నాం. అవేంటో చూద్దమా..!

1.కొబ్బరి నూనె: గోరువెచ్చగా చేసి తలకు రాసి మర్దన చేయడం వల్లా ఫలితం ఉంటుంది. తలలో రక్త ప్రసరణ సాఫీగా జరిగి, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగని రోజూ నూనె రాసుకోవాలని లేదు. తలస్నానానికి గంటా, రెండు గంటల ముందు నూనె రాసుకుంటే సరిపోతుంది.

2.ఉసిరి : జుట్టు రాలే సమస్యనే కాదు, చుండ్రుని కూడా నివారిస్తుంది. తలలో ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తగ్గేలా చూస్తుంది. అలాంటి సమస్యలున్నప్పుడు పెరుగులో ఉసిరి పొడిని కలిపి తలకు పూతలా వేసుకొని కాసేపయ్యాక కడిగేసుకుంటే సరిపోతుంది.


3.పెరుగు :జుట్టుని మెరిపించడంతో పాటూ ఒత్తుగా పెరిగేలా చేస్తుంది పెరుగు. దీన్ని నేరుగా తలకు రాసుకోవచ్చు. లేదంటే తేనె, నిమ్మరసం లాంటి ఇతర పదార్థాలతో కలిపీ తలకు పట్టించుకోవచ్చు. పెరుగును తలకు రాసుకుని అరగంట తరవాత తలస్నానం చేయాలి.

4.గోరింటాకు : జుట్టు సంరక్షణకు సంబంధించి గోరింటాకు పొడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారం, పదిహేను రోజులకోసారి గోరింటాకు పొడిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగూ కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక తలస్నానం చేయాలి.

5.మందారం : జుట్టు విపరీతంగా రాలుతుంటే ఉడికించిన మందాల పువ్వుల్ని వాడితే ఎంతో మార్పు ఉంటుంది. అయితే ఆ పూతను నేరుగా కాకుండా పెరుగు లేదా గుడ్డులో కలిపి రాసుకోవాలి.

6.కొబ్బరిపాలు:కొన్నిసార్లు జుట్టు చిట్లిపోతుంది. పొడి బారడం, తలంతా దురదపెట్టడం వంటి సమస్యలూ తలెత్తుతాయి. వాటిని నివారించాలంటే తలకు కొబ్బరి పాలు రాసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి.

Tuesday 8 November 2016

అతివలు మెచ్చేవి అతివలకు నచ్చేవి హైహీల్స్...హై ‘హీల్స్ తెచ్చిపెట్టే సమస్యలు

అతివలు నడుస్తుంటే వారి అందం మరింతాగా ఆకర్షింప చేస్తుంది. అతివలు నడకే వారికి ఎంతో వన్నె తెచ్చిపెడుతుంది కూడా! అంతేకాక అతివలు తమ నడక ఎంతో బాగుండాలని శతవిధాలా ఆలోచించి రకరకాల చెప్పులను కూడా వాడుతుంటారు. వాటిలో అతివలు మెచ్చేవి అతివలకు నచ్చేవి హైహీల్స్. ఎత్తుగా ఉన్న వారి నుండీ పొట్టిగా ఉన్నవారి వరకూ అందరూ వాటినే వాడటానికి ఇస్టపడతారు. పొట్టిగా ఉన్నవాళ్ళు వాడితే కొంచేం ఫర్వాలేదు కానీ మధ్యస్థంగా ఉన్నవారూ, ఎత్తుగా ఉన్నవారూ వీటినే ఎంచుకుంటారు. కానీ ఆనతికాలంలోనే సమస్యల వలయంలో చిక్కుకుని సతమతమై ఫ్లాట్ మోడల్స్ ను వాడటం మొదలుపెడతారు. హైహీల్స్ వెనుక వున్న సమస్యలను ఈ శీర్షికలో మహిలా పాఠకు ప్రత్యేకంగా తెలుగు టిప్స్ అందిస్తోంది. అవేంటో తెలుసుకుందామా!


హైహీల్స్ వలన నడకలో హొయలు వచ్చి.. నడక అందాన్ని దిద్దుకుంటుంది. కాస్తంత ఎత్తు తక్కువగా ఉన్న వారు కూడా ఎత్తుగా వున్నవారిలా కన్పించే అవకాశం వీటిలో వుంది. అయితే హైహీల్స్‌ను ఏదో ఒక సందర్భంలో వుపయోగించడం వలన అంతగా ప్రమాదమేమీ ఉండదు. కానీ రెగ్యులర్‌గా ఉపయోగించారంటే మాత్రం వాటి కారణంగా చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. హైహీల్స్‌ షేప్‌ కారణంగా పాదాల మీద అధిక భా రం పడుతుం ది. వెన్నెము క, మెడ వీటి పైన కూడా, అధిక భారం పడి.. అవి నొప్పి పెట్టే అవకాశం ఉంది. ఎక్కువ కాలం హైహీల్స్‌ వాడటం వలన పాదం చీల మండలం దగ్గర వుండే ఎచిలిస్‌ టెండాన్‌ పొట్టిగా తయా రయ్యే అవకాశం ఉంది. దీంతో టెండాన్‌ ఇబ్బందిని కలిగిస్తుం ది. పాదాలపై ఆనెలు, బ్లిస్టర్స్‌ వంటివి రావటానికి, హైహీల్స్‌ కారణం అవుతాయి. ఆనెలు, వత్తిడితో కలిగే బ్లిస్టర్స్‌ నొప్పితో నడవ నీయని పరిస్థితి తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.

హైహీల్షూ దీర్ఘకాలం హైహీల్స్‌ వాడేవారిని న్యూరోమా అన్న సమస్య వేధిస్తుంది. తీవ్రమైన నొప్పి కాకుండా… దీర్ఘకాలంగా పెయిన్‌ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే సర్జరీ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. దీర్ఘకాలం హైహీల్స్‌ వాడడం వలన పాదం వెనుక భాగంలో లోపం ఏర్పడుతుంది. ఇది కూడా వేధిస్తుంది.బొటన వ్రేళ్లలో కూడా లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. హైహీల్స్‌ ధరించినప్పుడు మెదడుకు వెళ్లే నరాలు వత్తిడికి గురై.. మెదడు కార్యకలాపాలు సక్రమంగా జరగవు. పూర్తిగా హైహీల్స్‌కు దూరంగా వుండటం కుదరని పక్షంలో వీలయినంత వరకు వీటి వాడ కాన్ని తగ్గించేందుకు చేసేందుకు ప్రయ త్నించాలి. హీల్స్‌ గనుక వేసుకోవాల్సి వస్తే వాటిని వేసు కున్నా సరే కూర్చున్నప్పుడు చెప్పులను విడిచి పాదాలను నేలపై పెట్టుకోవాలి. నడిచేటప్పుడు వేసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

పెళ్ళాం కావాలి అని ప్రకటనిస్తే ...? నవ్వేద్దాం గురు పోయేదేముంది!

అన్నీ కొత్తగా అంటే ఇలానే ఉంటుంది మరి! 

ఓ అతి తెలివి గడుగ్గాయి పెళ్ళీ చేసుకుందామని పేపర్లో ప్రకటన ఇవ్వాలనుకున్నాడు. అందరూ వధువు కావాలని ప్రకటన ఇవ్వడం చూసి విసికి కాస్త వెరైటీగా ఉంటుందని "పెళ్ళాం కావాలి" అని ప్రకటన ఇచ్చాడు. 
అంతే మర్నాడు వేలకొద్దీ ఫోన్ కాల్స్, మెయిల్స్, మెసేజ్-లు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అన్నిటి సారాంశం ఒక్కటే....
 "ఆలశ్యం  చేయకుండా వచ్చి మా ఆవిడని తీసుకువెళ్ళండి. మీకు కుదరకపోతే అడ్రస్ ఇవ్వండి వచ్చి దింపివెళ్తాము."


మూత్రపిండాల్లో రాళ్ళు ఎందుకు వస్తాయంటే?

కొందరికి మూత్రం పోసెటప్పుడు విపరీతమైన మంటకలుగుతుంది. అంటే మీకు మూత్రపిండాలలో రాళ్ళు ఉన్నాయని అర్థం. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడితే మీకు సమస్య నానాటికీ పెరిగిపోతుందని అర్థం.ఇలా జరుగటానికి కారణాలెమిటో తెలుసుకుందామా..!
అవి ఎలా ఏర్పడతాయంటే: 
1. ఆహారం ద్వారా మూత్రపిండాలలోకి ప్రవేశించిన కుళ్ళిన ఆహార పదార్ధ రూపమైన యూరిక్ ఆసిడ్ (మూత్రికామ్లము ) మూత్రపిండాల బలహీనత వల్ల మూత్రంతో కలసి బయటకు రాకుండా లోపలే వుండిపోయి రాళ్ళులాగా మారుతుంది.

2. మనం తినే ఆహారంలోని కా్ల్షియం అనబడే సున్నపు ధాతువు ఎప్పటికప్పుడు థైరాయిడ్ గ్రంధి ద్వారా ధాతురూపంగా మార్చబడుతూ ఎముకలకు చేరుకుంటుంది. అయితే థైరాయిడ్ గ్రంధి ఎప్పుడైతే బలహీనపడి రోగ గ్రస్తమవుతుందో ఆ మరుక్షణమే కాల్షియం అరిగించలేకపోవడంవల్ల, కరిగించలేకపోవడంవల్ల అది ఎక్కడిదక్కడే నిలవవుండిపోయి మూత్రపిండాలలో రాళ్ళుగా ఏర్పడుతుంది.
నివారణ: 
అలాంటి సందర్బ్హాల్లో ఆకులు తీసిన ముల్లంగి కాడలను తెచ్చి దంచి తీసిన రసం 20 గ్రాములు రెండు పూటలా సేవిస్తుంటే మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్రనాళం మొదలైన చోట్ల ఏర్పడిన రాళ్ళు ముక్కలు ముక్కలుగా కరిగి పడిపోతాయి.

స్వకార్యం...స్వామికార్యం రెండు ఐనట్టేగా! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

స్వకార్యం...స్వామికార్యం రెండు ఐనట్టేగా! 

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రాంగణంలో ఒక చోట కంచెను మరమ్మత్తు చేయడానికి టెండర్లను ఆహ్వానించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చివరికి ముగ్గురిని ఎంపిక చేశారు. ఒకరు బంగ్లాదేశ్, మరొకరు చైనా, మూడో వ్యక్తి భారతదేశానికి చెందిన వాడు.
ముగ్గురూ వైట్‌హౌస్ అధికార ప్రతినిథితో కలిసి కంచెను పరీక్షించడానికి వెళ్ళారు.

