Friday 21 October 2016

ముఖంపై అవాంచిత రోమాలను తొలగించేందుకు తగిన సహజసిద్ధ గృహ నివారణలు

స్త్రీ ముఖం అనగానే గుర్తొచ్చేది అందం. చంద్రునిపై మచ్చల్లా ఆ అందానికి అవాంచిత రోమాలు తోడైతే ఆడవారి బాధ వర్ణాతీతం.చాలమంది స్త్రీలు ముఖంపై అవాంచిత రోమాలు ఏర్పడటం వల్ల బాధపడుతుంటారు.చక్కని ముఖంపై అవాంచిత రోమాలు ఏర్పడటం వల్ల సహించలేని విధంగా ముఖం తయారవుతుంది.ఈ సమస్య స్త్రీలు ఎదుర్కొనే సమస్యల్లో ముఖ్యమైనది.అయితే అవాంచిత రోమాలు చిన్నగా ప్రారంభమై కొన్ని సమయాల్లో అకస్మాత్తుగా అత్యంత వృద్ది చెందుతాయి.దీనినే హిర్స్యుటిస్మ్ అని అంటారు.అంటే ఈస్త్రొజెన్ హార్మోనుల అసమతుల్యత వల్ల కారణంగా ఈ అవాంచిత రోమాల స్థాయి పెరుగుతుంది.హిర్స్యుటిస్మ్ సమస్య దీర్ఘకాలికమైనదే అయిన వాక్స్ చేయించతం వల్లో తొలగించటం వల్లనో చికిత్సలు తీసుకోవటం వల్లనో తగ్గకపోగా సమస్య మరింతగా పెరిగే అవకాశముంది.ఈ సమస్య నుంచి తాత్కాలికంగా బయటపడేందుకు ఇంటిలోనే నివారణ మార్గాలు కొన్నింటిని మీకోసం:

పసుపు: భారతీయ సంస్కృతిలో పెద్దపీట వేయబడిన పసుపు ప్రతి ఇంటిలోను దొరికే వనమూలిక.అన్నింటా వాడబడే ఈ పసుపు సౌందర్య రహస్యానికి కూడా పని చేస్తుంది.పూర్వం పసుపును చర్మం సున్నితంగా ఉండేందుకు పెంపొందించేందుకు ప్రతిరక్షకం.దీనివల్ల మేని ఛాయ వృద్ది చెంది అవాంచిత రోమలను పోగొడుతుంది.

శనగపిండి:భారతీయ సంప్రదాయ పారంపర్యంగా ఎన్నో ఏల్ల నుంచి ఇంటిలో వాదే ఫేస్ మాస్క్ గా వాడబడుతోంది.మృత చర్మం మళ్ళీ ప్రకాశవంతంగా తయారయ్యేల ఇది వృద్ది చేస్తుంది.శనగపిండిని పసుపుతో కలిపి వాడటం వల్ల ఇతర ఫేషియల్స్ కంటే మంచి పలితానిస్తుంది.సహజసిద్దమైన నివారణా మార్గాలు ఎటువంటి దుష్ప్రభావలను ఇవ్వదని అందరికీ తెలిసిన విషయమే.కాబట్టి ఇలా శెనగపిండి,పసుపు వాడటం వల్ల పెరుగుదలను నియంత్రించవచ్చు.

చక్కెర మిశ్రమం ఇది ఇంటిలో ఉపయోగించే ఫెస్వాక్స్.ఏది ఏమైన ఈ ప్రక్రియ చాల మంచి ఫలితాలనే ఇస్తుంది.కాని కొంచెం దీని వల్ల చర్మం ఒత్తిడికి గురవుతుంది.ఎందుకంటే చక్కెర మిశ్రమంలో నిమ్మ,తేనె కలపటం వల్ల కొంచెం నొప్పిని కలిగిస్తుంది.నిమ్మను,తేనెను,చక్కెర మిశ్రమాన్ని ముఖనికి రాయాలి.మామూలు వ్యాక్స్ ప్రక్రియనవలంబించి గుడ్డ సాయంతో తొలగించాలి.

గ్రుడ్డు మాస్క్ : కోది గ్రిడ్డులోని తెల్ల సొనను,ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్నను కలపాలి.ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖంపై ఆరనివ్వాలి.అవాంచిత రోమాలను కూడా తేలికగా తొలగించవచ్చు.ఈ నివారణా మార్గం చాలా సులువు.ఎందుకంతే ఇందుల కలిపే దినుసులు అన్ని చోట్లా దొరకటం వల్ల ఇది చాలా ప్రభావవంతమైనది.అంతేకాక మంచి ఫలితాలనిస్తుంది.
ఆహారంలో పైటోఈస్ట్రొజన్స్ ఉందేల చూసుకుంటే:
అవాంచిత రోమాల నివారణకు మంచి ఆహారం ఎంతో అవసరం.ఈ సమస్య హార్మోనుల లోపం వల్ల కలుగుతుంది.అయితే ఆహారపు అలవాట్లు నిర్లక్షం కారణంగా కూడా ఇది సంభవిస్తుంది.హార్మోన్ల అసమతుల్యత కేవలం పైటోఈస్ట్రొజన్ లోపం వల్ల సంభవిస్తోందని నిపుణులు చెబుతున్నారు.అవిశ గింజలు,సోపు,ఆల్ఫాల్ఫా(రజిక)గోటుకు(ఉత్త్రభారతదేశంలో బ్రహ్మి)పైటో ఈస్ట్రోజన్స్ పెరుగుదలకు తోడ్పడతాయి.హిర్స్యుటిస్మ్ తగ్గేందుకు మనం తీసుకునే ఆహారం ప్రముఖ పాత్రను పోషిస్తుంది.

Hair growth tips in Telugu. Hair loss control tips in Telugu



జుట్టు రాలడం ఎక్కువైదా…? మీ జుట్టు అందంగా పొడువుగా, బలంగా లేదని బాధపడుతున్నరా……..? బ్యుటిపార్లకి వెల్లె సమయం లేదా………….? జుట్టును అసలు పట్టించుకోవడం లేదా…..? చుండ్రు సమ్యస…? వీటన్నిటికి మన ఇంటిలోనె అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయెగించి, చుండ్రు నుండి నివారణ పొందటానికి, బలమైన, దృఢమైన జుట్టును మీ సొంతం చేసుకోవడానికి చిట్కాలు ఎంటో……తెలుసుకుందామా……. మీ జుట్టు పొడవుగా, దృఢంగా, నిగ నిగ లాడుతు ఉండడానికి సూత్రాలు
వారానికి తప్పనిసరి:- కోడిగుడ్డులో తెల్లని సొనను మత్రమే జుట్టుకు బాగ పట్టించి 20 నిమిషములు తర్వతా షాంపూతో వాష్ చెయ్యండి వారంలో కనీసం ఒకసారి అయీన మీ జుట్టుకు ఈ పాక్ వెసుకొనిన యెడల ఎప్పుడు నిగ నిగ లడే జుట్టున్ని మీ సొంతం చెసుకోవచ్చూ.
పొడవాటి నిగ నిగ లాడే జుట్టు మీ సొంతం:-ఒక అరటిపండు గుజ్జులో ఒక కోడి గుడ్డు ను మూడు స్పూన్ ల పాలు మరియు మూడు స్పూన్ ల తేనె ను వేసి బాగ కలపండి, కలిపిన దాన్ని జుట్టు కి బాగా పట్టించండి. 30 నిమిషములు తర్వతా షాంపూతో వాష్ చెయ్యండి ఇలా వారంలో కనీసం రెండు సార్లు చెసి, పొడవాటి నిగ నిగ లడే జుట్టున్ని మీ సొంతం చెసుకోండి.
రెండు కోడి గుడ్లు మరియు ఐదు స్పూన్ ల ఆలీవ్ అయిల్ ఒక గిన్నె లొ వెసి బాగ కలిపిన మిస్రమ్మాన్ని జుట్టు కి బాగా పట్టించి 30 నిమిషములు తర్వతా షాంపూతో వాష్ చెయ్యాలి.
కోడి గుడ్డు- నిమ్మ రసంతో చుండ్రు నివారణ-మేరిసె జుట్టు:- ఒక కోడి గుడ్డు మెత్తంను మరియు ఒక నిమ్మకాయ రసంను బాగా కలపండి తరువాత దాన్ని జుట్టుకు బాగా పట్టించి 20 నిమిషములు తరువాత షాంపూతో వాష్ చేస్తె చుండ్రు నివారణ మరియు మేరిసె జుట్టు మీ సొంతం.
దృఢమైన పొడువాటి జుట్టు:- ఒక గిన్నెలో మూడు కప్పుల మెహంది పౌడర్, 1/4 స్పూన్ ఉప్పు, Daber Amla Hair Oli ఒక కప్పు ఐదు స్పూన్ల తేనె,ఒక కప్పు టీ పౌడర్, రెండు కోడి గుడ్లు మొత్తంను బాగా కలిపి జుట్టుకి బాగా పట్టించి ఒక గంట తరువాత షాంపూతో వాష్ చెయ్యాలి అలా కనీసం నెలకి ఒకసారి చేస్తె మీ జుట్టు బలంగా, పొడవుగా, దృఢంగా మరియు తొందరగా పెరిగే అవకాశం ఉంది.
జుట్టు రాలకుండ-నివారణ:- ఉసిరి రసం(Amla Juice) లో మూడు స్పూన్ల నిమ్మ రసంను కలిపి జుట్టు కుదుళ్ల భాగంలో బాగా పట్టించి 30 నిమిషములు తర్వతా నీటితో శుభ్రం చెయ్యాలి ఇలా వారంలో కనీసం రెండు సార్లు చెస్తె మీ జుట్టు రాలకుండా ఉంటుంది.

‘పెరుగు ‘ వల్ల మీ ఆరోగ్యం పెరుగు


రాను రానూ పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలని ఇస్టపడుతున్న యువత ఆహారపు అలవాట్లకు కూడా పాశ్చాత్య ఆహార విధానాలనే ఇస్టపడుతున్నారు.చైనీస్,వెస్ట్రన్ దిషస్ నే ఇస్టపడుతున్నారు.మన భారతీయ ఆహారం లో ప్రముఖ పాత్రని పోషించే పెరుగు అనగానే యువత అమ్మో పెరుగా.. అని దూరం పారిపోతున్నారు.పొట్టకు మేలు చేసే ఈ పెరుగు గురిచి ఈ కాలం లో తెలుసుకుందాం.


మనకుండే విపరీత అలవాట్ల వల్ల మనమెన్నో ఇబ్బందులు పడుతుంటాం.జిహ్వ చాపల్యమే దీనికి కారణం.రకరకాల రుచుల కోసం కొందరు ఇస్టం వచినట్లు తింటుంటారు.ఈ అలవాటు వల్ల దాదాపు 40 శాతం మంది ఇర్రిటబుల్ బోవెన్ సిండ్రోం తో బాధపడుతున్నారని నిపుణుల అంచనా.ఈ సమస్య వల్ల విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది.పెరుగులో శరీరానికి మేలు చేసే లాక్టోబసిల్లస్ అడిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ అనే మేలు చేసే బ్యాక్టీరియా ఉందని నిపుణులు చెబుతున్నారు.ఉదర ఉబ్బరాని,కదుపు నొప్పిని తగ్గిచేందుకు ఈ బ్యాక్టీరియా కీలక పాత్రను వహిస్తుంది.ప్రతి రోజూ ఒక కప్పుకు తగ్గకుండా పెరుగు తినతం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది

సౌందర్యానికి ‘మందారం’


నేటి ప్రపంచంలో అదీ ఈ యాంత్రిక జీవనంలో ఆహారానికి పెడుతున్న ఖర్చు కంటే సౌందర్యానికి పెడుతున్న ఖర్చు అంతా ఇంతా కాదు.ఇక కేశ సమ్రక్షణ కోసం మరింత ఖర్చే పెడుతున్నారు.అయితే సౌందర్యాన్ని కాపాదుకునేందుకు,పోషణకు మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులున్నప్పటికీ సహజంగా లభించేవాటిలో సౌందర్య పరిరక్షణ చేసుకోవడం సులువే కాక ఖర్చు తక్కువ కూడా.


అలాంటి కోవకు చెందిన వాటిలో ఎంతో మేలైనది మందారం.మందారం ఉపయోగలను తెలుసుకుందమా..
మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌదర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పడతాయి.ఈ మొక్క నుంచి నూనె తీస్తారు.మందార నూనెతో తలవెంట్రుకలను పరిరక్షించుకోవటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.మందార నూనెలో తేమ ఉంటుంది కనుక చర్మానికి, కేశాలకు మృదువుగా ఉందేందుకు తోడ్పడుతుంది.మందార నూనె కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలు మరింతగా మెరిసి అందానీ, మెరుపుని ఇస్తుంది.ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు నివారించవచ్చు.జుట్టు రాలటం తగ్గతమే కాకుందా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కేశాలు తెల్లబడకుండా ఉందేందుకు ఉపకరిస్తుంది.అంతేకాక దృఢంగా ఉండేందుకు మెరుపుతో ఉందేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది.కేశాలకు వృధప్య చాయలు దరి చేరకుండ చూస్తుంది.చర్మం నునుపుగ ఉండెల చూస్తుంది.చర్మం లో మృత కణజాలం లేకుండా చూస్తుంది.స్నానానికి వెల్లేముందు మందార నూనె నీటిలో వేయటం వల్ల శరీరం అందంగా ఉండటమేకాక సుగంధభరితంగా ఉంటుంది.పాదాల సంరక్షణలోనూ తన ఉనికి కాపాడుకుంతోంది.పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ ఇస్తే మంచి ఫలితాలొస్తాయి.అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేమంటే మందారం అన్నిచోత్ల విరివిగా దొరకుతుంది.

Thursday 20 October 2016

గ్యాస్ ప్రోబ్లమా? – Telugu tips for gastric trouble – stomach gas problem solution in Telugu

మీరు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నప్పుడు కానీ,లిఫ్త్ లో ఇతరులతో నిలబడినప్పుడు కానీ, పక్కవారితో గడిపే సమయంలో కానీ మీరు గ్యాస్ విడుదల చేయాల్సివస్తే కలిగే ఇబ్బంది వర్ణనాతీతమే కదా…అన్నిటికంటే ఇప్పుడున్నా ఉరుకుల పరుగుల జీవితంలో ఈ ఉదరంలో గ్యాస్, పొట్ట ఉబ్బరింపు అన్ని వయస్సుల వారినీ పీడిస్తొంది.పేగుల్లో తయారయ్యే గ్యాస్ ప్ర్మాదం కలిగించదు కానీ మహా ఇబ్బందిని కలిగిస్తుంది.ప్రతివారిలోనూ గ్యాస్ తయరవుతూనే ఉంటుంది.సాధారణ వ్యక్తుల్లో మామూలు పరిస్థితుల్లో రోజుకు కనీసం 10 సార్లు గ్యాస్ విడుదల చేస్తూ ఉంటారు.కొంతమందిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంతుంది.కొన్ని సమయాల్లో ప్రేగుల్లో తయారయ్యే గ్యాస్ బయటకు వెళ్ళకుండా లోపలే బంధింపబడి తీవ్ర స్థాయిలో కదుపులో నొప్పి వస్తుంది.మల బధకం,విరోచనాలు వంటి సంస్యలను కలిగించే కారణాల వల్ల అదనంగా గ్యాస్ తయారవ్వటమే కాకుండా నొప్పిని కూడా కలిగిస్తుంది.గ్యాస్ అనేది సహజమైన ప్రక్రియ కనుక దాని అడ్డుకోలేనప్పటికీ కొన్నీ గృహ చికిత్సల ద్వారా, ఆహార వ్యవహారాల్లో మార్పులూ చేర్పుల ద్వారా గ్యాస్ సమస్యను తీర్చుకోవచ్చు.

గ్యాస్ సమస్య కలిగిన వారికీ సంకల్పితంగా కాని, అసంకల్పితంగా కానీ గ్యాస్ విడుదల అవుతుంది.గ్యాస్ వల్ల కడుపులో తీవ్రంగ నొప్పిగా ఉంటుంది.ఏదో ప్రమాదకరమైన సమయ ఉందా అన్నంత సందిగ్ధానికి గురిచేస్తుది.ఉదరంలో గ్యాస్ నొప్పి వస్తుంతే ఎదమవైపు అది కేంద్రీక్రుతమైతే గుందె నొప్పేమో అన్నంత బ్రమను కలిగిస్తుంది.అదే కుడివైపు ఈ నొప్పి వస్తే ఎపైండిసైటస్ గా గానీ గాల్ స్టోన్ నొప్పిగా గానీ బ్రమకలుగుతుంది.అయితే ప్రతీ వారు ఎదుర్కొనే ఈ గ్యాస్ సమస్యకు గృహ చికిత్సలను మా పాఠకుల కోసం ఈ కాలం లో అందిస్తున్నాం.


వామును దోరగా వేయించి,పొడి చేసుకుని పావు చెంచాడు మోతాదుగా వేడి అన్నంల్లో, మొదటి ముద్దతో కలిపి వాడితే పొట్ట ఉబ్బరింపు బాధించదు.

జీలకర్ర 2 భాగాలు,సొంఠి 4 భాగాలు,ఉప్పు 1 భాగం వీటన్నింటినీ మెత్తగా నూరి,నిష్పత్తి ప్రకారం కలిపి సీసా లో నిల్వ చేసుకోవాలి.పొట్ట ఉబ్బరించినప్పుడు ఈ మిస్రమాన్ని అర చెంచాడు మొతాదుగా వీడినీళ్ళతో కలిపి సేవించాలి.

ఇంగువను దోరగా వేయించి, పొడి చేసుకుని పావు చెంచాడు మోతాదుగా వేడి వేడి అన్నం అన్నంతో, మొదటి ముద్దతో కలిపి తినాలి.

ఆకలి లేకపోవటం వల్లపొట్ట ఉబ్బరిస్తుంటే జీలకర్రను దోరగావేయించి, పొడి చేసి అరచెంచాడు నుంచి చెంచాడు మొతాదుగా భోఅజనానికి ముందు అరకప్పు వేడి నీళ్ళలో కలిపి తాగాలి.

వాము, అల్లం, జీలకర్రను సమాన భాగాలుగా తీసుకుని సైంధవ లవణంగా కలిపి నూరి ఉదయం సాయంకాలం సేవించాలి.

నిత్యం కడుపు ఉబ్బరంతో బాధపడేవారు అను నిత్యం భోజనానికి ముందు రెండు మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకుని తింటుండాలి.

