గజగజమనిపించే చలికాలం.. అదేనండీ శీతాకాలం మన చర్మం పై దాడికి త్వరలో సిధ్ధం కానుంది. శీతాకాలం వచ్చిందంటే చర్మం పొడిబారిపోయి అసహనానికి గురిచేస్తుంది. ఇక మహిళలు సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి శీతాకాలంలో చర్మం ఎదుర్కొనే ఇబ్బందులకు పార్లర్లనో, క్రీములనో అన్వేషిస్తుంటారు. ఎన్ని వాడినా చర్మం రసాయనాలకు అలవాటు పడి పాడైపోతుందే కానీ సహజసిధ్ధంగా ఉండదు. కాబట్టి శీతా కాలంలో అతివల చర్మ సౌందర్యానికి ఇంట్లో వాడే చిట్కాలను మీకందిస్తున్నం. అవేంటో ఒకసారి చూద్దామా..

1. పొడిచర్మం కలిగినవారు చర్మాన్ని శుభ్రపరచుకునేటప్పుడు పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌ను వేసి బాగా కలిపి కాటన్‌తో చర్మంపై రుద్దుకోవాలి.

2. మృదువైన చర్మం కలిగినవారైతే, ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి.

Image result for winter skin tips

3. పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. ఒకవేళ మీరు మాస్క్ వేసుకుంటే పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు.

5. అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.

6.మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది.

7.కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

8.కాళ్లూ, చేతులకు గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్‌, తేనె కలిపి… ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేతులకు, కాళ్ళకు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి.
Share To:

0 comments so far,add yours