బంగ్లాదేశీయుడు బ్యాగ్ లోఉన్న టేప్ తీసుకుని స్థలాన్ని, కొలిచి కొన్ని లెక్కలు వేసి చివరికి 900 డాలర్లు ఖర్చవుతుందని తేల్చాడు. 400 డాలర్లు సామగ్రికి, 400 డాలర్లు పనివాళ్ళకు, 100 డాలర్లు అతనికి లాభం.
తరువాత చైనీయుడి వంతు వచ్చింది. అతను కూడా ఏవో కొన్ని లెక్కలు వేసి 700 డాలర్లు లెక్క తేల్చాడు. 300డాలర్లు సామాగ్రికి, 300 పనివాళ్ళకు, 100 డాలర్లు లాభం.
చివరగా భారతీయుడి వంతు వచ్చింది. కొలతలు వేసే కార్యక్రమాలేమీ పెట్టుకోకుండా అధికార ప్రతినిథిని దగ్గరగా పిలిచి చెవిలో “2700 డాలర్లవుతుంది” అన్నాడు.
“నువ్వు వాళ్ళలాగా కనీసం కొలత కూడా వేయలేదు. అంత పెద్ద సంఖ్య ఎలా చెప్పావు?”
“1000 డాలర్లు నీకు , 1000 డాలర్లు నాకు, ఆ చైనా వాణ్ణి మనం పనిలో పెట్టుకుందాం. ఏమంటావ్?”
“Done”.


Monday 7 November 2016

తెలుగు వాళ్ళ గురించి ఎంతో చమత్కారంగా చెప్పినది మీరు చదవాల్సిందే.

లోకం లో జనాలు రెండు రకాలు.
చదవడం తెలిసిన వాళ్ళు, చదవడం రాని వాళ్ళు.
చదవడం రాని వాళ్ళతో హ్యాప్పీస్.

చదవడం వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండు రకాలు.
తెలుగు వచ్చిన వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు.
తెలుగు రాని వాళ్ళతో హ్యాప్పీస్

తెలుగొచ్చిన వాళ్ళు మళ్ళీ రెండు రకాలు
బ్లాగులు చదివే వాళ్ళు, బ్లాగులు చదవని వాళ్ళు.
బ్లాగులు చదవని వాళ్ళతో హ్యాప్పీస్.

బ్లాగులు చదివే వాళ్ళు రెండు రకాలు.
నా బ్లాగు చదవని వాళ్ళు, నా బ్లాగు చదివే వాళ్ళు.
నా బ్లాగు చదవని వాళ్ళతో హ్యాప్పీస్.

నా బ్లాగు చదివే వాళ్ళు మళ్ళీ రెండు రకాలు
మొత్తం చదివే వాళ్ళు, పై పైన చదివే వాళ్ళు
మొత్తం చదివే వాళ్ళతో హ్యాప్పీస్.

పై పైన చదివే వాళ్ళు మళ్ళీ రెండు రకాలు.
కామెంటు రాసే వాళ్ళు, కామెంటు రాయని వాళ్ళు.
కామెంటు రాయని వాళ్ళతో హ్యాప్పీస్.

కామెంటు రాసే వాళ్ళు రెండు రకాలు
బాగుందని రాసే వాళ్ళు, బాలేదని రాసే వాళ్ళు.
బాలేదని రాసే వాళ్ళతో హ్యాప్పీస్.

బాగుందని రాసే వాళ్ళు రెండు రకాలు
బ్లాగుండి రాసే వాళ్ళు, బ్లాగు లేక రాసే వాళ్ళు
బ్లాగుండి రాసే వాళ్ళతో హ్యాప్పీస్

బ్లాగు లేక రాసే వాళ్ళు మళ్ళీ రెండు రకాలు
బ్లాగు మొదలు పెడదామని రాసే వాళ్ళు, బ్లాగు అలోచన లేకుండా రాసే వాళ్ళు
బ్లాగు మొదలు పెడదామని రాసే వాళ్ళతో హ్యాప్పీస్

బ్లాగు ఆలోచన లేకుండా రాసే వాళ్ళు రెండు రకాలు.
చేనీస్ వచ్చిన వాళ్ళు, చైనీస్ రాని వాళ్ళు.
చైనీస్ రాని వాళ్ళతో హ్యాప్పీస్.

చైనీస్ వచ్చిన వాళ్ళు రెండు రకాలు
తెలుగు బ్లాగుల్లో చైనీస్ రాసేవాళ్ళు, చైనీస్ బ్లాగులో చైనీస్ రాసే వాళ్ళు.
చైనీస్ బ్లాగుల్లో చైనీస్ రాసే వాళ్ళతో హ్యాప్పీస్

తెలుగు బ్లాగుల్లో చైనీస్ రాసే వాళ్ళు రెండు రకాలు కాదు. ఒకే రకం. అదే కనిపించకుండా పోయిన రకం.
ఒక రకమే కాకుండా మనిషి కూడా ఒకడే.వాడే కూడలి ని వ్యాఖ్యలతో స్పాం చేసేవాడు
వాడి అదృశ్యం తో ఇప్పుడు కూడలి హ్యాప్పీస్, నేను హ్యాప్పీస్, ఆల్ హ్యాప్పీస్.

గమ్మతైన విషయం ఏంటంతే కోడి పందాలు వేసే పందెం కోళ్ళకు సైతం ఇవే ఎక్కువ పెడతారు!

మన పూర్వికులు రాగులను బాగా వాడేవారు. ఆరోగ్యానికి కొండంత బాసటగా ఇవి నిలుస్తాయనేది వారి అనుభవం చెబుతోంది. అందుకే కొందరు ఇప్పటికీ రాగి జావను త్రాగుతుంటారు. ఇంకో గమ్మతైన విషయం ఏంటంతే కోడి పందాలు వేసే పందెం కోళ్ళకు సైతం ఇవే ఎక్కువ పెడతారు. ఎందుకంతే వీటి వల్ల వచ్చే బలం చాలా ఎక్కువ. రాయలసీమలో ఈనాటికీ రాగి సంగటి ఆహరంగా వాడటం జరుగుతోంది. కానీ రాగులు చేసే ఉపయోగాలు, ఇచ్చే ఆరోగ్యం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ వాడతారు. అవేంటో ఇప్పుడు చూద్దామా?

1. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.



2. రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల బాగుంటుంది.

3.కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుం ది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి శక్తి చేకూరుతాయి.

4.ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.

సీమ పల్లెల్లో పొద్దు పొద్దునే నిద్రలేపే అల్లారం ట్యూన్...భలే సరదాగా ఉంటుంది.

పొద్దున్నే లేసినాడు కాదరయ్యా వాడు కాళ్ళూ-మొగం గడిగినాడు కాదరయ్యా
కాళ్ళూ-మొగం గడిగినాడు కాదరయ్యా వాడు సద్ది సంగటి దిన్నాడు కాదరయ్యా
సద్ది సంగటి దిన్నాడు కాదరయ్యా వాడు పంగనామం బెట్టినాడు కాదరయ్య
పంగనామం బెట్టినాడు కాదరయ్యా వాడు బుట్ట సంకనేసినాడు కాదరయ్యా
బుట్ట సంకనేసినాడు కాదరయ్యా వాడు పల్లే దోవ బట్టినాడు కాదరయ్యా
పల్లే దోవ బట్టినాడు కాదరయ్యా వాణ్ణి పల్లె కుక్క భౌ మనె కాదరయ్యా
పల్లె కుక్క భౌ మనె కాదరయ్యా వాడు అడ్డ దోవ బట్టినాడు కాదరయ్యా
అడ్డ దోవ బట్టినాడు కాదరయ్యా వాడు జొన్నసేలో బణ్ణాడు కాదరయ్యా
జొన్నసేలో బణ్ణాడు కాదరయ్యా వాడు జొన్నకంకులు జూసినాడు కాదరయ్యా
జొన్నకంకులు తుంచినాడు కాదరయ్యా వాడు యిరిసిరిసి బుట్లోబెట్టె కాదరయ్యా
యిరిసిరిసి బుట్లోబెట్టె కాదరయ్యా వాణ్ణి సేన్రెడ్డి కేకలుబెట్టె కాదరయ్యా
సేన్రెడ్డి కేకలుబెట్టె కాదరయ్యా వాడు గువ్వల దోల్తాండనుకొండె కాదరయ్యా
గువ్వల్ గాదు గివ్వల్ గాదు కాదరయ్యా వాణ్ణి జుట్టుబట్టి వొంగదీసె కాదరయ్యా
జుట్టుబట్టి వొంగదీసె కాదరయ్యా వాడు పేండ్లు జూస్తాడనుకొండె కాదరయ్యా
పేండ్లుగాదు గీండ్లుగాదు కాదరయ్యా వాణ్ణి మంచె గుంజకు యాలదీసె కాదరయ్యా
మంచె గుంజకు యాలదీసె కాదరయ్యా వాడు ఉయ్యాలూప్తాడనుకొండె కాదరయ్యా
ఉయ్యాల్గాదు గియ్యాల్గాదు కాదరయ్యా చింతమల్లెలు దెచ్చినాడు కాదరయ్యా
చింతమల్లెలు దెచ్చినాడు కాదరయ్యా వాడు పెండ్లి జేస్తాడనుకొండె కాదరయ్యా
పెండ్లిగాదు గిండ్లిగాదు కాదరయ్యా వాణ్ణి వాతల్ వాతలు పెరికినాడు కాదరయ్యా
వాతల్ వాతలు పెరికినాడు కాదరయ్యా వాడూ దోవల్ దోవలు ఉరికినాడు కాదరయ్యా
దోవల్ దోవలు ఉరికినాడు కాదరయ్యా... దోవల్ దోవలు ఉరికినాడు కాదరయ్యా...

మీకు తెలిసిన జానపదులను వ్యాఖ్యాపెట్టిలో తెలియపరచండి. 

వరో సుత్తితో మోదుతున్నట్టు, పొట్టలో వికారంగా ఉన్నట్టు అనిపిస్తూ చాలా ఇబ్బందిగా ఉంటుందా ?

మైగ్రేన్ అంటే?

తలపై ఎవరో సుత్తితో మోదుతున్నట్టు, పొట్టలో వికారంగా ఉన్నట్టు అనిపిస్తూ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ నొప్పి ఎన్ని పైన్ బాంలు వాడినా ఎన్ని మందు బిళ్ళల్ని మింగినా తగ్గదు. దీనినే అంగ్లంలో మైగ్రేన్ అంటారు. పల్లెల్లో ఒంటి చెంపపోటు అనే మాట వింటుంటాం. దీనిని తట్టుకోవడం కాస్త ఇబ్బందికర విషయమే. అచ్చు తెలుగులో పార్శ్వ తల నొప్పి అంటారు. ఇది మిగిలిన సాధారణ తలనొప్పులకు భిన్నంగా ఉంటుంది. మైగ్రేన్ లక్షణాలు మనిషికి మనిషికి వేరు వేరుగా ఉంటాయి. ఇది నరాలకు సంబంధించిన జబ్బు. మైగ్రేన్ లక్షణాలు, దాని నివారణా చర్యలను తెలుసుకుందామా!

మైగ్రేన్ లక్షణాలు

1. పార్శ్వ తలనొప్పి లక్షణాలు ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి. ఎండ పెరిగే కొద్ది తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి వస్తున్నట్లుగాను మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి వుంటుంది.

2. అధిక వెలుతురును, శబ్ధాలను భరించలేరు. కళ్ళ ముందు వెలుతురు చుక్కలాగా కనిపించవచ్చు.

3. పై లక్షణాలు మొదలైన కొన్ని నిముషాలకు ముఖములో ఒక భాగములో కాని, ఒక చేయి కాని , ఒక కాలు కాని తిమ్మిర పట్టడము. సూదులతో గుచ్చినట్లు అనుభూతి ఉంటుంది. కళ్ళు తిరగడం, బలహీనత, మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడడం జరగవచ్చు.

