Wednesday 12 October 2016

ఆపిల్ వల్ల కలిగే ఉపయోగాలెన్నో???


అందరికీ సుపరిచితం అయిన ఈ పండు గురించి ఎక్కువగా వర్ణించవలసిన అవసరం లేదు, కాని ఈ ఆపిల్ తీసుకోవడంవల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది,ఇది మీకు మంచి పోషకాలు సమకూర్చి మిమ్మల్ని ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
అయితే శాస్త్రవేత్తలు దీని పై అనేక ప్రయోజనాలపై అద్యయనం చేస్తున్నారు,ఇది రోజు తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని డాక్టార్లు సూచిస్తున్నారు, అయితే మన అరోగ్యానికి ఆపిల్ వేసే మంత్రం ఏమిటో చుసేద్దామ.

1.కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
ఆపిల్ ను క్రమంతప్పకుండా తీసుకుంటే, మీ ఒంట్లోని కొవ్వు శాతాన్ని తగ్గించడమే కాకుండా, గుండెకు హాని కలగకుండా కాపాడుతుంది, ముఖ్యంగా ఈ ఆపిల్ లో ” పెక్టిన్”అనే పదార్దం పుష్కలంగా కలిగి ఉంది, ఇది మన శరీరంలోని కొవ్వు పదార్దాలను నిర్మూలించడంలో
సహయపడడమే కాకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
2అధిక రక్త పోటును తగ్గిస్తుంది:
మీరు సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే గుండె వ్యాధులు మరియు రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ, అయితే రోజుకో ఆపిల్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే “మినరల్స్”,”పొటాషియం”,మీ రక్త పోటును తగ్గించుటలో సహాయపడుతుంది.
3.మెదడుకు సంబందించి వ్యాదులను తగ్గిస్తుంది:
ఒక అధ్యయనంలో ఈ ఆపిల్ జ్యూస్ రోజు తీసుకోవడం వల్ల మీ మెదడుకు సంబందించిన వ్యాదులను అరికట్టడమే కాకుండా మీ మెడదును సం రక్షించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, ఈ అధ్యయనంలో దీనిని ఒక “ఎలుక”పై ప్రయోగించారు,రోజూ ఎలుకకి ఆపిల్ జ్యూస్
పట్టించడం ద్వారా సాదరణ ఆహారం కన్నా ఈ ఆపిల్ లో “న్యూరోట్రాన్స్మిటర్ ఎసిటైల్” అధిక స్థాయిలలో ఉంది అని నిరూపించబడింది.

4.పెద్దప్రేగు కాన్సర్ నివారణలో:
మన కడుపులో ఉండే పేగులు సరిగా లేకపోతే అది మనకు “జీవన్మరణ” సమస్యే అవుతుంది, అయితే ఈ ఆపిల్ ని రోజు తీసుకోవడం ద్వారా, ఈ సమస్యలో మారణాన్ని జయించి జీవాన్ని కొనసాగిస్తారు,ఆపిల్ లోని “ఫైబర్”లక్షణాలు మీ కడుపులో ఉండే క్యాన్సర్ తో పోరాడి మిమ్మల్ని
దాని బారి నుండి రక్షిస్తుంది.
5.మీ గుండెను రక్షిస్తుంది:
సామాన్యంగా మన రక్త కణాలు, రక్త ప్రసరణ సరిగా లేదంటే దానికి సాకులు(కారణాలు) వెతుక్కోనవసరం లేదు, అందుకంటే దానికి కారణం సరియైన, పొషకమైన ఆహారం తీసుకోకపోవడమే. అయితే వీటన్నిటికి ఈ ఆపిల్ తో సమాధానం ఇవ్వండి, రోజు ఆపిల్ తీసుకోండి, మీ గుండె
జబ్బులను నయం చేసుకోండి.
6.ఆస్తమాని తగ్గిస్తుంది:
ఆపిల్లో ఉన్న “ఫైటో కెమికల్స్” పదార్దాలు “ఫ్లవనోయిడ్స్”,”ఫినోలిక్ యాసిడ్” మీ శ్వాస సంబందిత వ్యాదులనుండి రక్షించడంలో ఎంతగానో సహాయ పడుతుంది,అంతే కాకుండా ఈ దీనిని(ఆపిల్) రోజూ తీసుకుంటే “ఆస్తమాని” జయించవచ్చు.
7.ఎముక రక్షణకు సహాయపడుతుంది:
మీ యముకల రక్షణలో కూడ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది,దీనిలో ఉన్న “ఫోలోరిడ్జిన్”మీ ఎముకల సమస్యను తరిమికొడుతుంది,అంతే కాకుండా మీ ఎముకలను గట్టిగా, దృడంగా చేస్తుంది. ఇది పెద్దవారు, చిన్నవారనే కాదు,అందరు తీసుకోవచ్చు.
అందుకే పాతదే అయిన మళ్ళీ చెప్పేది ఒక్కటే “రోజుకో యాపిల్ తినండి, డాక్టర్ కి దూరంగా ఉండండి”

0 comments:

Post a Comment