స్క్లిరోసిస్ అంటే?

యుద్ధ క్షేత్రంలో రాజు కోసం సైనికులు తమ ప్రాణాలొడ్డి పోరాడతారు. అలాంటి సైనికులే పోరాడక ఎదురు తిరుబాటు చేస్తే..ఇలాంటి పరిస్థితే మన శరీరాంకి వస్తే ఏం జరుగుతుంది?ఎల్లవేళలా కంటికి రెప్పలా మన శరీరాన్ని కాపాడేవి రోగ నిరోధక కణాలు. ప్రాణాన్ని కాపాడాల్సిన ఈ కణాలే ప్రాణాన్ని హరిస్తాయి. వాటి వల్ల వచ్చే దాని పేరే సిస్టమిక్ స్క్లిరోసిస్.. ఈ వ్యాధి ఎలా వస్తుందో తెలుసుకుందామా!

రోగనిరోధక వ్యవస్థ అనేది శరీరం మొత్తాన్ని రోగక్రిములనుంచి కాపాడే అద్భుత వ్యవస్థ. మనది కానిది ఏదైనా మన శరీరంలోకి ప్రవేశిస్తే వెంటనే యాంటీబాడీలను తయారుచేసి దాన్ని బయటకు పారదోలే అద్భుతమైన వ్యవస్థే రోగనిరోధక వ్యవస్థ -ఇమ్యూన్ సిస్టమ్-. కొన్ని సందర్భాల్లో రోగనిరోధక వ్యవస్థ తయారుచేసిన ఈ యీంటీబాడీలు మన సొంత కణాలనే పరాయివిగా భావించి దాడి చేస్తాయి. దాని ఫలితమే ఆటో ఇమ్యూన్ వ్యాధి.

శరీరాన్ని నిర్వీర్యం చేసే సిస్టమిక్ స్క్లిరోసిస్ కూడా ఈ కోవకు చెందినదే. భారతీయులకు ఇది అరుదుగా వచ్చే జబ్బే అయినప్పటికీ దీని బారిన పడ్డవారికి మాత్రం ఇది ప్రాణసంకటం లాగే ఉంటుంది. శరీరమంతటినీ అనుసంధానించే ప్రసరణ కణజాలాన్ని దెబ్బతీసే ఈ వ్యాధి శరీరంలోని అన్ని ప్రధాన అవయవాల పైనా ప్రభావం చూపిస్తుంది. చర్మం నుంచి జీర్ణ వ్యవస్థ, శ్వాసకోశాలు, గుండె, కిడ్నీలు.. ఇలా అన్నీ క్రమక్రమంగా దెబ్బతినడంతో మనిషి కుప్పగూలిపోతాడు.

వ్యాధిని గుర్తించటం ఇలా

సాధారణ ఇన్‌ఫెక్షన్లలాగ ఈ వ్యాధిలో జ్వరం వంటి లక్షణాలేవీ కనిపించవు. దగ్గు, ఆయాసం మాత్రం ఉంటాయి. వీరు కొద్ది దూరం కూడా నడవలేరు. అతి త్వరగా అలసిపోతారు. చిన్న పని చేయడానికైనా కష్టపడతారు. బరువు తగ్గిపోతారు. శరీరం నీలిరంగులోకి మారవచ్చు. శ్వాసకోశాలు దెబ్బతిన్నప్పుడు బ్రాంకైటిసి లక్షణాలన్నీ కనిపిస్తాయి. అందుకే న్యూమోనియా, క్షయలాంటి వ్యాధులేవీ లేవని నిర్ధారించుకోవడం అవసరం.



కొన్ని సందర్భాల్లో ఇతర శ్వాసకోశవ్యాధులేవీ లేవని స్పష్టమైన తర్వాత బయాప్సీ చేయాల్సి వస్తుంది. ఊపిరి తిత్తుల బయీప్సీ చేసేటప్పుడు కొంత కణజాలాన్ని కోసి తీసి పరీక్షించాల్సి ఉంటుంది. ఇలాంటప్పడు గాలిని ప్రసరింపజేసే చిన్నచిన్న శ్వాసమార్గాలు చిట్లిపోయి గాలి బయటకు వచ్చే అవకాశముంటుంది. దీని వల్ల శ్వాసకోశాలు మరింత దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.
చికిత్సా విధానం

1. శ్వాసకోశాల పనితీరు చాలావరకు దెబ్బతినడం వల్ల ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేషన్ అనే పరికరం ద్వారా నిరంతరం గాలిని పంపించాల్సి వస్తుంది. ఇది నైట్రస్ ఆక్సైడ్‌ని ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను శరీరంలోకి పంపిస్తుంది. దీన్ని జీవితాంతం వాడాల్సి ఉంటుంది.

2. ఇమ్యూనిటీని తగ్గించే దశలో మందులు చాలా అవసరం. కాబట్టి ఇమ్యునో సప్రెసెంట్ మందులను జీవితాంతం వాడుతూనే ఉండాలి. కాని వీటి వల్ల సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఎక్కువ.

3. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల అనేక రకాల ఇన్‌ఫెక్షన్లు చుట్టుముడతాయి. స్టెరాయిడ్స్ వాడకంతో ఎముకలు మెత్తబడడం, ఆస్టియోఫోరోసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

4. బిపి, మధుమేహం వ్యాధులు కూడా చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలకు ఎప్పటికప్పుడు చికిత్స అందించగలిగితే కొంత మేలు కలుగుతుంది. వీటన్నిటికంటే ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేయించుకుంటే చాలావరకు పరిష్కారం అవుతుంది.
Share To:

0 comments so far,add yours