Friday 14 October 2016

మీ ఆరోగ్యం గురించి బెంగుళూరు మిరపకాయ(కాప్సికమ్) చెప్పే కబుర్లు


సామాన్యంగా ఘాటునిచ్చే మిరపకాయ అంటే తెలియని వాళ్ళుండరు,అదేవిధంగా అందరికీ కాకపొయినా ఎక్కువమందికి తెలిసినదే ఈ “కాప్సికమ్”,దీనిని ముద్దుగా “బెంగుళూరు మిరపకాయ”,బెల్ పెప్పర్”,” చిల్లీ” అని కూడా పిలుస్తారు.
దీనిని ఎన్నో సంవత్సరాల నుంచి పెద్ద సంఖ్యలో పండిస్తున్నారు, ఇది 2 రకముల రంగులలో పండుతుంది, ఆకుపచ్చ రంగు, ఏరుపు రంగు, అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఇది అధిక విటమిన్లు, మరియూ ఎన్నో ఔషద లక్షణాలు కలిగి, ఎన్నో వ్యాదులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.

ఈ మిరపకాయ వల్ల కలిగే లాభాలు ఇవే:
క్యాన్సర్ నివారణ:
క్యాప్సికం క్యాన్సర్ నివారణలో ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న కాంపౌండ్స్ “Capsaicins “మన రక్త కణాలతో కలిసి క్యాన్సర్ బారినుండి రక్షిస్తాయి.


జుట్టు:
దీని వల్ల జుట్టు ఉత్పత్తి బాగా అవ్వడమే కాకుండా,జుట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది.అంతే కాకుండా, మీరు ఎక్కువ జుట్టు కలిగి ఉండడానికి ఎంతో సహాయ పడుతుంది.
కళ్ళు మరియు చర్మము:
ఇది తినడం వల్ల మీ చర్మం ఎంతో తాజాగ, మొటిమలు లేకుండా,అందంగా ఉండడమే కాకుండా, దీనిలో ఉన్న “Vitamin A” మీ కళ్ళకు సం రక్షణగా ఉపయోగ పడుతుంది.
క్యాలరీలను తగ్గించుట:
ఇది మీ శరీరంలోని అనవసరమైన కాలరీలు తగ్గించు, మీరు అధిక బరువుతో బాదపడుతుంటే, దానిని తగ్గించి మిమ్మల్ని విముక్తుల్న్ని చేస్తుంది, అంతే కాకుండా ఇది మీ గుండెకు ఇబ్బంది కలిగించే మలినాలు అంటే కొవ్వు పదార్దాలను కరిగించి ఏ విదమైన ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని రక్షిస్తుంది.
నొప్పి నిర్మూలన:
ఇది తీసుకోవడం వల్ల మీ చర్మంలోని నొప్పిని మీ శరీర అంతర్బాగాలకు సోకకుండా,పుండ్లు పడకుండా ఎంతగానో రక్షిస్తుంది.నొప్పిని తగ్గించి మీకు మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.

0 comments:

Post a Comment