Thursday 6 October 2016

ఉభయకాయనికి వణుకు పుట్టించండి... ఇలా!

నిల్చోవాలంటే ఇబ్బంది, కుర్చీలో కూర్చోవాలంటే ఇబ్బంది, వేగంగా నడవాలంటే కష్టం, పరిగెత్తాలంటే కష్టం..బస్సు ఎక్కాలంటే కష్టం..ఏ పని చేయాలన్నా కష్టం. ఏం సమస్యా అని ఆలోచిస్తున్నారా? అదే ఊబకాయం. ఈ సమస్య పొట్ట పెరగటం ద్వార వస్తుంది. పొట్ట ఎక్కువైపోయి ఏ పనీ చేయలేక ఇబ్బందికి లోనవుతారు. దీనిని అధిగమించటాం ఎలాగో తెలుసుకుందామా..

ఫొట్ట రావటం మొదలైందంటే ఊబకాయం వచ్చే సూచనలున్నాయని అర్థం. తినడం ఎక్కువై, క్యా లరీల ఖర్చు తక్కువ అయితే కొవ్వు పెరిగి పొట్ట ఎక్కువగా పెరగటం మొదలవుతుంది. రోజూ ఎంత తింటున్నం? ఎలా తింటున్నం ? అనేది మనం తెలుసుకోవాలి. అది వారిలో బిఎమ్‌ఆర్‌ అంటే ‘బేసల్‌ మెటబాలిక్‌ రేట్‌’ లెవల్‌ని బట్టి ఉంటుంది.

మనం భుజించే ఆహారంలో ఎక్కువగా ప్రొటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. ఒక మనిషికి రోజులో 1000 నుంచి 1400ల కేలరీల ఆహారం సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా తీసుకొన్న ఆహారం కొవ్వు రూపంలో తయారయ్యే అవకాశం ఉంది. దైటింగ్ అంటూ ఆహారన్ని తీసుకోవటం మానేస్తే బరువు తగ్గుతారు. కాని శరీరం తగ్గే అవకాశం లేదు. అందుకని తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసు కోవడం, నిత్యం వ్యాయామం చేయ్యడం, నియమబద్ధ జీవితాన్ని గడపడం వల్ల పొట్ట పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బయట దొరికే చిప్స్‌, పాప్‌కార్న్‌, కుకీస్‌, కేక్స్‌ మొదలైన లావు పెంచే వాటిని తినకుండా ఉండటం ఉత్తమం.

Image result for obesity india

ఊబకాయం వల్ల ఇవి వస్తాయి... 


బరియాటిచ్-సర్జెర్య్-క్లిప్పింగ్స్ వల్ల మన శరీరంలో కొవ్వు సులభంగా చేరిపోతుంది. దీని వల్ల బరువు పెరగడం కాని శరీరంలోని ఇతర అవయవాలు పెరగవు, కాని కొవ్వు వల్ల అధిక రక్త పో టు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్‌, డయాబెటీస్‌, హైపొథైరాయిడ్‌ ప్రాబ్లమ్‌, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, అధిక నిద్ర, క్యాన్సర్లు, కొందరిలో వంధ్యత్వం, రుతు స్రా వంలో తేడాలులాంటి సమస్యలు రావచ్చు. కొందరిలో సమస్యలు మరింత తీవ్రంగా రావచ్చు. ఇలా మన శరీరానికి ఊబకాయం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఈ జాగ్రత్తలు పాటిస్తే ఊబకాయం నుంచీ దూరంగా ఉండవచ్చు

1. కప్పు గోరు వెచ్చని నీటిలో స్పూన్‌ తేనె కలుపుకొని పరగడుపున తాగాలి. రోజులో కూడా ఎక్కువగా నీటిని తాగాలి. అప్పుడు పొట్టలోని మలినాలు, కొవ్వు కరిగి బయటకు విసర్జితమవుతాయి.
2. పొట్ట రాకుండా రోజువారీగా తప్పరి సరిగా డైట్‌ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
3. సహజంగా లభించే గ్రీన్‌ టీని ఉదయం పూట సేవించాలి. దానిమ్మ జ్యూస్‌ తప్ప మిగితా అన్ని రకాల జ్యూసులను తీసుకోవచ్చు, కాఫీ మాత్రం రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి.
4. అన్ని రకాల ఆకు కూరలు తీసుకోవచ్చు. అయితే క్యారెట్‌ను మాత్రం తక్కువ మోతాదులో తీసుకోవాలి.
5.వైట్‌ పాస్తా, బ్రెడ్‌, బంగాళ దుంపలు తినకూడదు.
6. గోధుమ పాస్తా, గోధుమ బ్రెడ్‌ను తీసుకోవచ్చు.రాత్రి ఏడు దాటితే తినడం ఆపటం మంచిది.
7. తక్కువగా ఫ్యాట్‌ ఉన్న పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి.
బరువు సూచిక…
8. బి.ఎమ్‌.ఐ. అంటే బాడీ మాస్‌ ఇండెక్స్‌. ఎదుగుతున్న కొద్దీ అలాగే ఎత్తుకు తగ్గ బరువుండాలి.
9. బరువు/ఎత్తు – బి.ఎమ్‌.ఐని బెట్టి కొలవచ్చు.
10. సాధారణంగా మన దేశంలో 18-20 బి.ఎమ్‌.ఐ. ఉండటం మంచిది.
12. 11.అధిక బరువు – బి.ఎమ్‌.ఐ. 25 కిలో గ్రాములు / ఎమ్‌ 2 కంటే ఎక్కువ.
13. ఊబకాయం – బి.ఎమ్‌.ఐ. 30 నుంచి 34.9 కిలో గ్రాములు / ఎమ్‌ 2 వరకు.
14. అధిక ఊబకాయం – బి.ఎమ్‌.ఐ. 35-39.9 కిలో గ్రాములు / ఎమ్‌ 2, బి.ఎమ్‌.ఐ. 40 కిలో గ్రాములు / ఎమ్‌ 2 అంతకంటే ఎక్కువ.
ఊబకాయానికి చికిత్సామార్గాలు:

ల్యాప్రోస్కోపిక్‌ వంటి నూతన విధానాలు స్థూలకాయ శస్త్ర చికిత్సను సులభం చేశాయి. దీని వల్ల తినగల్గిన పరిమాణాన్ని నియంత్రించి అధిక కేలరీల చేరికను అరికట్టవచ్చు. ఉదరకోశాన్ని కుంచింపజేయడం స్లీవ్‌గ్రాసెక్టమీ ద్వారా చేయవచ్చు. అలాగే గ్యాస్ర్తిక్‌ బ్యాండ్‌ ద్వారా కొద్దిగా ఆహారం తీసుకొన్నా త్వరగా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. పొట్ట భాగంలో చేరిన అధిక కొవ్వును లైపోసెక్షన్‌ పద్ధతి ద్వారా తీసివేయవచ్చు. అయితే ఈ చికిత్స తరువాత మళ్లీ బరువు పెరగకుండా నిత్యం వ్యాయామాలు చేయాల్సి ఉంటంది. బేరియాట్రిక్‌ చికిత్స అనేది కూడా ఉంది. అయితే ఇలాంటి చికిత్సలని నిపుణులైన వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు వారి పర్యవేక్షణలోనే తీసుకోవాలి.

0 comments:

Post a Comment