Thursday 20 October 2016

గ్యాస్ ప్రోబ్లమా? – Telugu tips for gastric trouble – stomach gas problem solution in Telugu

మీరు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నప్పుడు కానీ,లిఫ్త్ లో ఇతరులతో నిలబడినప్పుడు కానీ, పక్కవారితో గడిపే సమయంలో కానీ మీరు గ్యాస్ విడుదల చేయాల్సివస్తే కలిగే ఇబ్బంది వర్ణనాతీతమే కదా…అన్నిటికంటే ఇప్పుడున్నా ఉరుకుల పరుగుల జీవితంలో ఈ ఉదరంలో గ్యాస్, పొట్ట ఉబ్బరింపు అన్ని వయస్సుల వారినీ పీడిస్తొంది.పేగుల్లో తయారయ్యే గ్యాస్ ప్ర్మాదం కలిగించదు కానీ మహా ఇబ్బందిని కలిగిస్తుంది.ప్రతివారిలోనూ గ్యాస్ తయరవుతూనే ఉంటుంది.సాధారణ వ్యక్తుల్లో మామూలు పరిస్థితుల్లో రోజుకు కనీసం 10 సార్లు గ్యాస్ విడుదల చేస్తూ ఉంటారు.కొంతమందిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంతుంది.కొన్ని సమయాల్లో ప్రేగుల్లో తయారయ్యే గ్యాస్ బయటకు వెళ్ళకుండా లోపలే బంధింపబడి తీవ్ర స్థాయిలో కదుపులో నొప్పి వస్తుంది.మల బధకం,విరోచనాలు వంటి సంస్యలను కలిగించే కారణాల వల్ల అదనంగా గ్యాస్ తయారవ్వటమే కాకుండా నొప్పిని కూడా కలిగిస్తుంది.గ్యాస్ అనేది సహజమైన ప్రక్రియ కనుక దాని అడ్డుకోలేనప్పటికీ కొన్నీ గృహ చికిత్సల ద్వారా, ఆహార వ్యవహారాల్లో మార్పులూ చేర్పుల ద్వారా గ్యాస్ సమస్యను తీర్చుకోవచ్చు.

గ్యాస్ సమస్య కలిగిన వారికీ సంకల్పితంగా కాని, అసంకల్పితంగా కానీ గ్యాస్ విడుదల అవుతుంది.గ్యాస్ వల్ల కడుపులో తీవ్రంగ నొప్పిగా ఉంటుంది.ఏదో ప్రమాదకరమైన సమయ ఉందా అన్నంత సందిగ్ధానికి గురిచేస్తుది.ఉదరంలో గ్యాస్ నొప్పి వస్తుంతే ఎదమవైపు అది కేంద్రీక్రుతమైతే గుందె నొప్పేమో అన్నంత బ్రమను కలిగిస్తుంది.అదే కుడివైపు ఈ నొప్పి వస్తే ఎపైండిసైటస్ గా గానీ గాల్ స్టోన్ నొప్పిగా గానీ బ్రమకలుగుతుంది.అయితే ప్రతీ వారు ఎదుర్కొనే ఈ గ్యాస్ సమస్యకు గృహ చికిత్సలను మా పాఠకుల కోసం ఈ కాలం లో అందిస్తున్నాం.


వామును దోరగా వేయించి,పొడి చేసుకుని పావు చెంచాడు మోతాదుగా వేడి అన్నంల్లో, మొదటి ముద్దతో కలిపి వాడితే పొట్ట ఉబ్బరింపు బాధించదు.

జీలకర్ర 2 భాగాలు,సొంఠి 4 భాగాలు,ఉప్పు 1 భాగం వీటన్నింటినీ మెత్తగా నూరి,నిష్పత్తి ప్రకారం కలిపి సీసా లో నిల్వ చేసుకోవాలి.పొట్ట ఉబ్బరించినప్పుడు ఈ మిస్రమాన్ని అర చెంచాడు మొతాదుగా వీడినీళ్ళతో కలిపి సేవించాలి.

ఇంగువను దోరగా వేయించి, పొడి చేసుకుని పావు చెంచాడు మోతాదుగా వేడి వేడి అన్నం అన్నంతో, మొదటి ముద్దతో కలిపి తినాలి.

ఆకలి లేకపోవటం వల్లపొట్ట ఉబ్బరిస్తుంటే జీలకర్రను దోరగావేయించి, పొడి చేసి అరచెంచాడు నుంచి చెంచాడు మొతాదుగా భోఅజనానికి ముందు అరకప్పు వేడి నీళ్ళలో కలిపి తాగాలి.

వాము, అల్లం, జీలకర్రను సమాన భాగాలుగా తీసుకుని సైంధవ లవణంగా కలిపి నూరి ఉదయం సాయంకాలం సేవించాలి.

నిత్యం కడుపు ఉబ్బరంతో బాధపడేవారు అను నిత్యం భోజనానికి ముందు రెండు మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకుని తింటుండాలి.

ఉదరకండరాల మీద టర్పంటైన్ ఆయిల్ ని వేడి చేసి ప్రయోగించి ఉప్పు మూటతో కాపడం పెట్టుకోవాలి.

అయితే ఎన్ని గృహ చికిత్సలను చేసిన బయత చికిత్స పొందిన ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే ఈ సమస్యకు విరుగుడు మాత్రం దొరికే అవకాశంలేదు.జీవన విధానంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను కొన్ని మీ కోసం:


ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో తినాలి అదీ ఎక్కువ సార్లు తీసుకోవాలి.ఆహారాన్ని నెమ్మదిగా తినాలి.
ఆహారాన్ని బాగా నమిలి తినాలి. మింగరాదు. ఒకవేళ సమయం కుదరదు అంటె స్పూన్ తో తినాలి.
బబుల్ గమ్మ్ నమలటం, గట్టి కాండీలు తినటం చప్పరించటం, స్ట్రాతో తాగటం మానేయాలి.
పొగత్రాగటం మానేయాలి, ఎందుకంటే సిగరెట్ తాగే సమయంలో పొగతో పాటు జీర్ణావయవాల్లోని మ్యూకస్ పొరలను రేగేలా చేసి గ్యాస్ ని కలిగిస్తుంది.

0 comments:

Post a Comment