బధిరత్వం అంటే?
ప్రస్తుతం ఎక్కడ ఎవరిని చూసినా చెవుల్లో ఇయర్ ఫోన్లతో కనపడుతున్నారు. పాటలతో సరదాగ ట్రాఫిచ్ లోనూ నడుచుకుంటూ, ఆఫీస్ లో పని చేసుకుంటూ ఇలా ఒక్క చోటేమిటి ప్రతి చోటా వాటిని వదల కుండా చెవుల్లొనే ఉంచుకుంటున్నరు. ఇందువల్ల ఎలక్ట్రానిక్ పరికరాల పుణ్యమా అని భారతీయ యువత వినికిడి సమస్యలను ఎదుర్కుంటున్నది. “హ్యాండ్స్ ఫ్రీ” ఇయర్ ఫోన్లు తమ వంతు పాత్రను ఇతోధికంగా పోషిస్తున్నాయి. అవేంటో మనం తెలుసుకుందామా!
బధిరత్వం అంటే వినికిడి సమస్య వల్ల వచ్చే రుగ్మతలు
బధిరత్వం మానవుని సామాజిక వర్తనానికి తీవ్రంగా ఆటంకం కలిగిస్తుంది. బాధితునిలో భావోద్వేగాలను పెంచుతుంది. వినికిడి సమస్య కారణంగా అలసట, ఆందోళన, ఒత్తిడి మరియు ఆత్మన్యూనత భావనలు సంప్రాప్తిస్తాయి.
పైన పేర్కొన్న రుగ్మతలు సమస్యను ఎదుర్కుంటున్న వారిని సామాజికంగా వెలివేసినంత పనిచేసి ఒంటరితనాన్ని మిగులుస్తాయి.
1. చురుకుదనాన్ని తగ్గించడమేకాక, వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగిస్తుంది.
2. జ్ఞాపకశక్తిపై దుష్ప్రభావాన్ని చూపి కొత్త విషయాలను నేర్చుకోవాలనుకునే సామర్థ్యాన్ని తుడిచి వేస్తాయి.
3.అంతటితో ఆగక వృత్తిలో నైపుణ్యాన్ని తగ్గిస్తుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే బధిరత్వం మనిషి ఆరోగ్యంపై చెడుప్రభావాన్ని చూపిస్తుంది.
ముందుగా గుర్తించడం ద్వారా, చికిత్సతో పుట్టకతోనే ఏర్పడే బధిరత్వాన్ని దూరం చేయవచ్చునని నిపుణులు అంటున్నారు. సరియైన వైద్యుని సంప్రదించి వినికిడిని పెంచే ఆధునిక యంత్రాల వినియోగంతో బధిరత్వాన్ని తాత్కాలికంగా దూరం చేసుకోవచ్చు. అనంతమైన సంగీతాన్ని వినిపించే ఐప్యాడ్‌లు, వీడియో గేమ్‌లు, డిస్కో పార్టీల్లో హోరెత్తించే సంగీతం తదితరాలు పట్టణ ప్రాంతాల యువతను వినికిడి సమస్యకు దగ్గర చేస్తున్నాయి. శబ్ద స్థాయిని తగ్గించుకుని సంగీతాన్ని ఆస్వాదించడం ద్వారా వినికిడి సమస్యను కొని తెచ్చుకునే ప్రమాదాన్ని దూరం చేసుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.

0 comments so far,add yours