చిట్టి పొట్టి చిన్నారులనుంచి, తప్పటడుగులు వేస్తూ చాక్లెట్ తినే పిల్లలవరకూ వారి తల్లిదండ్రులలో ఉండే ఒకే ఒక్క ఆవేదన పిల్లల ఆహారము,వారి సం రక్షణ,అయితే,పిల్లలు ఎదిగే వయస్సులో ఉన్నప్పుడు వారి అహారం పొషకపదార్దాలతో సరి సమానంగా ఉండాలి,తక్కువ కాకుండా,అలా
అని ఎక్కువ కాకుండా సరిచూసుకోవాలి.సాద్యమైనంత వరకూ తల్లి పాలు తగ్గించి,పొషకపదార్దాలు నిండిన ఆహారం అందించడం ఎంతో అవసరం,అయితే ఇక్కడ సూచించిన నియమాలు మీ పిల్లల ఎదుగుదలకు, అరోగ్య సం రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి.
మొదటి 4 నెలలు,ఆహార నియమాలు:
పుట్టిన వెంటనే మొదటి 3 వారాలు పాలు 1/2 నుంచి 1oz,4 ఒజ్ వరకు ఇవ్వవచ్చు, ఇలా 2-3 గంటలకు ఒకసారి అలా రోజుకి 8 సార్లు ఇవ్వవచ్చు .
మొదటీ 3 వారాల నుంచి 4 నెలలు వరకు:
4-6 oz పాలను ఇవ్వాలి అలా 4 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 6 సార్లు ఇవ్వాలి.
ఈ వయస్సులో వారి జీర్ణ అవయవాలు ఎదిగే సమ్యయం కాబట్టి,తల్లి పాలు, లేదా పోత పాలు మత్రమే ఇవ్వాలి,



4 నెలలు నుంచి 6 నెలల వరకు,ఆహార నియమాలు:
తల్లి పాలు లేదా స్వచ్చమైన పోత పాలు ఇవ్వడం మంచిది.
5-7oz, పాలను ఇవ్వాలి అలా 5 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 5 సార్లు ఇవ్వాలి.
ఈ వయస్సులో కొద్ది కొద్దిగా ద్రవం రూపంలో బలాన్ని చేకూర్చే ఆహారం, అంటే మెత్తగా కలిపి, లేదా నీటిలో నానబెట్టి,స్పూనుతో పట్టించాలి,

6 నెలలు నుంచి 9 నెలల వరకు,ఆహార నియమాలు:
తల్లి పాలు లేదా స్వచ్చమైన పోత పాలు ఇవ్వడం మంచిది.
7-8oz, పాలను ఇవ్వాలి అలా 6 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 4 సార్లు ఇవ్వాలి.
చిన్నారులు తింటున్నారు కదా అని ఎక్కువశాతం పెట్టకుండా కొంచెం, కొంచెం గా పప్పు,పండ్లు,మెత్తగా ముక్కలు చేసి తినిపించాలి.
ఇలా రోజుకి 2-3 సార్లు,3-9 స్పూన్లు తినిపించవచ్చు.
ముందుగా, మెల్లగా ఒక స్పూన్ పండ్లు, లేదా పండ్ల రసం పట్టించాలి, అలా అలా మెల్లగా1\4 కాప్పు,1\2కప్పు పెంచుతూ రోజుకు 2-3 సార్లు ఇవ్వడం మంచిది.
పండ్లలో అరటి పండు,ఆపిల్,అవకాడో పండు, దానిమ్మ,ఉడికించిన క్యారెట్,ఇలా తినిపించవచ్చు.

9 నెలలు నుంచి 12 నెలల వరకు,ఆహార నియమాలు:
7-8oz పాలను ఇవ్వాలి అలా 6 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 4 సార్లు ఇవ్వాలి.
ఈ వయస్సులో మరికొన్ని పదార్దాలను అలవాటు చేయాలి, అవి ఏమిటంటే,వెన్న,”ప్రొటీన్లు కలిగిన ఆహారం” ,పండ్లు,చిన్న చిన్న కూరగాయలు ,ఇలా తినిపించడం మంచిది.
ఒక కప్పుతో పండ్ల రసములు ఇవ్వడం ఎంతో మంచిది.
Share To:

0 comments so far,add yours