మైగ్రేన్ అంటే?
తలపై ఎవరో సుత్తితో మోదుతున్నట్టు, పొట్టలో వికారంగా ఉన్నట్టు అనిపిస్తూ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ నొప్పి ఎన్ని పైన్ బాంలు వాడినా ఎన్ని మందు బిళ్ళల్ని మింగినా తగ్గదు. దీనినే అంగ్లంలో మైగ్రేన్ అంటారు. పల్లెల్లో ఒంటి చెంపపోటు అనే మాట వింటుంటాం. దీనిని తట్టుకోవడం కాస్త ఇబ్బందికర విషయమే. అచ్చు తెలుగులో పార్శ్వ తల నొప్పి అంటారు. ఇది మిగిలిన సాధారణ తలనొప్పులకు భిన్నంగా ఉంటుంది. మైగ్రేన్ లక్షణాలు మనిషికి మనిషికి వేరు వేరుగా ఉంటాయి. ఇది నరాలకు సంబంధించిన జబ్బు. మైగ్రేన్ లక్షణాలు, దాని నివారణా చర్యలను తెలుసుకుందామా!
మైగ్రేన్ లక్షణాలు
1. పార్శ్వ తలనొప్పి లక్షణాలు ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి. ఎండ పెరిగే కొద్ది తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి వస్తున్నట్లుగాను మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి వుంటుంది.
2. అధిక వెలుతురును, శబ్ధాలను భరించలేరు. కళ్ళ ముందు వెలుతురు చుక్కలాగా కనిపించవచ్చు.
3. పై లక్షణాలు మొదలైన కొన్ని నిముషాలకు ముఖములో ఒక భాగములో కాని, ఒక చేయి కాని , ఒక కాలు కాని తిమ్మిర పట్టడము. సూదులతో గుచ్చినట్లు అనుభూతి ఉంటుంది. కళ్ళు తిరగడం, బలహీనత, మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడడం జరగవచ్చు.
4. పై లక్షణాలు తీవ్రమైన లేక తగ్గుదల కనిపించిన తరువాత విపరీతమైన తలనొప్పి సుత్తితో బాదినట్లు వస్తుంది. ఆకలి మందగిస్తుంది. ఈ లక్షణాలు సాధారణంగా ఉదయం 6 గం నుండి 8 గం వరకు వుంటుంది. స్త్రీలకు బహిస్టు సమయంలో మైగ్రేన్ తల నొప్పి వస్తుంటాయి.
మైగ్రేన్ రావటానికి కారణాలు
మైగ్రేన్‌కు మానసిక వత్తిడికి చాలా దగ్గర సంబంధం ఉంది. మానసిక వత్తిడి పెరిగితే మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. అధిక శ్రమ, ప్రకాశవంతమైన వెలుతురు కళ్ళ మీద పడినప్పుడు, రుతు క్రమములో తేడాలు. కొందరిలో గర్బనిరోధక మాత్రలు మైగ్రేన్ ను ప్రేరేపిస్తాయి.
మద్యపానం, ధూమపానాల ప్రభావం
తలకు ఒక వైపు వెళ్ళే నరాలు అకస్మాతుగా కుచించుకు పోవడం వలన మైగ్రేన్ లక్షణాలుప్రారంభమవుతాయి. ఇవే నరాలు ఒక్కసారిగా వ్యాకోచించడం వలన అక్కడికి అధిక రక్తం ప్రవహించుట వచ్చి తలనొప్పి వస్తుంది.
నివారణా మార్గాలు
1. ఉద్వేగము కలిగించే జీవనశైలి నుండి స్వల్ప మార్పుల తో సాధారణ జీవిత విధానాన్ని అలవరచుకోవాలి.
2. ఇంటిలో ఉన్నప్పుడు చీకటి గదిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి.
3. ద్రవ పదార్దాలు నీళ్ళు ఎక్కువ మోతాదుల లో తాగాలి.
4. నీటిలో తడచిన బట్టను తల మీద వేసుకొని విశ్రాంతి తీసుకొన్న కొంత ఉపశమన ఉంటుంది.
ఏ మాత్రము సందేహము తలెత్తినా గర్భ నిరోధక మాత్రలను మానేయాలి. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా తీసుకోకూడదు. ఇతర కుటుంబ నియంత్రణ పద్దతులు అవలంబించాలి. కొందరు మహిళల లో మెనోపాజ్ వయస్సు రాగానే మైగ్రేన్ తగ్గిపోతుంది. ఈ సమస్య తీరాలంటే వైద్యుని పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలి.

0 comments so far,add yours