Wednesday 5 October 2016

జలుబు, దగ్గు దరిచేరకుండా చూసుకోండి!

వాతావరణం మారిందంటే చాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పు మొదలై ఎంతో సతమతమయ్యేలా చేస్తాయి. వీటి రాకతో మన శరీరం అంతా కంపించిపోయి అటు మింగలేక బయటకు కక్కలేక అన్న చందంలో పరిస్థితి మారుతుంది. అందుకే వీటిని అంటు వ్యాధులంటారు. వీటి నివారణకు మనం తీసుకునే ఆహారంలో స్వల్పంగా మార్పులు చేసి తీసుకుంటే వీటి బారిన పడకుండా ఉండటమే కాకుండా కాస్త ఉపశమనం పొందవచ్చు.

అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే బాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల బారినుంచి మనల్ని మీరు కాపాడుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. దీనికి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడమే ఏకైక ప్రాథమిక జాగ్రత్త.


1.జలుబుతో బాధపడతున్నవారితో కలిసి పానీయాలు, లిప్‌స్టిక్‌లు, ఇతర వస్తువులను పంచుకోకూడదు. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులను శుభ్రపరచుకుంటే క్రిములు నశిస్తాయి.

2.వర్షాకాలంలో రోజూ ఆరేడు సార్లు సబ్బుతో చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు రాకుండా సాధ్యమైనంత వరకు కాపాడుకోవచ్చు.

3. పండ్లరసాలు, పండ్లసలాడ్‌లను సిద్ధం చేసుకున్న వెంటనే అప్పటికప్పుడే తీసుకోవాలి.

4. తాజాపండ్ల, కూరగాయలు శుభ్రంగా కడిగిన తర్వాతే తీసుకోవాలి.

5. పెరుగు, మజ్జిగలను తాజాగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

6. సాధ్యమైనంత వరకూ ఆహారాన్ని వేడివేడిగా తినాలి. పాత్రలపై మూతలు తప్పనిసరిగా పెట్టాలి.

7. ఆకుకూరలను కూడా ఒకటికి రెండుసార్లు కడిగి, బాగా ఉడకనిచ్చి ఆ తర్వాతే తినాలి.

8. జలుబు, దగ్గు తదితరాలకు పాలకూర, బ్రోకలీ, క్యాబేజీ, బత్తాయి ఎంతో మేలు చేస్తాయి.

9. కర్బూజ, ఆఫ్రికాట్ల గుజ్జు, తాజా పెరుగును తీసుకోవాలి.

10.సూప్‌లలో కూరగాయలను ఎక్కువగా చేర్చాలి.

11.పుచ్చకాయ ముక్కలను నిత్యం తీసుకోవాలి.

12.మంచినీళ్లు, టమాట రసం తీసుకోవాలి. తాజా మొలకెత్తిన గింజలు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

13.మాంసాహారం, కొవ్వుశాతం అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. దీనివల్ల శాచురేటెడ్ కొవ్వు శాతం తగ్గుతుంది. జలుబు కారక క్రిములను నివారించే సి విటమిన్ నిమ్మకాయలో ఉంది కాబట్టి సమృద్ధిగా నిమ్మజాతిపండ్లను ఆరగిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

0 comments:

Post a Comment