Friday 30 September 2016

మీ నాన్నేం చేస్తుంటారోయ్! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

మీ నాన్నేం చేస్తుంటారోయ్!

"మీ డాడీ ఏం చేస్తుంటాడోయ్" పంతులమ్మ చింటూను అడిగింది.
"ఫర్నిచర్ అమ్మే పని టీచర్" చెప్పాడు చింటూ.
"వ్యాపారం బాగా సాగుతోందా మరి".
"మాబాగా సాగుతోంది టీచర్.. ప్రస్తుతం ఇంట్లో మంచం మాత్రమే మిగిలింది." తాపీగా చెప్పాడు చింటూ.


Thursday 29 September 2016

ఇది మీకు తెలుసా?



రక్తం అవసరత ఉన్నపుడు అదే గ్రూప్ ఎందుకు అవసరముంటుందో అదే విధంగా బ్లడ్ గ్రూప్ బట్టి ఆహారాన్ని తీసుకుంటే మంచి ఆరోగ్యం వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనిని ఇప్పటికే ఫారిన్ కంట్రీస్ బాగా అనుసరిస్తున్న్నరు. బ్లడ్‌గ్రూప్‌ ను బట్టి ఆహారం తీసుకొంటే తిన్నది బాగా జీర్ణమై రక్తంలో త్వరగా కలిసిపోతుంది. అందుకని బ్లడ్‌ గ్రూప్‌కి తగ్గ ఆహారం తీసుకుంటే జీర్ణసంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విషయం తెలియగానే అవునా?ఇది నిజమా అని ఆశ్చర్య పోతారు చాలామంది. ఇది నిజమే. ఈ సీర్షికలో తెలుగు టిప్స్ పాఠకుల కోసం అందిస్తున్నాం. అవెంటో వాటి వివరాలేంటో తెలుసుకుందామా!

సహజంగా మానవునికి వారి వారి రక్త గ్రూపులు వేరువేరుగా ఉంటాయి. ఏయే గ్రూపు ఏం తినాలో క్రింద ఇస్తున్నాం.



గ్రూప్‌ ఎ: ఈ బ్లడ్‌గ్రూప్‌ వాళ్లు కూరగాయలు, ఆకుకూరలతోపాటు చిరుధాన్యాలు, గింజధాన్యాలు, కార్బోహైడ్రేట్స్‌ను కూడా ఎక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అయితే ఈ గ్రూప్‌ వాళ్లు మాంసాహారాన్ని తక్కువ మొత్తంలో తింటే మంచిది.

గ్రూప్‌ బి : మాంసాహారం, చేప, కాయగూరలు, గింజధాన్యాలతో పూర్తిస్థాయి పౌష్టికమైన ఆహారాన్ని సుష్టుగా తీసుకోవచ్చు.

గ్రూప్‌ ఎ,బి : చేప, కాయగూరలు, కార్బోహైడ్రేట్స్‌, గింజధాన్యాలు తినడం ఆరోగ్యకరం.

గ్రూప్‌ ఒ : చేపతోపాటు ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే మాంసం వంటి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

వా’ కింగ్ ‘



రోజూ మన దేహానికి ఏదో ఒక వ్యాయామం మంచిది. అలా అనగానే పెద్ద పెద్ద ఎక్సెర్సైజులు చెయ్యనవసరం లేదు. చక్కగా పొద్దున్నే నడక తో వ్యాయామం చేస్తే ఎంతో మంచిది. ప్రతి డాక్టరూ ఇదే సలహాను ఇస్తారు. కాని ఒక రోజు చేసి మరొక రోజు పాటించరు కొంతమంది. అసలు వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలుఎమిటి? దాని వల్ల ఆరోగ్యం ఏ విధంగా పెరుగుతుందో చూద్దామా..!


1. నడక వల్ల హృదయానికి సంబంధించిన జబ్బులు -రక్తపోటు, మధమేహం, మూత్ర పిండాలకు సంబంధించిన జబ్బులు తగ్గుతాయి. నడక రక్త నాళాల వృద్ధికి తోడ్పడుతుంది. రక్తం శరీరంలో బాగా సరఫరా అవుతుంది.

2. కాళ్ళ కండరాలు బలపడతాయి. మనం నడిచేటప్పుడు కాళ్ళ కండరాలు కదిలిక వల్ల రక్త నాళాలపై ఒత్తిడి ఏర్పడి అది వ్యాకోచించి, వాటి ద్వారా రక్తం హృదయానికి సక్రమంగా సరఫరా అవుతుంది. ఈ నాళాలు ఎక్కువగా తెరుచుకొని కూడా రక్తాన్ని సరఫరా చేస్తాయి.