4. పై లక్షణాలు తీవ్రమైన లేక తగ్గుదల కనిపించిన తరువాత విపరీతమైన తలనొప్పి సుత్తితో బాదినట్లు వస్తుంది. ఆకలి మందగిస్తుంది. ఈ లక్షణాలు సాధారణంగా ఉదయం 6 గం నుండి 8 గం వరకు వుంటుంది. స్త్రీలకు బహిస్టు సమయంలో మైగ్రేన్ తల నొప్పి వస్తుంటాయి.


మైగ్రేన్ రావటానికి కారణాలు

మైగ్రేన్‌కు మానసిక వత్తిడికి చాలా దగ్గర సంబంధం ఉంది. మానసిక వత్తిడి పెరిగితే మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. అధిక శ్రమ, ప్రకాశవంతమైన వెలుతురు కళ్ళ మీద పడినప్పుడు, రుతు క్రమములో తేడాలు. కొందరిలో గర్బనిరోధక మాత్రలు మైగ్రేన్ ను ప్రేరేపిస్తాయి.

మద్యపానం, ధూమపానాల ప్రభావం

తలకు ఒక వైపు వెళ్ళే నరాలు అకస్మాతుగా కుచించుకు పోవడం వలన మైగ్రేన్ లక్షణాలుప్రారంభమవుతాయి. ఇవే నరాలు ఒక్కసారిగా వ్యాకోచించడం వలన అక్కడికి అధిక రక్తం ప్రవహించుట వచ్చి తలనొప్పి వస్తుంది.

నివారణా మార్గాలు

1. ఉద్వేగము కలిగించే జీవనశైలి నుండి స్వల్ప మార్పుల తో సాధారణ జీవిత విధానాన్ని అలవరచుకోవాలి.

2. ఇంటిలో ఉన్నప్పుడు చీకటి గదిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి.

3. ద్రవ పదార్దాలు నీళ్ళు ఎక్కువ మోతాదుల లో తాగాలి.

4. నీటిలో తడచిన బట్టను తల మీద వేసుకొని విశ్రాంతి తీసుకొన్న కొంత ఉపశమన ఉంటుంది.

ఏ మాత్రము సందేహము తలెత్తినా గర్భ నిరోధక మాత్రలను మానేయాలి. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా తీసుకోకూడదు. ఇతర కుటుంబ నియంత్రణ పద్దతులు అవలంబించాలి. కొందరు మహిళల లో మెనోపాజ్ వయస్సు రాగానే మైగ్రేన్ తగ్గిపోతుంది. ఈ సమస్య తీరాలంటే వైద్యుని పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలి.

Sunday 6 November 2016

చక్కెర వ్యాధి లక్షణాలను తెలుసుకోండిలా..!

వాహనం నడవాలంటే ఇంధనం ఎలా అవసరమో అలాగే మన శరీరం చక్కగా పని చేయాలంటే మన శరీరానికి శక్తి అవసరం. ఆ శక్తి ఎక్కడి నుందీ వస్తుంది. అదే గ్లూకోస్ నుందీ శక్తి వస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్ తగ్గయంటే సెలైన్ పెడతారు. దానికి కారనం శక్తి తగ్గిందంతే గ్లూకోస్ లెవెల్స్ తగ్గాయని అర్థం. ఇక సుగర్ అంటే మధుమేహ వ్యాధి ఎలా వస్తుందంతే శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ మెల్ల్ మెల్లగా తగ్గి ఈ మధుమేహం వస్తుంది. దీనికే మరోపేరు చక్కెర వ్యాధి.

శరీరంలో చక్కెర హెచ్చుతగ్గుల వల్ల కలిగే అనారోగ్యాన్ని వ్యాధి అని అంటున్నా, నిజానికి ఇది వ్యాధి కాదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ డయాబెటిస్‌ను అదుపులో ఉంచగలిగితే మనిషి ఎంతకాలమైనా హాయిగా జీవించగలడు.మనం ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలో చక్కెర ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా అదనంగా ఉత్పత్తి అయిన చక్కెర కాలేయం (లివర్‌)లో నిల్వ ఉంటుంది. మనం శారీరకంగా ఎక్కువ కష్టపడితే, కణాలకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అంటే ఎక్కువ చక్కెర (గ్లూకోజ్‌) కావాలన్నమాట. దీనిని లివర్‌ అందిస్తుంది. ఇదికాక ఇంకా అదనపు చక్కెర నిల్వ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఇదే డయాబెటిస్‌! దీనివల్ల మూత్రపిండాల (కిడ్నీస్‌) పైన అధిక భారం పడుతుంది.

మన దేహంలోని పాంక్రియాస్‌ అనే అవయవం ఇన్‌సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పాంక్రియాస్‌ జీర్ణకోశానికి పక్కనే ఉంటుంది. చక్కెరను జీర్ణం చేయడంలో పాంక్రియస్‌దే కీలకపాత్ర. చక్కెరను గ్లూకోజ్‌గా మార్చి నిల్వచేయడం, వివిధ శరీర భాగాలకు పంపించడమూ పాంక్రియస్‌ బాధ్యత.



వ్యాధి లక్షణాలు

* త్వరగా అలసిపోవడం, నీరసం

* శరీరం నిస్సత్తువగా మారడం

* పనిలో ఆసక్తి లేకపోవడం

* నాలుక తడారిపోవడం, విపరీతమైన దాహం

* తడవ తడవకూ మూత విసర్జన చేయడం

* ఎక్కువ ఆహారం తీసుకుంటున్న శరీరం బరువు తగ్గిపోవడం

* కంటి చూపు మందగించడం

* కీళ్ళనొప్పులు

* ఒంటినొప్పులు

* రోగ నిరోధక శక్తి తగ్గడం. తరచు వ్యాధులకు గురికావడం

* కడుపులో నొప్పి

* చర్మం మంటగా ఉండటం. గాయాలు త్వరగా మానకపోవడం

* వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం

* సెక్స్ కోరికలు సన్నగిల్లడం

* చర్మం ముడత పడటం.

* రక్తహీనత

* ఎప్పుడూ పడుకునే ఉండాలనిపించడం.

పొడిబారి పగుళ్ళు ఏర్పడే సమస్య నుండి పరిష్కారం...ఖర్చు లేకుండా!

శీతాకాలం వచ్చేసింది. ఇక ప్రతి మగువ తమ చర్మాన్ని కాపాడుకోవటానికి ఎన్నో క్రీముల్ని అన్వేషిస్తుంది. పొడిబారి పగుళ్ళు ఏర్పడే సమస్య ప్రస్తుతం మగువలు ఎదుర్కొనే సమస్య. ఈ సమస్యలకు మన ఇంట్లొనే చిట్కాలు దాగి వున్నాయ్. వాటిని ఉపయోగించుకుంటే సరి. అవేంటో చూద్దామా మరి!

1.పొడిచర్మం కలిగినవారు చర్మాన్ని శుభ్రపరచుకునేటప్పుడు.. పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌ను వేసి బాగా కలిపి కాటన్‌తో చర్మంపై రుద్దుకోవాలి.

2.మృదువైన చర్మం అయితే ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇంకో పద్ధతిలో… పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



మాస్క్ వేసుకునేటప్పుడు

1.పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు. ఇంకా… అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.

2.మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే… చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది. కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

3.ఇక కాళ్లూ, చేతులకు

గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్‌, తేనె కలిపి… ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేతులకు, కాళ్ళకు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి. పైన చెప్పుకున్న చిన్న, చిన్న చిట్కాలను పాటించినట్లయితే… చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకున్నవారవుతారు.

చిన్నపిల్లలకు కంటి సమస్యలు వస్తే? ఇవి చేయండి...నివారించండి!

చిన్నపిల్లలకు కంటి సమస్యలు వస్తే?

కంటి సమస్యకు ఏ వయసులోనైనా వస్తాయి. ఈ సమస్యలకు చిన్నపిల్లలూ దానికి మినహాయింపు కాదు. అయితే చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలు గుర్తించలేనివి. వీటిని గుర్తించటం అంత తేలికా కాదు. వాళ్ళు స్కూలుకి వెళ్ళేనాటి నుండే ఈ సమస్యలు మొదలు కావచ్చు కూడా. ఈ సమస్యలు గురించి తెలుగు టిప్స్ పాటకులకు అందించే ప్రయత్నం చెస్తోది తెలుగు టిప్స్ ఈ సీర్షికలో.. అవేంటో చూద్దామా..!

చక్కగా చదివే చినారికి స్కుల్లో శ్రధ్ధ తగ్గింది. చక్కగా, స్పష్టంగా చదవలేకపోతున్నాడు. తల్లిదండ్రులకు సమస్య ఏమిటో అంతుబట్టడం లేదు. స్కూల్లో ఏదైనా సమస్య ఉందేమో అనే కోణంలోనే ఆలోచిస్తున్నారు గానీ… ఆరోగ్యకోణంలో అస్సలు ఆలోచించలేకపోయారు. కారణం… అంతా హుషారుగా ఉండే ఆ వయసు పిల్లల్లో ఆరోగ్యసమస్య ఏదో ఉందనుకునే ఆస్కారమే లేకపోవడం.

ఆ చిన్నారి స్పష్టంగా చదవలేకపోవడానికి కారణం… బోర్డుపైన ఉన్నది అస్పష్టంగా కనిపించడమేనని టీచర్ గుర్తించింది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియపరచింది. ఎప్పుడూ తాము తీసుకెళ్లే పిల్లల డాక్టర్‌ను కలిస్తే… ఆయన కంటిడాక్టర్‌ను… అందునా చిన్నపిల్లల కంటి డాక్టర్‌ను కలవమని సలహా ఇచ్చారు. అప్పుడు తెలిసింది ఆ తల్లిదండ్రులకు… చిన్నారుల కళ్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఓ వైద్యవిభాగం ఉందని… ఆ విభాగం పేరే ‘పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజీ’ అని. పదహారేళ్ల లోపు వయసున్న పిల్లలకు సంబంధించిన కంటిసమస్యలను కనుగొని చికిత్స చేసే వైద్యనిపుణులను ‘పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్’ అని అంటారు.

చిన్న పిల్లలకు వచ్చే సాధారణ కంటి సమస్యలు

1. అన్‌కరెక్టెడ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్: ఇందులో లక్షణాలు కంటికి కనిపించేది స్పష్టంగా లేకుండా మసకమసకగా ఉండటం (బ్లర్‌డ్ ్రవిజన్), ఏదైనా చూస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు కంటికి ఇబ్బందిగా ఉండటం, ఎక్కువసేపు చదివినప్పుడు కంటికి భారంగా అనిపించడం, కళ్లలోంచి నీరు కారడం, తలనొప్పి మొదలైనవి. ఈ ఇబ్బందులను యాస్థెనోపిక్ సింప్టమ్స్ అంటారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లోనే సరైన అద్దాలను ఉపయోగించడం ద్వారా పిల్లలకు స్పష్టంగా కనిపించేలా చేసి… సమస్య తీవ్రతరం కాకుండా కాపాడవచ్చు.

2. ఆక్యులార్ అలర్జీ: పిల్లలకు ఏవైనా సరిపడని పక్షంలో (అంటే ఇంట్లో ఉండే దుమ్ము ధూళి లేదా పూల పుప్పొడి వంటి వాటితో) కన్ను బాగా ఎర్రబారడం, కళ్లను తీవ్రంగా నలుపుకోవాలి అనిపించేలా కనురెప్పల చివరల్లో దురదలు, కళ్లలో నీరు రావడం వంటివి.