ఉదరకండరాల మీద టర్పంటైన్ ఆయిల్ ని వేడి చేసి ప్రయోగించి ఉప్పు మూటతో కాపడం పెట్టుకోవాలి.

అయితే ఎన్ని గృహ చికిత్సలను చేసిన బయత చికిత్స పొందిన ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే ఈ సమస్యకు విరుగుడు మాత్రం దొరికే అవకాశంలేదు.జీవన విధానంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను కొన్ని మీ కోసం:


ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో తినాలి అదీ ఎక్కువ సార్లు తీసుకోవాలి.ఆహారాన్ని నెమ్మదిగా తినాలి.
ఆహారాన్ని బాగా నమిలి తినాలి. మింగరాదు. ఒకవేళ సమయం కుదరదు అంటె స్పూన్ తో తినాలి.
బబుల్ గమ్మ్ నమలటం, గట్టి కాండీలు తినటం చప్పరించటం, స్ట్రాతో తాగటం మానేయాలి.
పొగత్రాగటం మానేయాలి, ఎందుకంటే సిగరెట్ తాగే సమయంలో పొగతో పాటు జీర్ణావయవాల్లోని మ్యూకస్ పొరలను రేగేలా చేసి గ్యాస్ ని కలిగిస్తుంది.

మెరుగైన కళ్ళ కోసం 10 చిట్కాలు.

నేడు చాలా వరకూ కంప్యూటర్ వాడేవారున్నారు. గంటల తరబడి కంప్యూటర్ ముందుండటం వల్ల అలసట ఏర్పడి వారి కళ్ళు ఇబ్బందులకు గురవుతాయి.కళ్ళు అలసటకు గురైనప్పుడు కళ్ళ క్రింద నల్లని వలయాలు ఏర్పడటం,విపరీతమైన తలనొప్పి రావటం జరుగుతుంది.యువతకు ఓ వైపు చదువు భారంగా తయారైంది.ఏ ప్రాజెక్ట్ చేయాలన్న వారు కంప్యూటర్ పైనే గంటల తరబడి గడపల్సి వస్తోంది.ఇంతేకాక జాబ్స్ లోనూ కంప్యూటర్ ముఖ్యమైన పాత్రను పోషించటం వల్ల గంటల తరబడి దృష్టిని కేంద్రీకరించటం వల్ల ఒత్తిడికి లోనై కళ్ళ క్రింద నల్లని వలయాలు,,కళ్ళు జీవం లెకుండాపోవటం జరుగుతోంది.శారీరికంగా, మానసికంగా అలసట, ఒత్తిడికి గురవుతున్నరు.కళ్ళకు సంబంధించిన నరాలు విపరీతమైన ఒత్తిదికి లోనై వారిని అసహనానికి గురిచేస్తుంది.అంతేకాక ఈ నరాలకు ఒత్తిడి కలిగినప్పుడు తీవ్రమైన తలనొప్పి మొదలవుతుంది.అంతేకాకుండా కళ్ళు మండటం,కళ్ళు పొడిబారిపోవటం, కంతి నుంచీ నీరు రావటం, బూదరగా కనిపించటం, మెద,భుజాలు నొప్పులు రావటం జరుగుతుంది.ఇకనైన ఆలస్యం చేయకుండా అలసిపోయిన మీ కళ్ళకు జాగ్రత్తలు తీసుకొండి.కళ్ళకు విశ్రాంతి ఇవ్వటం వల్ల నేటి నుంచీ మీరు ఆహ్లాదంగా ఉండగలరు.

ఈ సమస్యను అధిగమించేందుకు పది చిట్కాలను తెలుసుకుందాం.



మొదట మీరు పని చేసే స్థానానికి మార్పులు చేయండి.అంతేకాక కుర్చీని వీలుగా సరైన ఎత్తులో అమర్చండి.

కంప్యూటర్ స్క్రీన్ ,బ్రైట్నెస్ ,కాంట్రాస్టులను సరిచేయాలి.బాక్ గ్రౌండ్,స్క్రీన్ పదాలకు కాంట్రాస్ట్ ను సరిచేయాలి.

గ్లార్ ను తగ్గించాలి.కిటికి నుంచీ కాస్త వెలుతురు వచేలా చూసుకోవాలి.రంగులు గుర్థించలేనంతగా కాక సూర్య కాంతి వచ్చేలా చూసుకోవాలి.

అంతేకాక కొట్టొచిన్నట్లు కనిపించే గ్లార్ ను తగ్గించేందుకు యాంటి గ్లార్ ను కంప్యూటర్ కు అమర్చాలి.

చిన్న చిన్న విరామాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది.

కంప్యూటర్ పూర్థి స్థాయిలో వాడేవారు గంటకోసారి పది నిముషాలు విరామం ఖచ్చితంగా తీసుకోవాలి

అందమైన మీ పెదవుల కోసం సంరక్షణ మార్గాలు



అందమైన స్త్రీలలో, మరింత అందమైనవి వారి పెదవులు,రకరకాల కారణముల వల్ల స్త్రీలు వారి పెదవుల విషయంలో ఎంతో ఇబ్బందికి గురి అవుతున్నారు.అయితే కారణం ఏదైననూ వారి అందమైన పెదవులు రంగు మారి నల్లగా అవ్వడం,వారికి ఇబ్బందిని కలిగిస్తుంది.ఈ ఇబ్బందిని తొలగించి, వారి పెదవుల సం రక్షణకై కొన్ని చిట్కాలు చుసేద్దామా:

బాదం ఆయిల్:

మీరు మర్కెట్లోకి వెళ్ళితే మీ పెదవుల్న్ని కాపాడుకోవడానికి ఎన్నో రకముల “లిప్ కేర్”, “లిప్ బాం”లు దొరుకుతాయి, అయితే పూర్తిగా వాటి మీద ఆదారపడితే ప్రయోజనం ఉండకపోగా, కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువ, అందుకే మీ ఇంట్లోనే ఎంతో సహజమైన,సులభంగా తయారుచేసుకునే చిట్కా ఇదిగో.బాదం ఆయిల్ని మీ పెదాలకు పట్టించాలి, ఇలా రోజు చేస్తూ ఉంటే, మీ పెదాలు నల్ల రంగుని వదిలేసి అందంగా మారతాయి.

కీరా దోసకాయ:

మీ చర్మ సౌందర్యాన్ని, పెదవుల అందాన్ని, కాపాడడంలో “కీరా దోసకాయ” ఎంతో ప్రత్యేకం, ఐతే దీని వల్ల మీ పెదవులే కాకుండా మీ శరీరంలోని పాదాలు, చేతుల కింద నల్లని మచ్చలు,ఇలా నల్లబడిన ప్రదేశాలన్నీ బాగు చేసుకోవచ్చు.మీ పెదవుల సం రక్షణకై దీని రసాన్ని తీసి రాయండి,ఇలా రోజూ చేస్తే ఇది మీ పెదవుల పై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.




పచ్చి పాలు:

మీ పెదవుల్న్ని కాపాడుకోవడానికి చర్మాన్ని అందంగా ఉంచ్చుకోవడానికి, ఈ పద్దతి బాగా ఉపయోగపడుతుంది, మీరు చేయవలసిందల్లా కొంచెం పచ్చి పాలు తీసుకుని “Cotton” తో కాని, లేదా ఎదైన పొడి గుడ్డతో కాని మీ పెదవుల్ని తుడవండి.పచ్చి పాల ప్రభావంతో మీ పెదవుల చర్మంలోని చనిపోయిన కణాలు తొలగి పోయి, అందమైన కాంతివంతమైన పెదాలు మీకు లబిస్తాయి.

ఫ్రూట్ జ్యూస్:

ఫ్రూట్ జ్యూస్ లు ఎక్కువగా తీసుకోవడం వల్ల,అందులో కెమికల్ “P” వల్ల మీ చర్మంలోని కణాలు శుబ్రపడతాయి, అంతే కాకుండా మీ వ్రుదా చర్మ కణాలని తొలగిస్తాయి.

తేనె,పెరుగు, నిమ్మరసం, ఈ 3 మిశ్రమాలని కలిపి మీ పెదవలకు పట్టించి, ఒక గంట తరువాత మెల్లగా కడగండి, ఇలా చేస్తూ ఉంటే మీ ఎదవులు అందంగా మారతాయి.

వెన్న:

మీ పెదవుల అందం కోసం ఎంతో డబ్బులు ఖర్చు చేసి, తిరిగి ఇబ్బందులు పడే కన్న మీ ఇంట్లొనే మీ ఫ్రిజ్ లో ఉన్న వెన్నను కొంచెం తీసి రోజూ మీ పెదాలకు పట్టించి, ఎలా 2-3 వారాలు చేస్తే అందమైన పెదవులు మీ సొంతం అవుతాయి.

మీ ఆరోగ్యం-పవిత్రమైన “తులసి”తోనే సాద్యం


మానవుని ఆరోగ్యం కోసం,అందం కోసం, చర్మ సౌందర్యం కోసం ఎన్నో సహజ పద్దతులు ఉన్నాయి, అందులో తులసి ఎంతో ప్రముఖమైనది, గత 5000 సంవత్సరాలుగా సహజ పద్దతులలో మీ ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో తులసి ఎంతో ఉపయోగపడింది.ఎన్నో అద్భుతాలకు కారణం అయినది, అందుకే “తులసి”ని అందరూ “మూలికల రాణీ” అని వర్ణిస్తారు.దీనిని మందుల తయారిలో, ఎన్నో చికిత్సలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.ఇది మన యొక్క మానసిక స్తితి పై మంచి ప్రభావాన్ని చూపించి, మంచి ఫలితాలను ఇస్తుంది.
ఎందరో ఈ తులసిని ఆయుర్వేదంలో “దోష నివారిణీగా” గుర్తించ్చారు,అంతే కాకుండా మంచి ఆరోగ్యం కోసం ఎంతో మంది దీని పచ్చి ఆకుల్ని నములుతారు.
తులసి వల్ల మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందామ :
1.దగ్గు మరియు శ్వాసకోశ సమస్యలు:
మీరు జలుబు,దగ్గు,శ్వాసకి సంబందించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే తులసితో మంచి ఫలితాలు పొందవచ్చు.తులసి లోని ఔషధ లక్షణాల మిమ్మల్ని ఈ సమస్యల నుండి విముక్తుల్ని చేస్తుంది.అంతే కాకుండా ఇది ఉపయోగించడం వల్ల జ్వరము,తుమ్ములు, మరియు వైరల్ నుండి మంచి విముక్తు లబిస్తుంది.


ఒక వేళ మీకు జలుబు చేస్తే కొంచెం తులసి ఆకులు, లవంగాలు, కొంచెం ఉప్పు కలిపి తీసుకుంటే, అన్నిటి నుండి మంచి ఉపసమనం కలుగుతుంది. ఆస్త్మా మరియు జలుబు నివారణకు మంచి ఔషదం.
2. కిడ్నీలో రాళ్ళ సమస్య :
మీ కిడ్నీలో రాళ్ళు ఉంటే కొంచెం తులసి రసంలో, తేనె కలిపి తీసుకోండి, మీ కిడ్నీలో రాళ్ళ కరిగిపోయి మంచి ఫలితాలు లబిస్తాయి.
3. గుండె జబ్బులు:
మీ గుండె సమస్యల్లో, మరియు, స్ట్రోక్ రాకుండా కాపాడడంలో తులసి ఎంతగానో ఉపయోగ పడుతుంది.
దీనిలో ఉన్న”విటమిన్ C” మీ గుండె జబ్బులని నయం చేసి, ఏ విదమైన ఇబ్బందులు కలగకుండా కాపాడుతుంది.
4.మీ గొంతు కోసం:
మీ గొంతు సమస్యలకు కూడ ఎంతో ఉపయోగపడుతుంది, జలుబు చేసి మీ గొంతు మూగబోయిన,ఎంతో ఇబ్బందిగా అనిపిస్తున్నా కొంచెం నీరు తీసుకుని అందులో తులసి ఆకులు వేసి మరిగించి ఆ నీటిని తాగితే మీ గొంతు ఏ సమస్యలు లేకుండా మంచిగా మారుతుంది.
5.పళ్ళ సమస్యలు :
ఇది మీ పళ్ళ సమస్యల్లో ఎంతగానో ఉపయోగ పడుతుంది, దీనిని మీ పళ్ళు శుబ్రపరుచుకోవడానికి ఉపయోగిస్తారు.
6. పిల్లల సమస్యలు:
తులసి చిన్న పిల్లలు యొక్క ఆరోగ్య సమస్యలలో ఎంతగానో ఉపయోగపడుతుంది, దగ్గు, జలుబు, విరేచనాలు, మరియు వాంతులు వంటి సాధారణ సమస్యల నుంచి విముక్తినిస్తుంది.ఆటలమ్మ, కడుపులో పురుగులు ఉన్నపుడు, గొంతు సరిగా లేనప్పుడు, ఇలా ప్రతీ సమస్యలో తులసి ఎంతో ఉపయోగపడుతుంది.
వీటితో పాటు, తులసితో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. చర్మం,జుట్టు, మదుమేహం, క్యాన్సర్ నుండి కాపాడటంలో కూడ ఎంతో ఉపయోగపడుతుంది.

Wednesday 19 October 2016

వర్షాకాలంలో మీ జుట్టుకి తీసుకోవలసిన జాగ్రత్తలు..



వర్షాకాలం అంటే ఎంతోమందికి ఇస్టం అయినది, సరదాగా తడచి హాట్, హాట్ కాఫీ తాగితే ఆ మజాయే వేరు, కాకపోతే ఎంత సరదానో అంతే ఇబ్బందులు కూడా ఉంటాయి, అవి ఏమిటంటారా, రండి చూసేద్దాం.
వర్షాకాలం అనేది అన్ని ఋతువులలో కల్లా ఎంతో ప్రత్యేకమైనది, అంతే కాకుండా ఎన్నో ప్రత్యేకతలతో కూడినది, ఈ కాలంలో తడితనం అంటే తేమ ఎక్కువగా ఉంటుంది.దీని వల్ల మీ జుట్టుకి చుండ్రు పట్టే అవకాశాలు ఎక్కువ.ఈ చుండ్రు వల్ల మన జుట్టే కాదు మంచి అందం కుడా పాడైపోతుంది.
వర్షాకాలంలో వర్ష శాతం ఎక్కువగా ఉండడం వల్ల మీ జుట్టుని తడవనివ్వకండి,ఎక్కువగా తడిస్తే మీ జుట్టూ పాడైపోయే ప్రమాదం ఉంటుంది.మీ జుట్టుని కాపాడుకోవడానికి “గొడుగులు”,”Caps” ఉపయోగించండి.
ఒకవేళ అనుకోని పరిస్తితుల్లో మీ జుట్టూ తడిచిపొయినట్లయితే వీలైనంత త్వరగా తుడుచుకుని ఆరబెట్టుకోండి.
వారంలో 2-3 సార్లు తలస్నానం చేయండి, అలా చేయడం వల్ల మీ జుట్టు మొదళ్ళు శుబ్రముగా వుండి, ఏరకమైన జుట్టుకి సంబందించిన వ్యాదులు(చుండ్రు,ఫంగస్”) సోకవు.
మీ జుట్టుని సాద్యమైనంతవరకు తడిగా ఉండనివ్వరాదు,అలా ఉన్నప్పుడు గట్టిగా కట్టకూడదు.

అందమైన, మెరిసే జుట్టు కోసం “హెయిర్ కండిషనర్లు” ఉపయోగించండి.

ఎక్కువ శాతం నీరు,పళ్ళ రసములు తాగడం మంచిది.


ఈ కాలంలో కొద్ది కొద్దిగా జుట్టు వూడిపోవడం సహజం, కంగారుపడనవసరం లేదు, “హెయిర్ కర్లింగ్”,మొదలగు విధానాలు మానుకోవడం మంచిది, వీటి వల్ల జుట్టు పాడైపొయే అవకాశం ఎక్కువ.

ఒకవేళ మీకు తీవ్రమైన సమస్యలు తలెత్తితే, చర్మానికి లేదా జుట్టుకి సంబందించిన వైద్యుల్న్ని (dermatologist or trichologist)సంప్రదించడం ఎంతో మంచిది.


చేయవల్సినవి:
వారానికి 2-3 సార్లు తలస్నానం చేయండి.
తలస్నానం చేసే ముందు జుట్టుకి నూనె పెట్టుకుని తరువాత చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
విటమిన్ “E” కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకొండి.


చేయకుడనివి:
మీ జుట్టుని తడిగా ఉంచరాదు.
తడిగా ఉన్నప్పుడు దువ్వరాదు.
వర్షాకాలంలో “Dryers” ఉపయోగించకపోవడం మంచిది.



పైన సూచించినవన్నీ మీ అందమైన, మరియు ఆరోగ్యవంతమైన జుట్టుకోసమే, పాటించండి

మీ ముడతలు పడ్డ చర్మాన్ని తరిమేయండి ఇలా



మీరు యవ్వనంలో ఉన్నారా, కాని మీ చర్మం ముడతలు పడి మిమ్మల్ని ముసలి వారిలా చుపిస్తుందా, అయితే ఎంకెందుకు ఆలస్యం అందమైన మీ చర్మాన్ని, మీ వయసుతో పాటే పయనించేల, అదే ముడతలు లేకుండా కాపాడుకునేల ఏం చేయాలో తెలుసుకుందామ :

మీ చర్మం ముడతలు పడటానికి అనేక కారణాలున్నాయి,తేమ తత్వం తగ్గడం అంటే పొడిగా ఉండడం, చర్మంలోని కణాల ఉత్పత్తి సరిగా లేకపోవడం, మీ యొక్క జీవనశైలి, వాతావరణంలోని మార్పులు, స్మోకింగ్,మానసిక ఒత్తిడి, ఆహారం సరిగా తీసుకోక పోవడం, వ్యాయామం చేయకపోవడం ఇలా ఎన్నో ఉన్నాయి.


అందమైన చర్మం కోసం మీరు చేయవలసిందల్లా, మీరు పడుకునే ముందు, నెయ్యి , బాదం నూనె లేదా కొబ్బరి నూనె ని మీ ముఖానికి రాసుకుంటే, ముడతలు పోయి మంచి మృదువైన చర్మం లభిస్తుంది.

కలబంద రసాన్ని మీ ముఖానికి రాయడం వల్ల మీ ముఖం ఎంతో తాజాగా, అందంగా, ముడతలు తగ్గి కాంతివంతంగా ప్రకశిస్తుంది.

కీరా దోసకాయతో “ఫేస్ ప్యాక్” వేసుకుంటే, చర్మంలో తేమతనం పెరిగి మంచి ఫలితాలు లభిస్తాయి.

