చెప్పకుండా వచ్చేదే జబ్బు. అయితే కొందరికి ఆరోగ్యంపై ఉన్న శ్రధ తో ముందే మెల్కొంటారు. కొందరికీ అసలు పూర్తి నిర్లక్షం ఉంటుంది. మరికొందరు కొంచెం జబ్బు ముదిరాక గాని కళ్ళు తెరిచి డాక్టరు వద్దకు వెళ్ళరు. జలుబు, దగ్గు, విరోచనాలు, వాంతులు చెప్పి వహ్చ్చే రోగాలయితే, కొన్ని వ్యాధులు చెప్పకుండా మన శరీరంపై దాడి చేస్తాయి. అలాంటి రోగాల గురించి తెలిసి ముందు జాగ్రత్తలు తీసుకోవాలంతే ఆ లక్షణాలు తెలిసి ఉందాలి. కాబట్టి వాటిని మీకోసం అందిస్తున్నాం..
1. శ్వాసలో ఇబ్బందులు
మనం గుర్తించలేని విధంగా సాధారణంకంటే ఎక్కువసార్లు ఊపిరి పీల్చటం లేదా తక్కువసార్లు ఊపిరి పీల్చటం అలాగే లోతుగా ఊపిరి పీల్చటం లేదా పైపైన పీల్చటం లోపల ముదురుతున్న జబ్బుకు తొలి లక్షణాలు కావొచ్చు. రక్తం లేకపోవటం, శ్వాస నాళంలో అడ్డంకులు, తక్కువ స్థాయిలో ఎప్పుడూ ఉండే ఉబ్బసం, ఊపిరి తిత్తుల్లో రక్తంగడ్డ కట్టటంలాంటి సమస్యలు తలెత్తి ఉండవచ్చు. ఇవి కాక తెలియని మానసిక ఆందోళన అలజడితో సతమతమవుతూ ఉండి ఉండవచ్చు.
2. ఉన్నట్టుండి బరువు తగ్గటం
కావాలని వ్యాయమం ద్వారానో, డైటింగ్ ద్వారానో, మరే ఇతర కారణాల వల్ల బరువు తగ్గితే ఫర్వాలేదు. కాని అలవాట్లలో మార్పులేకుండా అప్పనంగా బరువుతగ్గడం మామూలుగా వీలు అయ్యే పని కాదు. గుర్తించదగిన కారణాలు ఏవీ లేకుండా ఆరునెలల కాలంలో 10 శాతం బరువు తగ్గారంటే మీ ఆరోగ్యం ఎక్కడో చెడిపోతుందని అర్థం. కాన్సరు, మధుమేహం, హైపరు థయరాయిడిజిం, దిగులు, కాలేయ సంబంధ జబ్బులు, తిండి అరుగుదల సమస్యలతోపాటు అరిగిన తిండి ఒంటికి పట్టుటలో సమస్యలు ఉన్నట్టు పరిగణించాలి.
3. అసహజంగా ప్రవర్తించటం
ఉన్నట్టుండి తికమక పడిపోవటం, కాస్సేపుఎక్కడ ఉన్నది. చుట్టూ ఏమి జరుగుతున్నదీ తెలియపోవటం, ఏకాగ్రత కుదరకపోవటం, విచిత్రంగా ప్రవర్తించటం, ఎప్పుడూ లేనిది ఉన్నట్టుండి కోపాన్ని ప్రదర్శించటం, ఆలోచనల్లో తేడా రావటం అనేవి మెదడులో జరిగి తిష్టవేసుకొని కూర్చున్న జబ్బులకు తొలి లక్షణాలు. ఇవి కొంతసేపు కనిపించి తిరిగి వాటంతట అవే తగ్గిపోవచ్చు. దాని అర్థం లోపల జబ్బు పోయిననది కాదు. కాబట్టి ఇలాంటి లక్షణాలు తొలిసారి కనిపించినా ఏమీ లేదని తేల్చేవరకు వాటిని గురించి పట్టంచుకోవాలి. పక్షవాతం, మూర్ఛ, మెదడులో పెరిగే కణుతులు, నెత్తురు గొట్టాలలో అడ్డంకులు ఏర్పడటం ఇలాంటి లక్షణాలకు కారణాలు అయి ఉంటాయి.
4. మీరు ఎంత తింటే ఏ మేరకు కడుపు నిండినట్టు ఉంటందో మీకు ఒక అంచనా ఉంటుంది. దానికి భిన్నంగా కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తున్నా వేళకు ముందే ఆకలి అనిపిస్తుంటేనే దాన్ని గురించి కొంత పట్టించుకోవాలి. రోజుల తరబడి పులి తేపులురావటం, కడుపు ఉబ్బరంగా ఉండటంలాంటి లక్షణాలు జీర్ణవ్యవస్థలో ముదిరే జబ్బుకు ముందస్తు లక్షణాలు. అవి అతి సాధారణమైన అసిడిటీ నుండి పాంక్రియాటీకు కాన్సరు వరకూ ఏదయినా కావొచ్చు.
5. కళ్లముందు మిరుమిట్లు కనపడటం, చుక్కలు కనపడటం, ఉన్నట్టుండి కాసేపు చీకటిగా మారటం, కళ్ళ ముందు తెరలు తెరలుగా కనపడటం వెనుక ఒక కారణం ఉంటుంది. అవి అతి సాధారణము అరున మైగ్రయిను తలనొప్పి నుండి అత్యంత ప్రమాదకరము, అత్యవసర చికిత్స అవసరమైన కంటి లోపలి రెటినా ఊడిపోవటం వరకు ఏదయినా కావొచ్చు.
ఇటువంటి లక్షణాలు ఎమైనా మన శరీరంలో కలిగినప్పుడు ఖచ్చితంగా వెంటనే డాక్టరును సంప్రదించాలి. వ్యాధి ముదరక ముందే జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం.

0 comments so far,add yours