Saturday 8 October 2016

పరధ్యానం నుంచి బయటపడాలంటే... How To Be Alert.

పరధ్యానం అంటే?

మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ అని మన పెద్దవాళ్ళూ, ఉపాధ్యాయులూ మనల్ని తిట్టటం తెలిసిందే. అయితే ఆ సామెతకు అర్థం మనిషిక్కడ, మనసక్కడ అని అర్థం. అయితే ధ్యానంలొ ఉంటే ఫర్వాలేదుగాని పరధ్యానంలో ఉంటేనే సమస్య. పరధ్యానంలో పడితే అసలు విషయంపై దృష్టి కేంద్రీకరించలేరు. ఈ సమస్యను చాలా మందిలో మనం చూస్తూనే ఉంటాం. అంతెందుకు మనమే ఒక్కోసారి అలా ప్రధ్యానంలో ఉండిపోతుంటం. ఆదేంటి నేను బాగా తెలివైనవాడినేనే నాకు అంతా బాగానే ఉంటుందే అని అనుకుంటున్నారా. తెలివితేటలు ఎక్కువైన వారికే ఎక్కువ ఈ సమస్య వస్తూ ఉంటుంది.

పరధ్యానానికి ఎన్నో కారణాలుంటాయి. వాటితో ఎన్నో సమస్యలూ వస్తాయి. వాటిని అధిగమించడాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.ఆఅ జగ్రత్తలేమిటో చుద్దామా..!

పరధ్యానం అంటే ఏమిటి? మనిషి ఉన్న చోటే ఉండి, అతని ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉండటం. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా అర్థం కానట్టుగా ఉంటారు. దీని వల్ల ఎన్నో పనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఆలోచన, ఆచరణ ఒకేదానిపై కేంద్రీకరించినప్పుడు ఆ పని సఫలీకృతం అవుతుంది. అంతమాత్రాన పరధ్యానం మానసిక వ్యాధి అని చెప్పడానికి లేదు. కొంత మంది వ్యక్తితత్వం అలా ఉన్నట్టుగా ఉంటుంది. కాకపోతే వ్యాధి రూపంలో ఒక లక్షణంగా ఉంటే ఉండొచ్చు. మామూలు వ్యక్తుల్లోనూ ఈ సమస్య ఉంటుంది. పరధ్యానానికి వారు వీరు, వయసు తేడా ఏమీ లేదు.

పరధ్యానంగా ఉన్నవారిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదు. వీరు…సున్నిత స్వభావులై, కళాత్మక హృదయం కలవారై ఉంటారు. ఎక్కువగా ఊహల్లో విహరిస్తుంటారు. చిత్రకారులు, రైటర్లు.. ఈ కోవకు చెందుతారు. తాము చేయబోయే పనిని రకరకాలుగా ఆలోచిస్తూ, ఊహించుకుంటూ, తమలో తాము మాట్లాడుకుంటూ ఉండటం వల్ల దైనందని జీవితంలో చుట్టుపక్కల వారిని పట్టించుకోరు. చాలా మెతకగా, నెమ్మదస్తులై ఉంటారు. రకరకాల కాంపిటిషన్స్‌లో పాల్గొనాలనే ఉత్సాహాన్ని చూపరు. పైగా వీటికి చాలా దూరంగా ఉంటారు.

Image result for deep thinking

ఎప్పుడూ మానసిక ప్రశాంతను కోరుకుంటారు. తమ భావాలను మరొకరితో పంచుకోవడానికి అంత ఉత్సాహం చూపరు. తక్కువగా మాట్లాడుతారు. ప్రతి ఒక్క విషయానికి ఇంకొకరిమీద ఆధారపడుతుంటారు. మెచ్యూర్డ్‌గా ఉండరు. సహజత్వానికి దూరంగా ఉంటారు.

పరధ్యానం వల్ల తలెత్తే సమస్యలు:

1.నేర్చుకోవాలన్న ఆసక్తి, ఏకాగ్రత ఉండదు. దీని వల్ల ఏం చేస్తున్నారో ఆ పని మైండ్‌లో రిజిస్టర్ కాదు.
2.ఇది పిల్లల్లో అయితే చదువులో వెనకబడేలా చేస్తుంది.
3. పెద్దల్లో పనుల్లో లోపాలు, జాప్యం, కెరియర్‌లో ఎదుగుదల లేకపోవడం వంటి నష్టాలు సంభవిస్తుంటాయి.
4.సమస్యల నుంచి తప్పుకోవాలనుకుంటారు. ప్రశాంతంగా ఉంటే చాలు అనుకుంటారు.
5.కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో దూరంగా ఉంటారు కనుక ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడతుంటారు.
6.వివాహ బంధంలో భాగస్వామితో త్వరగా సర్దుకుపోలేరు. ఎదుటి వ్యక్తి అంటే ఉండే భయం కారణంగా వివాహం కూడా వద్దనుకుంటారు.
7.ఏదైనా వర్క్ విషయంలో ‘చేస్తాను’ అని మాట ఇచ్చి నిలుపుకోలేరు. దీంతో ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోతుంటారు.

