Wednesday 12 October 2016

మదుమేహం మిమ్మల్ని బాధిస్తుందా?ఆహార నియమాలు చూసేద్డామా


మన ప్రస్తుత జీవన శైలిలో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అతిచిన్నవయస్సులో వాచ్చే ప్రమాదం ఏమిటంటే “షుగరు వ్యాది”దీనికి వయస్సుతో సంబందంలేదు, 25 యేళ్ళ నుంచి 70 యేళ్ళ వృద్దుల వరకూ ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు.
అయితే ఇది ఎందువల్ల వస్తుంది అంటే,ఈ గజిబిజి గందగోళంలో, బిజీగా ఉండే జీవనశైలిలో,ఆహార నియమాలు పాటించడం మర్చిపోవడం వల్ల,అస్తవ్యస్తంగా ఆహారం తీసుకోవడం వల్ల.
అయితే ఒక్కసారి ఈ వ్యాది వచ్చిందంటే నిర్మూలన లేదూ, మనం చెయ్యవల్సిందల్లా సరియైన ఆహారం తీసుకుంటూ మీ రక్తంలో చక్కెర స్థాయిలను కాపాడుకుంటూ ఉండడమే.
ఈ వ్యాది నిర్మూలనకి కొన్ని ఆహార నియమాలు చూసేద్డామా:
వోట్మీల్:
వోట్మీల్ అనేది మీ షుగర్ వ్యాదిని నిర్మూలించడంలో ఎంతగానో సహాయ పడుతుంది, ఇందులో ఉన్న “ఫైబర్”పదార్దం మిమ్మల్ని ఈ వ్యాది నుండి రక్షిస్తుంది. అంతే కాకుండా ఈ వోట్మీల్ ని రోజూ అల్పాహారంతో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.
యాపిల్స్ :
ఎవరో చెప్పినట్లు “రోజుకో యాపిల్ తినండి, డాక్టర్ కి దూరంగా ఉండండి”అనే నానుడి, అక్షరాలా సత్యమైనది, ఎందుకంటే యాపిల్ తినడంవల్ల అందులో ఉన్న అతి తక్కువ క్యాలరీలు కలిగిన “ఫైబర్”మీ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్ ను నిర్మూలిన్స్తుంది. అయితే యాపిల్ ను తొక్కతో సహా తీసుకుంటే దానిలో ఉండే “యాంటీ ఆక్సిడంట్స్”మిమ్మల్ని ఈ వ్యాదినుంచి రక్షిస్తుంది.

బీన్స్:
బీన్స్ ని ఉడకపెట్టి,ఎండబెట్టి, లేదా నీటిలో నానబెట్టి,ఏరకంగా అయినా సరే తీసుకోవడం వల్ల మీ ఈ వ్యాదిని అరికట్టి, రక్త కణాలలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.అయితే ఈ బీన్స్ లో ఉన్న “ప్రొటీన్లు” శాకాహారులకు మంచి బలాన్ని ఇస్తాయి.
టీ:
ఈ వ్యాదినుండి రక్షించే వాటిలో టీ కూడ ఒకటీ,సామన్యంగా చాలమంది యొక్క దినచర్య ప్రొద్దున్నే ఒక కప్పు టీ తోనే మొదలవుతుంది, అయితే టీలో ఉన్న “ఫైటో న్యూట్రీన్లు” మిమ్మల్ని ఈ సమస్య నుంచి రక్షిస్తాయి.అందుకే ప్రతిరోజూ టీ తాగితే ఈ సమస్యని దూరం చేయవచ్చు .
కాయగూరలు మరియూ గింజలు:
ఈ సమస్య ఉన్న వాళ్ళు కాయగూరలు మరియూ గింజలు ఎక్కువగా తినాలి,అలా తింటే రక్తం లోని చక్కెర స్థాయిలను నియంత్రించి మిమ్మల్ని గుండె జబ్బులకు దూరంగా కూడా ఉంచుతుంది,ఇందులో ఉండే ప్రొటీన్లు, ఫైబర్, మీ ఆరోగ్య సం రక్షణలో,ఎంతగానో సహాయపడుతుంది .
సిట్రస్ పండ్లు:
సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల అందులో ఉన్న పీచు పదార్దము, “విటమిన్ C” మీ చక్కెర స్థాయిలను నియంత్రించి, బలమైన పోషక పదార్దాలను మీకు అందిస్తుంది, ఇందులో కొవ్వు శాతం కూడా అతితక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది మిమ్మల్ని షుగరు వ్యాది నుంచి రక్షిస్తుంది.
బియ్యపు బ్రెడ్:
ఇది కూడా మిమ్మల్ని మదుమేహం నుండి రక్షిస్తుంది.ఇందులో ఉన్న “ఫైబర్”పొషకాలు మీ చక్కెర స్థాయిలను నియంత్రించి,మీ శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది
ఆలీవ్ నూనె:
ఆలీవ్ నూనె మీ చర్మ సం రక్షణలో ఎలా ఉపయోగ పడుతుందో అలానే మీ ఈ వ్యాది నిర్మూలనలో కూడా అలానే సహాయపడుతుంది. దీని వల్ల,గుండె జబ్బులు కూడా నయం అవుతాయి.అలానే ఈ మదుమేహ సమస్యను తరిమేయడంలో ఎంతో సహాయ పడుతుంది.ఆహారం అరుగుదలకు కూడా ఎంతో ఉపయోగ పడుతుంది.
చేప :
ఈ మదుమేహం గుండె జబ్బుకు దారి తీసే ప్రమాదం ఉంది అందు వల్ల చేపలు ఎక్కువగా తింటే, ఈ సమస్యనుండి ఉపశమనం లబించడమే కాకుండా 40% వరకు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. చేపలో ఉన్న Omega 3 కొవ్వు ఆమ్లాలు మిమ్మల్ని ఈ సమస్య నుంచి రక్షిస్తాయి.
క్యారెట్:
క్యారెట్ ఆరోగ్యానికే కాదు మీ మదుమేహ నిర్మూలనకూ ఎంతగానో ఉపయోగపడుతుంది.రోజు క్యారెట్ తింటే మీ ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా కంటి చూపు బాగా ఉంటుంది,అలాగే మీ చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

0 comments:

Post a Comment