3. స్ట్రేబిస్మస్ లేదా స్క్వింట్ (మెల్లకన్ను): ఈ సమస్య ఉన్న పిల్లల్లో రెండు కళ్లలోని నల్లగుడ్డు ఒకేలా లేకపోవడం (అంటే ఒకటి ఒక పక్కకు గాని, లేదా రెండూ రెండు పక్కలకు గాని తిరిగి ఉన్నట్లు కనిపించడం). ఈ లక్షణాన్ని మిస్‌అలైన్‌మెంట్ ఆఫ్ ఐస్ అని పేర్కొనవచ్చు. దీన్ని వాడుక భాషలో మెల్లకన్ను అని వ్యవహరిస్తుంటారు. సాధారణంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మెల్లకన్ను అదృష్టసూచిక అని ఒక దురభిప్రాయం ఉంది. అయితే మన రెండు కళ్లలో చివరన ఏర్పడే ప్రతిబింబాలు రెండూ మెదడులో ఒకటిగానే కనిపించే ఏర్పాటు ఉండి… మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

4. స్ట్రేబిస్మస్ లేదా స్క్వింట్ అని పిలిచే ఈ మెల్లకన్నుకు సరైన వయసులో సాధ్యమైనంత త్వరగా చికిత్స జరగకపోతే అది ఆంబ్లోపియా అన్న సమస్యకు దారితీసి శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మెల్లకన్ను అదృష్టసూచిక కాదని గ్రహించి, పిల్లల్లో ఈ సమస్య ఉంటే వెంటనే కంటి వైద్యనిపుణులకు అందునా చిన్నపిల్లల కంటివైద్యుల (పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్)కు చూపించడం మంచిది.

5. రెటినల్ డిస్ట్రఫీస్ అండ్ డీజనరేషన్స్: ఈ తరహా జబ్బుల్లో కంటికి దగ్గర్లో ఉన్నవి లేదా దూరాన ఉన్నవి స్పష్టంగా కనిపించకపోవడం, రాత్రివేళల్లో లేదా పగటి వెలుతురు ఎక్కువగా ఉన్న సమయాల్లో స్పష్టంగా కనిపించకపోవడం, రంగులను స్పష్టంగా గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవేగాక మనకు కనిపించే కంటిచూపు పరిధి (ఫీల్డ్ ఆఫ్ విజన్) తగ్గుతూ పోవడం, ఒక్కోసారి కనుగుడ్లు అటూఇటూ వేగంగా కదులుతున్నట్లుగా ఉండటం (వైద్య పరిభాషలో నిస్టాగ్మస్) వంటి లక్షణాలు ఉన్న సమస్యలన్నీ ఈ విభాగంలోకి వస్తాయి.



6. ల్యూకోకోరియా: ఇందులో కంటిపాప తెల్లగా కనిపిస్తుంది. మనలో చాలామందికి సాధారణంగా కంటిలోని తెల్లపువ్వు ఒక వయసు తర్వాతే వస్తుంటుందని భావిస్తుంటాం. కానీ కొందరిలో పుట్టుకతోనే కళ్లలో తెల్లపువ్వు (కంజెనిటల్ కాటరాక్ట్) ఉంటుందన్నమాట. అలాంటివే కంటిలో గడ్డలు (వైద్యపరిభాషలో ఇంట్రా ఆక్యులార్ ట్యూమర్స్) కనిపించే రెటినోబ్లాస్టోమా వంటి కేసులు కూడా ఉంటాయి. రెండు కిలోల కన్నా తక్కువ బరువు ఉన్న పిల్లలు లేదా తొమ్మిది నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లో రెటీనా దెబ్బతినే పరిస్థితి కూడా రావచ్చు. దాన్నే హాఫ్ ప్రీమెచ్యురిటీ రెటినోపతి అంటారు.

విటమిన్-ఏ లోపంతో వచ్చే కంటిసమస్యలు: కొందరు పిల్లల్లో పోషకాహారలోపం వల్ల కూడా కంటి సమస్యలు రావచ్చు. ఇటువంటివారిలో కళ్లు పొడిబారిపోవడం, రాత్రిపూట కనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీళ్లను పరిశీలిస్తే నల్లగుడ్డు పక్కన తెల్లమచ్చలు (కార్నియల్ అండ్ కంజంక్టివల్ గ్సీరోసిస్) ఉంటాయి. దీనికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కంటిలోని నల్లగుడ్డు దెబ్బతిని చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

పిల్లల్లో కంటి సమస్య కనిపించిన వెంటనే వీలైనంత త్వరగా దాన్ని కనుగొనడానికి (డయాగ్నోజ్ చేయడానికి), చికిత్సకు ప్రయత్నించాలి. ఎందుకంటే మనం సముపార్జించే జ్ఞానంలో 80 శాతానికి పైగా మన జ్ఞానేంద్రియాలన్నింటిలోనూ ప్రధానమైన కంటి తో చూసి నేర్చుకునేదే. ఇక మన కంటి ద్వారా జరిగే చూపు ప్రక్రియలో చాలా ప్రక్రియలు ఎనిమిదేళ్ల వయసు వచ్చేవరకు జరుగుతుంటాయి. అందుకే ప్రక్రియలు జరిగే సమయంలో తలెత్తే లోపాలను ఎంత త్వరగా తెలుసుకుంటే వాటిని అంత త్వరగా సరిదిద్దవచ్చన్నమాట. తద్వారా పిల్లల్లో శాశ్వతంగా చూపుకోల్పోయే ప్రమాదాలను నివారించవచ్చు. అందుకే పిల్లల్లో చూపు సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.

మనం రెండు కళ్లతో చూసే వేర్వేరు దృశ్యాలను ఒకటిగా చూసే యంత్రాంగం మెదడులో ఉంటుంది. రెండు కళ్లలో కనిపించే వేర్వేరు ప్రతిబింబాలను సమన్వయం చేసి ఒకే దృశ్యంగా చూసే ప్రక్రియలో ఒక్కోసారి మెదడు ఒక కంటి ప్రతిబింబాన్ని విస్మరించే ప్రమాదం ఉంది. అంటే… ఏదైనా కంటి నుంచి వచ్చే ప్రతిబింబం తాలూకు దృశ్యం అంత స్పష్టంగా లేనప్పుడు ఆ ప్రతిబింబాన్ని స్వీకరించేందుకు మెదడు నిరాకరిస్తుంటుంది. ఫలితంగా ఒక కంటి ప్రతిబింబాన్నే మెదడు కంటిన్యువస్‌గా స్వీకరిస్తూ రెండవ కంటి ప్రతిబింబాన్ని నిరాకరిస్తుంటుంది. ఇలా జరగడాన్నే వైద్యపరిభాషలో ఆంబ్లోపియా (లేజీ ఐ) అంటారు. దాంతో కొంతకాలం గడిచాక చూపు సరిగాలేని కంటికి వైద్యం చేసినా మెదడు దాన్ని నిరాకరించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా చికిత్స చేయించడం అన్నది చాలా ప్రధానం.

పిల్లల్లో కంటిజబ్బులను గుర్తించటం ఎలా?

సాధారణంగా పిల్లల్లో దృష్టిలోపాలు ఏవైనా ఉన్నాయేమో అన్న విషయాలు వారు చదివే పొజిషన్‌ను బట్టి తెలుస్తుంటాయి. పిల్లలు పుస్తకాలు చదివే సమయంలో సాధారణంగా ఒక అడుగు లేదా అడుగున్నర (12 నుంచి 18 అంగుళాల) దూరంగా పెట్టుకొని చదువుతుంటారు. చిన్నారులు తాము చదివే సమయంలో పుస్తకాన్ని మరీ దగ్గరగా పెట్టుకొని చదవడం లేదా దూరంగా పెట్టుకొని చదవడం, టీవీ బాగా దగ్గర్నుంచి చూడటం, మెల్లకన్ను పెట్టడం వంటివి చేస్తుంటే ఒకసారి చిన్నపిల్లల కంటి వైద్యనిపుణులను కలవాలి.

ఎప్పుడు ఇలా సమస్యలొస్తాయంటే?

చిన్నారుల్లో ఎలాంటి లోపాలు కనిపించకపోయినా స్కూల్లో చేర్పించే ముందు అంటే… మూడేళ్ల వయసులో ఒకసారి చిన్నపిల్లల కంటి వైద్యనిపుణులకు చూపించాలి. ఆ తర్వాత ఐదేళ్ల వయసులో మరోసారి సంప్రదించాలి. ఇదిగాక పిల్లల్లో కంటికి సంబంధించి ఏ అసాధారణ లక్షణం కనిపించినా లేదా పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంప్రదించడం అవసరం.

పిల్లల్లో తల్లిదండ్రులు పరిశీలించాల్సినవి

1. రెండు కళ్లలోని కనుగుడ్లు రెండూ ఒకేలా ఉన్నాయేమో చూడాలి.

2. రెండు కళ్లతో చూసినా మనకు కనిపించే దృశ్యం ఒకటిగానే ఉండాలి. (ఒకవేళ రెండు దృశ్యాలు వేర్వేగా ఉంటే దాన్ని డిప్లోపియా లేదా డబుల్‌విజన్ అంటారు. అలాంటి సందర్భాల్లో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి).

3. ఏ కంటితో చూసినా మనం చూసే దృశ్యం స్పష్టంగా ఉండాలి. ఒక కంటితో స్పష్టంగానూ, మరో కంటితో మసకగానూ ఉంటే వెంటనే చిన్నపిల్లల కంటివైద్య నిపుణులను సంప్రదించాలి.

పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్ ఎందుకన్న ప్రశ్న తలెత్తవచ్చు. ఎందుకంటే… పెద్దల్లా పిల్లలు తమను బాధించే సమస్యను సరిగ్గా వివరించలేరు. పెద్దల్లా డాక్టర్లకు సహకరించకపోవచ్చు కూడా. వారు చెప్పని విషయాలను కూడా పరిగణనలోకి తీసుకొని, వైద్యపరీక్షల సమయంలో పిల్లలు సహకరించకపోయినా ఓపిగ్గా సమస్యను తెలుసుకొని చికిత్స చేసేలా పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్స్ శిక్షణ పొందుతారు.

పిల్లల్లో కనిపించే కంటి సమస్యల చికిత్సల్లో నైపుణ్యం ఉంటుంది. పిల్లల కంటివైద్యం కోసమే రూపొందించిన ప్రత్యేకమైన ఉపకరణాలను పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్స్ కలిగి ఉంటారు. కాబట్టి పెడియాట్రిచ్ ఆప్తమాలజిస్ట్ ను సంప్రదించటం ఎంతో మేలు.

ముఖంపై బుడిపెలోస్తున్నాయా?

ముఖం పై మొటిమలొస్తేనే ఎంతో చింతించే అతివలకు ముఖం పై బుడిపెలొస్తే ఇక చెప్పేదేముంది తట్టుకోలేనత అసహనం వస్తుంది. ఎందుకంటే ముఖంలో ఉబ్బురూపంలో కనిపించే ఇవి మహిళలకు చికాకు కల్గిస్తుంటాయి. ముఖానికంతటికీ ప్యాక్ చేసుకోవడం, బొడిపెలమీద మాత్రమే అప్లయ్ చేసుకునే ప్యాక్‌లను ఉపయోగించడం ద్వారా వీటిని పొగొట్టుకోవచ్చు. అవి ఎంతో తెలుసుకుందామా..!