పొడి బారిన చర్మము(పొడి చర్మం), తగిన చికిత్స


మీ చర్మం పొడిగా మారటం అనేది ముఖ్యముగా ఎండ వల్ల, వేడి నీటి వల్ల, ఎక్కువ గాలి వల్ల వస్తుంది, దీని వల్ల చర్మం దానిలోని తేమని, మృదుత్వం ను కోల్పోయి చాల పొడిగా, గట్టిగా,కఠినంగా తయారవుతుంది.
పర్యవరణంలోని మార్పుల కారణం చేత కూడ ఈ సమస్య తలెత్త వచ్చు.
ముఖ్యంగా సూర్యిని కాంతి వల్ల, గాలి, చలి, రసాయనాలు, ఎక్కువగా కఠినమైన సబ్బులు ఉపయోగించడం వల్ల, చర్మం పొడిగా మారిపోయి ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది.
దీని వల్ల చర్మ తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి.


తేనె, పొడిబారిన చర్మం నుంచి కాపాడుతుంది:
1\2 స్పూన్ తేనెలో 1-2 టేబుల్ స్పూన్లు పన్నీరు కలిపి, ముఖానికి,మెడకి,పొడిబారిన చర్మానికి పట్టించాలి, 15-20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే పొడితనం నశించి, చర్మం తేమగా మారుతుంది,అంతే కాకుండా చర్మంలోని కణాలు శుబ్రపడి, తేజోవంతమైన చర్మం, మీ సొంతం ఔతుంది.
గుడ్డులోని పచ్చ సొన, తేనె కలిపిన మిశ్రమము:
ఒక టీస్పూన్ గుడ్డులోని పచ్చసొన,ఒక టీస్పూన్ తేనె, 1-2 ఒక టీస్పూన్ల పాల పొడి తీసుకుని బాగా కలిపి చర్మానికి పట్టించి 15-20 నిముషాల తరువాత చల్లని నీటితో సుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.
బలమైన, పొషక పదార్దాలతో కూడిన ఆహారం తీసుకొవడం వల్ల కూడ ఈ సమస్యను అదిగమించవచ్చు.
కొంచెం నూనెలో Glycerin కలిపి, పొడిగా ఉన్న చర్మం పై రుద్దితే మంచి మార్పు ఉంటుంది.
కాచిన వెన్న లేదా పాలు మీగడను మీ పగిలిన పెదాలపై రోజూ రాస్తే, మీ పెదాలు అందంగా మారి,మంచి ఫలితం ఉంటుంది.

గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు


ప్రస్తుతం మనం రోజూ వారి జీవితంలో మన ఆరోగ్యన్ని రక్షించుకోవడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అందులో సహజమైన,పద్దతిలో, అందరికీ, అతి తక్కువ ఖర్చుతో లభించేది ఈ గ్రీన్ టీ, ఇది ఎప్పటినుంచో ఆరోగ్య సం రక్షణలో ఎంతోగానో ఉపయోగపడుతుంది,అధిక బరువుని తగ్గించడమే కాకుండా ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంది.అవి ఏంటో చుసేద్దామా:

క్యాన్సర్ పై పొరాడుతుంది:క్యాన్సర్ అనేది మన శరీరంలోని రక్త కణాలని,క్యాన్సర్ కణాలుగా మార్చుకుంటూ అధికమవుతుంది, ఈ గ్రీన్ టీ రక్త కణాలకు ఇబ్బంది కలగకుండా క్యాన్సర్ కణాలను తొలగిస్తూ, పెద్దప్రేగు ,కడుపు భాగం, క్లోమము మరియు పిత్తాశయమును క్యాన్సర్ ప్రమాదము నుండి కాపాడుతుంది.



గుండె జబ్బులు నయం చేస్తుంది :ఈ గ్రీన్ టీ గుండెపోటు, రక్తపోటు, వంటి ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుంది, దీని వల్ల మన మన గుండెలో కొవ్వు శాతం తగ్గి, గుండే,రంద్రాలు శుబ్రం అవుతాయి.

రక్తపోటును నియంత్రించడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

కీళ్ళ నొప్పి,కీళ్ళవాతం ఇలాంటి ఇబ్బందులనుండి కాపాడుతుంది.

మనలోని రోగ నిరోదక శక్తిని పెంచి, రక రకాల రోగములు, క్రిముల నుండి మనల్ని రక్షించడమే కాకుండా ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది.

కాలేయ రక్షణకై: మన శరీరంలోని కొన్ని విష పదార్దాల వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది, ఈ గ్రీన్ టీ వాటిని తొలగించి మీ కాలేయాన్ని కాపాడి మంచిగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇది మనలో పేరుకున్న కొవ్వుని తొలగించి, గుండె పోటుకి, అధికబరువుకి దూరంగా ఉంచుతుంది,
ఇంకెందుకు ఆలస్యం రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తీసుకొండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి

Tuesday 18 October 2016

అందమైన చర్మం కోసం “ఆముదము(Castor oil)” చెప్పే చిట్కాలు చూద్దామా.


అందమైన మీ చర్మ సౌందర్యం కోసం ఆముదము, దాని ప్రయోజనాలు.
1.వయస్సులో వచ్చే మచ్చలు:

సాధారణంగా ప్రతీ ఒక్కరికీ టీనేజ్ లో ముఖం పై మచ్చలు వస్తాయి, వీటిని వదిలించడంలో ఆముదము ఎంతగానో ఉపయోగపడుతుంది.
2.జుట్టు పెరగడానికి:

పూర్వం జుట్టుకి ఈ “ఆముదమును”, నూనెలా ఉపయోగించేవారు, కాని కొబ్భరి నూనే, దీని స్తానాన్ని బర్తీ చేసింది అనిచెప్పవచ్చు,ఎందుకంటే ఆముదము కొంచెం చిక్కగా, జిగురుగా,ఉండి, సుగంధముగా ఉండకపోవడమే కారణం. కానీ ఆముదము జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది.వేడి చేసిన ఆముదము మీ జుట్టుకి పట్టించి, షాంపూతో స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
3. హెయిర్ కండీషనర్ గా :

దీనిని మన జుట్టుకు కండీషనర్ గా కూడ ఉపయోగించుకోవచ్చు.దీనిలోని కొవ్వు పదార్దములు మీజుట్టు పెరుగుదలకి ఎంతో మంచిది.


4. పగినిల గోళ్ళకు,వేళ్ళ చిగుళ్ళకు:

ఈ ఆముదము మీ పగిలిన వేళ్ళకు రాత్రి పూట పట్టించి మరుసటి రోజు శుబ్రం చేసుకుంటే పగిలిన మీ గోళ్ళకు ఎంతో మంచిది.
5.అందమైన, మృదువైన చర్మం కోసం:

ఈ ఆముదమును మీ ఒంటికి పట్టించి 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తేం, మీ చర్మం లోని చనిపొయిన, వృదా చర్మ కణాలని తుడిచేసి అందమైన, మెరిసే చర్మాన్ని ఇస్తుంది.
6.పగిలిన పాదాలను రక్షిస్తుంది:

మీ పాదాలు పగిలి మిమ్మల్ని భాదిస్తున్నాయా, అయితే వేడి చేసిన ఆముదమును రాత్రి నిదురపొయేముందు మీ పాదాలకు పట్టించి, ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే నొప్పి నుంచి విముక్తినిస్తుంది, అలా నిరంతరం చేస్తూ ఉంటే, పగిలిన పాదాలనుండి కుడా విముక్తి లబిస్తుంది.
7.ముదతలు పడిన చర్మానికై:

మీ అందమైన చర్మం చిన్న వయస్సులోనే ముడతలు పడి మిమ్మల్ని బాదిస్తుందా,అయితే మీ ముడతలు పడిన చర్మానికి వేడి చేసిన ఆముదమును రాసి, మెల్లగా మర్దనా చేస్తే మంచి ఫలితాలు లబిస్తాయి.
8.చర్మం పై మచ్చల నిర్మూలనకు:

మీ చర్మం పై మచ్చలతో అందమైన మీరు అందంగా కనబడటం లేదా, అయితే ఆముదముతో,”బేకింగ్ సోడా” కలిపి మచ్చలపై రాస్తే, మచ్చరహితమైన చర్మం మీ సొంతం అవుతుంది.
9. చర్మం పై, గీతలు, మొటిమలు:


మీ చర్మం పై, గీతలు, మొటిమలు, మచ్చలు ఎలాంటి వాటికైన ఈ ఆముదము మంచి చికిత్సలా ఉపయోగపడుతుంది.
10.చర్మాన్ని తేమగా ఉంచడానికి:

ఆముదము చర్మాన్ని తేమగా ఉంచడానికి “చర్మం యొక్క మాయిశ్చ్చరైజర్” గా ఉపయోగపడుతుంది .

మగ వారి చర్మ రక్షణకు చిట్కాలు చూసేద్దామా


అందం అనగానే గుర్తొచ్చేది ఆడవాళ్ళు, అలా అని వదిలేస్తే మగవాళ్ళు ఏమైపోతారు.వాళ్ళు కూడా అందంలోను, దాని సం రక్షణలోను ఆడవారితో పోటీ పడుతున్నారు.ఆడవారికి ఉన్నట్లుగా మగవారికి అన్ని రకముల “కాస్మటిక్స్” లేకపొయినప్పటికి, ఎన్నో సహజమైన పద్దతుల ద్వారా వారి అందాన్ని కాపాడుకుంటూ, అందంలో వారుకూడ ఆడవారికి తక్కువ కాదు అని చెప్పడానికి ఈ పద్దతులు, రండి చూసేద్దాం:
సాధారణంగా మగవారి కన్నా ఆడవారికే చర్మం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి,అయితే కొన్ని అధ్యాయనాల ప్రకారం మగవారి చర్మం ఆడవారి చర్మం కన్నా ఆలస్యంగా ముడతలు పడుతుందంట కాని, మగవారి జీవనశైలి, వారి అలవాట్లు, వారిని చర్మ సమస్యలలో ముందుకు తీసుకు వచ్చి,ఆడవారితో సమానం చేసేశాయి.
సరే అయ్యిందేదో ఔతుందిలే కాని, మగ వారి చర్మ రక్షణకు చిట్కాలు చూసేద్దామా,

ధూమపానం: ధూమపానం అనేది మగవారి యొక్క “Manliness”కి చిహ్నము లాంటిది.కాని దీని వల్లనే మగవారి వయస్సు వారి అసలు వయస్సుకన్నా ఎక్కువగా అనిపిస్తుంది,ధూమపానము మగవారి అసలు వయస్సుకి మరికొంత వయస్సు కలిపి, చర్మం ముడతలకు, పొడిబారిపోవడానికి కారణం అవుతుంది.

షేవింగ్ : సాధరణంగా మగవారు షేవింగ్ ఎక్కువగా చేసుకోవడం వల్ల చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి,షేవింగ్ వల్ల చర్మం కఠినంగా అయిపొయి, చర్మంలోని తేమను తీసివేస్తుంది, అందువల్ల చర్మం పొడిగా మారి ముడతలకు దారి తీస్తుంది. మీరు షేవింగ్ ను చల్లని నీటితో చేసుకుని,తరువాత “మాయిశ్చరైజర్” ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

ద్రాక్ష రసం: మగ వారి చర్మ సౌందర్యానికి ద్రాక్ష రసం ఎంతో మంచిది, ప్రతీ రోజూ ఆహారంతో పాటు ద్రక్ష రసాన్ని కలిపి తీసుకుంటే, అది మీ చర్మంలోని “Elasticity” స్థితిస్థాపకతను పెంచి, మీ చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచుతుంది.


మద్యం: మగవారికి ముఖ్యమైన, ఎంతో ఉపయోగకరమైన చిట్కా ఏమిటంటే మద్యాన్నికి దురంగా ఉండటం, ఎందుకంటే మద్యం వల్ల రక్త నాళాలు అవసరమైన దానికంటే ఎక్కువగా సాగి ఇబ్బందులు కలిగిస్తాయి.


వ్యాయామం: వృద్దాప్యంగా కనిపించడం అనేది మన చర్మం వల్లే కాదు మన కుంగిపోయిన కండరాలు కూడా దీనికి కారణం అవుతాయి,అందుకే ప్రతీ రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయడం వల్ల కండరాలు బలపడి చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

మసాజ్: రోజూ మీ ముఖం పై మెల్లగా మసాజ్ చేయడంవల్ల రక్త ప్రసరణ సజావుగా సాగి చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది.

రోజూ పాలతో మీ ముఖాన్ని శుబ్రం చేసుకుంటే చర్మంలోని మలినాలు అన్నీ పోయి మంచి ఫలితం కనిపిస్తుంది.

ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు.

ముఖ్యంగా బచ్చలికూర లేదా చిక్కుళ్ళు వంటి కూరగాయలలో చర్మం ముడతలు పడకుండా చూసుకోవచ్చు .

సూర్యుని కాంతి: మీ చర్మాన్ని అధికంగా సుర్యుని కాంతిలో ఉంచకండి, దాని వల్ల మీ చర్మం ముడతలు పడటానికి ఎక్కువ అవకాశం ఉంది.

మంచి నీరు అధికంగా తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని ముడతల బారి నుంచి కాపాడుకోవచ్చు

రోజుకి కనీసం 8 గ్లాసులు, లేదా 2 లీటర్ల నీరు తీసుకుంటే చర్మ రక్షణలో ఎంతో ఉపయోగపడుతుంది.

చక్కటి ఆరోగ్యానికి పాటించవలసిన పధ్ధతులు


మీకు మీ ఆరోగ్యం అంటే శ్రధ్ధ వుందా? మీ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యమని ఏనాడైన ఆలోచించారా?అవును మన ఆరోగ్యం బాగుంటేనే కొంతకాలం జీవిత లక్ష్యాలు సాధించవచ్చు.అంతే కాక మన ఆరోగ్యాన్ని చూసి మరికొందరు మారే అవకాశముంది.మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని అదీ మన అలవాట్లలోనె ఉందని ఇప్పుడు తెలుసుకుందాం: 


 
ఆహారంలో ఎక్కువగా పళ్లు, కూరగాయలు ఉంటే అది ఆరోగ్యకరమైన ఆహారం అన్నమాట.అధిక బరువు తగ్గితే, దాంతో పాటు ఉప్పు వాడకం తగ్గిస్తే రక్తపోటు తగ్గుతుంది. పక్షవాతం రావడానికి ముఖ్య కారణం అధిక రక్తపోటే. సగం గుండెపోటు, పక్షవాతాలకు కారణం అధిక రక్తపోటు.రక్తపోటు,కొలెస్ట్రాల్,షుగర్ ఏ స్థ్తాయిలో ఉన్నయో,ఏ స్థ్థాయిలో ఉండాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.అదేవిధంగా గుండె బాగా పని చేసేందుకు ఓ కార్యచరణను రూపొందించుకోవలి.ఎక్కువగా మధ్యపానం చేసే వారిలో గుండె జబ్బులు,లివర్ పాడవటం,రక్ట పోటు పెరిగి పోవటం లాంటివి వస్తాయి.అంతేకాక మధ్యపానం చేసే వారిలో రక్తపోటు కూడా పెరుగుతుంది. సరైన ఆరోగ్యం కొరకు మధ్యపానం ఆపేయాలి.ఇక ధూమ పానం విషయానికొస్తే రోజూ తక్కువ తక్కువగ మనేయ్యాలి.అంతేకాక ధూమపానం మానటానికి ఎన్నో మందులు ఈ రోజు వచ్చాయి. అంతే కాక ధూమ పానం చేయలి అనుకున్నప్పుడు పనిమీదే శ్రధ్ధ పెడితే దానిపై ధ్యాస పోతుంది..రోజూ అరగంట పాటు నడక, లేదా ఏ ఇతర్ సులభమైనటువంటి వ్యాయామం చేస్తే గుండెపోటు, పక్షవాతం రాకుండా నిరోధించవచ్చు.ఒక సంవత్సరం పాటు పొగతాడం మానేస్తే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సగం తగ్గుతుంది. కొన్నేళ్ళు పొగతాగకుండా ఉంటే ఆ రిస్క్ పూర్తిగా పోతుంది.మీరు తాగకపోయినా పక్కవారు తాగి పీల్చే పొగ వల్ల వారికంటే ముందు మీరు జబ్బుపడతారు. అంటే మీరు ప్రతి రోజూ చేసే పనిలో శారీరక శ్రమనుఉందేలా చూసుకోవాలి.వీలైనప్పుడంతా నడవడం చేయాలి. శుభ్రమైన గాలి పీల్చడానికి కాసేపు నడవాల్సి వస్తే నడవండి. రోజుకు రెండు సార్లు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు ఐదు నిమిషాలపాటు చేయొచ్చు.బయట తినేటప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. క్యాంటీన్ లో, హోటళ్లలో ఏది పడితే అది తినటం మంచిది కాదు.మానసిక ఒత్తిళ్ళ వల్లే కాక పొగతాగడం, ఆల్కహాలు తీసుకోవడం, ఏ ఆహారం పడితే ఆ ఆహారం తినడం వల్ల జరుగుతుంది.కొవ్వు తక్కువగా వుండే పద్దార్థాలు తినటం ఎంతో మంచిది.పండ్లు, తాజా కూరగాయలు తినటం శరీరానికి ఎంతో మంచిది.

నోటిని,పళ్ళను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి


నోటినీ,పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవటం వల్ల వయస్సు మీద పడేటప్పుడు వచ్చే సమస్యలకు దూరంగా ఉండవచ్చు.నోటినీ శుభ్రంగా ఉంచుకోవటం అంటే రోజూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవటం,వాటిని ఎప్పుడూ కడుక్కోవటం.నోటిని శుబ్రంగా ఉంచుకోవటం ఎలా అనేది ఏ వయస్సు వారు ఎలా జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నపిల్లలు:
పుట్టుకతోనే పిల్లల్లో పళ్ళు నిర్మాణం జరిగిపోతుంది కాని అవి చిగుళ్ళ క్రింద ఉండిపోతాయి.ఒకసారి పళ్ళు వచ్చాక ఆ నిర్మాణం జీవితాంతం ఉండిపోతుంది.కాబట్టి ఒకసారి పళ్ళు వచ్చాక వాటిని ఎలా ఉంచుకోవాలో తల్లిదండ్రులు తెలియజేయాలి.పుట్టుకతో వచ్చిన పళ్ళను సమ్రక్షించుకుంటే అవి వాళ్ళు పెద్ద అయ్యేవరకూ ఆ స్థానాలను పదిలంగా ఉంచుకుంటాయి.కాబట్టి మీ పిల్లలు చక్కగా ఆహారం నమలాలంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవటం ఒక్కటే మార్గం.
పిళ్ళల పళ్ళ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:
1.అప్పుడే పళ్ళు వస్తున్న పిల్లలకు రోజూ పళ్ళను శుభ్రంగ తోమాలి.అంతేకాక అప్పుడే వచ్చే పళ్ళను ఒక గుడ్డ సాయంతో సున్నితంగ పళ్ళను తోమాలి.2 సంవత్సరలు లోపు పిల్లలకు బ్రష్ వాడకూడదు.కేవలం తడిగుడ్డతో మాత్రమే తోమాలి.
2.పిల్లల్ని నోటిలో సీసా పెట్టుకుని పడుకోనివ్వరాదు.ఎందుకంతే ఆ సీసాలో ఉన్న పాలు లేదా మరేదైన తాగేవస్తువు పళ్ళలో చేరి పళ్ళను పాడు చేస్తాయి.
3.కొంచెం వయసు కలిగిన పిల్లలకు తక్కువా చక్కెర శాతం ఉన్న పదార్థాలైన పళ్ళు,కూరగాయలూ తినేలా అలవాటు చెయ్యాలి.అంతే కానీ చూయింగ్ గంలు,కాండీలు తిననివ్వకండి.