ఈ సమస్యకు కారణాలు:

1. వంశపారంపర్యం: తల్లిదండ్రుల్లో పరధ్యానం సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వచ్చే అవకాశం ఉంటుంది.
2. కుటుంబ వాతావరణ: ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలతో చులకనగా మాట్లాడటం. ‘నీకే పనీ చేతకాదు, ఓ చోట కూర్చో, నువ్వు సరిగ్గా చదవలేవు…’ వంటి పెద్దల మాటల ప్రభావం చిన్నతనంలో ఒంటరిగా ఉండేలా చేస్తుంది.
ఇంకొంతమంది పిల్లల్ని అతిగారాబం చేస్తుంటారు. తింటున్నా, కూర్చున్నా, నిల్చున్నా… ఏం చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే భావంలో ఉంటారు. అన్నీ సజావుగా జరిగిపోవడంతో ఎప్పుడూ సౌకర్యాన్నే కోరుకుంటారు. తమకు అనుగుణంగా లేనప్పుడు త్వరగా మూడీ అయిపోతారు. ఇవి రకరకాల ఆలోచనలను కలిగిస్తాయి.
3. పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు (ఎమోషనల్ ప్రాబ్లమ్స్), అతిగా ఆలోచిస్తున్నప్పుడు కూడా పరధ్యానం వస్తుంటుంది.
4. పెద్దవారిలో పర్సనాలిటీ డిసార్డర్స్, మేజర్ డిప్రెషన్ డిసార్డర్స్ వల్ల మనసు దిగులుగా, దుఃఖంగా ఉండటం, తమను తాము తక్కువగా అంచనా వేసుకొని వాళ్లలో వాళ్లు లీనమైపోతారు.

స్కిజోఫ్రీనియో: ఇది తీవ్రతరమైన మానసిక జబ్బు. వ్యక్తి తన ఆలోచనల్లో తాను ఉండిపోతాడు. చుట్టుపక్కల వాతావరణం అంతా బాధాకరంగా అనిపిస్తుంటుంది. అందరూ బాధపెట్టేవారుగానే కనిపిస్తారు. రకరకాల అనుమానాలు పెట్టుకుంటారు. తమ ముందు ఎవరూ లేకున్నా, ఎవరో వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంటారు.

మద్యం, సిగరెట్, మత్తు పదార్థాలు అలవాటైన వారు కూడా ఏదో పోగొట్టుకున్నట్టు పరధ్యానంగా ఉంటారు. మందుల ప్రభావం వల్ల, వ్యసనం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది.

మల్టీటాస్కింగ్ : ఒకేసారి రకరకాల పనులు చేసేవారిలో అయోమయం నెలకొంటుంది.

వ్యాపారాలు, వృత్తి, ఉద్యోగాలు.. ఎన్నో రకాల పనులు పెట్టుకునేవారిలో ఈ సమస్య ఉంటుంది. దీని వల్ల తప్పులు దొర్లుతుంటాయి. ఏకాగ్రత లోపిస్తుంది.స్ర్తీలు- ఇంటి పనులు, పిల్లల పనులు, ఉద్యోగినులైతే ఆఫీస్ పనులు. ఇలా ఒక పని తర్వాత మరో పని పెట్టుకొనే వారు, పనులను ఒక ఆర్డర్ ప్రకారం చేసుకోనివారు పరధ్యానంగా కనిపిస్తుంటారు. దీంతో ‘మర్చిపోతున్నాం’ ‘మతిమరుపు మూలంగా ఏ పనీ చేయలేకపోతున్నాం’ అని తిట్టుకుంటూ ఉంటారు. కాని ఇది మతిమరుపు కాదు, పరధ్యానం వల్ల కలిగే సమస్య.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే:
1. ఇష్టమైన పనులు చేయాలి. వారం మొత్తం ఏమేం పనులు చేశామో వారాంతంలో గుర్తుచేసుకొని బుక్‌లో రాసుకోవాలి.
2. ఏకాగ్రత కుదరడానికి, సోషల్ స్కిల్స్‌లో ప్రావీణ్యానికి శిక్షణ తీసుకోవాలి.
3. పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకోవాలి.
4. సమయానుకూలంగా పనిని విభజించుకొని దానికి తగినట్టుగా పనులు చేసుకోవాలి.
5. అదేవిధంగా ఆ రోజు చేయాల్సిన పనుల జాబితా రాసుకోవాలి. అనుకున్న పని పూర్తవగానే టిక్ పెట్టుకోవాలి.
6. ఏకాగ్రత పెరగడానికి రకరకాల పజిల్స్‌తో మెంటల్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.
7. పిల్లలు దేని కారణంగా పరధ్యానంగా ఉంటున్నారో తెలుసుకొని, చర్చిస్తే ఆ సమస్యకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది.

మనస్తత్వ నిపుణులను సంప్రదించి, మానసిక రుగ్మతతో ఉంటే చికిత్స తీసుకోవాలి. 

0 comments:

Post a Comment