3. చేతులు ఊపడం వల్ల ఈ రెంటికి బలం చేకూరుతుంది. నడిస్తే ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అదనపు శక్తి శరీరంలో నిల్వ వున్న క్రొవ్వు నుండి ప్రధానంగా లభిస్తుంది. అందువల్ల ఈ క్రొవ్వు కరిగి లావుగా వున్నవారు సన్నబడతారు.

4. నడవడానికి బదులు కొందరు పరుగెత్తడం, జాగింగ్‌ అంటే మెల్లగా పరుగెత్తడం చేస్తారు. వీటి వల్ల కాళ్ళు నొప్పి పెట్టడం, మడమలకు, పాదాలకు దెబ్బలు తగలడం ఎక్కువ, ఆయాసం వచ్చి ఒక్కొక్కప్పుడు ఊపిరిపీల్చడం కష్టమవడం కూడా సంభవించవచ్చు. శ్రమతో కూడిన వ్యాయామం వల్ల శక్తి అధికంగా ఖర్చయి అందువల్ల ఆకలి ఎక్కువై ఆహారం ఎక్కువగా తిని లావెక్కె ప్రమాదం గూడా వుంది. అందుకే నడక చాలా శ్రేయస్కరం.

5. 70 కేజీలు బరువు వున్న మనిషి ఒక గంటకు మూడు మైళ్ళ వేగంతో ఒక గంట సేపు రోజూ నడిస్తే 258.6 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. ఒక కేజి బరువు తగ్గాలంటే 7,500 కేలరీల శక్తి ఖర్ఛవ్వాలి. రోజుకు ఇంచు మించు 250 కేలరీల శక్తి ఖర్ఛయితే ఒక నెలలో ఒక కేజి బరువు పోగొట్టుకోవచ్చును. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే నడవడం మంచిది.

Wednesday 28 September 2016

మన ఆరోగ్యానికి ‘ కీర ‘



ఈనాడు ప్రతి భోజన రెసిపీలలో కీరదోస కనపడుతోంది. ఇక ఏ స్టార్ హోటల్లోనైనా ఖచ్చితంగా వాడటం జరుగుతోంది. దోసకాయలా కనిపించే ఈ కీర దోస ఉపయోగాలు ఎక్కువేనన్నమాట. ఆ ఉపయోగాలని ఈ శీర్షికలో ఇస్తున్నాం మీకోసం. ఆవెంటో తెలుసుకుందామా!

1. కీరదోసకాయ శరీరాన్ని రిహైడ్రేట్ చేస్తుంది తగినంత నీటిని మీరు తీసుకోలేనప్పుడు , 90 పర్సెంట్ నీరు ఉన్న ఒక చల్లటి కీరదోసకాయ తినండి.

2. కీరదోసకాయ శరీరంలోని -శరీరం బయట వేడిని తగ్గిస్తుంది. కీరదోసకాయ తినడం వల్ల శరీరంలోపల ఛాతీలో మంటను తగ్గిస్తుంది. కీరదోసకాయను చర్మానికి రుద్దడం వల్ల సన్ బర్న్ నుండి ఉపశనమం కలిగిస్తుంది.

3. కీరదోసకాయ విషపదార్థాలను తొలగిస్తుంది కీరదోసకాయలో ఉన్న నీరు ఒక వర్చువల్ చీపురులాగా మీ శరీరంలో ఉన్న వ్యర్ధ పదార్ధాలను బయటకు పంపి ప్రక్షాళన చేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తింటే దోసకాయ కిడ్నీలలో రాళ్ళను కరిగిస్తుందని అంటారు.

4. కీరదోసకాయ కావలసిన రోజువారీ విటమిన్లను తిరిగి నింపుతుంది కుకుంబర్ లో రోజులో శరీరానికి కావలసిన చాలా విటమిన్లు ఉన్నాయి. మీ వ్యాధినిరోధక వ్యవస్థను చురుగ్గా ఉంచేందుకు మరియు మీకు శక్తిని పెంచడానికి తోడ్పడే విటమిన్లు ఏ,బి మరియు సి,దీనిలో పుష్కలంగా ఉన్నాయి. దోసకాయ రసంతో పాలకూర మరియు క్యారట్ కలిపితే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. శరీరానికి కావలసిన 12 శాతం విటమిన్ సి లో ఎక్కువ శాతం సి విటమిన్ ఇందులో ఉండటంవలన దీనిని శరీరం మీద ఉంచటం మర్చిపోవొద్దు.