4.పిల్లలకు నోటి పరిశుభ్రత,పళ్ళ విషయం లో తీసుకొవలసిన జాగ్రత్తలునీర్పాలి.పళ్ళు శుభ్రపరచుకునే విధానాని వారికి తెలపాలి.
5.అలాగే పిల్లల్ని డెంటిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళలి.అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ఏడాది నిండిన పిల్లలకు చెక్ అప్ అవసరమని సూచిస్తోంది.
టీన్స్:
పళ్ళను శుబ్రంగా ఉంచుకోవటం వల్ల మీ చిరునవ్వు ఫ్రెష్గాను స్వాస మంచి ఫ్రెష్ గా ఉంటుంది.
1.మీ పళ్ళను రోజూ రెండు సార్లు ఫ్లూరైడె బ్రుష్ తో కడుకుంతే మంచిది.
2.రోజుకొకసారి పళ్ళను పుక్కిలించటం ఎంతో మంచిది.
3.చూయింగ్ గం తినకూడదు,పొగ త్రాగరాదు.ఎందుకంటే పొగ త్రాగటం వల్ల మీ పళ్ళు గారలు పడతాయి.ఫలితంగా నోరు దుర్వాసన వస్తుంది,అంతేకాక కాన్సర్ వస్తుంది.
4క్రికెట్ మొదలైన క్రీదల్లో తలకు ధరించె హెల్మెత్ను వాడలి.
5.ప్రతీ ఆరు నెలలకొకసారి మీ డెంటిస్ట్ ను కలవండి.చెక్ అప్ చేయించుకోండి.
పెద్దలు:
పళ్ళ సమ్రక్షణ చక్కగా చేసుకోవటం వల్ల చిగుల్ల సమస్యలకు, పళ్ళు ఊడిపోవటం సమస్యలు తలత్తకుండా ఉంటాయి.
1.రోజూ 2 సార్లు బ్రష్ చెసుకోవాలి.ఫ్లూరైడ్ బ్రష్ తో తోముకోవాలి.రోజుకొకసారి పళ్ళను పుక్కిలించుకోవాలి.
2.చూయింగ్ గం వాడవద్దు,పొగ త్రాగవద్దు.
కొన్ని మందులు వాడినప్పుదు పళ్ళపై వాటి ప్రభావం ఉంటుంది.కాబట్టి మీ డెంటిస్ట్ ను సంప్రదించాకే వాటిని వాడండి.
3.మీ నోతిని, పళ్ళను నిత్యం పరీక్షించి చూసుకోండి.ఎందుకంతే బలహీనపడిన పళ్ళు,చిగుళ్ళ సమస్యా తెలిసేందుకు అవకాశముంది.
4.ప్రతి ఆరు నెలలకొకసారీ మీ దంత వైదుని వద్దకు వెళ్ళండి.

Monday 17 October 2016

అందం కోసం “చందనం(గంధం)”తో చేసే ఫేస్ ప్యాక్స్,ఫేస్ మాస్క్స్


అందం, దీనికోసం అందరూ ఏమిచేయడానికైన సిద్దపడతారు,దీన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూంటారు, అయితే అందమైన చర్మం కోసం చందనం చెప్పే మరింత అందమైన చిట్కాలు చుసేద్దామ. చందనం, గులాబీలు, ఈ రెండిటి కలియక అనేక సత్ఫలితాలను ఇస్తుంది, ఈ రెండింటిని కలిపి ముఖానికి పట్టించుకుంటే మీ చర్మం ఎంతో తాజాగా, అందంగా, మరియు యవ్వనంగా కనిపించడమే కాకుండా, మీ ముఖం పై ఉన్న మొటిమలు, నల్ల మచ్చలు తొలగిపోయి, మీ ముఖం మృదువుగా మారి ,ఎంతో కాతివంతంగా మెరుస్తుంది.
అందమైన చర్మానికి చందనం ఇలా అంటుంది..

చందనం(గంధం)ఫేస్ ప్యాక్స్ 1:
చందనం మన చర్మానికి ఎంతో మంచిది, ఇది మన చర్మంలోని నల్ల మచ్చలు, మొటిమములు,ముడతలు, ఇలా అన్నింటినీ తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.అయితే దీనిని జిడ్డు మరియు పొడి చర్మం కోసం ఉపయోగించుకోవచ్చు,
జిడ్డు గల చర్మం అయితే కొన్ని క్రీము పదార్థాలతో కలిపి ఉపయోగించండి,పొడి చర్మం అయితే పన్నీరుతో కలిపి ఉపయొగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
కావలసినవి:
2 టేబుల్ స్పూన్లు చందనం పొడి
పన్నీరు
తయారుచేసుకునే పద్దతి:
2 టేబుల్ స్పూన్లు చందనం పొడి, కొంచెం పన్నీరు తీసుకుని పేస్ట్ లా చేయండి.మీ ముఖాన్ని శుబ్రంగా చల్లని నీటితో శుబ్రం చేసుకుని,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించండి,
20 నిమిషాల తరువాత మెల్లగా చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి సత్ఫలితాలు పొందుతారు.
ఈ పన్నీరులోని సువాసన పరిమళం మీ మనసుని,మెదడుని ప్రశాంతంగా ఉంచి మీ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.
ఈ పన్నీరు వల్ల మన చర్మంలోని మలినాలు అన్నీ పొయి, మీ చర్మంలోని చర్మ కణాలు తెరుచుకుని, మీ చర్మం ఎంతో అందంగా, కాంతివంతంగా మారుతుంది.
అధిక వేడివల్ల మీ ముఖం పై వచ్చే ఎర్రని కందిన మచ్చలను దూరం చేసి మంచి మచ్చ రహితమైన చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.



చందనం(గంధం)ఫేస్ ప్యాక్స్ 2:
కావలసినవి:
రోజ్ రేకుల
నూరిన వోట్స్
తాయారుచేసుకునే విధానం:
2 రోజా పూల రేకులు తీసుకుని, 2 టేబుల్ స్పూన్లు నూరిన వోట్స్ తీసుకుని,కొంచెం నీరు కలిపి, పేస్ట్ లాగా చేసి 5 నిమిషాల్లో మీ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోతుంది.
మీ చర్మం పొడిగా ఉంది అనిపించిన ప్రదేశంలో కొంచెం నీరుతో శుబ్రం చేసి ఈ మిశ్రమాన్ని పట్టించి 20 నిమిషాల తరువాత చూసుకుంటే, మీరు ఊహించని అందమైన, కోమలమైన,యవ్వనమైన చర్మం మీ సొంతం అవుతుంది.

చందనం(గంధం)ఫేస్ ప్యాక్స్ 3:
ఈ ఫేస్ ప్యాక్ మన చర్మంలోని మొటిమలను, మచ్చలను తొలగించి యవ్వనమైన చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది, అయితే ఈ మిశ్రమంలో పసుపుని కూడా కలిపితే మీ చర్మంలో ఉన్న క్రిములని నాశనం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
కావలసినవి:
1 టేబుల్ స్పూన్ పసుపు
2 టేబుల్ స్పూన్ లు గంధం పొడి
3 టేబుల్ స్పూన్ లు తేనె
తాయారుచేసుకునే విధానం:
పైన సూచించిన వన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలిపి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి.మంచి సువాసనతో పరిమళించే ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ, మీ శరీరం అంతా పట్టించుకోవచ్చు, 20 నిమిషాల తరువాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుబ్రం చేసుకుంటే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

ముడతలు మచ్చలు మిమ్మల్న్ని భాదిస్తుంటే ఇలా చేసేద్దాం


ఈ రోజుల్లో జీవితం ఎంతో గజిబిజిగా, హడావిడిగా, ఉరుకులు, పరుగులు పెడుతూ, అందాన్ని కాపాడుకోవడానికి ఏ రకమైన వస్తువులు వాడాలో కూడా అలొచించుకునేంత సమయం ఉండడంలేదు అందుకే, “మీ అందమే మా ఆనందం” అని భావిస్తూ మీ కోసం, మీ అందమైన చర్మం కోసం సరికొత్త చిట్కాలు తెచ్చేశాం, ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి.
ముందుగా మీ చర్మంలో ముడతలు అనేక కారణముల వల్ల వ్యాపించవచ్చు,సూర్యిని కాంతి వల్ల, ధూమపానం వల్ల,ఈ ఇబ్బందులు కలగవచ్చు.అయితే మీ కంటి కింద, ముక్కు, నోరు ఇలా ముఖంలో అనేక భాగములలో ముడతలు వచ్చి మిమ్మల్ని అందమైన వయస్సులోనుంచి అమ్ముమ్మ, తాతాయ్యల వయస్సులోకి మార్చేస్తాయి, అంటే చిన్న వారు అయినను ఎక్కువ వయస్సు ఉన్నవారిలా కనపడతారు.

ధూమపానం వల్ల మీ చర్మం ముడతలు పడిపోతుంది, ఇందులో ఉన్న నికోటిన్ పదార్దము మీ రక్త ప్రవాహాన్ని సరిగా అవ్వకుండా ఆపేస్తుంది, అంతే కాకుండా మీ రక్త కణాల ఉత్పత్తిని కూడా ఆపేస్తుంది. దీని వల్ల మీ చర్మం ముడతలు పడిపోతుంది.

మంచి పౌశ్టికమైన ఆహారం విటమిన్ “E”తో తీసుకోవడం వల్ల మీ చర్మంలోని ముడతలు తగ్గి,ప్రారంభ దశలో ఉన్న ముడతలను ఆపుతుంది.


బయటకు వెళ్ళెటప్పుడు చర్మానికి సన్ స్క్రీన్ ను రాయడం మంచిది.ఇది మిమ్మల్ని ముడతల బారి నుంచి కాపాడుతుంది.

మీ ఆహార పద్దతులలో సరియైన సమ్యమనం పాటించండి, శరీర బరువు శాతం తగ్గినా చర్మం పై ముడతలు పడే ప్రమాదం ఉంది.

చర్మం ఎప్పుడూ పొడిగా మారకుండా తేమగా ఉంచడానికి ” మాయిశ్చరైజర్” ను ఉపయోగించండి.

తగిన పోషకపదార్దాలు లభించాలంటే మీ భోజనంలో పండ్లు, కూరగాయలు, గింజలు,తీసుకుంటే మంచిది, వీటిలో ఉన్న పొషకపదార్దాలు మీ చర్మాన్ని ముడతల బారి నుండి రక్షిస్తాయి.

అత్యంత సులభమైన చిట్కా ఏమిటంటే, సరియైన సమయం అంటే కనీసం 6 గంటలు నిదుర పోతే, మీ చర్మం ముడతలు పడకుండ కాపాడుకోవచ్చు.

మీ ఆహారంలో “విటమిన్ A,C,E,K”కలిగి ఉన్నవి తీసుకుంటే, మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు .

ఒక నమ్మలేని నిజం ఏమిటంటే, ఒత్తిడి వల్ల కూడ మన చర్మం ముడతలు పడడానికి దారి తీస్తుంది.

సాద్యమైనంత వరకూ ప్రశాంతమైన మనస్సు, ఆలోచనలతో ఉంటే మంచిది.
చర్మవ్యాధి నిపుణులు సలహా ప్రకారం మీ ముఖాన్ని ఎక్కువగా శుబ్రం చేయరాదు, అలా చేస్తే మీ చర్మంలోని సహజమైన కణాలు పోయి, ముడతలకు దారి తీసే ప్రమాదం ఉంది.
మీరు సూర్యునికాంతి ప్రభావం నుండి బయటపడాలంటే “విటమిన్ C” ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.

మలబద్దకం మిమ్మల్ని బాధిస్తుందా??ఉపసమనానికి పద్దతులు, ఆహార అలవాట్లు చూసేద్దాం


మీ కడుపులో సరిగా లేకపోతే ఆరోజంతా నరకంగా అనిపిస్తుంది.ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు కాని, ఈ మలబద్దకం వల్ల నలుగురిలో ఉన్నప్పుడు, మీకే కాకుండా అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది.అయితే కంగారుపడి,భయపడవలసిన అవసరం లేదు, మీరు తీసుకునే ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

పీచు పదార్దములు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి,దీని వల్ల ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది. సామన్యముగా మనం పౌశ్టికమైన ఆహారం తీసుకోవడం కన్నా “జంక్ ఫుడ్”నే ఎక్కువగా ఇష్టపడతాము, కానీ ప్రతీ రోజూ మనం తీసుకునే ఆహారంలో 26 గ్రాముల పీచు పదార్దంతో కూడిన ఆహరం ఉండాలి.

సామన్యంగా ఈ మలబద్దకము, సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల, మన తీసుకునే ఆహారంలో పీచు పదార్దం లేకపోవడం వల్ల,ఇంకా చాల కారణముల చేత వస్తుంది.దానికోసం మందులు వాడి మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం సరికాదు, పీచు పదార్దం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది.



పండ్లు , కూరగాయలు , బీన్స్ మరియు ధాన్యాలు:ఇవి అన్నీ అధిక శాతంలో పీచు పదార్దం కలిగి ఉన్నవే, అయితే సరియైన పౌశ్టికమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది.ఆకులు, పండ్లు, పండ్ల యొక్క పై తొక్క భాగములో ఎక్కువగా మీకు పీచు పదార్దం లభిస్తుంది.ఆపిల్ పండులోని తొక్కను తీయకుండా తీసుకుంటేనే మంచిది,పచ్చి కూరగాయలు, ఆకుకూరలలో పీచు పదార్దమే కాదు శరీరానికి కావలసిన మెగ్నీషియం కూడా లభిస్తుంది.

ఎండు ద్రాక్ష: ఈ మల బద్దక సమస్యకు ఎండు ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న లక్షణాలు మన కండరాలను ఉత్తేజపరచి, పెద్ద ప్రేగు ద్వారా వ్యర్ద పదార్దాలని పంపించేస్తుంది.5 ఎండు ద్రాక్షలో 3 గ్రా.ము పీచు పదార్దం ఉంటుంది.

కాఫీ మరియు ఇతర వేడి ద్రవాలు: కాఫీ మన ఆరోగ్యానికి ఏ రకంగాను సహయపడక పొయిన మనలోని ఒత్తిడిని తగ్గించి, మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.అయితే ఈ మలబద్దక సమస్య నిర్మూలనలోను కాఫీ ఎంతగానో సహాయపడుతుంది, అంతే కాకుండా ఇతరత్రా వేడి పదార్దాలు తీసుకోవడంలోను ఈ సమస్య నుంచి మంచి ఫలితం లభిస్తుంది.

నీరు: మనం పీచు పదార్దం ఎంత తీసుకున్నప్పటికీ, దానికి తోడు నీరు కూడా తీసుకోవాలి,లేదంటే కడుపులో ఉన్న వ్యర్ద పదార్దాలు శుబ్ర పడకుండా అధిక నొప్పితో మలబద్దకముకు దారి తీస్తుంది.పండ్ల ముక్కల్ని నీటితో కలిపి తీసుకుంటే మంచి ప్రభావం చుపిస్తాయి.

రాత్రి పూట పడుకునే ముందు 1 గ్లాసు వేడి పాలు తాగి పడుకుంటే మీ జీర్ణాశయం శుబ్రపడి, మంచి ప్రబావం చుపిస్తుంది.

మీరు భోజనం చేసిన తరువాత దానిలో భాగంగనే పీచు పదార్దం తీసుకున్నట్లు అయితే అహారం త్వరగా జీర్ణం అయ్యి ఈ మలబద్దక సమస్యనుండి విముక్తి లభిస్తుంది.

మీ చర్మ సంరక్షణకు సహజమైన “బాడీ లోషన్స్”


ఈ బాడీ లోషన్స్ అనేవి వాడటం చాల సులభం, అదేవిధంగా తయారుచేసుకోవడం మరింత సులభం, ఒక్క 10-15 నిమిషాలు మీవి కావు అనుకుని చేసుకుంటే అందమైన మీ అందానికి కారణం అయ్యే “బాడీ లోషన్స్”ని మీరు తయారు చేసుకోవచ్చు.అదేవిధంగా వారి వారి కోరిక మేరకు మంచి సుగంధ ద్రవ్యాలు కలుపుకుంటే, మీ చర్మం సుగంధ పరిమళాలను వెదజల్లుతుంది అనడంలో సందేహం లేదు.
మన ఇంట్లోనే, మనకు అందుబాటులో ఉన్న పదార్థాలుతో, చాల సులభంగా తయరుచేసుకోవచ్చు,ముఖ్యంగా కావాల్సినవి అల్లము, చమొమిలె పండు, కొబ్బరి,పనీరు, బాధం నూనె మొదలగునవి, సరికొత్త పరిమళాలు కావాలనుకుంటే పుదీనా , వనిల్లా , లావెండర్ రుచి వంటి సువాసనలు జోడించవచ్చు.
“బాడీ లోషన్” తయారు చేసుకునే విధానం చుసేద్దామ:
ఎవరికి వారు వారికి నచ్చిన విధంగా,వారి శరీరానికి అనుకూలంగా ఈ “బాడీ లోషన్” తయారుచేసుకోవచ్చు, అయితే వీటి తయారీలో ముఖ్యమైనవి కొబ్బరి నూనె , కోకో వెన్న లేదా షియా వెన్న, ని ఉపయోగిస్తే మీ పగిలిన పాదాలను, పొడి చర్మాన్ని కాపాడుకోవచ్చు.


