నాకు ఆ వంకాయ కూర వద్దు..గోంగూర తినను నాకు పడదు. అమ్మో.. దుమ్ము వాసన, సోపు వాసన పడదు తుమ్ములోస్తాయ్ అని ఇలా చాలామంది చెబుతుంటారు. సాధారణార్థంలో శరీరం ఏదైనా పదార్థాన్ని స్వీకరించలేకపోవటం, సహించలేక పోవడాన్నే ఎలర్జీగా పిలుస్తున్నారు. వైద్య పరిభాషలో కొన్ని పదార్థాల పట్ల శరీరంలోని కణాలు భిన్న రీతిలో వ్యవహరించి అవలక్షణాలను వ్యక్తపరచటాన్ని ఎలర్జీగా చెబుతున్నారు. ఎలర్గీ కారకాల గురించి తెలుసుకుందామా!

శరీర కణాలు భిన్నరీతిలో వ్యవహరించటానికి ఎలర్జిన్‌ అనే మాంసకృత్తి కారణం. ఇది నీటిలో , గాలిలో, ఆహారంలో, ఇలా ప్రతి చోటా వుంటుంది. ఈ ఎలర్జిన్‌ కలిగి వున్న పదార్థం శరీరాన్ని తాకినా, లోపలికి ప్రవేశించినా కణాలు దాన్ని సరిగా స్వీకరించవు. శరీర కణాల ఈ అసాధారణ ప్రతిస్పందననే ఎలర్జీ అంటున్నారు వైద్యులు.



ఎలర్జీ కారకాలు

చిన్న పాటి ప్రభావాలు కలిగించే రకంనుంచి మొదలుకుని తీవ్ర పరిణామాలు కలిగించే వరకు ఎలర్జీ కారకాలు వైవిధ్య పూరితంగా ఉంటున్నాయి. ముఖ్యంగా పసి పిల్లల్లోను, చిన్న పిల్లల్లోనూ ఎలర్జీ సులువుగా ప్రభావం చూపుతూ వుంటుంది.

పిల్లలకు గుడ్లు, పాలు, గోధుమ వంటి పదార్ధాలు కూడా పట్టక పోవచ్చు. ఈ సమస్య ఐదేళ్ల పిల్లల వరకే వుంటుంది. అటు తర్వాత గాలిలో వుండే పుప్పొడి, దుము్మ, ధూళి, జంతువుల రోమాలు మొదలైనవి ఎలర్జీని కల్గిస్తాయి. ఇంకా చేపలు, వివిధ రకాల మాంసం, గింజలు, టమోటాలు, నిమ్మ, నారింజ, చాక్లెట్లు వంటివి సైతం ఎలర్జీని కలిగిస్తాయి.
Share To:

0 comments so far,add yours