5. కీరదోసకాయ చర్మానికి పొటాషియం, మెగ్నీషియం మరియు సిలికాన్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా స్పాలలో ఎక్కువగా దీనిని ఆధారం చేసుకుని చికిత్సలు జరుగుతాయి.

6. జీర్ణక్రియలో మరియు బరువు తగ్గడంలో కీరదోసకాయ సహాయపడుతుంది దీనిలో ఉన్న అధిక నీరు మరియు తక్కువ కాలరీలు కంటెంట్ కారణంగా, ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఆదర్శంగా నిలిచింది. కీరదోసకాయ మీరు ఇష్టపడకపోతే, మీరు క్రీము, తక్కువ కొవ్వు ఉన్న పెరుగుతో డిప్ చేసిన దోసకాయ చెక్కలను తీసుకోండి. కీరదోసకాయ నమలడం వలన మీ దవడలకు ఒక మంచి వ్యాయామం కలుగుతుంది మరియు ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియలో ఉత్తమంగా పని చేస్తుంది. కుకుంబర్ రోజువారీ వాడకం, దీర్ఘకాల మలబద్ధకం కోసం ఒక చికిత్సగా పని చేస్తుంది.


7. కీరదోసకాయ కళ్ళను తేరుకునేట్లుగా చేస్తుంది ఉబ్బిన కళ్ళ మీద కీరదోసకాయ ఒక చల్లని ముక్క ఉంచడం వలన దృష్టి బాగుంటుంది కాని దీనిలో ఉన్న వ్యతిరేక శోథ లక్షణాల కారణంగా కళ్ళ క్రింద ఉబ్బులు మరియు నలుపులు తగ్గిస్తుంది.

8. కీరదోసకాయ క్యాన్సర్ తో పోరాడుతుంది కీరదోసకాయలో సెకొఇసొలరిసిరెసినల్, లరిసిరేసినోల్ మరియు పినోరేసినోల్ ఉన్నాయి. మూడు లిజ్ఞాన్స్ అండాశయ రొమ్ము, ప్రొస్టేట్ మరియు గర్భాశయ క్యాన్సర్ సహా అనేక క్యాన్సర్ రకాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

9. కీరదోసకాయ మధుమేహం, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, రక్తపోటు నియంత్రిస్తుంది కీరదోసకాయ రసంలో విస్తృతంగా మధుమేహ రోగులకు వాడే ఇన్సులిన్ ఉత్పత్తి కోసం క్లోమము యొక్క కణాలకు అవసరమైన ఒక హార్మోన్ ఉన్నది. పరిశోధకులు కుకుంబర్ లో స్టెరాల్స్ అనే సమ్మేళనం కొలెస్ట్రాల్ క్షీణతకు సహాయపడుతుంది అని కనుగొన్నారు.

10. కుకుంబర్ ఫైబర్, పొటాషియం మరియు మెగ్నీషియం చాలా కలిగి ఉన్నది. ఈ పోషకాలు రక్తపోటును నియంత్రించటంలో సమర్థవంతంగా పని చేస్తాయి. కీరదోసకాయ మంచిది ఎందుకు అంటే అధిక రక్తపోటు మరియు తక్కువ రక్తపోటు రెండు చికిత్సలలో పనిచేస్తుంది.

11. కీరదోసకాయతో నోరు రిఫ్రెష్ అవుతుంది కీరదోసకాయ రసం వ్యాధితో ఉన్న చిగుళ్ళను నయం చేస్తుంది మరియు రిఫ్రెష్ చేస్తుంది. కీరదోసకాయ ఒక ముక్కను తీసుకోండి, ఒక అర నిమిషంపాటు మీ నాలుకతో కీరదోసకాయ ముక్కను మీ నోరు పైకప్పుమీద నొక్కిఉంచండి, దీనిలోని ఫైటోకెమికల్స్ దుర్వాసనకు కారణమైన మీ నోటిలోని బ్యాక్టీరియాను చంపుతుంది.

12. కీరదోసకాయ జుట్టు మరియు గోర్లను మృదువుగా చేస్తుంది దీనిలో ఉన్న అద్భుతమైన ఖనిజం సిలికా మీ జుట్టు మరియు గోర్లను కాంతివంతంగా మరియు బలంగా చేస్తుంది. దీనిలో ఉన్న సల్ఫర్ మరియు సిలికా మీ జుట్టు పెరుగుదల ప్రేరేపించటానికి సహాయపడుతుంది.