కావలసిన పదార్దాలు:
1/2 కప్పు బాదం (లేదా) ఆలివ్ నూనె
1/4 కప్పు కొబ్బరి నూనె
1/4 కప్పు మైనం
కావాలంటే 1 టీ స్పూన్ విటమిన్ “E”, కొబ్బరి నూనె , కోకో వెన్న లేదా షియా వెన్న కూడా ఉపయోగించవచ్చు.
తయారు చేసుకునే పద్దతి:
పైన సూచించిన వన్నీ కలిపిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి, మరొక గిన్నెలో మీరు పోసి గోరు వెచ్చగా చేసి, అందులో ఈ మిశ్రమాన్ని కలపండి,మీ చర్మానికి పట్టించండి, మంచి ఫలితాలు లభిస్తాయి.



అందమైన చేతులు, శరీరం కోసం క్రీం:
మనకు అందుబాటులో ఉన్న వాటితో మన చేతులు, శరీరమును కాపాడుకోవడానికి మంచి క్రీం తయారు చేసుకోవచ్చు,ఇది అన్ని రకముల చర్మానికి ఉపయోగపడుతుంది .
ఈ విదంగా చేయండి:
1/4 కప్పు కొబ్బరి నూనె
1/8 కప్ షియా వెన్న
1/8 కప్ కోకో వెన్న
1 టేబుల్ స్పూన్ కలబంద రసం
1 టేబుల్ స్పూన్ నూనె(బాదం, జొజోబా)
5-10 చుక్కల ముఖ్యమైన నూనెలు.
తయారు చేసుకునే పద్దతి:
షియా వెన్న, కొబ్బరి నూనె, కోకో వెన్న తీసుకుని వేడి చేసి కరగబెట్టాలి.
పైన మిశ్రమాన్ని కలబంద వేరా మరియు నూనె, కావాల్సిన పదార్దములు కలిపి, ఒక కొత్త మిశ్రమంగా మార్చుకుని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి.
ఈ షియా వెన్న మీ కఠినమైన చేతుల్ని అందంగా, మృదువుగా, మార్చి మంచి ప్రయోజనం చేకూరుస్తుంది.

మేక పాలు, కలబంద మిశ్రమము:
మీ పొడిబారిన, జిడ్డైన చర్మ సం రక్షణకు ఈ మిశ్రమం ఎంతో ఉపయోగపడుతుంది, అంతే కాకుండా దీని వల్ల ఏ రకమైన దుష్ప్రభావాలు ఉండవు.

Sunday 16 October 2016

మీలో అస్థిరతను తొలగించేదుకు కొన్ని మార్గాలు

అస్థిరత, చాంచల్యము, డోలాయమానము ఇది ఎక్కువగా యువతలో కనపడుతున్న, వినపడుతున్న పదాలు.పదాలు కొత్తగా ఉన్నా దీనిని ఇప్పుడు ఆగ్లంలో పిలుస్తున్న పదమయితే ఫ్రక్చువేషన్ అని పిలుస్తున్నారు.అయితే దీని ప్రభావం మానవునిపై ఉండబట్టే ఈనాడు దీని కింత ప్రధాన్యత సంతరింన్చుకుంది.ఈ లక్షణం ఎక్కువ అయితే ఆ వ్యక్తి రాక్షసుడిగా మారతాడు.ఈ లక్షణం పెరిగి పెద్దదై చివరికి తనను తను బాధ పెట్టుకొవటమో లేక పక్కవారిని బాధపెట్టటమో చేస్తాడు.ఈ హెచ్చు తగ్గులు ఈ మార్పులు మనకు తెలియకుండానే మన దరి చేరతాయి.దీని వల్ల్ తీవ్ర అనారోగ్యాల పాలుకాక తప్పదు.కాబట్టి వాటిని నియంత్రిచుకోవటం ఎలా అనేది ఈ కాలంలో తెలుసుకుందాం.
సాధారణంగా ఈ అస్థిరత అనేది ఏర్పడే సమయంలో రక్తపోటు స్థాయి పెరిగిపోతుంది.నరాలు బాగా విపరీతమైన నొప్పికి గురవుతాయి.తలనొప్పి ఎక్కువగా వస్తుంది.ఆ సమయంలో ఏ పనీ, ఆలోచన కానీ చేయలేము.


ఈ సమస్యకు ఆడ మగ అన్న తేడాలయితే లేవు కానీ వారి రక్తపోటు స్థాయిలను బట్టి ఉంటుంది.
మీ తల బరువుగా, భారంగా ఉండి, చేతులు లాగటం జరిగితే అది ఖచితంగా రక్తపోటు పెరిగినట్లే.
అయితే ఒకనాడు ఉన్న పరిస్ఠితికి నేడు ఉన్న పరిస్థితికీ చాలా తేడాలున్నాయి.ఒకనాడు రక్తపోటంటే పెద్దలోనే వచ్చేది.కానీ ఈనాడు ఇది అన్ని వయస్సుల వారినీ ఇబ్బంది పెడుతోంది.
ఇలా అస్థిరత మీలో చోటు చేసుకున్నప్పుడు వెంటనే మీరు మీ చిటికిన వేలిని రెండు చెవుల్లోనూ లోపల ఉంచి అటూ ఇటూ కదుపుతూ ఉండాలి.ఈ ప్రక్రియను రెండు మూడు నిముషాలు ఉంచి తగ్గించుకోవాలి.తగాని పక్షంలో మరోసారి ఇలాగే చేయాలి.దీనినే యోగా పరిభాషలో అనులోమ్ విలోమ్ ప్రాణాయామా అని అంటారు.
శరీరంలో అస్థిరత చోటు చేసుకున్నప్పుడు ఎక్కువగా నీరు త్రాగాలి.ఇందువల్ల నరాల్లో రక్త ప్రసరణ జరిగి తగ్గుతుంది.
ఫ్రక్చువేట్ అవ్వటానికి కారణం మానవునిలో ఉన్న ఎలక్త్రో ఎన్సెఫలోగ్రం అని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాక హైపెర్ టెన్షన్ లో వచ్చే దానిని ఆర్థోస్టాటిక్ హైపర్ టెన్షన్ అని అంటారు.దీని కారణంగా తలనొప్పి, బూదరగా కనిపిచటమ్, నీరసంగా ఉండటం, తడబడటమ్ లాంటివి లక్షణాలు.
ఈ సమస్య ఆల్కహాలు త్రాగటం, ధూమపానం చేయటం, అతిగా ఒక విషయాన్ని ఆలోచించటం, మానసిక శారీరక ఒత్తిళ్ళు వలన ఇలా శరీరం అస్థిరతకు గురవుతుంది.
ఈ సమస్య నుంచీ బయటపడాలంటే ప్రొద్దున్నే యోగా చేయాలి.
నెమ్మదిగా స్థిమితంగా అలోచించాలి.
ఏ విషయానికీ ఒత్తిడి తీసుకొనరాదు.
చక్కటి ఆహార అలవాట్లు రోజూ అలవరచుకోవాలి.
ఎక్కువగా విదాకులు పొందినవారిలో, ఒన్తరిగా జీవించే వారిలో, రిటైర్డ్ అయిన వారిలో, నిరుద్యోగులలో, అంగవైకల్యం ఉన్న వారిలో ఎక్కువగా ఈ సమస్య కనపడుతోంది.
ఈ సమస్య నుంచీ బయటపడేందుకు వ్యాయామాన్ని అలవరచుకోవాలి, జీవిత లక్షాలను నిర్దేశించుకోవాలి.
కుటుంబ సభ్యుల, స్నేహితుల నున్చి చేయూత తీసుకోవాలి.ఏదైనా నచ్చిన వాటిని ఆటలు, క్రీడలు అలవాటు చేసుకోవాలి.

ఆరోగ్యానికి బెండ. . .

సన్నగా అమ్మాయి చేతి వేళ్ళలా నాజూకుగా కనిపించే బెండకాయలంటే ఇష్టపడనివారుండరేమో. . . విందుభోజనాల నుంచీ సాధారణ భోజనం వరకూ అన్నింటా కనిపించి ముద్దుగా ఆంగ్లంలో లేడీస్ ఫింగర్ అనిపించుకుంది. దీనిలో పీచు, కాల్షియం, పొటాషియం. . . వంటి వాటితో పాటు పండ్లలో ఉన్నట్లే యాంటీ ఆక్సీడెంట్లు బెండలో అధికం. ఏంటీ ఇంత ఉపోధ్ఘాతం అనుకుంటున్నారా. . !బెండ ఆరోగ్యానికి ఎంతో అండ. ఇందుగలదు అందుగలదో అన్న సందేహం వలదు. . . ఎందెందు చూసినా అందందే కలదు అన్న చందంలో బెండ అన్ని దేశాలలో ప్రాచుర్యంలో ఉంది. అందుకే దీనిని భూగోళం అంతా పండిస్తున్నారు. దీనిలో ఉన్న పోషక విలువలు ఎలా అరోగ్యానికి ఉపయోగపడతాయో తెలుసుకుందామా. . .
బెండ తింటే తెలివి తేటలు పెరుగుతాయ్ నాన్నా. . తిను అని మన పెద్దవాళ్ళు కొసరి కొసరి బెండను తినిపిస్తారు. దానికి కారణం ఇందులో బీటాకెరోటిన్, బి-కాంప్లెక్స్, విటమిన్-సి, ఐరన్, పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు బెండలో ఎక్కువ. అవి శరీరంలోని ద్రవాలను సమతుల్యంగా ఉంచేలా చేస్తాయి. దీని వల్ల నాడీవ్యవస్థ పనితీరు బాగుంటుంది. అందుకే దీన్ని బ్రెయిన్ ఫుడ్ అని అంటారు. దీన్ని తినటం వల్ల దిప్రెషన్ తగ్గుతుంది.
గర్భిణులకు ఇది మంచి ఆరోగ్యం. శిశువు నాడీవ్యవస్ధ వృధ్ధి చెందుతుంది. ఇందులోని ఫోలిక్ ఆమ్లం చాలా ఉపయోగపడుతుంది.
అధికంగా ఉండే కాల్షియం , విటమిన్-సిల వల్ల బంధన కణజాలం, ఎముకలు, కీళ్ళు పనితీరు బాగుంటుంది.

కరగని పీచు ఎక్కువ. ఇది మలబధ్ధకానికి మన్చి మందు. చక్కెర వ్యాధి కూడా తగ్గుతుంది.
అధిక పీచు వల్ల దీని గ్లెయసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. అందువల్ల ఇది బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ఈ పీచులోని పెక్టిన్ రక్తంలోని కొలెస్టాల్ సాతాని తగ్గిస్తుంది. అందుకే ఇది రక్తనాళాల్లో కొవ్వును కరిగిస్తుంది.
పొట్టలోని చక్కెర నిల్వల్ని పీల్చుకుంటుంది. ఇందువల్ల షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది.
అల్సర్లతో బాధపడేవారు బెండ తరచూ వాడటం వల్ల అందులోని జిగురు జీర్ణకోశానికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.
ఇక అందం విషయానికొస్తే బెండ చాలా మంచిది. దీనిని తినటం వల్ల చర్మం మృదువుగా ఉండటంతో పాటు మొహం మీద మొటిమలు రాకుండా చేస్తుంది.
జ్వరం, డయేరియా, కడుపులోనొప్పికి బెండ రసం మంచిగా పనిచేస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్ గా కూడా పని చేస్తుంది. ఇలా గృహ వైద్యానికి బెండ అన్ని విధాలా పనిచేస్తుంది. ఇక ఆలస్యమెందుకు బెండ ను తినేద్దామా. . . మరి. . !

కంటి పక్క చర్మం పై ముడతలా?



అందమైన చిరునవ్వంటే ఇష్టపడని వారుండరు, అలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనే అందరూ కోరుకుంటారు, కాని మీ అందమైన చిరునవ్వుకు మీ కళ్ళు ఇబ్బంది పెడుతున్నాయా, అదే ముడతలు పడ్డ చర్మంతో మిమ్మల్ని బాధిస్తున్నాయా, చింతించవలసిన అవసరం లేదు, సామాన్యంగా 40 ఏళ్ళ వయస్సులో మీ నవ్వుల చాటున ఈ ముడతలు వస్తున్నాయంటే అది మీ వయస్సు ప్రభావం వల్ల అనుకోవచ్చు, కాని ఇప్పటి కాలంలో 20 నుంచి 40 వరకూ, ఎక్కువగా 30 ఏళ్ళ వాళ్ళకు ఈ ఇబ్బంది వస్తుంది.



అసలు ఈ ఇబ్బందికి కారణాలేమిటి?పరిష్కరించడం ఎలా??

ఎదైనా సరే మితంగా ఉండాలి, అంటే సరిపడా ఉండాలి, ఎక్కువైతే ఎన్నో ఇబ్బందులు వస్తాయి, మన అందమైన ముఖంలో మరింత అందమైనవి మన కళ్ళు, కాని ఈ కళ్ళ పక్క చర్మం ముడతలు పడి బాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి, అందులో మనకెంతో ఇస్టమైనవే అయినప్పటికీ, ప్రమాదకరమైనవి 3, అవి ఏమిటంటే

1. ఎక్కువగా నవ్వడం

2. ఎక్కువగా ఓర కంటితో చూడడం.

3. నిదురించే పద్దతి

ఈ పై సూచించిన 3 పనులు ఎక్కువగా చేయడం వల్ల మన చర్మం సాగి, ముడతలుగా, మారుతుంది.



నవ్వడం:

ప్రతీ ఒక్కరికీ నవ్వడం అనేది ఒక గొప్ప అదృష్టం, కాని ఎవరికి వారు సొంత శైలిలో నవ్వుతూ ఉంటారు, కొందరు నవ్వెటప్పుడు వారి కంటి పక్క చర్మ కండరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.అయితే దీనిని గుర్తించి నవ్వేటప్పుడు ఆ కండరాలను ఉపయోగించకుండా నవ్వడం ఎంతో మంచిది.



ఓర కంటితో చూడడం:

సమాన్యంగా మనం ఓర కంటితో చుస్తూ ఉంటాం, ముఖ్యంగా ఏదైన వెలుతురు మన ముఖంపై పడినప్పుడు, సుర్యకాంతికి ఎదురుపడినప్పుడు, మనం ఇలా చేస్తూ ఉంటాం, ఇలా ఎక్కువ సార్లు చేస్తే మన చర్మం పగిలి ముడతలకు దారి తీసే ప్రమాదం ఉంది.



నిదురించే పద్దతి:

మన నిదురించే పద్దతిలో కుడా ఈ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది, అదే విదంగా, అదే పద్దతిలో ఈ సమస్యను పరిష్కరించే ప్రమాదం ఉంది.

అంటే, మనం నిదురించేఅప్పుడు కొన్ని పద్దతులు పాటిస్తే ఈ సమస్యనుంచి ఉపసమనం పొందవచ్చు. ముఖ్యంగా “యూ” ఆకారంలో ఉన్న దిండుని, లేదా పట్టు దిండుని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉండవచ్చు.



ఈ సమస్యను అదిగమించడానికి చాలా మార్గాలున్నాయి అవి ఇవే:

మీకు ఈ సమస్య వస్తుందేమో అని భయపడుతున్నారా, అయితే ఈ పద్దతులు పాటిస్తే మీరు సంతోషంగా, ఏ చింతా లేకుండా ఉండవచ్చు.



ఎప్పటికప్పుడు మీ చర్మాన్ని శుబ్రం చేసుకోవడం, దుమ్ము దూళితో, మలినాలు కలిగి ఉన్న చర్మాన్ని

తీసివేసి సరికొత్త యవ్వనమైన చర్మం వచ్చేలా చేసుకోవడం అంతే కాకుండా మొటిమలు, మచ్చలు లేని చర్మం కోసం మీ చర్మాన్ని శుబ్ర పరుచుకోవడం ఇలా చేయడం వల్ల మీ చర్మం లోని చనిపొయిన రక్త కణాలను తరిమేసి, కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.



ఈ చర్మాన్ని శుబ్రం చేసుకునే పద్దతిలో “గ్లైసోలిక్ యాసిడ్(Glysolic Acid)” ను ఉపయోగిస్తే అది మీ మలినమైన చర్మాన్ని శుద్ది చేసి అందమైన, యవ్వనమైన సరికొత్త చర్మాన్ని ఇస్తుంది.



ఇలా మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవడం వల్ల ఈ సమస్యను మీ దరి చేరకుండా కాపాడుతుంది.

మెరిసే చర్మం కోసం నారింజ, నిమ్మ తొక్కలతో “ఫేస్ ప్యాక్”



సహజంగా మన ఏ పండ్లు తిన్నా వాటి పై తొక్కను తీసి పడేస్తాము, అయితే చాలా మందికి తెలియని, విషయం ఏమిటంటే, చెత్త అనుకునే ఆ పై తొక్కలో కూడా మన చర్మాన్ని కాపాడే గుణం ఉంది, అది ఏమిటో తెలుసుకోవాలంటే ఇది చూడాల్సిందే..

ప్రస్తుత సమాజంలో తొందరపాటు తనంతో, సమయాన్ని వృదా చేసుకోకూడదు అనే తత్వంతో మన చర్మ సం రక్షణ కోసం మనం మార్కెట్లో దొరికే అనేక వాటిపై ఆదారపడతాము, సరిగ్గా గమనిస్తే మనం వాడేవాటిల్లో ఎన్నో మనం ఇంట్లో ఉపయోగించుకునే వస్తువులతోనే తయరు చేస్తారు, అలాంటప్పుడు, డబ్బులు ఖర్చుపెట్టి, ఆ రసాయనాల ప్రభావం వల్ల ఇబ్బందులు పడే కన్నా మీరే ఈ “ఫేస్ ప్యాక్స్”ని తయారు చేసుకోవచ్చు, అది ఎలా అంటే…ఇలా

మన మార్కెట్లో నారింజా, నిమ్మ పుష్కలంగా దొరుకుతాయి, అందులో సందేహమే లేదు, అయితే ఈ పండ్ల పై తొక్కలలోని “విటమిన్ C” మీ చర్మ సం రక్షణలో ఎంతగానో సహాయపడుతుంది.అయితే నేరుగా ఉపయోగించడం కన్నా ఈ తొక్కలను పొడిగా చేసి పౌడరు రూపంలో ఉపయోగించుకోవడం సులభము.

ఈ “ఫేస్ ప్యాక్” ని ఉపయోగించే ముందు చర్మాన్ని శుబ్రం చేసుకుంటే దానివల్ల మీ చర్మం లోని చనిపోయిన, అనవసరమైన కణాలు తొలగిపోతాయి.

