Thursday 29 September 2016

వా’ కింగ్ ‘



రోజూ మన దేహానికి ఏదో ఒక వ్యాయామం మంచిది. అలా అనగానే పెద్ద పెద్ద ఎక్సెర్సైజులు చెయ్యనవసరం లేదు. చక్కగా పొద్దున్నే నడక తో వ్యాయామం చేస్తే ఎంతో మంచిది. ప్రతి డాక్టరూ ఇదే సలహాను ఇస్తారు. కాని ఒక రోజు చేసి మరొక రోజు పాటించరు కొంతమంది. అసలు వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలుఎమిటి? దాని వల్ల ఆరోగ్యం ఏ విధంగా పెరుగుతుందో చూద్దామా..!


1. నడక వల్ల హృదయానికి సంబంధించిన జబ్బులు -రక్తపోటు, మధమేహం, మూత్ర పిండాలకు సంబంధించిన జబ్బులు తగ్గుతాయి. నడక రక్త నాళాల వృద్ధికి తోడ్పడుతుంది. రక్తం శరీరంలో బాగా సరఫరా అవుతుంది.

2. కాళ్ళ కండరాలు బలపడతాయి. మనం నడిచేటప్పుడు కాళ్ళ కండరాలు కదిలిక వల్ల రక్త నాళాలపై ఒత్తిడి ఏర్పడి అది వ్యాకోచించి, వాటి ద్వారా రక్తం హృదయానికి సక్రమంగా సరఫరా అవుతుంది. ఈ నాళాలు ఎక్కువగా తెరుచుకొని కూడా రక్తాన్ని సరఫరా చేస్తాయి.



3. చేతులు ఊపడం వల్ల ఈ రెంటికి బలం చేకూరుతుంది. నడిస్తే ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అదనపు శక్తి శరీరంలో నిల్వ వున్న క్రొవ్వు నుండి ప్రధానంగా లభిస్తుంది. అందువల్ల ఈ క్రొవ్వు కరిగి లావుగా వున్నవారు సన్నబడతారు.

4. నడవడానికి బదులు కొందరు పరుగెత్తడం, జాగింగ్‌ అంటే మెల్లగా పరుగెత్తడం చేస్తారు. వీటి వల్ల కాళ్ళు నొప్పి పెట్టడం, మడమలకు, పాదాలకు దెబ్బలు తగలడం ఎక్కువ, ఆయాసం వచ్చి ఒక్కొక్కప్పుడు ఊపిరిపీల్చడం కష్టమవడం కూడా సంభవించవచ్చు. శ్రమతో కూడిన వ్యాయామం వల్ల శక్తి అధికంగా ఖర్చయి అందువల్ల ఆకలి ఎక్కువై ఆహారం ఎక్కువగా తిని లావెక్కె ప్రమాదం గూడా వుంది. అందుకే నడక చాలా శ్రేయస్కరం.

5. 70 కేజీలు బరువు వున్న మనిషి ఒక గంటకు మూడు మైళ్ళ వేగంతో ఒక గంట సేపు రోజూ నడిస్తే 258.6 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. ఒక కేజి బరువు తగ్గాలంటే 7,500 కేలరీల శక్తి ఖర్ఛవ్వాలి. రోజుకు ఇంచు మించు 250 కేలరీల శక్తి ఖర్ఛయితే ఒక నెలలో ఒక కేజి బరువు పోగొట్టుకోవచ్చును. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే నడవడం మంచిది.

0 comments:

Post a Comment