Saturday 8 October 2016

తల్లి కాబోయే ప్రతీ ఆడపిల్ల పాటించాల్సిన పద్ధతులు


సృష్టిలో అపురూపమైనది, ఏమీ ఆశించని స్వచ్చమైన అసలు సిసలైన అనురాగం అప్యాయత కలగలిపి చూసేది అమ్మతత్వం.గర్భవతి అవ్వటం ఓ విసేషం అయితే గర్భధారణ కూడా అంతే కీలకమైనది.బిడ్డ పుట్టక ముందు నుంచి మొదలుపెట్టి… నెల తప్పడంతో మొదలైన గర్భధారణ నాటి నుంచి 40 వారాల వరకు క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.గర్భధారణ జరిగాక మొదటి ఏడునెలల్లో ప్రతినెలా క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.ఏడోనెల నుంచి తొమ్మిదో నెల వరకు ప్రతినెలలో రెండుసార్లు, తొమ్మిదోనెల నుంచి ప్రసవం వరకు ప్రతివారం డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండాలి.

డాక్టర్‌ను సంప్రదించిన ప్రతిసారీ గర్భధారణ సమయంలో పెరుగుతున్న బరువు (మెటర్నల్ వెయిట్ గెయిన్), బీపీ, శరీరంలోంచి కోల్పోయే ప్రోటీన్లను తెలుసుకునేందుకు మూత్రపరీక్షలు తప్పక చేయించాలి.గర్భవతికి హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు ఉంటే పైన పేర్కొన్న కాల వ్యవధిలోపే డాక్టర్ సలహా మేరకు వైద్యుని సంప్రదించాలి.ఇంతే కాక గర్భవతిలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ సూచించే ఇతర పరీక్షలు, బిడ్డ ఎదుగుదలను పరిశీలించేందుకు వీలుగా చేసే ‘యుటిరైన్ సైజ్’ పరీక్షను చేయించుకోవాలి.

Image result for food pregnant women

గర్భవతి తీసుకోవలసిన ఆహార అలవాట్లు:
గర్భధారణ సమయంలో కొన్ని విటమిన్లు, మినరల్స్ అదనంగా అవసరమవుతాయి. అయితే ఈ విటమిన్లు, మినరల్స్ స్వాభావికంగానే లభ్యమైతే అది మేలు. ఒకవేళ అలా జరగకపోతే కాబోయే తల్లికి విటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.అన్ని సూక్ష్మపోషకాలూ, విటమిన్లు, మినరల్స్ అందేలా పోషకాహారంలో తాజాపండ్లు, ఆకుకూరలు, పాల ఉత్పాదనలు తీసుకోవాలి.తల్లి తన బిడ్డకు పుష్కలంగా పాలు పట్టాలంటే ప్రతిరోజూ 10 మైక్రోగ్రాముల విటమిన్ డి అందాలి.

మొదటి మూడు నెలలూ ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. దీనివల్ల పుట్టబోయే బిడ్డలో వెన్నెముకకు సంబంధించిన లోపాలను నివారించవచ్చు. ఫోలిక్ యాసిడ్ అందకపోవడం వల్ల వచ్చే వెన్నె ముక సంబంధ లోపాలు ఉన్న కండిషన్‌ను ‘స్పైనా బైఫిడా’ అంటారు. ఈ కండిషన్ వల్ల బిడ్డ పురిట్లోనే చనిపోయే అవకాశం ఉంది. ఒకవేళ బతికితే శారీరక వైకల్యాలు వచ్చే ప్రమాదం ఉంది. ఫోలిక్ యాసిడ్ అన్నది ఆకుకూరలు, దంపుడు బియ్యం వంటి వాటితో సమకూరతాయి.

‘విటమిన్-ఏ’ సప్లిమెంట్లు వద్దు: గర్భధారణ సమయంలో విటమిన్-ఏ సప్లిమెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవటం మంచిది కాదు.

0 comments:

Post a Comment