Wednesday 5 October 2016

తులసి చెట్టుకు ప్రతిరోజూ పూజ చేస్తారు ఎందుకు ?

ఒకనాడు తెల్లారితే కౌసల్యా సుప్రజా రామ..అన్న సుప్రభాతంతో పాటు మహిళలు తులసి కోట చుట్టూ తిరగటం మనం చూసే వాళ్ళం. కానీ మారుతున్న జనరేషన్లో దీని ప్రాధాన్యం తెలియకుండా పోయిందంటే అతిశయొక్తి కాదేమో. కాని తులసికి ఉన్న ఔషద గుణాలు దేనికీ ఉండవనే చెప్పవచ్చు. అందుకే మన సంస్కృతిలో ప్రతి ఇంట్లో తులసి కోట ఉండేది. అది ఈ మధ్య కనుమరుగవుతోంది. తులసి మన ఆరోగ్యానికి ఏమి ఇస్తుందో తెలుసుకుందామా..

తులసి ఆకు సర్వరోగ నివారిణి. తులసి ఆకులు రుచికి చేదుగా, వగరుగా ఉన్నప్పటికీ అగ్నిప్రదీపకం. గుండెకు బలాన్నిస్తుంది. అంతేకాదు ఇది చాల సుగంధభరితమైనది. తన చుట్టూ ఉన్న గాలిని శుద్ధిపరుస్తుంది.

సూర్యోదయానికి ముందే దీని సేవనం ప్రయోజనకరం అని శాస్త్రాలు చెబుతున్నాయి. మన పెద్దలు కుడా చెఫ్తుంటారు. తులసిలో శ్రీతులసి, కృష్ణతులసి అనే రెండు రకాలున్నాయి. ఈ రెండింటిలోనూ సమానమైన ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకులు, వేర్లు, విత్తనాలు అన్నింటిలోనూ ఒక్కో ఔషధ గుణం ఉన్నది. దీని ఆకులలో ఉన్న సుగంధం క్రిమికీటకాలను, రోగాణువులను అరికడుతుంది.

తులసీ దళాలను నీటిలో వేస్తే నీటిలో ఉన్న సూక్ష్మక్రిములు నాశనమవుతాయి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు రెండు పెద్ద స్పూన్ పరిమాణంలో తులసి రసాన్ని తీసుకుని తగినంతగా తేనె చేర్చి 2,3 సార్లు తాగితే తగ్గుతుంది. తులసి ఆకులను నమలవచ్చు. ఇంటిచుట్టూ తులసి మొక్కల ఉంటే దోమల బాధ ఉండదు.

Image result for tulasi

1. గొంతునొప్పి, స్వరం సరిగా పలుకని సమయంలో కొంచెం నీళ్లలో తులసి ఆకులను వేసి ఉడికించి ఆ నీటితో పుక్కిలిపట్టాలి. నీళ్లు వెచ్చగా ఉన్నప్పుడే చేయాలి.

2. పైత్యం, అలర్జీ లేదా ఏదైనా పురుగు కొరికినప్పుడు తులసి రసాన్ని రాయాలి. రెండు స్పూన్ల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగించాలి. తులసి ఆకులలో చెమటపట్టించే గుణం ఉంది. అందుకే అన్నిరకాల జ్వరాలలోను తులసి రసాన్ని తేనెతో కలిసి నాలుగు గంటలకు ఒకసారి ఇస్తారు.

3. లివర్ సమస్య ఉన్నటువంటి వారికి తులసి ఆకుల కషాయం చాలా మంచిది

4. మూత్రవిసర్జనలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెరతోపాటు తీసుకోవాలి.

5. తులసి విత్తనాలను ఒక గంటపాటు నీటిలో నానబెట్టి బాగా పిసికి, వడగట్టి తాగాలి. గజ్జి మొదలైన చర్మవ్యాధులలో దురద ఎక్కువగా ఉంటే తులసి ఆకుల రసాన్ని రాసి తులసి కషాయాన్ని తాగించాలి.

మన ఆరోగ్యానికి ఓ మంచి ఔషధంగా పనిచేసే తులసిని మీ ఇంట్లో ఈ రోజే నాటండి. చక్కని ఆరోగ్యం సొంతం చేసుకోండి.

0 comments:

Post a Comment