Saturday 8 October 2016

జబ్బు పడినప్పుడు తీసుకోకూడని ఆహార పదార్థాలు

మన ఆరోగ్యంలో మార్పులు జరగటం సహజం.ఆరోగ్యం ఒకేలా ఉండటం మాత్రం జరుగదు.అయితే వాతావరణ మార్పులతో పాటు మన శరీరంలో కూడా అనేక మార్పులకు చోటు చేసుకుంటుంది. కాలాన్ని బట్టి వ్యాధులూ మనల్ని ముసురుతాయి. వేసవికాలంలో శరీరం మీద ఎండవేడమి ప్రభావం, శరీరం వేడెక్కడం, చెమటలు, డీహైడ్రేషన్, డయోరీయా ఇలా అనేక జబ్బులు చుట్టుముడుతాయి. అలాగే శీతాకాలం మరియు వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ జబ్బులు ఎక్కువగా ఉంటాయి.జబ్బు పడినప్పుడు ఆహారాల మీద ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల ఖచ్చితంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో పాటు చాలా త్వరగా జబ్బునుండి తేరుకోవడానికి సహాయపడుతాయి. ఆరోగ్యం చెడినప్పుడు ఏ ఆహార పదార్ధలను తీసుకోకూడదో ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందామా..

1.మిఠాయిలు

సాధారణంగా తీపి అంటే ఇష్టపడనివారుండరు. అదీకాక ఆరోగ్యం చెడినప్పుడు నాలుక చేదుగా ఉండటం వల్ల తీపి తినాలనిపించటం సహజం. అటువంటి సమయంలో మీరు ఖచ్చింతా అదనపు క్యాండీ(స్వీట్స్)లేదా కుకీస్ ను తినకూడదు. ఎందుకంటే స్వీట్స్ లో సాచురేటెడ్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణం అవ్వడానికి చాలా కష్టతరం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని డిజర్ట్స్ కూడా మీరు జబ్బుపడేలా చేస్తాయి.
2.ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్య పునరుద్ధరించడం కోసం బాగా సహాయడపుతుందని ఒక రహస్యం చిన్న బిట్ గా ఉంది. ఎందుకంటే నారింజలో విటమిన్ సి , ఫైబర్ , మరియు సూక్ష్మ పోషకాలకు ఖచ్చితంగా పూర్తిగా ఉన్నాయి, అయితే ఇటీవలే ఒక పరిశోధన జరిగింది.దీని ప్రకారం ఆరెంజ్ నుండి జ్యూస్ ను వేరు చేసినప్పుడు, అదే ఆరోగ్యకరమైన జ్యూస్ ఎక్కువ షుగర్స్ మరియు సోడా కలిగి ఉన్నాయని నిరూపించాయని నిపుణులు తెలిపారు. అలాగే ఇవన్నీ కూడా మీ జీర్ణ వ్యవస్థ పాడయ్యేలా తయారయ్యేందుకు దారితీస్తాయి.
3.రెడ్ మీట్

రెడ్ మీట్ కూడా నట్స్ లాగే మీ శరీరంను ప్రభావితం చేస్తుంది. మీరు జలుబుతో బాధపడుతున్నప్పుడు బర్గర్ తినాలని కోరిక కలిగినప్పుడు, ఆ అదనపు ద్రవాలన్నీ కూడా మీ ముక్కు మరియు ఛాతీలో చేరి ఇబ్బందికి గురి చేస్తాయి.ఎందుకంటే మాంసాహార పదార్థాలన్నింటిలోనూ కాంప్లెక్స్ ఫ్యాట్స్( క్లిష్టమైన కొవ్వులు). మీరు జబ్బుపడిన ఉన్నప్పుడు ఇవి మీ శరీరంపై ప్రబవితం చేస్తాయి.