1. ముఖంలో బొడిపెలు ఉంటున్నట్లయితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చిదపకూడదు. ముఖం కడుక్కునేటప్పుడు కూడా గట్టిగా రుద్దకుండా జాగ్రత్తగా శుభ్రం చేయాలి.



2. తాజా నిమ్మరసంతో ముఖం కడుక్కోవాలి. లేదా రోజుకు నాలుగైదు సార్లు నిమ్మరసాన్ని బంప్ మీద రాసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

3. రెండు టీ స్పూన్ల తాజా తులసి రసాన్ని మరుగుతున్న నీటిలో కలిపి చల్లారిన తర్వాత ఆ నీటితో ముఖం కడుక్కోవాలి. లేదా ఆ మిశ్రమాన్ని నాలుగైదు సార్లు బొడిపెపై రాయాలి.

4. కోడి గుడ్డులోని తెల్ల సొనను బొడిపె మీద రాసి ఆరిన తర్వాత కడిగితే ఫలితం ఉంటుంది.

5. ఒకటిన్నర టేబుల్ స్పూన్ల తేనెలో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వేస్టులా చేసుకోవాలి. దీనిని రాత్రి పూట పేస్టులా చేసుకుని పడుకోబోయే ముందుగా బొడిపెపై రాసుకుని ఉదయం గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

6. రాత్రి పూట నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి, ఆపిల్ సైడర్ వెనిగర్‌ను బంప్ మీద రాయాలి.

Saturday 5 November 2016

గోంగూర తినను నాకు పడదు...అసలు ఎలర్జీ ఎలా వస్తుందంటే?

నాకు ఆ వంకాయ కూర వద్దు..గోంగూర తినను నాకు పడదు. అమ్మో.. దుమ్ము వాసన, సోపు వాసన పడదు తుమ్ములోస్తాయ్ అని ఇలా చాలామంది చెబుతుంటారు. సాధారణార్థంలో శరీరం ఏదైనా పదార్థాన్ని స్వీకరించలేకపోవటం, సహించలేక పోవడాన్నే ఎలర్జీగా పిలుస్తున్నారు. వైద్య పరిభాషలో కొన్ని పదార్థాల పట్ల శరీరంలోని కణాలు భిన్న రీతిలో వ్యవహరించి అవలక్షణాలను వ్యక్తపరచటాన్ని ఎలర్జీగా చెబుతున్నారు. ఎలర్గీ కారకాల గురించి తెలుసుకుందామా!

శరీర కణాలు భిన్నరీతిలో వ్యవహరించటానికి ఎలర్జిన్‌ అనే మాంసకృత్తి కారణం. ఇది నీటిలో , గాలిలో, ఆహారంలో, ఇలా ప్రతి చోటా వుంటుంది. ఈ ఎలర్జిన్‌ కలిగి వున్న పదార్థం శరీరాన్ని తాకినా, లోపలికి ప్రవేశించినా కణాలు దాన్ని సరిగా స్వీకరించవు. శరీర కణాల ఈ అసాధారణ ప్రతిస్పందననే ఎలర్జీ అంటున్నారు వైద్యులు.



ఎలర్జీ కారకాలు

చిన్న పాటి ప్రభావాలు కలిగించే రకంనుంచి మొదలుకుని తీవ్ర పరిణామాలు కలిగించే వరకు ఎలర్జీ కారకాలు వైవిధ్య పూరితంగా ఉంటున్నాయి. ముఖ్యంగా పసి పిల్లల్లోను, చిన్న పిల్లల్లోనూ ఎలర్జీ సులువుగా ప్రభావం చూపుతూ వుంటుంది.

పిల్లలకు గుడ్లు, పాలు, గోధుమ వంటి పదార్ధాలు కూడా పట్టక పోవచ్చు. ఈ సమస్య ఐదేళ్ల పిల్లల వరకే వుంటుంది. అటు తర్వాత గాలిలో వుండే పుప్పొడి, దుము్మ, ధూళి, జంతువుల రోమాలు మొదలైనవి ఎలర్జీని కల్గిస్తాయి. ఇంకా చేపలు, వివిధ రకాల మాంసం, గింజలు, టమోటాలు, నిమ్మ, నారింజ, చాక్లెట్లు వంటివి సైతం ఎలర్జీని కలిగిస్తాయి.

చలిజ్వరం వస్తే? చలి జ్వరం లక్షణాలు, నివారణ మార్గాలు

చలిజ్వరం వస్తే?

ఒక్కోసారి జ్వరం వచ్చినప్పుడు శరీరంలో విపరీతమైన చలి వచ్చి పగలు, రాత్రీ తేడా లేకుండా దుప్పటి కప్పుకుని పడుకుంటాం. దీనికి కారణం చలి జ్వరం. వాతావరణంలో మార్పులు వచ్చాయంటే వాటితోపాటే వచ్చే జ్వరాల్లో శీతల జ్వరం ఒకటి. ఉన్న చోట కూర్చొనివ్వదు. పడుకుంటే లేవలేం. శరీరాన్ని తాకుతూనే కాగే పెనంపై చేయి పెట్టినట్టే. విపరీతమైన తలనొప్పి. ఈ వ్యాధికి వాతావరణంలో మార్పులే ప్రధాన కారణమవుతాయి. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామా!


చలి జ్వరం లక్షణాలు

1.విపరీతమైన జర్వం వస్తుంది.
2.భరించలేని తలనొప్పి పట్టి పీడించేస్తుంది.
3.వళ్ళంతా ఒకటే నొప్పులు ఉంటాయి. ఇవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
4.జ్వరమొచ్చి పట్టించుకోకపోతే రెండు వారాల వరకూ ఉంటుంది. నిర్లక్ష్యం చేసి తేడా వస్తే ప్రాణానికే ప్రమాదం. వళ్ళంతా చచ్చుగా తయారవుతుంది.





నివారణ మార్గాలు

ఈ వ్యాధి కారకాలు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. కనీసం వారం రోజుల పాటు శరీరంలో దాగి ఉంటాయి.
1. చేతి రుమాలు లేదా టవెల్‌ను కలసి వాడడం వలన త్వరగా సోకే ప్రమాదం ఉంది. అన్నింటికంటే ముఖ్యం.
2.ఎవరి చేతి రుమాలు, టవెల‌్‌ను వారు మాత్రమే వాడడం మంచిది.
3.భోజనం చేసే ముందు లేదా ఏదైనా పదార్థాలు తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం ఉత్తమం.
4. చిన్న పిల్లలకు త్వరగా సోకే అవకాశాలున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ కనుక వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

పిల్లలకు యుక్తవయస్సు రాకపోతే?

కొందరు 20 ఏళ్ళకే పుడుతుంటారు..కొందరు 60 ఏళ్ళైనా అప్పుడే పుట్టరు అని ఓ కవి అన్నాడు అంటే ఆ మాటకి అర్థం ఇంకా వారిలో మెక్చ్యూరిటీ రాలేదని అర్థం. ఆడ, మగ తేడాలు లేకుండా ఈ సమస్య అందరినీ బాధిస్తుంది. అయితే తల్లిదండ్రులకు మాత్రం ఇది పెను సమస్యగా ఉంటుంది. పిల్లల్లో నెలకొనే ఈ సమస్యలను ఈ పోస్ట్ లో ఇస్తున్నాం. అవెంటో చూద్దామా!

పిల్లలకు యువక్త వయసు రాగానే తల్లిదండ్రులలో అందోళన మొదలవుతుంది. ఎక్కడ పెడదారి పడతారోనని భయపడుతుంటారు. ఇది దాదాపుగా అందరు తల్లిదండ్రులలోనూ ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా కొంత తల్లిదండ్రలలో పిల్లలకు యుక్తవయసు రాక ఆందోళన చెందుతుంటారు. తమ అమ్మాయి పెద్దపిల్ల కాలేదనో లేక తమ అబ్బాయికింకా పిల్లమనస్తత్వం పోలేదనో వారు భయపడుతుంటారు. వారి ఆందోళన సరీనదే. ఏ వయసులో జరగాల్సిన పరిణామాలు ఆ వయసులో జరిగిపోవాలి.లేదంటే కొన్ని సందర్భాలలో లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.



కొందరు అమ్మాయిలు ఎంతకాలం చూసినా అదే విధంగా ఉంటారు. వయసు పెరుగుతుందే కాని శరీర ఆకృతిలో మార్పు ఉండదు. అంటే రసజ్వల కారు. ఇలా జరగకపోత అమ్మాయి యుక్తవయసుకు రాలేదని అర్థం. దీంతో తల్లిదండ్రులలో అందోళన మొదలవుతుంది.

సాధారణంగా యుక్తవయస్సు రావడానికి ఓవరీలకు సంబంధించిన అంశాలో చాలా ముఖ్యం. ఇవి కనుక ఉత్పత్తి కాకపోతే అమ్మాయిలలో యుక్తవయసు రాదు. దీనికి ఆయుర్వేద వైద్యం మంచి పరిష్కారాలే సూచిస్తోంది. అమ్మాయిలకు యుక్తవయస్సు రాకపోతే ప్రవర్తినీ వటి, అశోకారిష్టం బాగా పని చేస్తాయని చెబుతున్నారు వైద్యులు.

అబ్బాయిల విషయానికొస్తే ఒక వయస్సు వచ్చిన తరువాత టెస్టోస్టిరాన్ అనే హార్మోను ఉత్పత్తి కాదు. ఫలితంగా యుక్త వయసు రాదు. జబ్బులతో కృశించి పోతుంటాడు. ఇలాంటి వారు చ్యవనప్రాశ లేహ్యం, అశ్వగ్రంధ లేహ్యం, టెంటెక్స్ పోర్ట్, మకరధ్వజ మాత్రలలో ఏదోకటి వాడవచ్చు. దీని వలన చాలా ఉపయోగం ఉంటుంది. ఈ ఆయుర్వేద మందులను సేవిస్తే సమస్యలు తొలగుతాయని ఆయుర్వేదం వైద్యులు చెబుతున్నారు.

ప్రాణాన్ని కాపాడాల్సిన ఈ కణాలే ప్రాణాన్ని హరిస్తాయి...స్క్లిరోసిస్ వ్యాధి అంటే?

స్క్లిరోసిస్ అంటే?

యుద్ధ క్షేత్రంలో రాజు కోసం సైనికులు తమ ప్రాణాలొడ్డి పోరాడతారు. అలాంటి సైనికులే పోరాడక ఎదురు తిరుబాటు చేస్తే..ఇలాంటి పరిస్థితే మన శరీరాంకి వస్తే ఏం జరుగుతుంది?ఎల్లవేళలా కంటికి రెప్పలా మన శరీరాన్ని కాపాడేవి రోగ నిరోధక కణాలు. ప్రాణాన్ని కాపాడాల్సిన ఈ కణాలే ప్రాణాన్ని హరిస్తాయి. వాటి వల్ల వచ్చే దాని పేరే సిస్టమిక్ స్క్లిరోసిస్.. ఈ వ్యాధి ఎలా వస్తుందో తెలుసుకుందామా!

