Tuesday 11 October 2016

జలుబు,దగ్గుతో బాధపడుతున్నారా?సహజమైన నియంత్రణా మార్గాలు ఇవే….


శీతాకాలం అంటే చాలు, చలితో పాటు అనేక సమస్యలు కూడా మనల్ని పట్టి పీడిస్తాయి,అందులో జలుబు,దగ్గు ఇవి రెండూ వద్దన్నా మనల్ని వదలకుండా చలితో పాటూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అయితే ఇది అందరికీ దాదాపుగా ఉండే సమస్యే అందువల్ల, మందులు తీసుకుంటే
సరిపోతుంది, కాని ఆ మందుల వల్ల దుష్ప్రబావాలు కలిగే ప్రమాదం ఉంది.ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ జలుబు, దగ్గు నుంచి త్వరిత ఉపశమనం కోసం సహజమైన పద్దతులు తెలుసుకుందామా…

కొంచెం పసుపు,అల్లం పొడి, ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే,ఇది వేడితనాన్ని పెంచి, మీ దగ్గుని తగ్గించడమే కాకుండా మీ శరీరంలోని నొప్పులని,తలపోటుని తగ్గిస్తుంది.


మీకు బాగా జలుబు చేసి, మీరు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారా అయితే వేడి నీటి యొక్క ఆవిరి పీల్చడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం లబిస్తుంది.

ఈ జలుబువల్ల మీ గొంతు నొప్పితో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా అయితే, కొంచెం గోరు వెచ్చని నీటిలో ఒక చిటికెడు ఉప్పు వేసుకును పుక్కిలించి ఊస్తే,త్వరిత ఉపశమనం కలుగుతుంది.

ఈ జలుబు నుంచి త్వరిత ఉపశమనం కోసం,వేడి పదార్దాలు ఎక్కువ తీసుకోవాలి, టీ,కాఫీ,వెచ్చటి కాక్టైల్స్, గోరు వెచ్చగా కాసిన మంచి నీరు తీసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.

జలుబు వల్ల మీ గొంతులో సమస్యగా ఉంటే టీతో పాటు అందులో తులసి ఆకులు,మిరియాలు,అల్లం పొడి కలిపి తీసుకుంటే త్వరిత ఉపసమనం లబిస్తుంది.
ఈ పై సూచించిన వాటితో పాటు మీ జలుబు,దగ్గు,మరియు గొంతు సమస్యలు పోవాలంటే “చవన్ ప్రాష్(Chavanpraash)”,”ఉసిరి ములబ్బ(Mulabba)” తీసుకుంటే వీటిలో ఉండే “Vitamin C”మిమ్మల్ని ఈ సమస్యలనుండి
కాపాడుతుంది.

0 comments:

Post a Comment