ఈ నారింజ, నిమ్మ తొక్కల పొడి తయరు చేసుకోవడం ఎలా?

నారింజ, మరియు నిమ్మ తొక్కలని తీసి కొన్ని రోజులు ఎండపెట్టాలి, అవి గట్టిగా అయిన తరువాత మెత్తగా పౌడరు లాగా చేసి ఒక డబ్బాలో ఉంచాలి.అలా మీరు “ఫేస్ ప్యాక్” తయారు చేసుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చు”



ఉపయోగించుకోవడం ఎలా??

ఈ పొడిని, కొంచెం పెరుగు, నీటిలో కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మీ చర్మంలోని జిడ్డు తొలగిపోయి మిల మిల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

కొంచెం పెసర పిండి, నిమ్మ రసం కలిపి ముఖానికి పట్టిస్తే అందమైన చర్మం కలిగి, మృదువుగా మచ్చలు లేని చర్మం మీ సొంతం అవుతుంది.

ఈ పొడిని పసుపుతో కలిపి ఉపయోగించుకుంటే మొటిమల నుంచి, నల్లని మచ్చలనుంచి, చర్మం ముడతలు పడకుండా ఎంతగానో సహాయపడుతుంది.

ఈ పొడిని ఎక్కువగా చేసుకుని ఉంచుకోవడం మంచిది, ఇది పాడైపోతుందేమో అనే భయం అవసరం లేదు ఎందుకంటే ఇది పూర్తిగా ఎండిపొయిన పండ్ల తొక్కలతో తయారుచేసింది .

ఈ పై మిశ్రమం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ఒక్కసారి ఉపయోగించి చూడండి,



వేసవిలో నారింజ మరియూ తేనె “ఫేస్ ప్యాక్”

1/4 కప్పు తేనె

1 1/2 టేబుల్ స్పూన్ నారింజ

ఈ పై వన్నీ కలిపి మీ ముఖానికి పట్టించి 20-30 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

Saturday 15 October 2016

మీ కడుపులో మంటగా ఉంటుందా, “గ్యాస్ ప్రాబ్లం”(acidity)తో బాధపడుతున్నారా?


ప్రస్తుత సమాజంలో చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరూ ఈ “యసిడిటి”తో బాధపడుతున్నారు, అయితే ఈ సమస్య రోజు రోజుకూ ఎక్కువై పోతుంది, దీనిని నియంత్రించక పోతే ఎంతో ప్రమాదం.

ఇది సహజంగా ఎక్కువ కారం, మషాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల మన కడుపులో వీటి ప్రబావం ఎక్కువయ్యి మంటకు దారితీసే “యాసిడ్”లను విడుదల చేస్తుంది.



కొన్ని అనువైన, తేలికైన పద్దతులతో మీ ఈ సమస్యని తరిమేయండి ఇలా..

Caffeine ఉండే పానీయాలను తీసుకోకపోవడం మంచిది, అంతేకాకుండా ప్రొటీన్లతో కూడిన పానీయములు తీసుకోవడం ఎంతో అవసరం.

రోజు వారి జీవితంలో ఒక గ్లాసు గోరు వెచ్చని మంచి నీరు తీసుకోవడం అవసరం.



అరటి పండ్లు, పుచ్చకాయ, దోసకాయ ఇవి ఈ సమస్య నుంచి విముక్తుల్ని చేస్తాయి, రోజూ తీసుకునె ఆహరంలో ఇవి అన్ని కలిపి తీసుకోవడం, పుచ్చకయ రసం ఎక్కువగా తాగడం వల్ల మీ కడుపు చల్లబడి, ఈ సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

కొబ్బరినీరు, మీ జీర్ణ వ్యవస్తను కొబ్బరికాయ ఎంతగానో రక్షిస్తుంది, ఎప్పుడైన ఈ సమస్యతో బాధపడుతుంటే కొబ్బరి నీరు తీసుకోండి మంచి ప్రభావం చూపిస్తుంది



రోజూ తీసుకునే ఆహారంతో పాలను కూడా తీసుకోవడం వల్ల మంచి ఉపసమనం లబిస్తుంది.

2-3 గంటల వ్యవదిలో కొంచెం కొంచెం ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది.

ఒకవేళ మీకు కారంతో, మషాలాతో కూడినవి తినాలనిపించినా, వాటికి దూరంగా ఉండడం ఎంతో మంచిది.

రోజూ భోజనం చేసిన తరువాత గోరు వెచ్చని నీటిలో పుదీనా ఆకులను వేసి తీసుకుంటే ఎంతో మంచిది.



ఈ సమస్యకు పరిష్కారాలు చుద్దామా:





లవంగాలు:

2-3 లవంగాలు తీసుకొని రోజూ తినండి, దాని వల్ల వాటిలో ఉండే రసం మీ ఈ సమస్యని దూరం చేస్తుంది.



బెల్లం:

రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తినండి ఈ సమస్యనుంచి విముక్తి పొందవచ్చు, ఈ చిట్కా మధుమేహం లేని వారికి మాత్రమే.



పెరుగు:

పెరుగు, కొత్తిమీర, దొసకాయతో చేసిన మిశ్రమం తీసుకుంటే ఈ సమస్యనుంచి మంచి ఉపసమనం లబిస్తుంది.



తులసి ఆకులు:

తులసి ఆకులలో మంచి ఔషధ లక్షణాలు కలవు, అయితే అవి తినడం వల్ల, లేదా వాటిని చిన్న చిన్న ముక్కలుగ చేసి నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్యను దూరం చేస్తుంది.



మజ్జిగ:

మీరు రోజు మజ్జిగ తాగేటప్పుడు అందులో 1\4 స్పూన్ మిరియాలు పొడి కలిపి తీసుకుంటే, ఈ సమస్య నుంచి మంచి ఫలితం లబిస్తుంది.



పుదీనా:

మీ జీర్ణ సమస్యలనుండి, ఈ గ్యాస్ సమస్యనుంచి విముక్తి కోసం మీరు పుదీన ఆకుల రసాన్ని తీసుకుంటే ఎంతో మంచిది.



పాలు:

రోజు వారి జీవితంలో పాలు ఎక్కువగా తీసుకుంటే వాటిలో ఉండే Calcium కంటెంట్ మిమ్మల్ని ఈ సమస్యనుంచి కాపాడుతుంది.



వెనిలా ఐస్ క్రీమ్:

వెనిలా ఐస్ క్రీమ్ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి మంచి ఫలితం పొందవచ్చు.

చక్కని అందానికి, ఆరోగ్యానికి బొప్పాయి…

ఏడాది పొడవునా విరివిగా లభించేది బొప్పాయి.ఇందులో ఉన్న పోషకాలు మన అందరికీ ఎంతో ఉపయోగపడతాయి.బొప్పాయికి మంచి చరిత్ర ఉన్నది.అంతేకాక బొప్పాయిని మందులలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.బొప్పాయిని ఎన్నొ వ్యాధులకు, రోగాలకు, చర్మానికి మందుగా వాడుతున్నారు.రోజూవారి వనుల్లోనూ దీని ప్రాముఖ్యత ఎంతో ఉంది.బొప్పయిని నావికా పితామహుడైన క్రిస్టఫస్ కొలంబస్ కు ఇష్టమైన పండుని చెబుతారు.ఇది సామాన్యంగా అన్ని ఉష్ణమండల ప్రదేశాలలో పండుతుంది.తక్కువ ఉష్ణోగ్రతతో పెరుగుతుంది.బొప్పాయి ఆకులు, విత్తనాలు, పాలు ప్రేగులోని పరాన్నజీవుల్ని నాశనం చేయటానికి,చాలా రకాల వ్యాధులకు మందుగా పని చేస్తుంది.అంతేకాక గర్భ నిరోధానికి,గర్భస్రావానికి ఉపయోగపడుతుంది.బొప్పాయి రుచి,దాని విషేషతలు విస్తారమైన ఆరోగ్యానికి సోపానంగా నిలుస్తుంది.

చర్మం మరియు బొప్పాయి:
ఇది మీ చర్మాన్ని కాపాడుకోవటానికి విశిష్టమైన దివ్య ఔషధం.దీనిని ముఖానికి ఫేస్పాక్ గా వాడుకోవచ్చు.ముఖంపై ఏర్పడిన మచ్చలకు,మొటిమలకు,చర్మ వ్యాధులకు ఉపయోగించవచ్చు.చర్మంలో ఏర్పడిన మృతకణాలను,మృత చర్మన్ని పోగొడుతుంది.చర్మం మరింతగా ప్రకాశించేదుకు బొప్పాయి తోడ్పడుతుంది.

వంటిలోని కొవ్వును తీసివేయటంలో బొప్పాయి పాత్ర:
శరీరంలోని కొవ్వును తీసివేయటంలో,రక్తకణాలలోని కొవ్వును బొప్పాయి తీసివేస్తుంది.గుండె పోటు రానీయకుండా నివారిస్తుంది.

చర్మ సౌందర్యానికి బొప్పాయి: బొప్పాయి ఫేస్ మాస్క్ గా చాలా మంచిది. బొప్పాయి వయస్సును మీద పడినా వారిలో సైతం తన ప్రభావాన్ని చూపుతుంది.చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.వయస్సు మీరిన వారిలోనూ అందాన్ని పెంపొందించుతుంది.

శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను బొప్పాయి నివారిస్తుంది.అంతేకాక ఇది జీర్ణవ్యవస్ధపై చక్కగా పని చేస్తుంది.కాకపోతే మీరు బొప్పాయిని రోజూ వాడాలి.అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.
వ్యాధినిరోధకశక్తి మరియు బొప్పాయి: ఈ పండులో విటమిన్-ఎ,విటమిన్-సి ఉండటం వల్ల శరీర వ్యాద్థి నిరోధకశక్తి పెరుగుతుంది.అంతేకాక జ్వరం,జలుబు,ఫ్లూతో బాధపడే వారికి ఎంతో మంచిది.రోజూ బొప్పాయి తినటం వల్ల రోగ నిరోధక శక్తి బాగా అభివృధ్ధి చెందుతుంది.
ఋతు క్రమ సమస్యలకు బొప్పాయి: ఆడవారిలో తరచూ ఉండే ఋతుక్రమ సమస్యలకు బొప్పాయి చక్కని మందు.అంతేకాక ఆడవారిలో రుతుక్రమ సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పిని కూడా బొప్పాయి తొలగిస్తుంది.
కాలేయ కాన్సర్ కు బొప్పాయి: కాలేయ సమస్యలకు దూరంగా ఉండేట్లు బొప్పాయి చేస్తుంది.అంతేకాక కాలేయంలో ఉన్న కణాల్లో కాన్సర్ కారక క్రిములను చంపేస్తుంది.

అధిక బరువును తగ్గించటంలో బొప్పాయి: అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గాలంటే బొప్పాయిని రోజూ వాడితే బరువు తగ్గుతారు.బొప్పాయిలో ఉన్న సహజమైన పోషకాల వల్ల తక్కువ కాలరీలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.సన్నగా తయారవాలని ఆశపడేవారికి బొప్పాయి వల్ల సన్నగా తయారయ్యే అవకాశముంది.

మలబధ్ధకానికి బొప్పాయి: మలబద్ధకానికి బొప్పాయి మంచి మందు.జీర్ణాశయంలో బొప్పాయి పని చేసి మలబద్ధకం నుంచి బయటపడేస్తుంది.మలబద్ధకం రాకుండా ఉండేందుకు బొప్పాయిని వాడితే మంచి ఫలితాలనిస్తుంది.బొప్పయిలో ఉన్న పొపైన్ ఎన్జయం జీర్ణవ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుంది.

బొప్పాయి చాలా మంచి పొషక విలువలు ప్రోటీనులు కలిగిన పందు.అంతేకాక ఇది పండ్లన్నిటిలోనూ చవకగా లభించే పండు.వారానికి ఒకసారైనా దీనిని తినటం ఎంతో మంచిది.బొప్పాయిని చర్మానికి కూడా రాయటం వల్ల చర్మం మెరుస్తుంది.మనం ఎంతో ఖర్చు చేసి వాడే ఫేస్ క్రీములకన్నా బొప్పాయి ఎంతో మిన్న.

మధురమైన "తేనె" చేసే మహాద్భుతాలు!

మీకు మూత్రం పదే పదే వస్తుందా…?? ఆఫీస్‌లో ఈ సమస్యతో మూత్రానికి వెళ్ళడానికి ఇబ్బంది పదుతున్నారా…??
వర్షాకాలం వస్తే మరింత సతమవుతున్నారా….?? అయితే మీ ఇంట్లోనే, మీకు అందుబాటులోనే ఔషధం ఉంది… అదే “తేనె”…. అతిమూత్రవ్యాధికే కాదు… ఆరోగ్యానికి ఏ రకంగా తేనె మేలు చేస్తుందో తెలుసుకుందామా!!
అతి మూత్రవ్యాధితో బాధపడేవారు రోజూ రాత్రి నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనె పుచ్చుకుంటే మాటి మాటికి మూత్రానికి వెళ్ళే బాధ తగ్గుతుంది..

1. పెరిగే పిల్లలకు తేనె ఎన్నోరకాలుగా మేలు చేస్తుంది. పోషకాహారంగా పిల్లలకు తేనె ఎంతో మేలు చేస్తుంది.

2. ఆరు నెలలు పూటకు రెండు ఔన్సుల చొప్పున తేనె పుచ్చుకుంటే గుండెకు మేలు చేస్తుంది.

3. క్రీడాకారులు ఆటల్లో పాల్గొనబోయే ముందు తేనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుంటే ఉత్సాహం, ఉత్తేజం కలిగి త్వరగా అలసట కలుగదు. ఆటలు ఆడిన తర్వాత తీసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.



4. ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయరసం, అరగ్లాసు నీటీలో కలిపి తీసుకుంటే వడదెబ్బను నివారించవచ్చు.

5. తేనె పుచ్చుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది.

6. తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలను గర్భిణీలు రోజూ ఉదయం, సాయంత్రం ఒకటి లేదా రెండు తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారు.

7. తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి, గొంతు గరగర, గొంతు బొంగురుపోయినట్లుండటం వంటి బాధలు తగ్గుతాయి.

8. ప్రకృతిలో సహజసిద్దంగా లభించే ఆహారపదార్ధాలలో తేనె ఉత్తమమైనది, పుష్టికరమైనది. తేనెలో కొద్దిగా ఆముదం చేరిస్తే మలబద్దకాన్ని నివారిస్తుంది. పంచదారకు బదులుగా తేనెను వాడటం అన్నివిధాలా ఉపయోగకరం. జీర్ణక్రియలో భాగంగా గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్‌లుగా మారిన తరువాత క్రమంగా జీర్ణం అవుతాయి. భోజనానంతరం తేనె తీసుకుంటే పైత్యహారిగా పనిచేస్తుంది. శరీరంలోని అధిక వేడిని తొలగిస్తుంది.

9. రెండు గ్లాసుల నీటిలో నాలుగు టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి తాగాలి. ఇది డయేరియా తగ్గడానికి సులభమైన మార్గం.
తేనె రక్తాన్ని శుద్ధి చేసి, బ్లడ్‌ సర్క్యులేషన్‌ని క్రమబద్దీకరిస్తుంది.

10. అధిక బరువును తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకొని తాగితే స్థూలకాయాన్ని నివారించవచ్చు. కాలిన గాయాలను త్వరగా తగ్గిస్తుంది. అల్సర్‌ను నివారిస్తుంది.

11. నోటి పూత, నోటిలో గుల్లలు వంటి సమస్యల నివారణకు తేనె వాడొచ్చు.

12. ప్రతిరోజూ ఒక టేబుల్‌స్పూన్‌ తేనె నీటిలో కలిపి పరగడుపునే తీసుకుంటే కిడ్నీలు బాగా పనిచేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చక్కెరతో పోల్చితే తేనెలో క్యాలరీలు తక్కువ. తేనెలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ.

ఇంతేకాక ఎనీమియా, ఆస్తమా, బట్టతల, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, బిపి, ఒత్తిడి, పక్షవాతం వంటి అనేక వ్యాధుల బారినపడకుండా కాపాడుతుంది “తేనె”

Friday 14 October 2016

మీ ఆరోగ్యం గురించి బెంగుళూరు మిరపకాయ(కాప్సికమ్) చెప్పే కబుర్లు


సామాన్యంగా ఘాటునిచ్చే మిరపకాయ అంటే తెలియని వాళ్ళుండరు,అదేవిధంగా అందరికీ కాకపొయినా ఎక్కువమందికి తెలిసినదే ఈ “కాప్సికమ్”,దీనిని ముద్దుగా “బెంగుళూరు మిరపకాయ”,బెల్ పెప్పర్”,” చిల్లీ” అని కూడా పిలుస్తారు.
దీనిని ఎన్నో సంవత్సరాల నుంచి పెద్ద సంఖ్యలో పండిస్తున్నారు, ఇది 2 రకముల రంగులలో పండుతుంది, ఆకుపచ్చ రంగు, ఏరుపు రంగు, అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఇది అధిక విటమిన్లు, మరియూ ఎన్నో ఔషద లక్షణాలు కలిగి, ఎన్నో వ్యాదులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.

ఈ మిరపకాయ వల్ల కలిగే లాభాలు ఇవే:
క్యాన్సర్ నివారణ:
క్యాప్సికం క్యాన్సర్ నివారణలో ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న కాంపౌండ్స్ “Capsaicins “మన రక్త కణాలతో కలిసి క్యాన్సర్ బారినుండి రక్షిస్తాయి.


జుట్టు:
దీని వల్ల జుట్టు ఉత్పత్తి బాగా అవ్వడమే కాకుండా,జుట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది.అంతే కాకుండా, మీరు ఎక్కువ జుట్టు కలిగి ఉండడానికి ఎంతో సహాయ పడుతుంది.
కళ్ళు మరియు చర్మము:
ఇది తినడం వల్ల మీ చర్మం ఎంతో తాజాగ, మొటిమలు లేకుండా,అందంగా ఉండడమే కాకుండా, దీనిలో ఉన్న “Vitamin A” మీ కళ్ళకు సం రక్షణగా ఉపయోగ పడుతుంది.
క్యాలరీలను తగ్గించుట:
ఇది మీ శరీరంలోని అనవసరమైన కాలరీలు తగ్గించు, మీరు అధిక బరువుతో బాదపడుతుంటే, దానిని తగ్గించి మిమ్మల్ని విముక్తుల్న్ని చేస్తుంది, అంతే కాకుండా ఇది మీ గుండెకు ఇబ్బంది కలిగించే మలినాలు అంటే కొవ్వు పదార్దాలను కరిగించి ఏ విదమైన ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని రక్షిస్తుంది.
నొప్పి నిర్మూలన:
ఇది తీసుకోవడం వల్ల మీ చర్మంలోని నొప్పిని మీ శరీర అంతర్బాగాలకు సోకకుండా,పుండ్లు పడకుండా ఎంతగానో రక్షిస్తుంది.నొప్పిని తగ్గించి మీకు మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.