రోగనిరోధక వ్యవస్థ అనేది శరీరం మొత్తాన్ని రోగక్రిములనుంచి కాపాడే అద్భుత వ్యవస్థ. మనది కానిది ఏదైనా మన శరీరంలోకి ప్రవేశిస్తే వెంటనే యాంటీబాడీలను తయారుచేసి దాన్ని బయటకు పారదోలే అద్భుతమైన వ్యవస్థే రోగనిరోధక వ్యవస్థ -ఇమ్యూన్ సిస్టమ్-. కొన్ని సందర్భాల్లో రోగనిరోధక వ్యవస్థ తయారుచేసిన ఈ యీంటీబాడీలు మన సొంత కణాలనే పరాయివిగా భావించి దాడి చేస్తాయి. దాని ఫలితమే ఆటో ఇమ్యూన్ వ్యాధి.

శరీరాన్ని నిర్వీర్యం చేసే సిస్టమిక్ స్క్లిరోసిస్ కూడా ఈ కోవకు చెందినదే. భారతీయులకు ఇది అరుదుగా వచ్చే జబ్బే అయినప్పటికీ దీని బారిన పడ్డవారికి మాత్రం ఇది ప్రాణసంకటం లాగే ఉంటుంది. శరీరమంతటినీ అనుసంధానించే ప్రసరణ కణజాలాన్ని దెబ్బతీసే ఈ వ్యాధి శరీరంలోని అన్ని ప్రధాన అవయవాల పైనా ప్రభావం చూపిస్తుంది. చర్మం నుంచి జీర్ణ వ్యవస్థ, శ్వాసకోశాలు, గుండె, కిడ్నీలు.. ఇలా అన్నీ క్రమక్రమంగా దెబ్బతినడంతో మనిషి కుప్పగూలిపోతాడు.

వ్యాధిని గుర్తించటం ఇలా

సాధారణ ఇన్‌ఫెక్షన్లలాగ ఈ వ్యాధిలో జ్వరం వంటి లక్షణాలేవీ కనిపించవు. దగ్గు, ఆయాసం మాత్రం ఉంటాయి. వీరు కొద్ది దూరం కూడా నడవలేరు. అతి త్వరగా అలసిపోతారు. చిన్న పని చేయడానికైనా కష్టపడతారు. బరువు తగ్గిపోతారు. శరీరం నీలిరంగులోకి మారవచ్చు. శ్వాసకోశాలు దెబ్బతిన్నప్పుడు బ్రాంకైటిసి లక్షణాలన్నీ కనిపిస్తాయి. అందుకే న్యూమోనియా, క్షయలాంటి వ్యాధులేవీ లేవని నిర్ధారించుకోవడం అవసరం.



కొన్ని సందర్భాల్లో ఇతర శ్వాసకోశవ్యాధులేవీ లేవని స్పష్టమైన తర్వాత బయాప్సీ చేయాల్సి వస్తుంది. ఊపిరి తిత్తుల బయీప్సీ చేసేటప్పుడు కొంత కణజాలాన్ని కోసి తీసి పరీక్షించాల్సి ఉంటుంది. ఇలాంటప్పడు గాలిని ప్రసరింపజేసే చిన్నచిన్న శ్వాసమార్గాలు చిట్లిపోయి గాలి బయటకు వచ్చే అవకాశముంటుంది. దీని వల్ల శ్వాసకోశాలు మరింత దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.
చికిత్సా విధానం

1. శ్వాసకోశాల పనితీరు చాలావరకు దెబ్బతినడం వల్ల ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేషన్ అనే పరికరం ద్వారా నిరంతరం గాలిని పంపించాల్సి వస్తుంది. ఇది నైట్రస్ ఆక్సైడ్‌ని ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను శరీరంలోకి పంపిస్తుంది. దీన్ని జీవితాంతం వాడాల్సి ఉంటుంది.

2. ఇమ్యూనిటీని తగ్గించే దశలో మందులు చాలా అవసరం. కాబట్టి ఇమ్యునో సప్రెసెంట్ మందులను జీవితాంతం వాడుతూనే ఉండాలి. కాని వీటి వల్ల సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఎక్కువ.

3. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల అనేక రకాల ఇన్‌ఫెక్షన్లు చుట్టుముడతాయి. స్టెరాయిడ్స్ వాడకంతో ఎముకలు మెత్తబడడం, ఆస్టియోఫోరోసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

4. బిపి, మధుమేహం వ్యాధులు కూడా చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలకు ఎప్పటికప్పుడు చికిత్స అందించగలిగితే కొంత మేలు కలుగుతుంది. వీటన్నిటికంటే ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేయించుకుంటే చాలావరకు పరిష్కారం అవుతుంది.

Friday 4 November 2016

“హ్యాండ్స్ ఫ్రీ” ఇయర్ ఫోన్లు వాడుతున్నారా... అయితే వినికిడి సమస్య వల్ల వచ్చే రుగ్మతలు తెలుసుకోండి.

బధిరత్వం అంటే?

ప్రస్తుతం ఎక్కడ ఎవరిని చూసినా చెవుల్లో ఇయర్ ఫోన్లతో కనపడుతున్నారు. పాటలతో సరదాగ ట్రాఫిచ్ లోనూ నడుచుకుంటూ, ఆఫీస్ లో పని చేసుకుంటూ ఇలా ఒక్క చోటేమిటి ప్రతి చోటా వాటిని వదల కుండా చెవుల్లొనే ఉంచుకుంటున్నరు. ఇందువల్ల ఎలక్ట్రానిక్ పరికరాల పుణ్యమా అని భారతీయ యువత వినికిడి సమస్యలను ఎదుర్కుంటున్నది. “హ్యాండ్స్ ఫ్రీ” ఇయర్ ఫోన్లు తమ వంతు పాత్రను ఇతోధికంగా పోషిస్తున్నాయి. అవేంటో మనం తెలుసుకుందామా!

బధిరత్వం అంటే వినికిడి సమస్య వల్ల వచ్చే రుగ్మతలు

బధిరత్వం మానవుని సామాజిక వర్తనానికి తీవ్రంగా ఆటంకం కలిగిస్తుంది. బాధితునిలో భావోద్వేగాలను పెంచుతుంది. వినికిడి సమస్య కారణంగా అలసట, ఆందోళన, ఒత్తిడి మరియు ఆత్మన్యూనత భావనలు సంప్రాప్తిస్తాయి.

పైన పేర్కొన్న రుగ్మతలు సమస్యను ఎదుర్కుంటున్న వారిని సామాజికంగా వెలివేసినంత పనిచేసి ఒంటరితనాన్ని మిగులుస్తాయి.



1. చురుకుదనాన్ని తగ్గించడమేకాక, వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగిస్తుంది.

2. జ్ఞాపకశక్తిపై దుష్ప్రభావాన్ని చూపి కొత్త విషయాలను నేర్చుకోవాలనుకునే సామర్థ్యాన్ని తుడిచి వేస్తాయి.

3.అంతటితో ఆగక వృత్తిలో నైపుణ్యాన్ని తగ్గిస్తుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే బధిరత్వం మనిషి ఆరోగ్యంపై చెడుప్రభావాన్ని చూపిస్తుంది.

ముందుగా గుర్తించడం ద్వారా, చికిత్సతో పుట్టకతోనే ఏర్పడే బధిరత్వాన్ని దూరం చేయవచ్చునని నిపుణులు అంటున్నారు. సరియైన వైద్యుని సంప్రదించి వినికిడిని పెంచే ఆధునిక యంత్రాల వినియోగంతో బధిరత్వాన్ని తాత్కాలికంగా దూరం చేసుకోవచ్చు. అనంతమైన సంగీతాన్ని వినిపించే ఐప్యాడ్‌లు, వీడియో గేమ్‌లు, డిస్కో పార్టీల్లో హోరెత్తించే సంగీతం తదితరాలు పట్టణ ప్రాంతాల యువతను వినికిడి సమస్యకు దగ్గర చేస్తున్నాయి. శబ్ద స్థాయిని తగ్గించుకుని సంగీతాన్ని ఆస్వాదించడం ద్వారా వినికిడి సమస్యను కొని తెచ్చుకునే ప్రమాదాన్ని దూరం చేసుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.

మీ ఆయుష్షును తెలుసుకోవచ్చు... ఇలా!

మనిషి జీవితం క్షణ భంగురమని అందరికీ తెలుసి కూడా కానీ ఈ కాస్త సమయంలోనే ఎన్నో ఆశలు కోరికలు ఇంకా ఎన్నో అయితే అసలు మనిషిలో ప్రాణం ఎంత కాలం ఉంటుందన్న దానికి సమాధానం లేదు. ఇప్పుడు ఒక సింపుల్ టెస్ట్ మన మరణ రహస్యం గుట్టు విప్పబోతోంది. మన రక్తం లోనే మన ఆయుష్ రేఖలు ఉన్నయన్న విషయం నిజమని తేలింది. అందుకే ఓ రక్త పరీక్ష మీ జీవిత కాలాన్ని లెక్క కడతానంటోంది. ఆ పరీక్ష మీ జీవన చక్రం ఎప్పుడు ఆగిపోతుందో వివరిస్తుంది.

మనిషి ఆయుష్షు ను నిర్థారించే టెలోమెరీ టెస్ట్ ఇది. మనిషి వయస్సు పెరగడానికి కారణం ఏంటి?

మనిషి దేహం ఎన్నో కణాల నిర్మాణం. మన వయసు పెరిగిందంటే మనలోని కణాల వయస్సు పెరిగినట్లే. వయసు పెరిగిందంటే టెలోమేర్స్ తగ్గిపోతున్నట్లు లెక్క. మన జీవితకాలాన్ని శాసించేవి ఈ టెలోమేర్లే. మనం ఎన్నేళ్లు బతుకుతామో వీటిని బట్టే తెలుసుకోవచ్చు. సాధారణంగా మనం ఎంతకాలం బతుకుతామో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి మనిషికీ ఉంటుంది. ఆ ఆసక్తి నుంచి పుట్టుకొచ్చిందే టెలోమేర్. అదే జరిగితే మన జీవితంలో ఇదో ముఖ్య భాగమైపోతుంది. కానీ.. సమాజానికిదో పెను ప్రమాదమని హెచ్చరించేవారూ ఉన్నారు..

టెలోమేర్ పై పరిశోధనలు

2009 నోబెల్ ఫ్రైజ్ విన్నర్ విలియం హెచ్ యాండ్రూస్ టెలోమేర్స్ మనిషి వయస్సుని ఎలా ప్రభావితం చెస్తాయో ప్రపంచానికి తెలియజెప్పారు. 20 ఏళ్లుగా మనిషి ఆయుష్షు పై ఈయన అంతులేని పరిశోధనలు చేస్తున్నారు. బోస్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కేంద్రంగా ఎన్నో వినూత్న ఆవిష్కరణలు జరిగాయి. రక్తం చూసి మనిషి ఎంత కాలం బతుకుతాడో చెప్పే పరీక్షను కనుక్కొంటున్నది ఇక్కడే. ఇందుకోసం 800 మంది సీనియర్ సిటిజన్లపై ఇక్కడ పరిశోధనలు చేశారు. 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం బతికిన వారందరినీ ఓ గ్రూప్ గా తీసుకున్నారు. వాళ్ల జన్యు పటాలను పరిశీలించారు. వాళ్ల ఆయుష్షు కు సంబంధించిన ఆనవాళ్లు రక్తంలో ఏమైనా దొరుకుతాయో వెతికారు. వాళ్ల ప్రయత్నాలు ఫలించాయి. వాటి ఫలితమే ఈ పరీక్ష.