13. కీరదోసకాయ కీళ్ళ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, కీళ్ళ నొప్పులు మరియు కీళ్లవాతపు నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. దీనిలో ఉన్న సిలికా ఒక అద్భుతమైన మూలంగా కనెక్టివ్ కణజాలాలను పటిష్టం చేయడం ద్వారా కీళ్ళ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కీరదోసకాయతో క్యారట్ రసం కలిపి తీసుకున్నప్పుడు, యూరిక్ ఆమ్లం మట్టాలను తగ్గించడం ద్వారా కీళ్లవాతపు మరియు కీళ్ళనొప్పులు నొప్పి ఉపశమనం పొందుతారు.

14. కీరదోసకాయ హ్యాంగోవర్ ను తగ్గిస్తుంది ఉదయం తలనొప్పి లేదా హ్యాంగోవర్ నివారించేందుకు మీరు నిద్రపోయే ముందు కొన్ని కీరదోసకాయ ముక్కలు తినండి. కుకుంబర్ లో అనేక ముఖ్యమైన పోషకాలు తిరిగి పొందటానికి తగినంత విటమిన్లు, చక్కెర మరియు ఎలెక్ట్రోలైట్స్ ఉన్నాయి మరియు తలనొప్పి రెండింటి తీవ్రతను తగ్గిస్తుంది.

15. కీరదోసకాయ మూత్రపిండాలను ఆకారంలో ఉంచుతుంది కీరదోసకాయ మీ శరీరంలోని యూరిక్ ఆమ్ల స్థాయిలను తగ్గిస్తుంది మరియు మూత్రపిండాలను ఆరోగ్యకరంగా ఉంచుతుంది.

Tuesday 27 September 2016

జీరో వలన మన శరీరం జీరో..!



కోరికలుండని మనిషుండరు. ఇక సౌందర్యోపాసన కోసం మాత్రం ఎంతకైనా మనిషి తెగిస్తాడనేది వాస్తవం. అయితే జీవితం లో ఫాషన్స్ సైక్లిక్ విధానంలో తిరుగాడుతుంటాయ్. ఆ విధానంలోనే ఒల్డ్ ఫాషన్స్ మాళ్ళీ మనకు తారసపడుతుంటాయ్. ఆ కోవాలోనికి ఈ రోజు సన్నగా నాజూకుగా ఉండే శరీరాకృతి కూడా వచ్చేసింది. అదేదో కాదు జీరో సైజ్ నడుము. ఈ నడుము గురించి ప్రస్తుతం అతివలంతా పడరాని పాట్లు పడుతున్నారు. జీరో సైజ్ విసేషాలేంటో తెలుసుకుందామా!

సైజ్ జీరో:

అమ్మాయిలు అతి సన్నటి నడుముకోసం మక్కువ పెంచుకుని కృంగి కృశించిపోవడాన్నే సైజ్ జీరో అంటున్నారు. అతిగా డైటింగ్ చేయడం, అతిగా వ్యాయామం చేయడం ద్వారా తమ శరీరాకృతిని అసాధారణ స్థితిలో కుదింపజేసుకుని స్లిమ్‌గా, నాజూకుగా, అందంగా కనిపించాలని మహిళలు పడుతున్న సరికొత్త పాటునే సైజ్ జీరో అంటున్నారు.

సైజ్ జీరో కోసం:

సైజ్‌ జీరో.. అందమైన శరీరాకృతి.. డైటింగ్ చేయాల్సిందే.. సన్నగా ఉండవలసిందే. ఊబకాయం మన సమీపానికి రాకుండా జాగ్రత్త పడాల్సిందే. అయితే నాజూకు పేరుతో మాతృత్వానికి సైతం దూరమయ్యే స్థితిని మహిళలు కొని తెచ్చుకుంటే ఎదురయ్యే పరిస్టిథులు…

తమ శరీరం తమకే బరువుగా తయారయ్యే విపత్కర స్థితిని ఎవరూ కోరుకోరు. ప్రస్తుత కాలంలో స్త్రీపురుషులు ఇరువురూ కూడా సన్నబడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ నాజూకుతనం కోసం ఆ ఆశ శృతి మించితే అందం కోసం పందెంలో శరీరం మోతాదుకు మించి చిక్కిపోతే సకల రోగాలకు శరీరం నిలయంగా మారుతోంది.