బ్రాంకైటిస్‌ను నివారించుకోండిలా..!

ఖంగు..ఖంగ్..ఖంగు..ఖంగ్..అని దగ్గు వస్తుంటే చెప్పలేనంత ఇబ్బందిగా ఉంటుంది.అమ్మో..ఈ దగ్గు మనల్ని ఎప్పుడు వదులుతుందో అన్న బాధ నిలువెల్లా కలచివేస్తుంది. అంతేకక ఈ దగ్గు వల్ల ఊపిరితిత్తులే కాక గొంతు మంటా,గొంతులో గరగర ఇలా ఎన్నో మనల్ని వేధిస్తాయి.అయితే ఈ దగ్గులోఎన్ని రకాలున్నాయి అని ప్రశ్నిచుకుంటే సమాధానాలు చాలా వస్తాయి.దీనినే బ్రాంకైటిస్‌ అని అంటారు.ఈ రుగ్మత మనిషిని ఎంతో బాధిస్తుంది.ప్రాధమికంగా దీని నుంచి బయటపడే కొన్ని చిట్కాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.


మొదటిదైన అక్యూట్ బ్రాంకైటిస్ అనేది జలుబు, దగ్గు తీవ్రంగా ఉండడం వల్ల వస్తుంది. ఒళ్ళునొప్పులు, నీరసం, జ్వరం, తలపోటు వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఒకవేళ దీనికి సరైన చికిత్సను తీసుకోకుంటే అది న్యూమోనియాకు దారితీసే అవకాశాలున్నాయి.

క్రోనిక్ బ్రాంకైటిస్ అనేది తరచూ ధూమపానం చేయడం, పొగాకు ఉత్పత్తులను సేవించడం ద్వారా సోకుతుంది.ఊపిరితిత్తుల్లో శ్వాసకోశ సమస్యలను కూడా పెంచుతుంది. బ్యాక్టీరితో సోకిన బ్రాంకైటిస్‌కు యాంటీబయాటిక్స్ అవసరముంటాయి కానీ వైరస్‌తో సోకిన వ్యాధికి తప్పనిసరిగా చికిత్స చేయాల్సి ఉంటుంది. వ్యాధి ప్రాథమిక దశలో ఉండగా, ఈ చిట్కాలను పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.


శీతలపానీయాల జోలికి వెళ్ళకుండా ఆరోగ్యకరమైన పళ్ళ రసాలను సేవించాలి. మనకు ఇబ్బంది పెడుతున్న అనుకునే ఫలాలను మినహాయించాలి.

వీలైనంతవరకు మంచినీటిని ఎక్కువగా సేవించాలి కాచి వడబోసిన నీరైతే మరింత శ్రేష్టం.గోరువెచ్చని హెర్బల్ తేనీరు సేవించడం వల్ల ముక్కు, గొంతు సమస్యలకు ఉపశమనం ఉంటుంది.


చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడేవారు ఆల్కాహాల్, సోడాను పూర్తిగా తగ్గించాలి. వీటి వల్ల డీహైడ్రేషన్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

థైమ్ టీ సహజ ఔషధం, క్యామోమైల్ టీని గొంతులో గరగరకు, పెప్పర్‌మెంట్‌కు టీ ముక్కుదిబ్బడను తగ్గించడానికి, అనీసీడ్, హోలీ బేసిల్‌ను దగ్గు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గోరువెచ్చటి నీటిని సగం టీస్పూన్ఉప్పుతో కలిపి నోరు పుక్కిలిస్తే గొంతు సమస్య తగ్గిస్తుంది. నిమ్మ, నారింజలు ఈ ద్రవంతో కలిపితే అది యాంటీబ్యాక్టీరియల్‌గా కూడా పనిచేస్తుంది.

కొన్ని సందర్భాల్లో చికెన్ సూప్‌ను కూడా జలుబు తగ్గడానికి ఉపయోగిస్తారు. మ్యూకస్‌ను పనితీరును మెరుగుపరిచి సమస్యను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది.

పడక గది వాతావరణంలో కాస్త తేమను ఉండేలా చూసుకోవాలి. సహజంగా లభించే యాంటీవైరల్ ఉత్పత్తులైన ఆర్గానో ఆయిల్, అల్లం మిశ్రమాలను ఉపయోగించవచ్చు

మనకు రోజూ కనిపించే అల్లంలో ఎన్నో పోషక విలువలుంటాయి. యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉన్న అల్లం చెవి, ముక్కు, గొంతు సమస్యలను నివారించడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

సైనస్ ఉన్నవారు అరోమాథెరపీ స్టీమ్‌ను దీర్ఘంగా పీల్చితే కాస్త ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు వైద్యుల సూచన ప్రకారం కొన్ని తైలాలు ఈ థెరపీకి ఉపయోగిస్తే శ్వాస సాధారణంగా మారడానికి తోడ్పతుంది. పుదీనా, శొంఠివి వంటిని మితంగా కలపడం కూడా మంచిది.

వాంటింట్లో దాగి ఉన్న ఔషధాలు


రోజూ మాటిమాటికీ వంటింట్లోకి వెళ్ళందే ఆడవారికి పని జరగదు.అయితే మనకు శరీరంలో ఏర్పడే వ్యాధులకు చక్కని ఔషధ లక్షణాలు మన పోపుల పెత్తేలోనే దాగున్నాయి తెలుసా..! ప్రతివారి ఇంట్లోను సాధారణంగా వంటింట్లో కనిపించే వస్తువు పోపుల పెట్టి.పోపుల పెట్టిలో దినుసులు లేకుండా ఏ పనీ ఏ వంటా జరగదు.అదే పోపుల పెట్టెలో మన అరోగ్యం దాగి ఉందని మనలో చాలా మందికి తెలియదు.ఆ పోపుల పెట్టెలో ఉన్న ఆరోగ్య సూత్రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుందని, ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం ఘోషిస్తోంది. వికారం, వాంతులు, విరోచనాలను నివారిస్తుంది. . గర్భవతులలో ఉదయం పూట వికారాన్నికడుపునొప్పిని అల్లం నివారిస్తుంది.

దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొలెస్ట్రాల్, ట్రెగ్లీసెరైడ్ స్థాయిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కుంకుంపువ్వు చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దేశ విదేశాలలో ఆహార పదార్థాలలో రుచి, రంగు, సువాసన కోసం వాడే కుంకుమపువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు వున్నాయి.



వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి.పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో అధికంగా వున్నాయి.

జీలకర్ర జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రీయాశీలం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా వుంచుతుంది.

ఫెన్నల్ ఇది మరువంలాంటి మొక్క. దీన్ని కూరల్లో వాడుతారు. ఫెన్నెల్స్ డైయూరిటిక్ గుణం కలిగి ఉంది. ఇది ఋతుస్రావ సమయంలోని ఇబ్బందుల్ని తొలగిస్తుంది. పొత్తికడుపులకు ఉపశమనాన్నిచ్చే శక్తి ఫెన్నల్ తైలానికి ఉంది. పాలిచ్చే తల్లులలో పాలు సమృద్ధిగా వుండడానికి ఎంతో తోడ్పడుతుంది

లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు దంత రక్షణనిస్తాయి. నోటిని, శ్వాసను తాజాగా వుంచుతాయి. హృదయానికి ఆరోగ్యాన్నిస్తాయి. యాంటిసెప్టిక్, యాంటీబయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు.

ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది.

మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. బ్లాక్ కాఫీలో మిరియాలపొడి వేసుకుని తాగితే ఋతుక్రమ సమయంలో ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తుంది.

పచ్చి ఏలకులు శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు ఏలకులు వేసిన పాలను తాగించాలి. ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి ఏలకులకు ఉంది.ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది.

Thursday 13 October 2016

కొబ్బరి పాలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎలా సహాయ పడతాయి?



రోజూ ఒక గ్లాసు పాలు తాగితే మంచిది అని అందరూ సూచిస్తారు, కాని ఆవుపాలకన్నా కొబ్బరిపాలు ఎంతో ఆరోగ్యకరమైనవి అని ఎంత మందికి తెలుసు?
కొబ్బరి పాల ప్రత్యేకత ఏమిటంటే:

ఇవి ఆవుపాలకన్నా ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయి,అంతేకాకుండా ఆవు పాలతో పోలిస్తె,అతి సులభంగా జీర్ణం అవుతాయి.

దీనిలో “Omega”అను ఆమ్లాలు 3, 6 మరియు 9 శాతం అధికస్తాయిలో ఉండి,ఈ ” Omega “లో అమైనో ఆమ్లాలు మరింత అదికంగా ఉన్నాయి, వీటన్నిటి కలయికతో కూడిన ఈ కొబ్బరి పాలు ఒక సంపూర్ణ భోజనముగా అనిపిస్తుంది.

ఈ పాల మన జీర్ణ సమస్యలు తొలగించడమే కాకుండా,జీర్ణాశయంకు కలిగిన నస్టాన్ని తొలగించటలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

” IBS “,” Crohn’s ” వంటి వ్యాదుల నుండి రక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

ఎంతో మందికి “పాల ఉత్పత్తులు”వాడకం ఇష్టం ఉండదు, అయితే అలాంటివారు ఈ కొబ్బరిపాలను తీసుకుంటే ఎంతో మంచిది.

ఇందులో భాస్వరం మరియు కాల్షియం వంటి పొషక పదార్దాలు ఉండడంవల్ల,మీ యముకలని భలంగా ఉంచుతుంది,సామాన్యంగా భాస్వరం వల్ల మీ యముకలకు బలం వస్తుంది.యముకకు సంబందించిన ఏవైన ఇబ్బందులు ఉన్ననూ వాటిని తొలగించి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

దీనిలోని “గ్లూకోజ్”,రక్తములో చక్కెర నిల్వలు తక్కువగా ఉన్న వారికి ఎంతోగానో సహాయ పడతాయి.

మీ కీళ్ళ నొప్పులను తగ్గించడంలో ఎంతో మంచి మందులా మీరు ఉపయోగించుకోవచ్చు.

ఇందులో “పొటాషియం” కలిగి ఉండడం వల్ల అది మీ శరీరంలోని ఒత్తిడిని తగ్గించి మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.

దీనిలోని “Vitamin C” మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

రోజుకో కప్పు కొబ్బరి పాలు తీసుకుంటే మీలోని రక్త హీనతను తొలగించవచ్చు.

మీ యముకలలోని నొప్పి, వాపు, ఇలాంటి వాటిని దూరం చేసి మీకు మంచి ఫలితాలను అందిస్తుంది.

దీనిలోని ఖనిజాలు మిమ్మల్ని క్యాన్సర్ బారి నుండి రక్షిస్తాయి .

మీరు అధిక బరువుతో బాదపడుతంటే ఈ కొబ్బరినీరు మీకు ఎంతో మంచిది.

ముద్దులోలికించే పసి పిల్లలకు(1-2 ఏళ్ళు) ఆహార జాగ్రత్తలు


ముద్దులోలికించే పసి పిల్లలంటే ఇష్టపడని వారుండరేమో,ఎన్ని కష్టాలు అనుభవిస్తే మాతృత్వం లభిస్తుందో, అంతే ఆనందం ఆ చిట్టి పొట్టి పిల్లలు అడుగులు వేస్తుంటే కలుగుతుంది,అయితే వారి పట్ల తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి,తల్లినుంచి లబించే ఆహారం,సరిపోయినప్పటికీ,వాళ్ళ ఎదుగుదలకు ఎన్నో రకములైన పోషక పదార్దాలు అవసరం.సమాన్యంగా పిల్లలు సంవత్సర కాలంలో 3-5inch మాత్రమే పెరుగుతారు, అయితే వారివారి వయస్సు,చురుకుతనం, బరువుని దృష్టిలో ఉంచుకుని రోజుకి 1,000-1,400 క్యాలరీలు ఉండే ఆహారం ఇవ్వాలి.అదేవిధంగా క్రమం తప్పకుండా, డాక్టర్ ని సంప్రదిస్తే మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించనవసరం లేదు.
తప్పటడుగులు వేసే మీ చిన్నారులకు ఆహార నియమాలు ఇవే:
ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చే ఆహారం:
మీ పిల్లలు తినేటప్పుడూ ఎక్కువగా అల్లరి చేస్తూ, ఒక్కొక్కటే తింటూన్నారా,అయితే ఆ ఒక్క వాటిలోనే అన్ని రకముల పోషక పదార్దాలు ఉండేలా చూసుకోవాలి,కొంచెం కొంచెం పెడుతూ తినిపిస్తూ ఉండాలి, అంతే కాకుండా వెన్న, బన్ను,వేరుసనగ వెన్న, ఇలా తినిపిస్తూ ఉంటే మంచిది.
మీ బుజ్జి పాపకి లేదా బాబుకి “డ్రింక్స్” తయారుచేయండి:
అందమైన మీ చిన్నారులకి ద్రవం రూపంలోనే ఎక్కువ పొషకాలు పట్టించండి, అయితే ఎక్కడ “జ్యూస్” లను కాకుండా పాలు, నీరు, కొంచెం పండ్ల రసము కలిపిన నీరు కలిపి పట్టిస్తే ఎంతో మంచిది .

చిరు తిండి:
ఎప్పుడూ అల్లరి చేస్తూ ఆడుతూ మనల్ని నవ్వించే మన పసిపిల్లలు ఆడీ ఆడీ, అలసిపోతారు, అందుకే కొంచెం సమయం తరువాత కొద్ది కొద్దిగా చిరుతిండి తినిపిస్తే ఎంతో మంచిది, చిరుతిండి అనగానే మనం తినేవి కాకుండా, పొషక పదార్దాలతో కూడినవి,”యాపిల్ సాస్, వెన్న,కేక్,క్యారెట్”ఇలా.
తిండిలోని మార్పులో:
ఆ చిన్నవయస్సులో, ఏమి తెలియని పసిపిల్లలకు రోజు ఒకే రకమైన ఆహారం పెట్టడం మంచిది కాదు, బోర్ కొట్టి తినడం మానేస్తారు, మనమైనా అంతేకదా, రోజూ ఒకే రకమైన కూర తింటే మనకైనా బోర్ కొడుతుంది.
అందుకే రోజుకోరకంగా రంగు, రుచి,వాసన, మరియూ పొషక పదార్దాలు,మారుస్తూ, పెట్టడం మంచిది,మరియూ మీ పిల్లలకు అరటి పండు, యాపిల్ ని ముక్కలుగా చేసి తినిపించడం, లేదా వాటిలో పెరుగు కలిపి పట్టించడం మంచిది.
అధికంగా తినిపించే కన్నా పౌష్టికమైన ఆహారం కొంచెమైనా చాలు:
ఒకవేళ మీ పిల్లలు ఎక్కూవగా తినకపోయినా, తినిపించేది తక్కువైన పౌష్టికమైన ఆహారం ఇవ్వడం ఎంతో అవసరం.అంటే ఎక్కువగా తినిపించనవసరం లేదు, కొద్దిగా అయినా బలాన్ని చేకూర్చే ఆహారం పెట్టడం మంచిది.
వాళ్ళు తినడం లేదు అని ఎక్కువగా అలోచించి కంగారు పడనవసరం లేదు, మీరు చెయ్యవలసిందల్లా, వాళ్ళు తినే కొంచెం ఆహారంలో అయినా పొషక పదార్దాలు నిండుగా ఉండేలా చుసుకుంటే సరిపోతుంది,
ప్రోటీన్లు, కాల్షియం, మినరల్స్, Vitamin C,పండ్లు, తృణధాన్యాలు, కొవ్వులు, సమృద్ధిగా ఉండే ఆహారాలు మీ పిల్లలకు ఇవ్వండి.
పైనవన్ని పాటించి మీ చిట్టి పొట్టి పిల్లలకు సరైన ఆరోగ్యంతో పాటు,వయస్సుతో సరిసమానమైన ఎదుగుదల కావాలంటే వారిని ఆటలు ఎక్కువగా ఆడించండి.