టెలోమేర్ల క్షీణత లక్షణాలు

మనిషి శరీరంలో అంతర్భాగంలోకి వెళ్తే అంతా కణాల మయమే. అందులోని ప్రతి కణంలోనూ జీన్స్, క్రోమోజోములు ఉంటాయి. ఈ క్రోమోజోములు డీఎన్ఏలతో నిండి ఉంటాయి. క్రోమోజోములోని చివరి భాగాన్నే టెలోమేర్ అంటారు. టెలోమెర్ లు తగ్గిపోతున్న కొద్దీ, మనిషి మరణానికి దగ్గరగా వెళ్తున్నాడన్నమాట. ఈ టెలోమేర్లు కుంచించుకుపోతున్నకొద్దీ కండరాల హీనత, జ్ఞాపకశక్తి కోల్పోవడం, దృష్టి లోపం వంటి సమస్యలు మనిషి ఎదురవుతుంటాయి. టెలోమేర్లు తగ్గితే వయసు పెరిగిపోతూ ఉంటుంది.

ఆయుఃప్రమాణాన్ని నిర్ధారించే టెలోమేరీలు

అసలు ఈ టెలోమెరీలు ఎందుకు తగ్గిపోతాయి? ఇవి తగ్గిపోకుండా మనిషి తనను తాను కాపాడుకోలేడా? దీన్ని కనుగొనేందుకే యాండ్రూస్ తన బృందంతో కలిసి పరిశోధనలు చేశారు. టెలోమేర్లు ఎందుకు తగ్గిపోతాయో తెలుసుకోగలిగారు. వాటి తరుగుదలను నివారించే ప్రక్రియను కూడా కనుగొన్నారు. మనం వయస్సు పెరుగుదలను నివారించాలంటే టెలోమేర్లను కాపాడుకోవాలి. అప్పుడే మనం ఎక్కువ కాలం జీవించవచ్చు. అలాగని ఎక్కువ టెలోమేర్లు ఉన్నంత మాత్రన ఎక్కువ కాలం జీవిస్తామన్న గ్యారెంటీ కూడా లేదంటున్నారు శాస్త్రవేత్తలు.
మరణ నిర్ధారణ పరీక్ష

రోగ నిర్ధారణ కోసం ఎలా బ్లడ్ శాంపిల్స్ ఇస్తామో, మరణ నిర్థారణ పరీక్ష కూడా అలాగే చేయించుకోవచ్చు. ఈ టెస్ట్ ఖరీదు 435 పాండ్లు ఉంటుందంటున్నారు సైంటిస్టులు. సో 30 వేల రూపాయలు ఖర్చు పెడితే చాలు మన నుదుటి రాతను తెలుసుకోవచ్చన్నమాట.

డెత్ క్యాలిక్యులేటర్ మనిషికి వరమా? శాపమా?

డెత్ క్యాలిక్యులేటర్ అద్భుతం అంటున్నారు కొందరు. కాదు అనర్థం అంటున్నారు ఇంకొందరు. ఇంతకీ ఇది వరమా? శాపమా? ఇక పరీక్ష ఫలితాలు రాకముందే నిజా నిజాల పరీక్షకు నిలబడాల్సి వచ్చింది డెత్ క్యాలిక్యులేటర్. ఎందుకంటే? ఇక మనిషి పెళ్లి చేసుకోవాలంటే ఈ పరీక్ష చేయించుకోవాల్సిందేనా? ఇన్స్యూ రెన్స్ కోసం డెత్ క్యాలిక్యులేటర్ డాక్యుమెంట్ కూడా పెట్టాల్సిందే? ఓన్ అయినా, లోన్ అయినా, ఉద్యోగానికైనా ఈ పరీక్ష అవసరమా? సగటు మనిషికో కన్ ఫ్యూజన్? సామన్యునికో సవాల్? డెత్ క్యాలిక్యులేటర్ అంటే మనిషి పేరు కింద క్వాలిఫికేషన్ తో పాటు ఎక్స్ పైరీ డేట్ కూడా రాయడమే ఈ పరీక్ష అని కొందరు వాదిస్తున్నారు. పుట్టిన రోజు జరుపుకుంటున్న మనిషి, మరి ఈ డెత్ డేని ఎలా జరుపుకోవాలి? పెళ్లిళ్లు జరగాలంటే ఈ టెలోమెరీ మూలమై పోతుంది. పరీక్షలో తక్కువ ఆయుష్షు ఉందని తెలిస్తే ఏ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకుంటుంది చెప్పండి. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ సంగతీ అంతే. తక్కువ కాలం బతుకుతారని తెలిస్తే వారికి పాలసీలు ఇచ్చేందుకు ఏ కంపెనీలూ ముందుకు రావు. ఉద్యోగాలకు కూడా ఈ టెస్ట్ అవసరం అంటాయి. కార్పొరేట్ కంపెనీల్లో అల్పాయుష్షు ఉన్న వారికి ఉద్యోగం దొరకడం కూడా కష్టమై పోతుంది. అప్పుడు సమాజంలో రెండు కొత్త వర్గాలు పుట్టుకొస్తాయి. అవి దీర్ఘాయుష్సు ఉన్నవారు, అల్పాయుష్షు ఉన్నవారు. దీంతో సరికొత్త సమస్యలు ఎదురవుతాయి.

సైన్స్ సాధిస్తున్న అద్భుత విజయంగా కొంతమంది దీన్ని వర్ణిస్తున్నారు. ఎందుకంటే? భవిష్యత్తులో రాబోయే వ్యాధులేంటో ముందే తెలిస్తే, వాటికి చికిత్స ముందే తీసుకోవచ్చని కొందరు చెబుతున్నారు. జన్యు పరమైన మార్పులను జెనెటిక్ మాడిఫికేషన్ తో ఆ వ్యాధులను తప్పించుకోవచ్చని ఇంకొందరు ఆశ పడుతున్నారు. దీంతో మనిషి ఆయు ప్రమాణం మరింత పెరుగుతుందంటున్నారు. ఇదంతా మనిషి మంచి కోసమే అన్నది వీరి వాదన.

మనిషి ఆశావాదాన్ని చంపేస్తున్న నిర్ధారణ పరీక్షలు సైన్స్ కందనిదంటూ ఏదీ లేదు కానీ ఇంత జెనెరేషన్లో మార్పులోచ్చినా ఇంకా ఎన్నో కనుగొనటానికి మానవుడు ఎన్నో కష్టాలు పడుతున్నాడు. చివరికి విజయం సాధిస్తున్నాడు. అయితే తన ఆయుష్షును సైతం తెలుసుకుంటే ఇంకేం చేస్తాదో చూడాలి.

జుట్టు నల్లగా లేదని బాధపడటం సహజమే...నల్లని జుట్టుకు గృహ చిట్కాలు!

జుట్టు నల్లగా లేదని చాలా మంది బాధపడటం సహజమే. ఈ జెనరేషన్లో రకరకాల ఆహార నియమాలు పాటించటం, విశ్రాంతి లేమి ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవటంతో జుట్టు నల్లగా కాకా నిర్జీవంగా కనపడుతోంది. ఇక నల్లని జుట్టు కోసం కుర్రకారు కూడా ఎంతో టెన్షన్ పడుతున్నారంటే అతిసయోక్తి కాదేమో. ఇక స్త్రీల విషయంలో ఇది మరీ ఎక్కువగా కనపడుతోంది. నల్లని జుట్టు కోసం ఏ హెయిర్ డై వాడాలో తెలియక సతమతమవ్వాల్సిన అవసరంలేదు. మీ ఇంట్లోనే గృహ చికిత్సలు లభ్యమవుతున్నాయి. అవెంటో చూద్దామా:

1. ఒక కేజి కాచిన వెన్న (నెయ్యి)తీసుకుని, 250 గ్రాములు లిక్కరైజ్ మ్యులీసియా (దీనిని ఎక్కువగా మందులు మరియు స్వీట్స్ తయారిలో ఉపయోగిస్తారు) తీసుకుని, 1 లీటరు ఉసిరి రసం కలిపి, వేడి చేసి ఒక సీసాలో ఉంచుకోవాలి, తలస్నానం చేసే ముందు, మీ తలకు రాసుకుని, చేస్తే సులభంగా నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.


2. అరలీటరు నీరులో రెండు చెంచాల ఉసిరిపొడి కలపండి,నిమ్మకాయని సగంగా కోసి,ఒక ముక్కలోని రసాన్ని ఆ నీటిలో కలపండి,ఈ మిశ్రమాన్ని రోజూ మీ తలకు రాసుకుని తలస్నానం చేస్తే అతి తక్కువ సమయంలో, అందమైన నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.

3.కొన్ని మామిడి ఆకులు, పచ్చి మామిడి పైన పచ్చని తొక్కను తీసుకుని,వాటిని పేస్ట్ లాగా చేసి,నూనెతో కలిపి ఎండలో ఎండబెట్టాలి,ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుబ్రం చేసుకుంటే జుట్టు ఊడిపోయే సమస్య తగ్గి అందంగా సహజమైన నల్లని జుట్టు పొందవచ్చు.

4. కొన్ని మామిడి ఆకులు తీసుకుని వాటిని పేస్ట్ లాగా చేసుకుని, తలకు పట్టించాలి, 15-20 నిమిషాల తరువాత, చల్లని నీటితో శుబ్రంచేసుకుంటే, అది మీ జుట్టు పెరుగుదలకే కాక అందమైన నల్లని జుట్టుని మీ సొంతం చేస్తుంది.

5. మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చికోవాలి అనుకున్న, లేదా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రాకుండా ఉండాలన్నా మామిడి యొక్క రసాన్ని తీసుకుని తలకి పట్టిస్తే మంచి ఫలితాన్నిస్తుంది, జుట్టు రాలిపోవడం,చుండ్రు సమస్యల నుంచి కూడా మంచి విముక్తి లభిస్తుంది.

స్వీట్స్ నుండి మిమ్మల్ని నియంత్రించుకోండి... ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రాకుండా!

తీపిని ఇష్టపడని వారుండరేమో..! తీపి తినటానికి చాలామంది అష్ట కష్టాలు పడుతుంటారు. షుగర్ ఒక కార్బోహైడ్రేట్ ఇది శరీరంలో విచ్చిన్నంకాబడి మన శరీరానికి కావల్సిన ఎనర్జీని రిలీజ్ చేసే సెరోటిన్ హార్మోనులను విడుదల చేస్తుంది. మన శరీరంలో స్వీట్స్ తినాలనే కోరిక కలిగినప్పడు, అది మీశరీరంలో షుగర్ లెవల్స్ తగ్గితున్నట్లు సంకేతం. అదే మీ మిమ్మల్ని మీ ఆకలి సంతృప్తి పరచే సామర్థ్యం కలిగి ఉంది మరియు మీ శరీరానికి అవసరమైయ్యే శక్తిని అందిస్తుంది. దాంతో మీరు ఇంకా మరింత చక్కెర అల్పాహారం తీసుకోవడం కోసం మరియు ఆకలి అనుభూతికి గురిచేయవచ్చు. ఎప్పుడైతే ఈ ఆహారం రక్తప్రవాహంలో ప్రవేశించినప్పుడు బ్లడ్ షుగర్ పెరగడానికి కారణం అవుతుంది. ఇలా క్రమంగా జరగడం వల్ల మీ శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. అది రక్తం నుండి రక్తకణాల్లోనికి చేరుతుంది . ఇన్సులిన్ స్థాయి శరీరంలోని రక్తకణాలు మరింత సున్నితంగా మారి మధుమేహం మరియు గుండె జబ్బు దారితీస్తుంది .

