Sunday 16 October 2016

కంటి పక్క చర్మం పై ముడతలా?



అందమైన చిరునవ్వంటే ఇష్టపడని వారుండరు, అలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనే అందరూ కోరుకుంటారు, కాని మీ అందమైన చిరునవ్వుకు మీ కళ్ళు ఇబ్బంది పెడుతున్నాయా, అదే ముడతలు పడ్డ చర్మంతో మిమ్మల్ని బాధిస్తున్నాయా, చింతించవలసిన అవసరం లేదు, సామాన్యంగా 40 ఏళ్ళ వయస్సులో మీ నవ్వుల చాటున ఈ ముడతలు వస్తున్నాయంటే అది మీ వయస్సు ప్రభావం వల్ల అనుకోవచ్చు, కాని ఇప్పటి కాలంలో 20 నుంచి 40 వరకూ, ఎక్కువగా 30 ఏళ్ళ వాళ్ళకు ఈ ఇబ్బంది వస్తుంది.



అసలు ఈ ఇబ్బందికి కారణాలేమిటి?పరిష్కరించడం ఎలా??

ఎదైనా సరే మితంగా ఉండాలి, అంటే సరిపడా ఉండాలి, ఎక్కువైతే ఎన్నో ఇబ్బందులు వస్తాయి, మన అందమైన ముఖంలో మరింత అందమైనవి మన కళ్ళు, కాని ఈ కళ్ళ పక్క చర్మం ముడతలు పడి బాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి, అందులో మనకెంతో ఇస్టమైనవే అయినప్పటికీ, ప్రమాదకరమైనవి 3, అవి ఏమిటంటే

1. ఎక్కువగా నవ్వడం

2. ఎక్కువగా ఓర కంటితో చూడడం.

3. నిదురించే పద్దతి

ఈ పై సూచించిన 3 పనులు ఎక్కువగా చేయడం వల్ల మన చర్మం సాగి, ముడతలుగా, మారుతుంది.



నవ్వడం:

ప్రతీ ఒక్కరికీ నవ్వడం అనేది ఒక గొప్ప అదృష్టం, కాని ఎవరికి వారు సొంత శైలిలో నవ్వుతూ ఉంటారు, కొందరు నవ్వెటప్పుడు వారి కంటి పక్క చర్మ కండరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.అయితే దీనిని గుర్తించి నవ్వేటప్పుడు ఆ కండరాలను ఉపయోగించకుండా నవ్వడం ఎంతో మంచిది.



ఓర కంటితో చూడడం:

సమాన్యంగా మనం ఓర కంటితో చుస్తూ ఉంటాం, ముఖ్యంగా ఏదైన వెలుతురు మన ముఖంపై పడినప్పుడు, సుర్యకాంతికి ఎదురుపడినప్పుడు, మనం ఇలా చేస్తూ ఉంటాం, ఇలా ఎక్కువ సార్లు చేస్తే మన చర్మం పగిలి ముడతలకు దారి తీసే ప్రమాదం ఉంది.



నిదురించే పద్దతి:

మన నిదురించే పద్దతిలో కుడా ఈ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది, అదే విదంగా, అదే పద్దతిలో ఈ సమస్యను పరిష్కరించే ప్రమాదం ఉంది.

అంటే, మనం నిదురించేఅప్పుడు కొన్ని పద్దతులు పాటిస్తే ఈ సమస్యనుంచి ఉపసమనం పొందవచ్చు. ముఖ్యంగా “యూ” ఆకారంలో ఉన్న దిండుని, లేదా పట్టు దిండుని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉండవచ్చు.



ఈ సమస్యను అదిగమించడానికి చాలా మార్గాలున్నాయి అవి ఇవే:

మీకు ఈ సమస్య వస్తుందేమో అని భయపడుతున్నారా, అయితే ఈ పద్దతులు పాటిస్తే మీరు సంతోషంగా, ఏ చింతా లేకుండా ఉండవచ్చు.



ఎప్పటికప్పుడు మీ చర్మాన్ని శుబ్రం చేసుకోవడం, దుమ్ము దూళితో, మలినాలు కలిగి ఉన్న చర్మాన్ని

తీసివేసి సరికొత్త యవ్వనమైన చర్మం వచ్చేలా చేసుకోవడం అంతే కాకుండా మొటిమలు, మచ్చలు లేని చర్మం కోసం మీ చర్మాన్ని శుబ్ర పరుచుకోవడం ఇలా చేయడం వల్ల మీ చర్మం లోని చనిపొయిన రక్త కణాలను తరిమేసి, కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.



ఈ చర్మాన్ని శుబ్రం చేసుకునే పద్దతిలో “గ్లైసోలిక్ యాసిడ్(Glysolic Acid)” ను ఉపయోగిస్తే అది మీ మలినమైన చర్మాన్ని శుద్ది చేసి అందమైన, యవ్వనమైన సరికొత్త చర్మాన్ని ఇస్తుంది.



ఇలా మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవడం వల్ల ఈ సమస్యను మీ దరి చేరకుండా కాపాడుతుంది.

0 comments:

Post a Comment