చలిజ్వరం వస్తే?
ఒక్కోసారి జ్వరం వచ్చినప్పుడు శరీరంలో విపరీతమైన చలి వచ్చి పగలు, రాత్రీ తేడా లేకుండా దుప్పటి కప్పుకుని పడుకుంటాం. దీనికి కారణం చలి జ్వరం. వాతావరణంలో మార్పులు వచ్చాయంటే వాటితోపాటే వచ్చే జ్వరాల్లో శీతల జ్వరం ఒకటి. ఉన్న చోట కూర్చొనివ్వదు. పడుకుంటే లేవలేం. శరీరాన్ని తాకుతూనే కాగే పెనంపై చేయి పెట్టినట్టే. విపరీతమైన తలనొప్పి. ఈ వ్యాధికి వాతావరణంలో మార్పులే ప్రధాన కారణమవుతాయి. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామా!
చలి జ్వరం లక్షణాలు
1.విపరీతమైన జర్వం వస్తుంది.
2.భరించలేని తలనొప్పి పట్టి పీడించేస్తుంది.
3.వళ్ళంతా ఒకటే నొప్పులు ఉంటాయి. ఇవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
4.జ్వరమొచ్చి పట్టించుకోకపోతే రెండు వారాల వరకూ ఉంటుంది. నిర్లక్ష్యం చేసి తేడా వస్తే ప్రాణానికే ప్రమాదం. వళ్ళంతా చచ్చుగా తయారవుతుంది.
నివారణ మార్గాలు
ఈ వ్యాధి కారకాలు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. కనీసం వారం రోజుల పాటు శరీరంలో దాగి ఉంటాయి.
1. చేతి రుమాలు లేదా టవెల్‌ను కలసి వాడడం వలన త్వరగా సోకే ప్రమాదం ఉంది. అన్నింటికంటే ముఖ్యం.
2.ఎవరి చేతి రుమాలు, టవెల‌్‌ను వారు మాత్రమే వాడడం మంచిది.
3.భోజనం చేసే ముందు లేదా ఏదైనా పదార్థాలు తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం ఉత్తమం.
4. చిన్న పిల్లలకు త్వరగా సోకే అవకాశాలున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ కనుక వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

0 comments so far,add yours