తీపిని తినటం తగ్గించటమెలా?

తీపి మీద కోరికలను నియంత్రించడానికి ఒక ఉత్తమ పధ్ధతి తక్కువగా తినాలనుకునేవారికి చెప్పవచ్చు. ఇవి మీ తీపి రుచుల కోరికలను నియంత్రించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి



1.తీపి తినాలనుకున్నప్పుడు చాక్లెట్స్ కాని వేరే తీపివస్తువులు కానీ చాలా తక్కువగా తినాలి. మీరు నార్మల్ బ్లడ్ షుగర్ లెవల్స్ కలిగి ఉండాలని కోరుకుంటే రోజు మొత్తంలోస్నాక్స్ తినడాన్ని నియంత్రించండి . పెద్దమొత్తంలో ఏదైనా తినడం కంటే, ఒక చిన్న బిట్ తినడానికి ప్రయత్నించండి . చిన్న క్యాండీస్ ను నోట్లో వేసుకోవడం వల్ల తీపి రుచుల కోరికలను నియంత్రించవచ్చు.

2.మీ చక్కెర కోరికలను నియంత్రించడానికి , కాయలు మరియు గోధుమ బియ్యం , స్టార్చ్ కూరగాయలు , లెగ్యుమ్స్ మరియు వోట్స్ వంటి మంచి ఘీ ఆహారాలు కొన్ని తినాలి .

3. మీకు ఇప్పటికీ షుగర్ స్టఫ్ మీద కుతూహలం ఉంటే, వెనిలా సేన్టేడ్ ఉత్పత్లును స్ప్రే చేయడం లేదా టాపింగ్ గా ఉపయోగించడానికి ప్రయత్నించండి. షుగర్ కోరికలను నియంత్రించడానికి మరొక ఆసక్తికరమైన చిట్కా హెయిర్ ఫ్రెషనర్ లేదా వెనీలా సెంటెడ్ క్యాండిల్ వెలిగించడం. వెనీలా వాసన చాలా ఘాటువాసన కలిగి ఉండి మీలో షుగర్ కర్వింగ్స్ ను తగ్గిస్తుంది లేదా నియంత్రిస్తుంది.

4. మీరు వెలితిగా లేదా షుగర్ కర్వింగ్స్ కు పూర్తిగా లొంగలేనప్పుడు, ఒక చిన్న బబుల్ గమ్ ను నమలండి, చూయింగ్ గమ్ మీ ఆహారాల మీద కోరికను తగ్గిస్తుంది.

Thursday 3 November 2016

గజిబిజి జీవితంలో...బ్రేక్ ఫాస్ట్ తినకపోతే...ఫుల్ స్టాప్ అయిపోతుంది జాగ్రత్త!

గజిబిజి జీవితంలో అదీకాక బిజీ బిజీ ఉరుకులపరుగుల జీవితంలో బ్రాక్ఫాస్ట్ చేయటానికి సమయమే దొరకటం లేదు. కాని ఎట్టిపరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్ ను మానకూడదు. ఉదయం తీసుకొనే ఆహారం ఏదో ఒకటి తినాలని పెద్దలన్టుంటారు. అయితే ఎంత మంది దీనిని అనుసరిస్తారు.బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయడానికి అనేక కారణాలను వెతుకుతుంతాం. బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వల్ల మనంతట మనం మన శరీరాన్ని, ఆనారోగ్యానికి గురి అవుతాం. పెద్దలు కానీ, పిల్లలు కానీ, ముఖ్యంగా మహిళలు బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం చాలా ఇబ్బందులకు లొను అయ్యే అవకాశముంది. బ్రేక్ ఫాస్ట్ ను దాటవేస్తామో, అప్పుడు మన శరీరంలో శక్తి తగ్గిపోతుంది. జీవక్రియలు ఆలస్యం అవుతాయి. మీరు లేట్ గా నిద్రలేవడం మరియు బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం, వంటివి రొటీన్ గా ఉన్నట్లైతే సమస్యలు మీకు మొదలైనట్లే. మీరు డైట్ లో ఉన్నప్పుడు, మీరు ఖచ్చితంగా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు లాస్ట్ మీల్స్ తీసుకొన్న 7-8గంటల తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. ఆ ఏడు, ఎనిమిది గంటల్లో మీరు కోల్పోయిన ఎనర్జీని తిరిగి పొందడానికి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం.

బ్రేక్ ఫాస్ట్ ప్రాముఖ్యతను తెలుసుకుందామా

1. శరీరానికి రోజుకు సరిపడా శక్తిని పొందాలంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఉడికించిన గుడ్లను తీసుకోవచ్చ. ఎందుకంటే ఉడికించిన గుడ్లలో అత్యధికంగా ప్రోటీనులు ఉంటాయి.

2. మీరు బ్రేక్ ఫాస్ట్ ను పక్కనపెట్టినప్పుడు నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది మరియు నీరసంగా ఉంటారు?అయితే, ఎప్పుడైతే మీరు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారో అప్పుడు తేడా ఉంటుంది.



3. బ్రేక్ ఫాస్ట్ వెయింట్ లాస్ ప్రోగ్రామ్ ను అటకాయిస్తుంది. బరువు తగ్గాలనుకొనే వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఓట్స్ ను తీసుకోవడం ఆరోగ్యకరం మరియు బరువు తగ్గిస్తుంది.

4. బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయకూడదన్నడానికి మరో ముఖ్య కారణం మధుమేమం. బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయడం వల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ హఠాత్తుగా పెరుగుతుంది. కాబట్టి, ఈ సమస్యలన్నింటిని నివారించడానికి ఒక ఆరోగ్యకరమైన మీల్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు.

5. మీకు గుడ్లు అంటే ఇష్టమైతే, మీరు మీ రక్తపోటును ట్రాక్ చేయాలి. హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారి సమస్యను నివారించడానికి గుడ్డులోని తెల్లని పదార్థం అద్భుతంగా సహాయపడుతుంది.

6. శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె . రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత రోగాలను దూరంగా ఉంచే న్యూట్రీషియన్స్ మరియు ఎనర్జీని మీ గుండెకు అంధిస్తాయి.

7. హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల, తరచూ మనస్సు మారడాన్ని నిరోధిస్తుంది. కాబట్టి, మూడ్ స్వింగ్స్ నివారించడానికి రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులంటున్నారు.

ముఖం పై ముడుతలు రాకుండా ఉండాలంటే...?

వయసు పెరిగేకొద్దీ మన చర్మం ముదుతలు పడటం సహజం. డార్క్ సర్కిల్స్,ఫైన్ లైన్లు వంటి వాటికీ కూడా ముఖ్య కారణం ఇదే అవుతుంది. ముడుతలు,కర్లింగ్ చర్మం మరియు ఫైన్ లైన్లు తగ్గించేందుకు అనేక క్రీములు ఉన్నాయి. ఏ చర్మ రకానికి అయిన రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు సమర్థవంతమైనవి కాదు. ఎందుకంటే అంటువ్యాధులు,దద్దుర్లు మరియు మచ్చల వంటి ప్రతికూల ప్రభావాలకు కారణం కావచ్చు. ముడుతలు మరియు వయస్సు మీద పడిన ఇతర చిహ్నాల కొరకు ఇంట్లో తయారు చేసిన క్రీములు ఉపయోగించటం అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇంట్లో తయారుచేసే క్రీములు సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి తయారుచేయుట వలన ఏ విధంగానూ హానికరం కాదు. అవి శాశ్వత ప్రభావం కలిగి ఉంటాయి. ఏ చర్మ రకానికి అయిన ముడుతల కొరకు సహజమైన మరియు ఇంట్లో తయారుచేసే క్రీములు అందుబాటులో ఉన్నాయి.

1. గుడ్డులో చర్మం బిగించి, ముడుతలను తగ్గించే బోయోటిన్,ప్రోటీన్లు మరియు విటమిన్లు వంటివి ఉన్నాయి. పచ్చసొన యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. క్రీమ్ చర్మంను మృదువుగా మరియు ప్రకాశవంతమైన తయారుచేస్తుంది. ఈ మాస్క్ తయారుచేయటానికి ఒక గుడ్డును అర కప్పు క్రీమ్ లో కలపాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించండి. మాస్క్ వేసుకొని 15 నిమిషాలు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ క్రమంగా ఉపయోగిస్తే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

2. అరటిపండు మరియు క్యారట్ మాస్క్ ఇది బాగా పని చేసే ప్యాక్. చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. అరటిపండు మరియు క్యారట్ రెండు కూడా చర్మంను బిగించి ముడుతలను తగ్గించేందుకు అవసరమైన ఖనిజాలను కలిగి ఉన్నాయి. ఈ ప్యాక్ తయారుచేయటానికి ఒక అరటిపండు మరియు ఒక క్యారట్ ను తీసుకోని పేస్ట్ గా చేయాలి. బాగా కలిపి ముఖం మీద రాయాలి. ఈ మాస్క్ ను 15 నిమిషాలు ఉంచి తర్వాత వెచ్చని నీటితో కడగాలి.



3. రోజ్ వాటర్తో చర్మం శుబ్రం చేసుకుంటే చర్మం మీద మలినాలు మరియు ధూళి ఎక్కువగా ఉండుట వలన ముడుతలు మరియు ఫైన్ లైన్లు వస్తాయి. ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు రోజ్ వాటర్ తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ చర్మం పునరుత్పత్తి మరియు కళ్ళు కింద వాపు మరియు డార్క్ సర్కిల్స్ వంటి వాటిని తగ్గిస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకోని రోజ్ వాటర్ లో ముంచి వలయాకార కదలికలతో ముఖాన్ని శుభ్రం చేయాలి. మర్దన చేయుట వలన చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది.

4. బంగాళాదుంప అద్భుతమైన బ్లీచింగ్ మరియు యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. ప్రతి రోజు మీ ముఖాన్ని బంగాళాదుంప స్క్రబ్ తో శుభ్రం చేస్తే చర్మం లేత గోధుమ రంగులోకి మారటం తగ్గుట,ముడుతలు మరియు ఫైన్ లైన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. ఒక బంగాళదుంప గుజ్జు మరియు దానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించి, ముఖం మీద రాసి 5-10 నిమిషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. మంచి ఫలితాలోస్తాయి.

5. పెరుగు చర్మం కణజాలాలు,కణాల రిపేరు మరియు పునర్నిర్మాణానికి అవసరమైన విటమిన్లు కలిగి ఉంటుంది. పెరుగును రోజూ తింటే చర్మం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగు మాస్క్ తయారుచేయటానికి ఒక కప్పు పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. నిమ్మరసం ముఖాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే పెరుగు ముడుతలను తగ్గిస్తుంది. ఈ ప్యాక్ వేసుకొని 20 నిమిషాలు ఉంచండి. తర్వాత వెచ్చని నీటితో కడగాలి.