4.ఆల్కహాల్

ఇక అలవాట్లు అనగానే గుర్తుకొచేది ఆల్కహాల్. అరోగ్యం బాగున్నా, లేకున్నా ఈ అలవాటుకు మాత్రం దూరం గా ఉండటం జరుగదు. అయితే ఆల్కహాల్ కెమికల్స్ తో నిండి ఉంటుంది. వ్యాధినిరోధకతకోసం మీరు తీసుకొనే మందుల మీద ఈ రసాయనాలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. అంతే కాదు, ఆల్కహాల్లో భయంకరమైన అసిడిక్ ఆమ్లం ఉండటం వల్ల మీ కడుపు మీద ఎక్కువ వత్తిడి కలిగిస్తాయి. దీని వల్ల అరోగ్యం బాగా చెదే అవకాశ్.
5.కెఫ్ఫిన్

మన శరీరం త్వరగా అనారోగ్యం పాలు చేయడంలో కెఫిన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. తక్కువ సోడా, చాలా తక్కువ మోతాదులో కాఫీ మరియు చాక్లెట్ వంటివి తీసుకోవడం వల్ల శరీరం త్వరగా కోలుకోవడానికి సహాయపడుతాయి. కానీ కెఫినేటెడ్ ఫుడ్స్ మరియు డ్రింక్స్ పంచదారతో నిండి ఉంటాయి, కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.
6. పచ్చికూరలు

చాల మంది అనారోగ్యంగా ఉన్నప్పుడు పచ్చికూరలు తినడం వల్ల త్వరగా కోలుకుంటామనుకుంటారు. కానీ వాటిని ఖచ్చితంగా ఉడికించి తీసుకోవాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు పచ్చి కూరలు కడుపులో గ్యాస్, పొట్ట ఉబ్బరంకు దారితీస్తుంది మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ను కూడా పెంచుతుంది.
7. స్పైసి

మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు కారంగా ఉండే ఆహారాలు తిన్నాకూడా రుచిగా అనిపించదు. కానీ, మీ జలుబును నుండి తక్షణ ఉపశమనం పొందడానికి కొన్ని మసాలా దినుసులు (మిరియం, అల్లం) వంటివి బాగా ఉపయోగపడుతాయి. అయితే మీకు గ్యాస్ సమస్య లేదా స్టొమక్ అప్ సెట్ వంటి సమస్యలు లేకుంటేనే తీసుకోవచ్చు. అధికంగా కారంగా ఉన్న ఆహారాలు, చీజ్ మరియు బీన్స్ వంటి ఆహారాలకు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దూరంగా ఉండాలి.
8. మాంసాహారం
మాంసాహారాన్ని చూడగానే నోరూరుతుంది. అదీకాక అరోగ్యం బాగాలేనప్పుడు ఈ మసాలాలు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. మాంసాహారాలు ముఖ్యంగా బేక్ చేసిన(కాల్చిన) వాటిలో అదనపు చెక్కరలు లేదా ఉప్పు స్థాయిలు ఉంటాయి. మాంసాన్ని బేక్ చేయడం లేదా సరిగా వండకపోవడం వల్ల మాంసాహారంలోని నైట్రేట్స్, నైట్రైట్స్ గా మారుతాయి, ఇటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ కు దారితీస్తుంది. అనారోగ్యం కారణం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల, నైట్రేట్లు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
9. నట్స్

మీరు జబ్బుపడిన ఉన్నప్పుడు నట్స్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వేరుశెనగ ఎక్కువ శ్లేష్మం (పైత్యాన్ని) సృష్టిస్తుంది. ఇది మీరు జలుబుతో పోరాడుతున్నప్పుడు మరింత ఇబ్బందికి గురిచేస్తుంది. అలాగే నట్స్ తినడం వల్ల మలబద్దకఅం మొదలవుతుంది.
10. పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులలో చాలా వరకూ ఫ్యాట్ కంటెంట్ మరియు కాంప్లిసిటిలు ఎక్కువగా ఉంతాయి. కొంత మందిలో అనారోగ్యంగా ఉన్నప్పుడు మిల్క్ అలర్జీ కూడా ఉంటుంది. అందుకే అనారోగ్యంగా ఉన్నప్పుడు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

0 comments:

Post a Comment