హైడ్రేషన్ మీ చర్మాన్ని ఎంతో కోమలంగా,మృదువుగా మరియూ యవ్వనంగా ఉంచుతుంది,చలికాలంలో ఉష్ణోగ్రతల శాతం మరీ తక్కువగా ఉండటం వల్ల మీ చర్మం పొడిబారి పోతుంది,దీనిని అదిగమించడానికి,మీ శరీరంలో నీరు,మరియూ నూనె శాతాన్ని పెంచుకుని,అవి ఇచ్చే
పదార్దాలని వాడటం మంచిది.
మీ శరీరాన్ని తేమగా ఉంచుకోవడం అనేది సహజంగా ప్రతీ కాలంలోను ఉండేదే,అయితే ఈ శీతాకాలంలో మరింత జాగ్రత్త అవసరం ఎందుకంటే,చర్మం మిగిలిన కాలాల కన్నా ఎక్కువగా పొడిబారిపోతుంది,అందుకే మాయిశ్చరైజర్ అనేది ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎంతగానో
సహకరిస్తుంది.
ఒకవేళ మీకు మాయిశ్చరైజర్ ను ఉదయం సమయాల్లో రాయడం కుదరకపొయినా,లేదా ఇష్టం లేక పోయినా రాత్రుళ్ళు రాసుకోవడం మంచిది,దీనిని కొన్ని చుక్కలు చేతిలోకి తీసుకుని ముఖానికి,కాళ్ళు,చేతులకు పట్టిస్తే,అది మీ చర్మంలోకి చొచ్చుకుపోయి,మంచి ప్రబావాన్ని
చూపిస్తుంది.
మీ వంటి సబ్బులో క్రిమిసం హారిక లక్షణాలు ఉన్న, లేదా మీరు తీసుకునే మాయిశ్చరైజర్ లో ఆల్కహాల్ కలిగి ఉన్నా,వాటిని వాడటం మంచిది కాదు.
వేడి నీళ్ళతో స్నానాలు చేయరాదు,ఎందుకంటే ఈ వేడి నీటి వల్ల మీ చర్మం ఇంకా పొడిబారిపోయే ప్రమాదం ఉంది.
గోరు వెచ్చని నీటితో చేయడం మంచిది అంతేకాకుండా ఎక్కువసేపు స్నానం చేయడం అంత మంచిది కాదు.
ఈ చలి కాలంలో వేసుకోవాల్సిన దుస్తులు:
మీరు దరించే బట్టలలో కూడా మీ ఆరోగ్యం దాగి ఉంటుంది,అందుకే ముఖ్యంగా కాటన్ తో, ఉన్నితో తయారు చేసిన బట్టలు,మీ శరీరం అంతా వ్యాపించి మిమ్మల్ని ఈ సమస్య నుండి రక్షించేవే వేసుకోవడం మంచిది.
ఈ చలి తీవ్రతను తట్టుకోలేక చాలా మంది,వెచ్చదనం కోసం ఎండలో నిలబడతారు,దాని వల్ల చర్మం మరింత పొడి బారిపొయే ప్రమాదం ఉంది.
ఈ చలిలో తగినంతవరకూ బయటకు వెళ్ళకపోవడం ఎంతో మంచిది,ఒకవేళ వెళ్ళ వలసి వస్తే స్వెటర్ లేదా జాకెట్ ను వేసుకుని వెళ్ళడం శ్రేయస్కరం.
చలికాలంలో ఆహార నియమాలు:
మీరు వేసుకునే దుస్తులే కాదు, తీసుకునే ఆహారం కూడా మిమ్మల్ని ఈ సమస్య నుంచి కాపాడడంలో ఎంతగానో సహకరిస్తుంది, ముఖ్యంగా విటమిన్లు A, C మరియు E సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది.
సెలీనియం మరియు జింక్ వంటి మినరల్స్ తీసుకుంటే మీ చర్మం యొక్క్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.
మీ శరీరన్ని చలి తీవ్రతనుండి,పొడి బారకుండా కాపాడడానికి ముఖ్యమైన కొవ్వు పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి.
అవిసె గింజలు, అక్రోట్లను, సాల్మొన్,లవంగాలు,సోయాబీన్స్,ఆకుకూరలు వంటి ముఖ్యమైన కొవ్వు పదార్ధాలు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం
0 comments so far,add yours