Friday 21 October 2016

‘పెరుగు ‘ వల్ల మీ ఆరోగ్యం పెరుగు


రాను రానూ పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలని ఇస్టపడుతున్న యువత ఆహారపు అలవాట్లకు కూడా పాశ్చాత్య ఆహార విధానాలనే ఇస్టపడుతున్నారు.చైనీస్,వెస్ట్రన్ దిషస్ నే ఇస్టపడుతున్నారు.మన భారతీయ ఆహారం లో ప్రముఖ పాత్రని పోషించే పెరుగు అనగానే యువత అమ్మో పెరుగా.. అని దూరం పారిపోతున్నారు.పొట్టకు మేలు చేసే ఈ పెరుగు గురిచి ఈ కాలం లో తెలుసుకుందాం.


మనకుండే విపరీత అలవాట్ల వల్ల మనమెన్నో ఇబ్బందులు పడుతుంటాం.జిహ్వ చాపల్యమే దీనికి కారణం.రకరకాల రుచుల కోసం కొందరు ఇస్టం వచినట్లు తింటుంటారు.ఈ అలవాటు వల్ల దాదాపు 40 శాతం మంది ఇర్రిటబుల్ బోవెన్ సిండ్రోం తో బాధపడుతున్నారని నిపుణుల అంచనా.ఈ సమస్య వల్ల విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది.పెరుగులో శరీరానికి మేలు చేసే లాక్టోబసిల్లస్ అడిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ అనే మేలు చేసే బ్యాక్టీరియా ఉందని నిపుణులు చెబుతున్నారు.ఉదర ఉబ్బరాని,కదుపు నొప్పిని తగ్గిచేందుకు ఈ బ్యాక్టీరియా కీలక పాత్రను వహిస్తుంది.ప్రతి రోజూ ఒక కప్పుకు తగ్గకుండా పెరుగు తినతం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది

0 comments:

Post a Comment