Share this:

మీ చర్మ రక్షణలో “మల్లెల తైలం(Jasmine Oil)” చేసే మంత్రాన్ని చూద్దామా


మల్లెపువ్వు,మగువల అందాన్ని వర్ణించడానికి,ఎందరో కవులు ఉపయోగించినది,అందానికి చిరునామ “మల్లెపువ్వు”అని చెబితే అతిసయోక్తి కాదేమో.అయితే ఈ మల్లెపువ్వు తియ్యదనంతో పాటు సువాసనకు మారుపేరుగా నిలుస్తుంది.ఈ పరిమళాన్ని ఇప్పటికీ జపాన్ మరియు ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

గమ్మత్తు ఏమిటంటే, కాలనుగుణంగా పూచే పూలలో ఈ మల్లె పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంది, అది ఏమిటంటే ఈ మల్లె రాత్రి పూట మత్రమే పూస్తుంది,అందుకే దీనిని చీకటి పడిన సమయాల్లో కోస్తారు.అయితే దీనితో తయారు చేసిన ఆయిల్ ఎంతో సువాసనబరితమైనది, దీనిని తయారు చేయుటకు ఎన్నో మాల్లె పూల రేకులను ఉపయోగిస్తారు.ఇది చాలా అరుదుగా దోరికేది అయినప్పటికి ఎంతో ప్రఖ్యాతిగాంచినది.
మల్లెపువ్వు మనలోని నిస్సహాయతను దూరం చేసి, విశ్వాసాన్ని పెంచుతుంది, అంతే కాకుండా ఇది మన శరీరంపై “యాంటి డిప్రెసంట్”, “యాఫ్రొడిసియాక్”గా పనిచేసి మనలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

గాలీ, వెలుతురు, ఇలా ఏమీలేకుండా నిశబ్దం అల్లుకున్న గదులలో, తన సుగంధ పరిమళాలతో మళ్ళీ జీవాన్ని తెచ్చి సువాసన పరిమళంగా మారుస్తుంది.
ఈజిప్షియన్లు ఈ మల్లెపువ్వుని వారి “నరము వ్యాదులకు” చికిత్సగా ఉపయోగిస్తారు, అంతే కాకుండా తలనొప్పికీ, నిద్రలేమికి కుడా ఉపయోగిస్తారు.
దీని ప్రయోజనాన్ని అనేక పద్దతులు,సంస్కృతులు, కార్యక్రమాలలో అనేక విధాలుగా ఉపయోగిస్తారు, అంతే కాకుండా దీని యొక్క “యాఫ్రొడిసియాక్” తత్వం మీ మానసిక స్తితిని మార్చడంలో ఎంతగానో సహాయ పడుతుంది.మీరు అధిక ఒత్తిడికి లోనైనప్పుడు, మల్లె ఆయిల్ తో మసాజు చేయించుకుంటే మీ ఒత్తిడి తగ్గి,మనసిక స్తితి మెరుగుపడుతుంది.
ఈ ఆయిల్ కొంచెం అధిక దర ఉన్నప్పటికీ మీ శరీర సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రత్యేకముగా మీ చర్మం యొక్క రంగుని,కోమలత్వాన్ని,కాపాడి మీలోని అలసత్వాన్ని తరిమికొడుతుంది.మీ చర్మం పై కాలిన గాయాలకు ఒక ఔషదంలా ఉపయోగపడుతుంది.
దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి, అవి ఏమిటంటే ఇది ఒక క్రిమినాశక ఏజంట్ గా,జుట్టు ఎదుగుదలకు,దెబ్బలకు,కాలిన గాయాలకు ఒక మంచి చికిత్సగా,ఉపయోగించుకోవచ్చు.
అయితే దీనిని మూలికల మిశ్రమాలతో అంటే “రోజ్ వుడ్”,గంధము,నిమ్మతో కలిపితే శరీరం యొక్క సహజ తత్వాన్ని ప్రోత్సహించి మంచి ఫలితాన్నిస్తుంది.
ఈ ఆయిల్ ని మీ ఉదరం(పొట్ట)పై రాసుకుంటే మీ గర్భాశయ సంకోచాలలోని(Inner Parts)ఏవైన ఇబ్బంది ఉంటే దానిని తొలగించి మంచి ఉపసమనాన్ని అందిస్తుంది.
ఆరోగ్యకరమైన, ఉల్లసభరితమైన స్నానం చేయాలంటే కొంచెం 1\2గ్లాసు సోయా ఆయిల్, 5 చుక్కలు మల్లె ఆయిల్, 3 చుక్కలు జునిపెర్ ఆయిన్, తీసుకుని VitaminE ని కూడా కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.
ఆరోగ్యకరమైన మసాజ్ కోసం, 8 స్పూన్లు ద్రాక్ష రసం,6 చుక్కలు మల్లె ఆయిల్,2 చుక్కలు “టీ పైన్” ఆయిల్,”నిరోలి ఆయిల్”, కలిపి చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.
అందమైన, కోమలమైన జుట్టు కోసం, ఈ మల్లె నూనెని 2 చుక్కలు తీసుకుని, దీనిలో 2 చుక్కలు “రొజ్ మేరి”ఆయిల్, 2 చుక్కలు”క్లారి సేజ్”,1\2ఔన్స్ బేస్ ఆయిల్ కలపి జుట్టుకి పట్టించాలి .

పంటి నొప్పితో బాధపడుతున్నారా??


మన జీవితంలో, కాలానుగుణంగా మార్పులు సంభవిస్తూ ఉంటాయి.అదే విదముగా ఆరోగ్య సమస్యలు కూడా,ఋతువుల మార్పుతో మనలో ఎన్నో మార్పులొస్తాయి అందులో ప్రత్యేకంగా ఈ కాలంలో అంటే చలి కాలంలో వచ్చే సమస్యలలో దంతాల సమస్య(పంటి నొప్పి) భరించలేనిది.మీ పళ్ళలో నొప్పి వస్తుందంటే మీరు వాటిని సరిగా రక్షించుకోవడంలేదు అనే అర్దం, అయితే కారణాలు ఏవైన అవి మన డాక్టర్ మాత్రమే చెప్పగలరు,నొప్పి వరకు తెచ్చుకుని నిద్ర లేని రాత్రుళ్ళు గడిపేకన్నా,పరుగు పరుగున డాక్టర్ వద్దకు పరుగెత్తేకన్నా, కొన్ని పద్దతులు పాటిస్తే మీ పళ్ళను రక్షించుకోవచ్చు, అవి ఏమిటంటే..


ప్రతీ రోజు ఆహారం తిన్న తరువాత కొంచెం గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించి వేయాలి.

ఉదయం లేచిన వెంటనే, రాత్రి పడుకునేముందు ఖచ్చితముగా పళ్ళను తోముకోవాలి(బ్రష్ చేసుకోవాలి).


ఏ దంతము అయితే మిమ్మల్ని బాదిస్తుందో, దాని వద్ద లవంగ మొగ్గ లేదా జాజి కాయ,ఉంచితే మంచి ప్రభావం చూపించడమే కాకుండా నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.

ఏ దంతమైతే ఎక్కువగా నొప్పి కలుగుతుందో దానిపై “ఐస్” ఉంచి మీ వేలితో రుద్దాలి.

బాగా భరించలేని నొప్పి కలిగితే ఒక “ఐస్” ముక్క తీసుకుని మీ నొప్పి కలిగించే పంటికి, మీ బుగ్గకీ మధ్య ఉంచుకోవాలి,అలాగే రోజుకి 3-4 సార్లు చేస్తే నొప్పి తగ్గుతుంది.

ఎక్కువగా పాలు మరియూ ఆకు కూరలూ తీసుకోవడం మంచిది, ఎందుకంటే వీటిలో ” కాల్షియం” అదికంగా ఉండి మీ పంటికి బలాన్ని ఇస్తుంది.

తీపి,ఐస్ కీంలు,చల్లని పదార్దాలు ఇలాంటీ వాటికి దూరంగా ఉండడం అవసరం దీనివల్ల దంత క్షయం కలిగి, దంతాలకు హాని కలిగే ప్రమాదం ఉంది.

మీరు మీ పంటి నొప్పితో బాదపడుతున్న సమయంలో వేడి పదార్దాలను దూరంగా ఉంచండి, ఎందుకంటే ఈ సమయంలో అవి తీసుకుంటే మీ నొప్పి తగ్గడం కన్న ఇంకా అధికమయ్యే ప్రమాదం ఎక్కువ.

Wednesday 12 October 2016

ఆపిల్ వల్ల కలిగే ఉపయోగాలెన్నో???


అందరికీ సుపరిచితం అయిన ఈ పండు గురించి ఎక్కువగా వర్ణించవలసిన అవసరం లేదు, కాని ఈ ఆపిల్ తీసుకోవడంవల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది,ఇది మీకు మంచి పోషకాలు సమకూర్చి మిమ్మల్ని ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
అయితే శాస్త్రవేత్తలు దీని పై అనేక ప్రయోజనాలపై అద్యయనం చేస్తున్నారు,ఇది రోజు తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని డాక్టార్లు సూచిస్తున్నారు, అయితే మన అరోగ్యానికి ఆపిల్ వేసే మంత్రం ఏమిటో చుసేద్దామ.

1.కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
ఆపిల్ ను క్రమంతప్పకుండా తీసుకుంటే, మీ ఒంట్లోని కొవ్వు శాతాన్ని తగ్గించడమే కాకుండా, గుండెకు హాని కలగకుండా కాపాడుతుంది, ముఖ్యంగా ఈ ఆపిల్ లో ” పెక్టిన్”అనే పదార్దం పుష్కలంగా కలిగి ఉంది, ఇది మన శరీరంలోని కొవ్వు పదార్దాలను నిర్మూలించడంలో
సహయపడడమే కాకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
2అధిక రక్త పోటును తగ్గిస్తుంది:
మీరు సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే గుండె వ్యాధులు మరియు రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ, అయితే రోజుకో ఆపిల్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే “మినరల్స్”,”పొటాషియం”,మీ రక్త పోటును తగ్గించుటలో సహాయపడుతుంది.
3.మెదడుకు సంబందించి వ్యాదులను తగ్గిస్తుంది:
ఒక అధ్యయనంలో ఈ ఆపిల్ జ్యూస్ రోజు తీసుకోవడం వల్ల మీ మెదడుకు సంబందించిన వ్యాదులను అరికట్టడమే కాకుండా మీ మెడదును సం రక్షించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, ఈ అధ్యయనంలో దీనిని ఒక “ఎలుక”పై ప్రయోగించారు,రోజూ ఎలుకకి ఆపిల్ జ్యూస్
పట్టించడం ద్వారా సాదరణ ఆహారం కన్నా ఈ ఆపిల్ లో “న్యూరోట్రాన్స్మిటర్ ఎసిటైల్” అధిక స్థాయిలలో ఉంది అని నిరూపించబడింది.

4.పెద్దప్రేగు కాన్సర్ నివారణలో:
మన కడుపులో ఉండే పేగులు సరిగా లేకపోతే అది మనకు “జీవన్మరణ” సమస్యే అవుతుంది, అయితే ఈ ఆపిల్ ని రోజు తీసుకోవడం ద్వారా, ఈ సమస్యలో మారణాన్ని జయించి జీవాన్ని కొనసాగిస్తారు,ఆపిల్ లోని “ఫైబర్”లక్షణాలు మీ కడుపులో ఉండే క్యాన్సర్ తో పోరాడి మిమ్మల్ని
దాని బారి నుండి రక్షిస్తుంది.
5.మీ గుండెను రక్షిస్తుంది:
సామాన్యంగా మన రక్త కణాలు, రక్త ప్రసరణ సరిగా లేదంటే దానికి సాకులు(కారణాలు) వెతుక్కోనవసరం లేదు, అందుకంటే దానికి కారణం సరియైన, పొషకమైన ఆహారం తీసుకోకపోవడమే. అయితే వీటన్నిటికి ఈ ఆపిల్ తో సమాధానం ఇవ్వండి, రోజు ఆపిల్ తీసుకోండి, మీ గుండె
జబ్బులను నయం చేసుకోండి.
6.ఆస్తమాని తగ్గిస్తుంది:
ఆపిల్లో ఉన్న “ఫైటో కెమికల్స్” పదార్దాలు “ఫ్లవనోయిడ్స్”,”ఫినోలిక్ యాసిడ్” మీ శ్వాస సంబందిత వ్యాదులనుండి రక్షించడంలో ఎంతగానో సహాయ పడుతుంది,అంతే కాకుండా ఈ దీనిని(ఆపిల్) రోజూ తీసుకుంటే “ఆస్తమాని” జయించవచ్చు.
7.ఎముక రక్షణకు సహాయపడుతుంది:
మీ యముకల రక్షణలో కూడ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది,దీనిలో ఉన్న “ఫోలోరిడ్జిన్”మీ ఎముకల సమస్యను తరిమికొడుతుంది,అంతే కాకుండా మీ ఎముకలను గట్టిగా, దృడంగా చేస్తుంది. ఇది పెద్దవారు, చిన్నవారనే కాదు,అందరు తీసుకోవచ్చు.
అందుకే పాతదే అయిన మళ్ళీ చెప్పేది ఒక్కటే “రోజుకో యాపిల్ తినండి, డాక్టర్ కి దూరంగా ఉండండి”

డెంగ్యూ గురించి తెలుసుకుందాం రండి..!


అమ్మో..డెంగ్యూనా అని ప్రతి ఒక్కరూ భయపడుతున్న అంటువ్యాధి డెంగ్యూ.ఇప్పుడు భారతదేశంలో ప్రజలను గడ గడలాడిస్తున్న అంటురోగాలో ముఖ్యమైనది.ఉష్ణదేశోత్పన్నమైన ప్రాంతాలలో,ఉప ఉష్ణదేశోత్పన్నమైన ప్రాంతాలలో ఇది బాగా ప్రబలుతుంది.దీనినే ఆంగ్లంలో ‘బ్రేక్ బోన్
ఫీవర్ ‘ అనికూడా అంటారు.ఈ వ్యాధి దెంగ్యూ వైరస్ వల్ల ఇది సోకుతోంది.దీనివల్ల జ్వరం, తలనొప్పి, నరల నొప్పులు,కొండరాల నొప్పులు, తట్టు మచ్చలు వస్తాయి.కొంత మందిలో చలా తక్కువ శాతం మంది దెంగ్యూ వ్యాధి సోకి రక్తస్రావం, రక్తపట్టికల శాతం పూర్థిగా తగ్గిపోవటం వంటివి జరుగుతాయి.అలాగె
కొన్నిసార్లు రక్తంలోని ప్లాజ్మా కారే అవకాశాలున్నాయి.ఈ వ్యాధి డెంగ్యూ షాక్ సిండ్రోం లొనికి కూడా మెల్ల మెల్లగా చేరుస్తుంది.ఇది చాలా ప్రణాంతకమైన వ్యాధి.ఈ డెంగ్యూ వ్యాధి దోమల వల్ల కకుగుతోంది.ముఖ్యంగా ఆఎదెస్ ఏగ్య్ప్తి అనే దోమ కారణంగా వస్తుంది.ఈ దోమ మానవుని కుట్టినప్పుడు దెంగ్యూ వ్యాప్తి
చెందుతుంది.దీనిలో కొన్ని రకాలున్నాయి.కొందరిని ఈ వ్యాధి జీవితంతాం మాపు లేకుండా బాధిస్తుంది,మరికొందరిలో కొంతకాలం తన ప్రభావాన్ని చూపుతుంది.ఏది ఏమైనా ఈ వ్యాధి తీవ్ర ఇబ్బ్బందులకు గురిచేస్తుంది.ఇంకా దీనికి వాక్సిన్ ను కనిపెట్టని కారణంగా ముందు జాగ్రత్త చర్యలే తీసుకోవాలి.అవి ఎంటో
మనం ఇప్పుదు చూద్దామా..!

డెంగ్యూ వ్యాధి లక్షణాలు.
జ్వరం:
అకస్మాత్తుగా ఇది ప్రవేశిస్తుంది.
39.5-41.4°సి ఉష్నోగ్రతల వరకూ ఉంటుంది.
1-7 రోజుల కడపటి రోజుల వరకూ వస్తుంది.1-2 రోజులకు జ్వరం తగ్గుతూ వస్తుంది.
మరలా రెండవ దశగా చిన్న చిన్న తట్టు మచ్చల్లా మొదలవుతుంది.
తలనొప్పి:
సాధారణంగా జ్వరంతో పాటూ తలనొప్పి మొదలవుతుంది.అయితే తల నుదుటి మీదకాని.కళ్ళ వెనుక కానీ తలనొప్పి వస్తుంది.
నరాల నొప్పి లేదా ఎముకుల నొప్పి:
1.జ్వరంతో పటూ ఇవి బాధిస్తాయి.ఈ నొప్పులు తీవ్ర స్థాయిలో ఉంటాయి.
2.కటి కుడివైపు గానీ,కాళ్ళవద్దగానీ, కీళ్ళ వద్దగానీ వస్తాయి.
ఈ నొప్పులు చాలా తీవ్ర స్థాయిలో బాధిస్తాయి.
3.జ్వరం తగ్గినా నొప్పులు మాత్రం కొన్ని వారాల వరకూ బాధిస్తూనే ఉంటాయి.
నొప్పులు సాధారణంగా డీహెచెఫ్ఫ్ /డీఎసెస్ లో పోతాయి.

ఆరోచితము మరియూ వాంతులు:
1.ఆకలి మందగించటం జరుగుతుంది.
2.వాంతుల స్థాయి పెరిగిపోతుంటుంది.
3.రుచి మారిపోతుంటుంది.
4.లక్ష్ణాలు పిల్లల్లో ఉన్నంత తక్కువగా పెద్దల్లో ఉండవు.

తట్టు మచ్చలు:
ఇవి రావటం మెల్లగా మొదలవుతుంది.

డెంగుఎ హెమోర్ర్హాగిచ్ Fఈవర్ / డెంగ్యూ షాక్ సిండ్రోం:
వ్యాధి మొదలైన కొన్ని రోజులకే డెంగ్యూ అని తెలుస్తుంది.
అంతేకాక జ్వరం సహాయంతో 2-7 రోజుల తర్వాత లక్ష్ణాలు మరింతగా పెరుగుతాయి.అవి:
1.విశ్రాంతి లేకపోవటం.
2.రక్త ప్రసరణ వ్యవస్థ పాడవుతుంది.
3.రక్త స్రావం తో పాటూ మరిన్నింటిని స్పష్టం చేస్తుంది.
4.చర్మంపై ఎర్ర మచ్చలు వచ్చి బాధిస్తాయి.
5.ముక్కులోనుంచి రక్తం కార్టం జరుగుతుంది.
6.పంటి చిగురు నుంచి రక్తం కారతుంది.
7.పొట్టలోనుంచి రక్తం వస్తుంది.అంతే వాంతులు అయ్యే సమయంలో రక్తం పడుతుంది.
8.రక్త పట్టికల సాతం క్రమేపీ తగ్గిపోతుంది.

డెంగ్యూ నివారించటానికి ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టడం జరుగలేదు.అందువల్ల దీనికి ముందు జాగ్రత్త చర్యలే మార్గం.అవేంటో చూద్దాం.
ముఖ్యాంగా ఈ డెంగ్యూని వ్యాప్తి చేసేది దొమలే కాబత్తి దోమ కాటు నుంచి జాగ్రత్త వహించాలి.
ప్రపంచా ఆరోగ్య సంస్థ దిశానిర్దేశకాల ప్రకారం ఇంటిగ్రేటెడ్ వెక్టర్ కంట్రోల్ ప్రోగ్రాం అనే ప్రోగాం ద్వారా ఇచ్చింది.
1.అవగాహనా విధానలను అందరికీ తెలియ చెప్పాలి.
2.ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సమన్వయంతో దీనిపై అవగాహన కల్పించాలి.
3.వ్యాధిని నివారిచేందుకు అన్నివిధాల ప్రయత్నించాలి.
4.క్రియాశీలకమైన,నిర్ణయాత్మక తో వ్యాధి ఏ ప్రదేశాలలో ఎక్కువ ప్రబలిందో చూడాలి.
5.ఈ వ్యాధిని ఎదుర్కొనేదుకు శక్తి సామర్ధ్యాలను పెంచుకుని సమిష్టిగా క్రుషి చేయాలి.

ఇంత్లో మనం పాటించవలసిన జాగ్రత్తలు:
1.దోమలను సాధ్యమైనంతగా రానివ్వకుండా చూసుకోవాలి.
2.మురికి కాల్వలను పరిసరాలలో లేకుండా చూసుకోవాలి.
3.దోమ తెరలను వాడాలి.
4.రోజూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
5.పొడవాటి బత్తలను శరీరాన్ని పూర్థిగా కప్పేటట్లు వేసుకోవాలి.
ఇలా ముందు జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూ వ్యాధికి దూరంగా ఉండవచ్చు.