ఎవరైనా వ్యక్తికి పదే పదే ఓ సమస్యా ఏర్పడిందంతే వెంటనే అది హార్మోనుల లొపం అని వెంటనే అనుకుంటం. హార్మోనులు అంత ప్రధానమైన పాత్రను పోషిస్తాయన్నమాట.అయితే హార్మోన్ల లోపం ఎంత వరకు మానవ శరీరాన్ని ప్రభావితం చేస్తుందో, ఆ లక్షణాలు ఎన్ని ఉన్నాయో, అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..! శరీరంలోని కొన్ని గ్రంథులు రక్తంలోకి నేరుగా కొన్ని రసాయన ద్రవపదార్థాలను విడుదల చేస్తాయి.. ఇవి విడుదల చేసే ద్రవ పదార్థాలను ‘హర్మోన్స్’ అని అంటారు. ఈ గ్రంథులను ‘ఎండోక్రైన్ గ్రంథులు’ అంటారు శరీరంలో జరిగే జీవ ప్రక్రియకు, నియంత్రణకు హర్మోనులే ఆధారం.

హార్మోనుల లోపం వల్ల ఏర్పడే కొన్ని సమస్యలను ఇప్పుడు చూద్దాం...
  1. శరీరంలోని రక్షణ వ్యవస్థలో లోపాలు చోటు చేసుకోవటం
  2. మానసిక ఒత్తిడి పెరగటం
  3. వంశపారంపర్య కారణాలు తోడవటం వల్ల ఇవి సహజంగా రావటం
  4. ఆహారం, పోషక పదార్థాల లోపాలు.
  5. బరువు అధికంగా పెరగటం.Image result for hormone imbalance

ఇక రోజూ మన జీవితంలో చోటు చేసుకున్న సమస్యలకు వాడే కొన్ని మందుల వల్ల వచే సమస్యలు:
శరీరంలో చురుకుదనం తగ్గడం, అతి నీరసం, అతిగా మూత్ర రావటం , అతిగా దాహం వేయటం, బరువు పెరగడం లేదా తగ్గడం.
శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ పెరగడానికి ఇన్సులిన్ అనే హర్మోన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది కొరవడితే వచ్చే సమస్యలు:

బహిష్టులు సరిగా రాకపోవడం, ఎక్కువ రోజులు ఉండి బాధపెట్టడం. వయసుకు తగ్గ ఎదుగుదల లేకపోవడం. అతిగా బరువు పెరగడం, తగ్గడం.ఆడవాళ్లలో అవాంఛిత రోమాలు, సంతాన సాఫల్య సమస్యలు కూడా వీటి వల్లే వస్తాయి. సెక్స్ సంబంధ సమస్యలు. చర్మ సంబంధ వ్యాధులు, జుట్టు రాలడం.
క్రెటినిజమ్ సమస్య చిన్న పిల్లల్లో థైరాయిడ్ లోపం వల్ల వచ్చే శారీరక, మానసిక ఎదుగుదల వల్ల వచ్చే సమస్య. పిల్లల్లో మతిమరుపు, బరువు పెరగడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనపడితే అవి థైరాయిడ్ లోపం వల్ల వచ్చే హైపోథైరాయిడిజం సమస్య అని ఘంటాపధంగా చెప్పవచ్చు. ఇక పిల్లల్లో ఎత్తు పెరగడం చాలా నిదానంగా ఉంటుంది. దీనిని మనం ద్వార్ఫిసమ్ అని పిలుస్తారు. గ్రోత్ హర్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయితే వచ్చే సమస్య వల్ల పిల్లల్లో పొడవు వయసు కంటే ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మగపిల్లల్లో యుక్తవయసులో వచ్చే మొటిమలు, ఛాతి ఎక్కువగా ఉండటం, జట్టు రాలడం, బట్టతల సమస్య, మీసాలు, గడ్డాలు రావడంలో లోపం వంటివన్నీ హర్మోన్‌ల వల్ల వచ్చే సమస్యలే అని చెప్పవచ్చు.

హర్మోన్ లోపాల వల్ల వివాహం తర్వాత ఆడవాళ్లు ఎదుర్కొనే సంతానసాఫల్య సమస్యలు, బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, అండాశయంలో తిత్తులు, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, కుషింగ్స్ వ్యాధిలు వస్తాయి.
వయస్సు మీరిన వాళ్ళుఅనగా 40 నుండి 50 సంవత్సరాల మధ్య ఎముకలు అరగడం సమస్యలు కూడా హర్మోన్స్ లోపం వల్ల వస్తాయి.ఆడవారిలో వచ్చే మధుమేహం, మెనోపాజ్ సమస్యలు, వేడిని తట్టుకోలేకపోవడం, వేడి ఆవిర్లు, చికాకు, దేనిమీద ధ్యాసలేకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొనవలసి వస్తోంది.హర్మోన్ తేడాల వల్ల వచ్చే మగవాళ్లలో వచ్చే సంతాన సాఫల్య సమస్యలు (వీర్య కణాలు తక్కువగా ఉండడం), సెక్స్ సమస్యలు, మధుమేహం కూడా వీటి వల్లే వస్తాయి
Share To:

0 comments so far,add yours