Thursday 13 October 2016

మీ చర్మ రక్షణలో “మల్లెల తైలం(Jasmine Oil)” చేసే మంత్రాన్ని చూద్దామా


మల్లెపువ్వు,మగువల అందాన్ని వర్ణించడానికి,ఎందరో కవులు ఉపయోగించినది,అందానికి చిరునామ “మల్లెపువ్వు”అని చెబితే అతిసయోక్తి కాదేమో.అయితే ఈ మల్లెపువ్వు తియ్యదనంతో పాటు సువాసనకు మారుపేరుగా నిలుస్తుంది.ఈ పరిమళాన్ని ఇప్పటికీ జపాన్ మరియు ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

గమ్మత్తు ఏమిటంటే, కాలనుగుణంగా పూచే పూలలో ఈ మల్లె పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంది, అది ఏమిటంటే ఈ మల్లె రాత్రి పూట మత్రమే పూస్తుంది,అందుకే దీనిని చీకటి పడిన సమయాల్లో కోస్తారు.అయితే దీనితో తయారు చేసిన ఆయిల్ ఎంతో సువాసనబరితమైనది, దీనిని తయారు చేయుటకు ఎన్నో మాల్లె పూల రేకులను ఉపయోగిస్తారు.ఇది చాలా అరుదుగా దోరికేది అయినప్పటికి ఎంతో ప్రఖ్యాతిగాంచినది.
మల్లెపువ్వు మనలోని నిస్సహాయతను దూరం చేసి, విశ్వాసాన్ని పెంచుతుంది, అంతే కాకుండా ఇది మన శరీరంపై “యాంటి డిప్రెసంట్”, “యాఫ్రొడిసియాక్”గా పనిచేసి మనలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

గాలీ, వెలుతురు, ఇలా ఏమీలేకుండా నిశబ్దం అల్లుకున్న గదులలో, తన సుగంధ పరిమళాలతో మళ్ళీ జీవాన్ని తెచ్చి సువాసన పరిమళంగా మారుస్తుంది.
ఈజిప్షియన్లు ఈ మల్లెపువ్వుని వారి “నరము వ్యాదులకు” చికిత్సగా ఉపయోగిస్తారు, అంతే కాకుండా తలనొప్పికీ, నిద్రలేమికి కుడా ఉపయోగిస్తారు.
దీని ప్రయోజనాన్ని అనేక పద్దతులు,సంస్కృతులు, కార్యక్రమాలలో అనేక విధాలుగా ఉపయోగిస్తారు, అంతే కాకుండా దీని యొక్క “యాఫ్రొడిసియాక్” తత్వం మీ మానసిక స్తితిని మార్చడంలో ఎంతగానో సహాయ పడుతుంది.మీరు అధిక ఒత్తిడికి లోనైనప్పుడు, మల్లె ఆయిల్ తో మసాజు చేయించుకుంటే మీ ఒత్తిడి తగ్గి,మనసిక స్తితి మెరుగుపడుతుంది.
ఈ ఆయిల్ కొంచెం అధిక దర ఉన్నప్పటికీ మీ శరీర సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రత్యేకముగా మీ చర్మం యొక్క రంగుని,కోమలత్వాన్ని,కాపాడి మీలోని అలసత్వాన్ని తరిమికొడుతుంది.మీ చర్మం పై కాలిన గాయాలకు ఒక ఔషదంలా ఉపయోగపడుతుంది.
దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి, అవి ఏమిటంటే ఇది ఒక క్రిమినాశక ఏజంట్ గా,జుట్టు ఎదుగుదలకు,దెబ్బలకు,కాలిన గాయాలకు ఒక మంచి చికిత్సగా,ఉపయోగించుకోవచ్చు.
అయితే దీనిని మూలికల మిశ్రమాలతో అంటే “రోజ్ వుడ్”,గంధము,నిమ్మతో కలిపితే శరీరం యొక్క సహజ తత్వాన్ని ప్రోత్సహించి మంచి ఫలితాన్నిస్తుంది.
ఈ ఆయిల్ ని మీ ఉదరం(పొట్ట)పై రాసుకుంటే మీ గర్భాశయ సంకోచాలలోని(Inner Parts)ఏవైన ఇబ్బంది ఉంటే దానిని తొలగించి మంచి ఉపసమనాన్ని అందిస్తుంది.
ఆరోగ్యకరమైన, ఉల్లసభరితమైన స్నానం చేయాలంటే కొంచెం 1\2గ్లాసు సోయా ఆయిల్, 5 చుక్కలు మల్లె ఆయిల్, 3 చుక్కలు జునిపెర్ ఆయిన్, తీసుకుని VitaminE ని కూడా కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.
ఆరోగ్యకరమైన మసాజ్ కోసం, 8 స్పూన్లు ద్రాక్ష రసం,6 చుక్కలు మల్లె ఆయిల్,2 చుక్కలు “టీ పైన్” ఆయిల్,”నిరోలి ఆయిల్”, కలిపి చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.
అందమైన, కోమలమైన జుట్టు కోసం, ఈ మల్లె నూనెని 2 చుక్కలు తీసుకుని, దీనిలో 2 చుక్కలు “రొజ్ మేరి”ఆయిల్, 2 చుక్కలు”క్లారి సేజ్”,1\2ఔన్స్ బేస్ ఆయిల్ కలపి జుట్టుకి పట్టించాలి .

0 comments:

Post a Comment