చివరకు మాతృత్వం కూడా స్త్రీకి దూరమయేలా సైజ్ జీరో ప్రభావం చూపుతోంది. ఇలా ఫిగర్ బాగుండాలని తపనతో అతి సన్నటి నడుమును కొని తెచ్చుకున్న యువతులకు బహిష్ఠు సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అంతకు మించి చిన్నవయసులోనే నెలవారీ బహిష్ఠులు ఆగిపోవడం లేదా క్రమం తప్పడం జరుగుతోందట.

ఇక ఇలాంటి వారికి పెళ్లంటూ జరిగితే గర్భం దాల్చడం కూడా కష్టమయిపోతోందని వైద్యుల ఉవాచ. నాజూకు శరీరం కష్టపడి సాధించుకున్న వారికి పుట్టే పిల్లలు సైతం పోషకాహారం లోపించి బరువు తక్కువతనంతో పుడుతున్నారట.

సన్నబడిపోవాలనే కోరిక మదిలో రగులుతుండగా అతిగా డైటింగ్ మరియు వ్యాయామం చేసే అమ్మాయిలకు అసాధారణ బహిష్టుల సమస్య వస్తోందని వైద్యులంటున్నారు. ఇంకా ప్రమాదం ఏమిటంటే ఇలాంటి నాజూకు భామల ఎముకలు ముదివయస్సులో ఉన్న వారి ఎముకల లాగా బలహీనంగా తయారవుతున్నాయి.

అందమైన శరీరాకృతి ఉండవలసిందే. ఊబకాయం మన సమీపానికి రాకుండా జాగ్రత్త పడాల్సిందే. అయితే నాజూకు పేరుతో మాతృత్వానికి సైతం దూరమయ్యే స్థితిని మహిళలు కొని తెచ్చుకోవటం మాత్రం ఇబ్బందికర విషయమే.

Saturday 24 September 2016

నిద్ర పుచ్చే ఆహారపదార్ధాలు



మీకు రోజూ నిద్ర రావటం లేదా? నిద్ర కోసం అష్టకష్టాలు పడుతున్నారా? అయితే కొన్ని ఆహార పదార్థాలు మనల్ని నిద్ర పుచ్చుతాయట! ఆశ్చర్యంగా ఉందా? అయితే అవేంతో తెలుసుకుందామా!

కొంతమంది ఆహారం తీసుకున్న వెంటనే హాయిగా నిద్రొచ్చేస్తుంది అంటారు. దీనికి కారణం మనం తీసుకుంటున్న ఆహారమే. ఏ ఆహారం తింతే నిద్ర వచ్చిందో మనకు అంతగా ఖచ్చితంగా తెలియకపోవచ్చు. దానికి కారణం వాటిపై మనకు అవగాహన లేకపోవటమే. అయితే కొన్ని ఆహార పదార్ధాలు తింతే నిద్ర ముంచుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాటితో ఆరోగ్యమే కాక కమ్మని నిద్ర కూడా ప్రాప్తిస్తుందట!

1. కొన్ని రకాలైన చేపలు, బీన్స్, పెరుగు, ఆకుకూరలను ఆహారంతో కలిపి తీసుకోవడం ద్వారా మాంచిగా నిద్ర వచ్చేస్తుంది.



2. బీన్స్ వగైరాలలో ముఖ్యంగా బఠానీలు, చిక్కుడు కాయల్లో బి6, బి12, బి విటమిన్లు ఉంటాయి. అలాగే ఫోలిక్ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు నిద్రొచ్చేలా పనిచేస్తాయి.

3. నిద్రలేమితో బాధపడుతున్న వారికి బి విటమిన్లు ఎంతగానో ఉపయోగపడుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

4. అలాగే ఫాట్ లెస్ పెరుగులో కాల్షియం, మెగ్నీషియం పూర్తిగా ఉంటాయి. ఈ రెండు నిద్ర వచ్చేలా చేయడంలో మంచిగా పనిచేస్తాయి. పెరుగులోని కాల్షియం, మెగ్నీషియంల ప్రభావంతో అత్యంత వేగంగా నిద్రలోకి జారుకుంటామని వైద్యులు చెబుతున్నారు.

5. కాల్షియం, మెగ్నీషియం లోపంతో నిద్రలేమి, మానసిక ఒత్తిడి, కండరాల్లో నొప్పి వంటివి ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక ఆకుకూరల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారు ఆకుకూరలను రెండు రోజులకోసారి ఆహారంతో కలిపి తీసుకోవాలి.