స్నేహమంటే ఇదేనోయ్! 

నాగరాజు ఓ amusement park కి వెళ్ళాడు. అక్కడ ఓ బోర్డు ముందు నిలబడి జూదం ఆడబోతుంటే ఓ గొంతు అతని చెవిలో వినబడింది.
"ఓరేయ్! నాగరాజు, నేను నీ ఫ్రెండ్ పరాత్పరరావ్ ని. నువ్వు ఓ వందరూపాయలు ఆ పచ్చరంగు మీద ఆడు." అందా గొంతు.
నాగరాజు వంద రూపాయలు కాశాడు. దాంతో వెయ్యి రూపాయలు వచ్చిందతనికి.
"ఈసారి ఎరుపు రంగు మీద ఆడు" అంది ఆత్మ.
దాంతో పదివేలొచ్చిందతనికి.
"ఈసారి బ్లూ రంగు మీద కాసెయ్" అందా గొంతు.
లక్ష రూపాయలొచ్చింది నాగరాజు కి
"ఇప్పుడు దేనిమీద కాయమంటావ్" అడిగాడు నాగరాజు
"తెలుపు" అంది ఆ గొంతు
అంతే!.. అంతా మట్టిగొట్టుకు పోయింది.
"అరరే !! నాకూ ఇలాగే ఆఖర్లో తంతేనే.. వళ్ళు మండి ఆత్మహత్య చేసుకున్నాను.." అంది గొంతు.


Share To:

0 comments so far,add yours